వృద్ధురాలికి వీల్ చైర్ అందించిన ఎమ్మెల్యే రేవూరి.

వృద్ధురాలికి వీల్ చైర్ అందించిన ఎమ్మెల్యే రేవూరి

పరకాల నేటిధాత్రి
గురువారం పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాగారం గ్రామానికి చెందిన వృద్ధురాలు మాచబోయిన ఓదెమ్మకి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వీల్ చైర్ ని అందించి వృద్ధిరాలితో కాసేపు ముచ్చటించి వారి ఆరోగ్య బాబోగుల గురించి తెలుసుకొని వృద్ధురాలికి ఆర్థిక సాయం చేశారు.ఈ కార్యక్రమం లో నాగారం గ్రామ కమిటీ అధ్యక్షులు దాసరి బిక్షపతి,యూత్ అధ్యక్షులు మాచబోయిన అజయ్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,కుంకుమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ రాజేశ్వరరావు,అల్లం రఘు నారాయణ,బొమ్మకంటి చంద్రమౌళి,చందుపట్ల రాఘవ రెడ్డి,పర్నెం మల్లారెడ్డి,కొత్తపల్లి రవి,బొచ్చు సంపత్,బొచ్చు మోహన్,కొక్కిరాల తిరుపతి రావు,మడికొండ చంగల్ రావు మరియు తదితరులు పాల్గొన్నారు.

మరపురాని చిత్రాలు అందించిన ‘అన్నపూర్ణ పిక్చర్స్’..

మరపురాని చిత్రాలు అందించిన ‘అన్నపూర్ణ పిక్చర్స్’

తెలుగువారికి అపురూప చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థల్లో ‘అన్నపూర్ణ పిక్చర్స్’ స్థానం ప్రత్యేకమైనది. తమ చిత్రాలలో కథకథనాలకే కాదు సంగీతసాహిత్యాలకూ ఎంతో ప్రాధాన్యమిస్తూ సినిమాలు నిర్మించారు అన్నపూర్ణ అధినేత దుక్కిపాటి మధుసూదనరావుDukkipati madhusudhana rao Memorable movies

తెలుగువారికి అపురూప చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థల్లో ‘అన్నపూర్ణ పిక్చర్స్’ స్థానం ప్రత్యేకమైనది. తమ చిత్రాలలో కథకథనాలకే కాదు సంగీతసాహిత్యాలకూ ఎంతో ప్రాధాన్యమిస్తూ సినిమాలు నిర్మించారు అన్నపూర్ణ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు(Dukkipati madhusudhana rao). మహానటుడు అక్కినేని నాగేశ్వరరావును నాటకాల నుంచీ తీర్చిదిద్దినదీ ఈ మధుసూదన రావే. సినిమా రంగంలో అక్కినేనిని (ANR) +-అగ్రపథాన నిలపాలనే ధ్యేయంతోనే ‘అన్నపూర్ణ పిక్చర్స్’ ను నెలకొల్పారు. ఆ సంస్థకు ఏయన్నార్ ను ఛైర్మన్ గా నియమంచి తాను మేనేజింగ్ డైరెక్టర్ గా అన్ని వ్యవహారాలూ చూసుకున్నారు దుక్కిపాటి. తొలి ప్రయత్నంగా కేవీ రెడ్డి దర్శకత్వంలో ‘దొంగరాముడు’ (1955) నిర్మించి అలరించారు. తరువాత బెంగాలీ నవల ఆధారంగా ‘తోడికోడళ్ళు’ (1957) నిర్మించారు. ఈ చిత్రంతోనే ఆదుర్తి సుబ్బారావు దర్శకునిగా నిలదొక్కు కున్నారు. ఆ పై ఏయన్నార్ హీరోగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో దుక్కిపాటి నిర్మించిన ‘మాంగల్య బలం, వెలుగు నీడలు, ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, పూలరంగడు, విచిత్ర బంధం, బంగారుకలలు’ వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. ఈ చిత్రాలలో అనేకం ఏయన్నార్ కెరీర్ లో మైలురాళ్ళుగా నిలిచాయి. ఏయన్నార్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ‘ఇద్దరు మిత్రులు’ (1961) మంచి విజయం సాధించింది. నవలా చిత్రంగా వెలుగు చూసిన ‘డాక్టర్ చక్రవర్తి’ (1964) నంది అవార్డు అందుకున్న తొలి సినిమాగా నిలచింది.

ఇక ఏయన్నార్ వరుస పరాజయాలు చూస్తున్న సమయంలో ఆయనను మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన చిత్రంగా ‘పూలరంగడు’ (1967) అలరించింది. ఆ పై వరుసగా యద్దనపూడి సులోచనా రాణి నవలల ఆధారంగా ‘ఆత్మీయులు, జైజవాన్, విచిత్రబంధం, బంగారు కలలు’ వంటి చిత్రాలు నిర్మించారు. ‘జైజవాన్’ మినహా అన్నీ ఆకట్టుకున్నాయి. సారథి స్టూడియోస్ భాగస్వామ్యంలో ‘ఆత్మీయులు'(1969) నిర్మించారు దుక్కిపాటి. తమ ‘ఆత్మగౌరవం’ (1965)తోనే కె.విశ్వనాథ్ ను దర్శకునిగా పరిచయం చేశారు దుక్కిపాటి. ‘ఆత్మీయులు, అమాయకురాలు(1971)’ చిత్రాలకు వి.మధుసూదనరావు దర్శకత్వం వహించగా, డి.యోగానంద్ డైరెక్షన్ లో ‘జైజవాన్’ (1970) నిర్మించారు. అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ లో ఏయన్నార్ నటించిన చివరి చిత్రం ‘బంగారుకలలు’ (1974).

తరువాతి రోజుల్లోనూ దుక్కిపాటి తనదైన బాణీ పలికిస్తూనే చిత్రాలను నిర్మించారు. యద్దనపూడి నవలలు ‘ప్రేమలేఖలు, రాధాకృష్ణ’ను అవే టైటిల్స్ తో సినిమాలు తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాలకు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. బాపు దర్శకత్వంలో ‘పెళ్ళీడు పిల్లలు’ (1982), సింగీతం శ్రీనివాసరావు నిర్దేశకత్వంలో ‘అమెరికా అబ్బాయి’ (1987) నిర్మించారు దుక్కిపాటి. ఆ తరువాత మారిన పరిస్థితుల కారణంగా సినిమాలకు దూరంగా జరిగారు దుక్కిపాటి. ఏది ఏమైనా తెలుగు చిత్రసీమలో తమ ‘అన్నపూర్ణ పిక్చర్స్’కు ఓ ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టి, తెలుగువారి మదిలో చెరగని ముద్ర వేశారు దుక్కిపాటి మధుసూదనరావు. 1917 జూలై 27న జన్మించిన దుక్కిపాటి తన చిత్రాల ద్వారా పలు అవార్డులూ, రివార్డులు సంపాదించారు. 2006 మార్చి 26న తుదిశ్వాస విడిచారు.

దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆర్థిక సహాయం.

దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆర్థిక సహాయం

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ట్రస్ట్ సభ్యులు

మంగపేట నేటిధాత్రి

 

 

 

వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ లోగల నిరుపేద కుటుంబానికి చెందిన బుడుగుల పిచ్చయ్య ఇటీవల అనారోగ్యం తో మృతి చెందాడు. కన్నీరు మున్నీరు అవుతున్న బాధిత కుటుంబాన్ని ట్రస్ట్ సభ్యులు కలిసి పరామర్శించి,25 కేజీ ల బియ్యాన్ని మరియు ఆర్థిక సహాయంని శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగరమేష్ ఆదేశాలమేరకు ట్రస్ట్ సభ్యులు వారి కుటుంబ సభ్యులైన భార్య కాంతమ్మ, కొడుకు రమేష్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమరం శివాజీ ,ఆలం శ్రీను, గట్టిపల్లి అర్జున్, చౌలం బాబు,గట్టిపల్లి బాలకృష్ణ మరియు గ్రామస్తులు గట్టిపల్లి సమ్మయ్య ,చౌలం నవీన్ ,చౌలం సుధాకర్, కొట్టెం రాము, బుడుగుల కృష్ణ,
పూనెం గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

వైద్యానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం.

బైక్ మెకానిక్ వైద్యానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ మిత్ర బైక్ మెకానిక్ షాప్ లో మెకానిక్ గా పని చేసే సాగర్ కి ఆదివారం యాక్సిడెంట్ అయ్యి త్రీవ గాయాలు అయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.గాయపడిన సాగర్ ని చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ప్రవేట్ హాస్పిటల్ చేర్పించారు.హాస్పటల్ వైద్య ఖర్చులకు 5 లక్షల రూపాయలు అవుతుందని డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో,ఆర్థిక స్తోమత లేని కుటుంబం కావడంతో ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు సాగర్ కుటుంబ సభ్యులు తెలిపారు.ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఆత్మీయ చారిటబుల్ ట్రస్టును సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు సట్ల మహేందర్, అధ్యక్షుడు కాయం తిరుపతి, కోశాధికారి తూముల సురేష్, సభ్యులు బి.సంపత్,జె.సతీష్, కే.మోహన్,బి.లక్ష్మణరావు,ఈ. వెంకటేష్,జై.నాగరాజు మిగతా సభ్యులు పాల్గొన్నారు.

పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ అందజేసిన వర్ధిని ఫౌండేషన్.

పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ అందజేసిన వర్ధిని ఫౌండేషన్

చిల్పూర్(జనగామ)నేటి ధాత్రి:

ఈనెల జరగబోయే పదవ తరగతి పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని వర్ధిని ఫౌండేషన్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా వర్థిని ఫౌండేషన్ వారి సహకారంతో చిల్పూర్ మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో
పదవ తరగతి విద్యార్థులకు జరగబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ ప్యాడ్ కిట్టును స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇల్లందుల విజయ్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో చిల్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ సిరిపురం నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎగ్జామ్ ప్యాడ్ కిట్టులను పదవ తరగతి విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ మాట్లాడుతూ చాలా గొప్ప కార్యక్రమం చేపడుతున్నారని కార్యక్రమం నిర్వహిస్తున్న ఫౌండేషన్ ప్రశంసించారు,
పరీక్ష రాయనున్న విద్యార్దులు అందరూ పరీక్షలు బాగా రాసి మెరుగైన ఫలితాలు సాధించి జీవితంలో ఉన్నతమైన స్థానంలో వుండాలని పదవ తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు జీవితంలో ఉన్నత స్థానం ఎంచుకోవడానికి సరైన మార్గం అని అన్నారు.విద్యార్థులందరికీ ఈ సందర్భంగా ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో వర్ధిని
ఫౌండేషన్ సభ్యులు తన్నీరు రమేష్ , ఎండి.హఫీజ్, సౌదర పల్లి సంపత్ రాజ్ ,కొర్ర వెంకటేష్ నాయక్,ఇల్లందుల రాజు మరియు కాంగ్రెస్ యూత్ నాయకులు ఐలపాక శ్రీనివాస్,పొన్న రాజేష్ తోపాటు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మృతుని కుటుంబానికి దుబాయ్ గ్రూప్ ఆర్థిక సాయం.

మృతుని కుటుంబానికి దుబాయ్ గ్రూప్ ఆర్థిక సాయం

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని అసినిపర్తి దేవయ్య ఇటీవల అనారోగ్యంతో ఐదు రోజుల క్రితం మరణించాడు, అతనిది చాలా బీద కుటుంబం కావడంతో అంత్యక్రియలు కూడా చందాలు వేసుకొని జరిపించారని తెలుసుకొని మల్యాల గ్రామ అభివృద్ధి కమిటీ దుబాయ్ గ్రూపు వారు అతని భీద స్థితిని గమనించి అతనికి ₹10,200 నగదును అలాగే 50 కిలోల రైస్ బ్యాగులను అందజేశారు, ఈ కార్యక్రమంలో చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు ఎస్సై అంజయ్య, ఏఎస్ఐ అనిల్ కుమార్ తో పాటుగా దుబాయ్ గ్రూప్ యొక్క ఆర్గనైజర్లు మాదం బాబు కొడగంటి గంగాధర్ లోకోజు సతీష్ పాటి సుధాకర్ ఈసరి శ్రీనివాస్, కోన నర్సయ్య, అర్సం సతీష్ మాదం అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version