ఏఐటియుసి నాయకుల తప్పుడు ఆరోపణలను.

ఏఐటియుసి నాయకుల తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం

ఐఎన్టియుసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్రావు

శ్రీరాంపూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

ఆర్కే5 గనిపై ఇటీవల జరిగిన ద్వార సమావేశంలో ఏఐటియుసి నాయకులు తమకు అసలు సంబంధం లేని విషయాలపై ఘనతను దక్కించుకోవాలని తాపత్రయపడటం దురదృష్టకరమన్నారు. డిపెండెంట్ల వయోపరిమితిని 30 నుండి 40 సంవత్సరాలకు పెంచేలా,మీప్రభుత్వంతో మాట్లాడి యాజమాన్యాన్ని ఒప్పించగలిగిన ఘనత ఐఎన్టియుసి యూనియన్‌ కే దక్కుతుంది అని అన్నారు. కానీ ఆ విషయాన్ని ఏఐటీయూసీ నాయకులు తమ విజయంగా చెప్పుకోవడం వారి నీతి మాలిన అసత్య ప్రచారానికి నిదర్శనమని పేర్కొన్నారు.
సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ఐఎన్టియుసి నాయకత్వంలో
బి.జనక్ ప్రసాద్,సెక్రటరీ జనరల్,తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరి బోర్డు చైర్మన్ ప్రభుత్వ స్థాయిలో అనేకసార్లు చర్చలు జరిపినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి,మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్,సింగరేణి చైర్మన్ డైరెక్టర్లతో జరిపిన చర్చలు,సమర్పించిన నివేదికలు స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.పెద్దపల్లి యువ వికాసం బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి
భట్టి విక్రమార్క,రాష్ట్ర మంత్రివర్యులు పాల్గొన్న ఈ సమావేశం అత్యంత విజయవంతంగా నిర్వహించబడిందన్నారు.
ఈసమావేశంలో మంత్రి
దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభలో సింగరేణి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, కార్మికుల సొంతింటి పథకం, అలవెన్సులపై ఇన్కమ్ టాక్స్ చెల్లింపులు,మారుపేర్ల పరిష్కారం,ఇతర పలు సమస్యలపై
బి.జనక్ ప్రసాద్ సమర్పించిన వినతిపత్రాల అంశాలను సంబంధిత శాఖలు పరిశీలిస్తున్నాయని స్పష్టంగా ప్రకటించడమే కాక,త్వరలో కార్మికుల కల నెరవేరేలా చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.ఐఎన్టియుసియూనియన్ కృషి, నిబద్ధతా కార్యాచరణకు, విజయపథానికి ప్రత్యక్ష నిదర్శనమని
జెట్టి శంకర్రావు పేర్కొన్నారు.
గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ యాజమాన్యంతో జరిపిన స్ట్రక్చర్ సమావేశాలలో ఏమి సాధించామో చెప్పకుండా ,
ఐఎన్టియుసి కార్యాచరణను, తమదిగా చెప్పుకుంటూ కాలం వెళ్ళేదీయడం వారి అనైతికతకు నిదర్శనమన్నారు.గనుల్లో, డిపార్ట్మెంట్లలో కార్మికులు, మహిళా కార్మికులు అధిక పనిభారంతో,మౌలిక సదుపాయాల ఏర్పాట్లు కొరవడి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా, ఏఐటీయూసీ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలతో, పైరవీలకే పరిమితమవుతూ కార్మికుల సమస్యల పట్ల శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు.ఈ నేపథ్యంలో కార్మికులు ఏఐటీయూసీ నాయకుల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని, నిజమైన కార్మిక సంక్షేమానికి కృషి చేస్తున్న ఐఎన్టియుసి పట్ల తమ మద్దతును కొనసాగించాలని జెట్టి శంకర్రావు పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో
సిహెచ్.భీమ్ రావ్, గరిగ స్వామి,కలవేన శ్యామ్, తిరుపతి రాజు,వెంకటేష్ పేరం రమేష్,ఏనుగు రవీందర్ రెడ్డి, ఐరెడ్డి తిరుపతిరెడ్డి,ల్యాగల శ్రీనివాస్,జీవన్ జోయల్, మనోజ్,గోపాల్ రెడ్డి,చాట్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

టీబీజీకేఎస్ నాయకులు అసత్యపు ఆరోపణలు మానుకోవాలి.

టీబీజీకేఎస్ నాయకులు అసత్యపు ఆరోపణలు మానుకోవాలి

*కేంద్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్
జెట్టి శంకర్రావు*

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

గత కొంతకాలం నుండి టీబీజీకేఎస్ నాయకులు చేస్తున్న అసత్యపు ఆరోపణలను మానుకోవాలని ఐఎన్టియుసి కేంద్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ రావు శుక్రవారం ప్రకటనలో హెచ్చరించారు.సింగరేణిలో టీబీజీకేఎస్ ఇంచార్జ్,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేస్తున్న ఆరోపణలు దయ్యాలు వేదాలు వల్లించడమే తప్ప వాస్తవం కాదని తెలిపారు.మితి మీరిన రాజకీయ జోక్యంతో బిఆర్ఎస్ ప్రభుత్వం బాండ్ల రూపంలో ఉన్న సింగరేణి మిగులు బడ్జెట్‌ను కొల్లగొట్టి సంస్థకు రూ.29 వేల కోట్లపైగా ప్రభుత్వ బకాయిలు ఇవ్వకుండా అజమాయిష్ చేసింది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.మీ పరిపాలనలో ఒక్క కొత్త గనిని కూడా తెరవలేని దుస్థితికి సింగరేణిని తీసుకొచ్చారని,సంస్థను ఆర్థికంగా నిర్వీర్యం చేసింది కూడామీ ప్రభుత్వమేనని విమర్శించారు.
మీ టీబీజీకేఎస్ నాయకులను, సంస్థ పాలనా పరంగా చేసిన బదిలీలను రాజకీయ జోక్యంగా చిత్రీకరించడం అసత్యప్రచారం తప్ప మరేమీ కాదన్నారు.అప్పటి గుర్తింపు సంఘం,అధికారంలో మీ పార్టీ ఉండగా జరిగిన ఈ చర్యలు ఇప్పుడు మితిమీరిన జోక్యమని మాట్లాడడం విడ్డురమన్నారు.
2022 లో యాజమాన్యం సంస్థ పాలన పరంగా, సింగరేణి వ్యాప్తంగా 20 మంది యూనియన్ నాయకులను, శ్రీరాంపూర్‌లో ఐదుగురు టీబీజీకేస్ నేతలను బదిలీ చేసింది.అప్పుడు గుర్తింపు సంఘంగా టీబీజీకేస్, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటాన్ని మరిచి,ఇప్పుడు రాజకీయ జోక్యం గురించి మాట్లాడడం నైతిక విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.మీ రాజకీయ హోదా నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వంపై నీతిమాలిన ఆరోపణలు చేయడం తగదని హితువు పలికారు.నిజం తెలుసుకున్న కార్మికులు తప్పకుండా మీ వాస్తవ రూపాన్ని గ్రహిస్తారని హెచ్చరించారు.

అసత్యపు ఆరోపణలు మానుకో..

అసత్యపు ఆరోపణలు మానుకో.. బహిరంగ చర్చకు సిద్ధమా ..?

సింగల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

అసత్యంతో కూడిన కల్పిత ఆరోపణలు మానుకోవాలని సంబంధిత ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సింగల్ విండో డైరెక్టర్(21వ వార్డు ఇంచార్జ్) ధర్ని మధుకర్ మాజీ ఎంపీపీ బేర సత్యనారాయణకు సవాల్ విసిరారు.

గురువారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

ఈనెల 2వ తేదీన స్థానిక ప్రెస్ క్లబ్ లో బేర సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడిన అసత్యపు మాటలను పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

నిరాధారణమైన వాక్కులు అంత మంచివి కావని హితువు పలికారు.తాను ఎవరి భూములను అక్రమంగా తీసుకోలేదని స్పష్టం చేశారు.

ఒకవేళ ఆధారాలతో నిరూపిస్తే దైవ సాక్షిగా ఆ భూములను ఈ ప్రాంత ప్రజలకు బే షరతుగా పంచుతానని పత్రికా ముఖంగా తెలుపుతున్నానని అన్నారు.

తగిన ఆధారాలతో శనివారం సర్వేనెంబర్ 8 లోని రైస్ మిల్లు వద్దకు వస్తే నేను అన్న మాటలకు కట్టుబడి ఉంటానని అన్నారు.

నీ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ లబ్ధి కోసం అనేక పార్టీలు మారావే కానీ నిన్ను గెలిపించి రాజకీయంగా పదవులు కట్టబెట్టిన 21వ వార్డు ప్రాంత ప్రజలకు ఏ విధంగా నువ్వు సహాయం చేయలేదని విమర్శించారు.

నువ్వు ఎంపీపీ స్థానంలో ఉండి రొడ్డ రాజేశం,గాజుల విజయలక్ష్మి,తిప్పని పద్మ, పోతురాజుల రమేష్ వంటి పేద ప్రజలకు సంబంధించిన భూములను అక్రమంగా లాక్కొని వారిని అనేక రకాలుగా ఇబ్బంది చేసిన విషయాన్ని మర్చిపోయావ అని గుర్తు చేశారు.వారికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా 21 వార్డులో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్వలేక రాజకీయంగా భవిష్యత్తులో తన ఉనికిని కోల్పోతాడనే ఉద్దేశ్యంతో అసత్య ప్రేలాపనలు పేలుతున్నాడని మండిపడ్డారు.

భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి తాను సిద్ధమని ప్రజల మద్దతు ఎవరికో వేచి చూడాలని సవాలు విసిరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

అసత్య ప్రచారం చేసిన ఒకరిపై కేసు నమోదు.

అసత్య ప్రచారం చేసిన ఒకరిపై కేసు నమోదు

నెన్నెల,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

నెన్నెల మండలంలో అసత్య ప్రచారం చేసిన ఒకరిపై కేసు నమోదు
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన బెల్లంపల్లి మండలం చాకెపల్లికి చెందిన దుర్గం రవిపై గురువారం కేసు నమోదు చేసినట్లు నెన్నెల ఎస్సై ప్రసాద్ శుక్రవారం తెలిపారు.ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడని నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన అత్తిని బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

తప్పుడుసమాచారం ఇచ్చినందుకు బహిరంగ క్షమాపణ ..!

తప్పుడుసమాచారం ఇచ్చినందుకు బహిరంగ క్షమాపణ ..!

*పగిడి పల్లి రవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

మంగపేట నేటిధాత్రి

 

 

 

 

మంగపేట మండలం బుచ్చంపేట గ్రామం ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరియు రాజీవ్ యువ వికాసం పథకం విషయం లో వచ్చిన కథనాల్లో ఎలాంటి నిజం లేదని, నేను ఎవరికీ డబ్బుల రూపంలో కానీ ఫోన్ పే ల ద్వారా కానీ ఎలాంటి నగదు చెల్లించలేదని , కాటూరి నాగయ్య, జంగం భానుచందర్, ఎడ్ల నరేష్ ,పల్లె శోభన్ బాబుల పేర్లను ప్రస్తావిస్తూ నేను చేసిన ఆరోపణలు పూర్తి గా అవాస్తవం అని ఆ ఆరోపణలు చేసిన పగిలిపెళ్లి రవి అనే నేను వారికి బహిరంగంగా క్షమాపణ చెపుతున్నాను. ఇట్టి విషయము నా సొంత నిర్ణయాలుతో నేను చేసినది కాదు అని కొన్ని ఒత్తిడిల మరియు పార్టీ మీటింగ్ లకు పిలువ లేదు అనే కారణాలవల్ల వారిపై ద్వేషం తో నేను పత్రిక కు మీడియాకు ఇవ్వాల్సి వచ్చిందని నా తప్పును మన్నించగలరని ఇలాంటి తప్పుడు సమాచారం ఇంక నేను ఎప్పుడూ కూడా ఇవ్వనని మీడియా ద్వారా ప్రజానీకానికి మరియు కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు గ్రామ బుచ్చంపేట కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా పత్రిక ముఖంగా క్షమాపణ కోరుతున్న..

తనపై ఆసత్య ఆరోపణలు చేసిన వారిపై కలెక్టర్.!

తనపై ఆసత్య ఆరోపణలు చేసిన వారిపై కలెక్టర్ కి ఫిర్యాదు ఆర్ఐ తిరుపతి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగారపు రమేష్ జైపూర్ ఆర్ఐ తిరుపతిపై చేసిన ఆరోపణలు నిరాధారమైన అసత్య ఆరోపణలనీ అన్నారు.తను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చుతూ అందరితో స్నేహపూర్వకంగా ఉంటానని,తనపై లేనిపోని ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో తన పరువు పోయేలా చేశారని,దానివల్ల ఎంతో మానసిక వేదనకు గురయ్యానని,తన కుటుంబ సభ్యులు అవమాన భారంతో కృంగిపోతున్నారని అన్నారు. నేను ఎటువంటి తప్పు చేయలేదని,విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేశానని,నేను తప్పు చేసినట్లు మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిరూపిస్తే నేను అధికారులు చేపట్టే చర్యలకు సహకరిస్తానని అన్నారు.కానీ ఇలాంటి ఆధారాలు లేకుండా తనపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ని కోరడం జరిగిందని తెలిపారు.

జైపూర్ ఆర్ఐ పై వచ్చిన వార్తకి స్పందించిన తహసిల్దార్ వనజా రెడ్డి

జైపూర్ ఆర్ఐ తిరుపతి పై వచ్చిన ఆరోపణలు ఆవాస్తవమని తహసిల్దార్ వనజా రెడ్డి తన కార్యాలయంలో బుధవారం తెలియజేశారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మా పరిధిలో ఉంటే తప్పకుండా వెంటనే స్పందిస్తామని,సమస్యను పరిష్కరిస్తున్నామని అన్నారు. తాము ఏదైనా తప్పు చేసినట్లు అనిపిస్తే తమ పై అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయవచ్చునని,అందులో నిజం ఉంటే అధికారులు దర్యాప్తు నిర్వహించి చర్యలు చేపడతారని తెలిపారు.తమ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్ఐ తో పాటు మిగతా అధికారులు కూడా అంకితభావంతో పనిచేస్తున్నామని,ప్రజా సమస్యలను తీర్చడంలో ఒక అడుగు ముందే ఉన్నామని తెలియజేశారు.ఇలా సోషల్ మీడియా ద్వారా అధికారులను అపరాదులుగా చూపిస్తూ,అసత్య ఆరోపణలు,ప్రచారాలు చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిన వారిపై తప్పకుండా చర్యలు చేపడతామని హెచ్చరించారు.

రెవెన్యూ అధికారి పై అసత్య ప్రచారం చేసిన.

జైపూర్ మండల రెవెన్యూ అధికారి పై అసత్య ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలి

టీఎన్జీవోఎస్ అధ్యక్షుడు గడియారం శ్రీహరి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలంలో రెవెన్యూ ఇన్సెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న తిరుపతి పై ప్రెస్ మీట్ నిర్వహించి అకారణంగా అసత్య,నిరాధార ఆరోపణలు చేసిన మాదిగ హక్కుల దండోరా నాయకులు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం వారు ఖండించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్ఐ తిరుపతి పై అనవసరంగా కొందరు ఆరోపణలు చేస్తున్నారని, ఇవన్నీ నిరాధారమైనవని కేవలం కక్ష్య పూర్వకంగా చేసినవని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం జైపూర్ ఏసిపి కార్యాలయంలో పిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా టిఎన్జీవోస్ అధ్యక్షుడు గడియారం శ్రీహరి,సెక్రెటరీ రామ్మోహన్,టీఎన్జీవోఎస్ మందమర్రి యూనిట్ అధ్యక్షులు ఏ.సుమన్,కార్యదర్శి సిహెచ్.సతీష్,సభ్యులు రవిచందర్,శ్రీనివాస్,లోకుల ప్రశాంత్,అరెల్లి సత్యనారాయణ,పి.సురేష్, బాణాల ఉదయ్ కుమార్,స్వామి,అపర్ణాదేవి, కళాశిల్ప,రజిత,విజయ్, తిరుపతి,రాజన్న తదితరులు పాల్గొన్నారు.

తప్పుడు మైనింగ్ అనుమతులు పై చర్యలు తీసుకోవాలి.

తప్పుడు మైనింగ్ అనుమతులు పై చర్యలు తీసుకోవాలి

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

 

ఆదివాసి సంక్షేమ పరిషత్ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ గారిని కలిసి మెమొరండా ఇవ్వడమైనది. అనంతరం దనసరి రాజేష్ రాష్ర్ట జాయింట్ సెక్రటరీ ఆదివాసి సంక్షేమ పరిషత్ మాట్లాడుతూ. పూర్తి ఏజెన్సీ మండలం అయినటువంటి బయ్యారం మండల పరిధిలోని ధర్మాపురం రెవేన్యూ గ్రామం నామలాపాడు గ్రామపంచాయతీ పరిధిలో గిరిజన రైతులు మట్టితోలకాలకు అనుమతులు కావాలని గనులు మరియు భూగర్భ శాఖకు దరఖాస్తు చేసుకున్నారని వారు 6000 మెట్రిక్ టన్నుల మట్టి తోలకాలకు పెసా గ్రామసభ తీర్మానం చేసి పంపమని చెప్తున్నా మైనింగ్ AD చెప్తున్నారు తప్ప ఆ మట్టిని రైతు పొలాల్లోకా లేక వ్యాపారవేతలకా అని చెప్పకపోవడం వారిచ్చే సర్కిలర్ లొ ఎంత లోతు మట్టి తవ్వకాలు జరుగుతాయి అని ఏం తెలుపకుండా పేసా కమిటీ ద్వారా తీర్మానం చేసి పంపండి అని చెప్పడం దురదృష్టకరం. ఇక్కడ మైనింగ్ అధికారులు మట్టి తోలకాల అనుమతులపై పూర్తి సమాచారం ఇవ్వకుండా ఒక సర్కులర్ పంపి ఆ తీర్మానం ఇవ్వండి అంటున్నారే తప్ప ఇప్పటివరకు మట్టి తోలకాలు చేసినటువంటి వారు మట్టి తోలకాల ద్వారా ఆ ఆదాయం ద్వారా ఆ గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు చెల్లించాలి అనే విషయాన్ని గోప్యంగా ఉంచుతూ గిరిజనుల పేరుతో ఈ మట్టి దందలో గిరిజనేతరులను ప్రోత్సహించడం సిగ్గుచేటు ఎన్నో సంవత్సరాల నుండి జరుగుతున్న అక్రమ మట్టి దంద పైన ఏజెన్సీ ప్రాంతంలోని 1/70 చట్టాన్ని ఉల్లంఘించి గిరిజనేతరలకు అనుమతులు ఇస్తున్న గనులు మరియు భూగర్భ శాఖ అధికారులను తప్పుడు గ్రామ సభ తీర్మానాలు ఇస్తున్న గ్రామపంచాయతీ సెక్రటరీలను విధుల నుండి తొలగించాలని ఈ అక్రమ వ్యాపారం పైన గత రెండు సంవత్సరాల నుండి జిల్లా కలెక్టర్ గారికి రెండు సంవత్సరాల నుండి దరఖాస్తులు ఇచ్చినా కూడా అక్రమ మట్టి తోలకాల పైన అక్రమ ఇటుక బట్టీల పైన ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈరోజు ఆదివాసి సంక్షేమ పరిషత్ డిమాండ్ తో మహబూబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపినారు.

అంతేకాకుండా ఎన్నో సంవత్సరాల నుండి ఏజెన్సీ ప్రాంతంలోని 1/70 చట్టానికి విరుద్ధంగా ధర్మపురం రెవెన్యూ, కొత్తపేట రెవేన్యూ, గంధంపల్లి రెవేన్యూ మరియు కాసినపల్లి రెవేన్యూ పరిధిలో గిరిజనేతరులు అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలను తొలగించాలి జిల్లా అధికారులు చిత్తశుద్ధితో అనుమతులు లేని ఇటుక బట్టీల పై ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ గారు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్,ఉపాధ్యక్షులు మంకిడి సురేష్ డివిజన్ అద్యక్షులు తాటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

శ్మశాన వాటిక గురించి తప్పుడు నివేదిక సోషల్ మీడియాలో.

శ్మశాన వాటిక గురించి తప్పుడు నివేదిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీనిని ప్రభుత్వ అధికారులు ఖండించారు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

సోషల్ మీడియాలో కోహిర్ నుండి వచ్చిన యువకుడిని నిజం చేయడం చాలా ఖరీదైన పని. వివరాల ప్రకారం, దివంగత భండారీ అబ్దుల్ రషీద్ కుమారుడు ముహమ్మద్ సలీముద్దీన్ భండారీ నిన్న హీర్‌లోని అతిపెద్ద శ్మశానవాటిక అయిన హజ్రత్ మౌలానా ముయిజుద్దీన్ తుర్కీ శ్మశానవాటికలో వక్ఫ్ సవరణ బిల్లు యొక్క మొదటి ప్రభావాన్ని కోహిర్లో చూడవచ్చని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేయడం ద్వారా వైరల్‌గా మారింది. కానీ అది అబద్ధాల ఆధారంగా జరిగింది. వివరాల ప్రకారం, కోహిర్ స్మశానవాటికలో ఒక కుటుంబం తమ పాత సమాధుల దగ్గర ఉన్న ముళ్ల పొదలను శుభ్రం చేయడానికి జెసిబిని ఉపయోగిస్తుండగా, వారు అకస్మాత్తుగా అక్కడికి వెళ్లి తమ మొబైల్ ఫోన్‌తో ఒక వీడియో తీశారు, అందులో వారు సెంట్రల్ బ్యాంక్ మరియు బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు అని చెప్పారు. దానికి ఒక ప్రభావం ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న అసత్యపు.!

కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న అసత్యపు ఆరోపణలు మానుకోవాలి.

ఎస్సి సేల్ మొగుళ్లపల్లి మండల కమిటీ అధ్యక్షులు
ఓనపాకాల ప్రసాద్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం పథకాలు, ఓర్వలేక సోషల్ మీడియాలో బిఆర్ఎస్, బిజెపి పార్టీలు అసత్యపు ఆరోపణలు మానుకోవాలని, లేకుంటే ప్రజలు బిఆర్ఎస్, బిజెపి పార్టీలకు తగిన గుణపాఠం చెప్తారని. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కనులకు కనిపించడం లేదా అని కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ మొగుళ్లపల్లి మండల కమిటీ అధ్యక్షులు ఓనపాకాల ప్రసాద్ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో బిఆర్ఎస్, బిజెపి చేస్తున్న విమర్శలకు సోమవారం రోజున అయన స్పందించి మాట్లాడుతూ. గత పాలకులు ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మూడు కోట్ల పదిలక్షల మందికి సన్న బియ్యం జరుగుతుంది నిజం కదా. సుమారు 82శాతం మందికి లబ్ది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకు ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, సుమారు 150 కోట్ల మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్నారని. రైతులకు 500 రూపాయల బోనస్, రైతు రుణమాఫీ రైతుబంధు జరిగింది. యువకులకు 57,వేల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో యువతకు అందించారాని. పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి, పేద ప్రజలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసి, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ పథకం అమలు అవుతుందని ప్రతిపక్షాలకు ఈ పథకాల అవపడుతలేవ. నూటికి నూరు శాతం ఏ ప్రభుత్వం కూడా అమలు చేయని పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం చేస్తుందనడంలో. ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో. నేటి యువత. స్వాతంత్ర ఉద్యమం చరిత్ర, రాజ్యాంగం యొక్క చరిత్ర,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చరిత్రను తెలుసుకోవడం అవసరం ఉందని, ఈరోజు జై బాపు జై భీమ్ జై సమిదాన్ కార్యక్రమం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఆదేశాల మేరకు గత నాలుగు రోజులు మొగుళ్లపల్లి మండలంలో పాదయాత్ర నిర్వహించడం జరిగిందని జిల్లా నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసి పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి లకు తగిన గుణపాఠం చెపుతామని ఎస్సి సెల్ మొగుళ్లపల్లి మండల కమిటీ అధ్యక్షులు ఓనపాకల ప్రసాద్ అన్నారు. పాల్గొని పై విధంగా పేర్కొన్నారు.

‌నాపై తప్పుడు ప్రచారం చేయొద్దు..

అక్కడ జరిగిన సంఘటనలకు నాకు ఎలాంటి సంబంధం లేదు.

సంఘటన జరిగిన రోజున హైదరాబాద్ లో కూడా లేను.

వరంగల్ లో ఎల్లమ్మ పండుగ కార్యక్రమంలో వున్నాను.

రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికే కొందరు నాపై దుష్పచారం మొదలుపెట్టారు.

నేను భూ యజమానిని కావడం వల్ల పోలీసులు నాకు నోటీసులు జారీ చేశారు.

నేను అందుకు సంబంధించిన వివరణ ఇస్తాను. పోలీసు విచారణకు సహకరిస్తాను.‌

మీడియా మిత్రులకు మనవి. ఎటువంటి ఆధారాలు లేకుండా అభూత కల్పనలతో కథనాలు ప్రసారం చేయొద్దు.

సోషల్ మీడియాలో నాపై దుష్పచారం చేస్తున్న వ్యక్తులకు లీగల్ నోటీసులు పంపించడానికి వెనుకాడను.

ఎమ్మెల్సీ “పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి”.

“నేటిధాత్రి”, హైదరాబాద్.

తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రజా ప్రతినిధిగా 20 సంవత్సరాల పాటు మచ్చలేని నాయకుడు, వివాద రహితుడిగా పేరు సంపాదించుకున్నాను. మొయినాబాద్ మండల తోల్కట్డ గ్రామంలో నాకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో జరిగిన సంఘటనకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. 2018 ఆ భూమి కొనుగోలు చేసిన తర్వాత దాని నిర్వహణ బాధ్యతలను నా మేనల్లుడు జాన్‌దేవ్ రెడ్డికి అప్పగించాను. ఇక్కడ మరో ముఖ్య విషయం. నా వ్యవసాయ క్షేత్రంలో ఎలాంటి నిర్మాణాలు లేవు. కేవలం వ్యవసాయ కూలీలు సేదదీరడం కోసం వేసిన రేకుల షెడ్లు మాత్రమే వున్నాయి. నా వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరి తోట, మామిడి తోటలున్నాయి. నిరంతరం వ్యవసాయ పనుల కోసం వాడే పని ముట్లు దాచడం కోసం రేకుల షెడ్లు వినియోగిస్తారు. అక్కడ గెస్ట్ హౌస్ లేదు. ఫామ్ హౌస్ లేదు. కానీ కొందరు పని గట్డుకొని అసత్యాలన్నీ ప్రచారం చేస్తున్నారు.‌ కాకపోతే మా మేనల్లుడు నా సమాచారం లేకుండా సదరు తోటను వర్రా రమేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి కౌలుకి ఇచ్చినట్లు మాత్రమే తెలిసింది. అయితే రమేశ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మరో వ్యక్తి ఎం. వెంకట పతి రాజుకు కౌలుకిచ్చారని నిన్ననే నా దృష్టికి వచ్చింది. వెలుగులోకి వచ్చిన విషయంలో సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూడా నేను స్వయంగా నిన్ననే పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటనలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. సంఘటన జరిగిన రోజున హైదరాబాద్ లో కూడా లేను. వరంగల్ లో ఎల్లమ్మ పండుగ కార్యక్రమంలో వున్నాను. రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికే కొందరు నాపై దుష్పచారం మొదలుపెట్టారు. నేను భూ యజమానిని కావడం వల్ల పోలీసులు నాకు నోటీసులు జారీ చేశారు. నేను అందుకు సంబంధించిన వివరణ ఇస్తాను. పోలీసు విచారణకు సహకరిస్తాను.‌ అయితే మీడియా మిత్రులకు మనవి. ఎటువంటి ఆధారాలు లేకుండా అభూత కల్పనలతో కథనాలు ప్రసారం చేయొద్దు. సోషల్ మీడియాలో నాపై దుష్పచారం చేస్తున్న వ్యక్తులకు లీగల్ నోటీసులు పంపించడానికి వెనుకాడను. అని పోచంపల్లి తెలిపారు.

అంబేద్కర్ భవన్ పై అసత్యపు ఆరోపణలు మానుకోండి

పరమశివన్.

తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 08:

దళిత ప్రజలకు ఆశ్రయంగా నిలుస్తున్న శ్రీ చెల్లప్ప మేస్త్రి మెమోరియల్ అంబేద్కర్ భవన్ పై అసత్యపు ఆరోపణలు మానుకోవాలని తిరుపతి అంబేద్కర్ భవన్ చైర్మన్ డాక్టర్ పరమేశ్వరం హెచ్చరించారు. శనివారం తిరుపతి స్థానిక బాలాజీ కాలనీలోని అంబేద్కర్ భవన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం నాడు ఏపీ ఎస్సీ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగిశెట్టి ధర్మయ్య తిరుపతి అంబేద్కర్ భవన్ పై విమర్శలు చేయడం తగదన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళుతూ అంబేద్కర్ భవన్ ను అభివృద్ధి పదంలో నడిపించేందుకు తామెంతో కృషి చేస్తున్నామన్నారు.అయితే కొందరు దుర్బుద్ధితో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. దళిత యువకులకు దళిత సంఘాలకు తాము ఎంతో ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు.అలాగే నెలలో రెండుసార్లు అంబేద్కర్ ఎలా ప్రజలకు సేవ చేశారు అన్న అంశాలను ప్రజల నిరంతరం తెలియజేస్తూ అందరికీ అండగా ఉంటున్నామని తెలిపారు. ఇకనైనా అసత్యపు ఆరోపణలు మానుకొని అంబేద్కర్ భవన్ అభివృద్ధికి సహకరించాలని లేనిపక్షంలో ప్రజలే వారికి బుద్ధి చెప్తారని అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో అంబేద్కర్ భవన్ కార్యదర్శి కె.నాగేశ్వరరావు, సభ్యులు ఇంద్రముని,గోపి,పుష్ప రాజ్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version