వికసించకుండానే వాడిపోతున్న రాజీవ్ యువ వికాస్ పథకం.

వికసించకుండానే వాడిపోతున్న రాజీవ్ యువ వికాస్ పథకం

◆ లబ్ధిదారులకు మొండి చేయి చూపిస్తున్న కాంగ్రెస్ సర్కార్

◆ జహీరాబాద్ బిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్,,ఎమ్మెల్యే కోనింటి మాణిక్ రావు ఆదేశాల మేరకు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది.. నాయకులు మాట్లాడుతూ
‘రాజీవ్‌ యువ వికాసం పథకం, కాంగ్రెస్‌ ఇచ్చిన అన్ని హామీల వలె విజయవంతంగా చెత్త బుట్టలోకి చేరిపోయిందని ఈ పథకం అమలు విధానంపై పునరాలోచన చేస్తాం’ అని రాష్ట్ర క్యాబినెట్‌ తెలంగాణ యువతపై ఓ పిడుగును పడేసిందన్నారు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 తారీకున రెండు లక్షల మంది అబ్ధిదారులను ప్రకటించి, పథకం మంజూరు పత్రాలను అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వట్టి మాటలు అయ్యాయి అన్నారు.. రేవంత్ చెప్పిన కల్లబొల్లి మాటలు నమ్మిన తెలంగాణ యువత సుమారు 16 లక్షల మంది ఈ పథకానికి నమోదు చేసుకున్నారని, రకంలో నమోదు చేసుకోవడానికి ప్రతి ఒక్క యువకుడికి సుమారు 200 నుంచి 300 రూపాయల వరకు ఖర్చు అయిందని అన్నారు .. దీని ద్వారా ప్రభుత్వానికి సుమారు 30 కోట్ల రూపాయల వరకు ఆదాయం కలిగిందని అన్నారు.. నమ్మిన యువకులకు కాంగ్రెస్‌ తన హామీలను పక్కనబెట్టడం ఇదే తొలిసారి కాదు.,బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను రెచ్చగొట్టి ధర్నాలు చేయించిన కాంగ్రెస్‌, తాను అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదు. గత కేసీఆర్‌ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెలువరించిన ఉద్యోగాలకు రేవంత్‌ ప్రభుత్వం జాయినింగ్‌ లెటర్లు ఇచ్చి తొలి ఏడాదిలోనే 58 వేల ఉద్యోగాలిచ్చామని ప్రగల్భాలు పలుకుతున్నారని కాంగ్రెస్‌ చేస్తున్న ఇలాంటి మోసపూరిత ప్రకటనలను ప్రజలు, నిరుద్యోగులు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఎంతో అర్భాటంతో ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ఊసే లేదు. ఉద్యోగాల కల్పన అంటుంచితే కనీసం స్వయం ఉపాధికి కార్పొరేషన్‌ రుణాలు తీసుకుందామన్నా యువతను మోసగాళ్లుగా చిత్రించి కాంగ్రెస్‌ ఆ పథకాన్ని కూడా ఆపేయడం ఆక్షేపణీయం అన్నారు.. ఎంతో తెలివితో ఆలోచించే తెలంగాణ యువత ఇప్పటికైనా కాంగ్రెస్‌ కపట నాటకాలను గుర్తించాలని. ‘ఒడ్డెక్కే దాన్క ఓడ మల్లన్న ఒడ్డు దాటినాక బోడ మల్లన్న’ అనే రీతిలో వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి సరైన సమయంలో, సరైన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,యువ నాయకులు దీపక్ ,బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు రాకేష్ ,బి ఆర్ ఎస్ వి పట్టణ అధ్యక్షులు ఓంకార్, ఫయాజ్,రోహిత్, శ్రీనాథ్ ,ప్రవీణ్ మెస్సీ,
తదితరులు .పాలుగోన్నారు.

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.

వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.

టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్.

చర్ల నేటిధాత్రి:

 

దేశంలో సాంకేతిక విప్లవానికి ఆజ్యం పోసి కంప్యూటర్ యుగానికి నాంది పలికిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి అన్నారు. వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి మండల నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ దూరదృష్టితో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృ ద్ధి ఆర్థిక వ్యవస్థను సరళీ కృతం చేయడం పరిశ్రమలకు రాయితీలు పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేయడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి మాట్లాడుతూ అతిపిన్న వయసులోనే దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించి దేశ భవిష్యత్తుకు నాడు నాటిన మొక్కలు నేడు వృక్షాలై ఫలాలు అందిస్తున్నాయన్నారు యువతలో శక్తివంతమైన మార్పును కోరుకున్నారని గుర్తు చేశారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ఫా శ్రీను మడకం పద్మ మరియు రామ్ కుమార్ గుండెపూడి భాస్కరరావు ఉప్పరిగూడెం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ మరియు రాజా సర్కార్ బొళ్ల వినోద్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

రాజీవ్ గాంధీ జీవితం అందరికీ ‌ స్ఫూర్తిదాయకం.

రాజీవ్ గాంధీ జీవితం అందరికీ ‌ స్ఫూర్తిదాయకం.

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కిష్టయ్య.

చిట్యాల నేటిధాత్రి:

రాజీవ్ గాంధీ జీవితం అందరికీ
స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య అన్నారు .
చిట్యాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని శ్రీ ‌రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కిష్టయ్య. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ .హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆధునిక దృష్టి కలిగిన భారత ప్రధానిగా టెక్నాలజీ. యువతపై .దృష్టి చారించి దేశాన్ని ఆధునిక రంగంలోకి నడిపించారు
ఆయన సామాన్య వ్యక్తి నుండి మహానాయకుడుగా ఎదిగిన ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించారు. రాజీవ్ గాంధీ పేరిట స్థాపించబడిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ నేటికీ .విద్య ఆరోగ్యం .సామాజిక అభివృద్ధి కోసం కృషి చేస్తోంది ఆయన విధానాలు భారతదేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాయని తెలిపారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చిలుకల‌ రాయకోంరు . చిట్యాల ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ మండల అధ్యక్షులు గుమ్మడి సత్యనారాయణ . సీనియర్ నాయకులు ‌ సరిగోమ్ముల సదయ్య . చిలుముల రాజమౌళి ‌ బుర్ర మల్లేష్. గుర్రపు తిరుపతి. బుర్ర కరుణాకర్ . ఆరేపల్లి నరసింహారాములు. శనిగరపు మొగిలి. గుర్రపు నరసయ్య.
తదితరులు పాల్గొన్నారు.

నిజాంపేట లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి.

నిజాంపేట లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

నిజాంపేట నేటి ధాత్రి:

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా మండల కేంద్రంలో గల బస్ స్టాండ్ వద్ద కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్ మాట్లాడుతూ దేశం కోసం ప్రజల కోసం వారి కుటుంబం ఎన్నో త్యాగాలు చేసారన్నారు. భారతదేశంలో ఐటి రంగానికి పునాదులు వేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కొమ్మట బాబు, ఎమ్మార్పీఎస్ గరుగుల శ్రీను, తాడెం వెంకటి, ఋషికేష్ యాదవ్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని. అభివృద్ధి పథంలో ముందు ఉంచాలని ఆయన తీసుకున్న నిర్ణయాలు అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిఆరోజు నాటిన మొక్కలే ఈరోజు దేశానికి వృక్షాలై . ఏ లుతున్నాయని అలాగే దేశంలోని యువతకు 21 సంవత్సరానికి ఓటు హక్కు కల్పించిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని అలాగే దేశంలో సాంకేతిక విద్యను విప్లవాన్నితీసుకువచ్చి టెక్నాలజీలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి దేశానికి. ఆయన ఐయామ్ లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారని సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చారని బలమైన అర్థిక దేశంగా నిలబెట్టారని అలాగే పాకిస్తాన్ కి ఇందిరాగాంధీ బలమైన గుణపాఠం చెప్పిందని. ఈ దేశానికి ఇవన్నీ తెచ్చిన. రాజీవ్ గాంధీ అని. తీవ్రవాద ముసుగులో రాజీవ్ గాంధీని హతమార్చారని దేశం గురించి ఆయన ప్రాణాలు అర్పించారని అలాగే తల్లి ఇందిరా గాంధీ కూడా దేశానికి ప్రాణాలు అర్పించారని అటువంటి వారు ఇప్పుడు మనలో లేకపోవడం చాలా బాధాకర విషయమని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఘనంగా రాజీవ్‌గాంధీ వర్ధంతి.

ఘనంగా రాజీవ్‌గాంధీ వర్ధంతి

మరిపెడ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జాటోత్ సురేష్ నాయక్

మరిపెడ నేటిధాత్రి:

దేశానికి సాంకేతికతను తీసుకువచ్చింది రాజీవ్‌ గాంధీనేనని మరిపెడ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జాటోత్ సురేష్ నాయక్ అన్నారు. రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం మరిపెడ పట్టణంలోని రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్‌ గాంధీనే అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు. దేశంలో బీదరికాన్ని పారద్రోలి సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికి మరవలేమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఎండి అప్సర్,ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ రవికాంత్,మరిపెడ పట్టణ యువ నాయకుడు బంక ప్రమోద్,యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీతేజావత్ అఖిల్ నాయక్, కార్యకర్తలు
తదితరులు పాల్గొన్నారు.

కమలాకర్ జన్మదినం సందర్భంగా రాజీవ్ గృహకల్ప సైటు.

గంగుల కమలాకర్ జన్మదినం సందర్భంగా రాజీవ్ గృహకల్ప సైటులో మొక్కలు నాటిన నాయకులు

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు చేట్టిపెళ్లి నరేందర్ ఆధ్వర్యంలో గురువారం రాజీవ్ గృహకల్ప సముదాయంలో మొక్కలు నాటడం జరిగినది. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి పరిచిన అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకర్ అని నిరుపేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ప్రజా సంక్షేమమే అభివృద్ధిగా ప్రజల సమస్యల పరిష్కరిస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకులని కొనియాడారు. కరీంనగర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి పథంలో ముందుంచిన నాయకులని వారు చేసిన సేవలు, చేస్తున్న పనులు కరీంనగర్ నియోజకవర్గం ప్రజలు మర్చిపోలేరని, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అవరోధించాలని ఆభగవంతున్ని ప్రార్థిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఈకార్యక్రమంలో కొత్తపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, యువజన విభాగం మండల అధ్యక్షులు గుర్రాల ప్రకాష్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రేణిగుంట రాజు, మైనార్టీ విభాగం అధ్యక్షులు చాంద్ పాషా, మహిళా విభాగం మండల నాయకురాలు స్వప్న, వరలక్ష్మి, లత, బిఆర్ఎస్ నాయకులు రవీందర్, కనకచారి, సలీం, వాజీత్, సూర్యనారాయణ, శశి, ఆకాష్ రెడ్డి, మహేష్, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్ యువ వికాస పథకం – పేదలకు అందని ద్రాక్ష!

రాజీవ్ యువ వికాస పథకం – పేదలకు అందని ద్రాక్ష!

సంఘీ ఎలేందర్, తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి, వరంగల్ జిల్లా అధ్యక్షులు

వరంగల్, నేటిధాత్రి

 

 

రాజీవ్ యువ వికాస పథకాన్ని సిబిల్ స్కోరు ఆధారంగా అమలు చేయడం వలన అసలు లబ్ధి పొందాల్సిన పేద ప్రజలకు ఇది అందని ద్రాక్షగా మారుతుందన్న ఆవేదనను తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు సంఘీ ఎలేందర్ వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే బ్యాంకు బాధితులుగా మారిన ఎంతో మంది పేద కుటుంబాలు గతంలో తీసుకున్న లోన్లు, వాటికి సంబంధించిన చెల్లింపులు కట్టని కారణంగా వారి సిబిల్ స్కోర్ దెబ్బ తినడం జరిగింది. ఇప్పుడు అదే సిబిల్ స్కోర్‌ను రాజీవ్ యువ వికాస పథకానికి అర్హతగా మారుస్తే, దాదాపు 40 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది అన్నారు. ప్రస్తుతం 16.25 లక్షల మంది పథకానికి దరఖాస్తు చేసిన నేపధ్యంలో, ఇంత పెద్ద సంఖ్యలో పేదలు ఈ అవకాశాన్ని కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. పథకం కింద నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడతాయి కాబట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బ్యాంకు అధికారులతో చర్చించి, సిబిల్ స్కోరు వంటి అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉంది అని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాజీవ్ యువ వికాస్ పథకానికి ఈనెల 14 చివరి గడువు.

రాజీవ్ యువ వికాస్ పథకానికి ఈనెల 14 చివరి గడువు

ముగుస్తున్న గడువు,పెరుగుతున్న దరఖాస్తుల సంఖ్య

జైపూర్,నేటి ధాత్రి:

 

రాజీవ్ యువ వికాస్ పథకం దరఖాస్తుల చివరి తేదీ ఈ నెల 14 వరకు ముగుస్తుందని మండల పరిషత్ అధికారులు ప్రకటించారు.దరఖాస్తు సమయం ముగుస్తున్న కొలది, దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నట్లు బుధవారం ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించుటకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది.ఈ పథకం ద్వారా ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన యువతకు రాయితీ రుణాలు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రత్యేక చర్యలు చేపట్టింది.ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా దరఖాస్తు గడువు దగ్గర పడుతున్నట్లుగా గమనించి, లబ్ధిదారులు ఇప్పటివరకు దరఖాస్తు చేయకపోతే త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ ఈ సందర్భంగా  తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version