కష్టించిన పంట వానపాలు.

— కష్టించిన పంట
వానపాలు
• లారీలు రాక తిప్పలు
• టార్పాలిన్లు అందివ్వని నిర్వాహకులు

నానిన వడ్లను కొనుగోలు చేయాలి

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

 

రైతు ఆరుకాలం కష్టించి పండించిన పంటకు లాభం లేకుండా పోయిందని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల వద్దకు వస్తే వానపాలు అవుతున్నాయన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు లారీల కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. రెండు, మూడు లారీలకు సరిపోడ ధాన్యం బస్తాలు ఉన్నప్పటికీ ఆ ధాన్యం బస్తాలను రైస్ మిల్లు లోకి తరలించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

Harvest Rains.

 

ఈ అకాల వర్షాలు నేపథ్యంలో చేతికి వచ్చిన పంటను కండ్లముందే నీటిపాలు చేసుకుంటున్నామని రైతులు వాపోతున్నారు. సొసైటీ నిర్వాహకులు రైతులకు ఎలాంటి టార్పాలిలను అందివ్వడం లేదని తమ వద్ద ఉన్న టర్పాలిన్ లు సరిపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ నిర్వాహకులు శరవేగంగా కొనుగోలు జరపాలని వేడుకుంటున్నారు. వానకి నానిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రోజుకు 20 రూపాయల చొప్పున తాటి పత్రిలకు కిరాయి తెచ్చుకుంటున్నామని అన్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బడుగు బలహీన వర్గాల మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ.

బడుగు బలహీన వర్గాల నాయకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు బడుగు బలహీన వర్గాల నాయకుడు నవభారత నిర్మాణ సృష్టికర్త దేశానికి దిశా నిర్దేశం చూపిన మార్గదర్శకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి కొమురయ్య అన్నారు బుధవారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో రాజీవ్ గాంధీ వర్ధంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికిపూలమాలవేసి నివాళి అర్పించారు వారు మాట్లాడుతూ దేశాన్ని టెక్నాలజీ రంగం వైపు తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు భారతదేశ ప్రధాన మంత్రిగా ప్రజలకు చేసిన సేవలు అభివృద్ధి గురించి గుర్తు చేశారు దేశానికి సాంకేతికతను తీసుకోవచ్చింది సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ అని అన్నారు అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశం నీ నిలిపిన ఘనత ఆయనకే దక్కుతుందని గుర్తు చేశారు దేశంలో బీదరికాన్ని పారదోలి సమ సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేమని కొనియాడాడు

సభ సక్సెస్ చేద్దాం రండి కదలిరండి.

సభ సక్సెస్ చేద్దాం రండి కదలిరండి

మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్

పరకాల నేటిధాత్రి:

 

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో ముదిరాజ్ సింహ గర్జన చైతన్య ర్యాలీని విజయవంతం చేయడానికి చేయి చేయి కలుపుదాం కలిసికట్టుగా సమిష్టి కృషితో సభను సక్సెస్ చేద్దామని,మెపా పిలుస్తోంది ప్రతి గడప నుండి సభకు వెళ్దాం,ముదిరాజ్ ల బలం బలగాన్ని చూపిద్దామని మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్ తెలిపారు.వారు మాట్లాడుతూ మన హక్కులను సాధించడానికి,రాజకీయ పార్టీలకు ఓట్లప్పుడే మనం గుర్తుకు వస్తున్నాం,ఆ తర్వాత మనం వారికి గుర్తుకు రావట్లేదని,ముదిరాజ్ లకు అధిక ప్రాధాన్యం ఇవ్వట్లేదని,ముదిరాజ్ లను బిసి ఏ లో చేర్చాలని,మేమెంతో మాకంత రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలని 75%సబ్సిడీతో సంక్షేమ పథకాలు ఇవ్వాలని,రాబోయే స్థానిక ఎన్నికలలో ముదిరాజ్ లకు టికెట్స్ కేటాయించాలని తెలిపారు.

రాజీవ్ గాంధీ జీవితం అందరికీ ‌ స్ఫూర్తిదాయకం.

రాజీవ్ గాంధీ జీవితం అందరికీ ‌ స్ఫూర్తిదాయకం.

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కిష్టయ్య.

చిట్యాల నేటిధాత్రి:

రాజీవ్ గాంధీ జీవితం అందరికీ
స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య అన్నారు .
చిట్యాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని శ్రీ ‌రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కిష్టయ్య. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ .హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆధునిక దృష్టి కలిగిన భారత ప్రధానిగా టెక్నాలజీ. యువతపై .దృష్టి చారించి దేశాన్ని ఆధునిక రంగంలోకి నడిపించారు
ఆయన సామాన్య వ్యక్తి నుండి మహానాయకుడుగా ఎదిగిన ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించారు. రాజీవ్ గాంధీ పేరిట స్థాపించబడిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ నేటికీ .విద్య ఆరోగ్యం .సామాజిక అభివృద్ధి కోసం కృషి చేస్తోంది ఆయన విధానాలు భారతదేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాయని తెలిపారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చిలుకల‌ రాయకోంరు . చిట్యాల ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ మండల అధ్యక్షులు గుమ్మడి సత్యనారాయణ . సీనియర్ నాయకులు ‌ సరిగోమ్ముల సదయ్య . చిలుముల రాజమౌళి ‌ బుర్ర మల్లేష్. గుర్రపు తిరుపతి. బుర్ర కరుణాకర్ . ఆరేపల్లి నరసింహారాములు. శనిగరపు మొగిలి. గుర్రపు నరసయ్య.
తదితరులు పాల్గొన్నారు.

నిజాంపేట లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి.

నిజాంపేట లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

నిజాంపేట నేటి ధాత్రి:

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా మండల కేంద్రంలో గల బస్ స్టాండ్ వద్ద కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్ మాట్లాడుతూ దేశం కోసం ప్రజల కోసం వారి కుటుంబం ఎన్నో త్యాగాలు చేసారన్నారు. భారతదేశంలో ఐటి రంగానికి పునాదులు వేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కొమ్మట బాబు, ఎమ్మార్పీఎస్ గరుగుల శ్రీను, తాడెం వెంకటి, ఋషికేష్ యాదవ్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు

పేద విద్యార్థికి స్టేట్ ర్యాంక్.

పేద విద్యార్థికి స్టేట్ ర్యాంక్

బాలానగర్ నేటి ధాత్రి:

 

మహబూబ్ నగర్ బాలానగర్ మండల కేంద్రంలోని జనరల్ బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో పదో తరగతి విద్యార్థి అమూల్య నిన్న వెలువడిన టీజీఆర్ జేసీ ఫలితాలలో.. ఏంఈసీ విభాగంలో స్టేట్ 1 ర్యాంకు సాధించింది. కొత్తకోట చెందిన సువర్ణ మల్లేష్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన కూతురు అమూల్యను బాలానగర్ గురుకుల పాఠశాలలో చదివిస్తున్నారు. స్టేట్ బ్యాంకు సాధించడంతో పాఠశాల ప్రిన్సిపల్ అంజన్ రెడ్డి, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

ఆసుపత్రి ని సందర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు.

జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి ని సందర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ఏరియా ఆసుపత్రి ని సందర్శించి* ఆసుపత్రిలో ప్రతి విభాగాన్ని తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ప్రతి విభాగంలో రోగులతో మాట్లాడుతూ వారి సమస్యలను మరియు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

MLA Manik Rao

 

 

అనంతరం సూపరెండింట్ డాక్టర్ శ్రీధర్ ,డాక్టర్ గిరి, ఇతర వైద్యులు & స్టాఫ్ తో మాట్లాడుతూ హాస్పిటల్ కు వచ్చే రోగులకు ప్రతి విభాగంలో స్టాప్ అంకితభావంతో సేవలందించాలని వచ్చే నెలలో తిరిగి ప్రతి విభాగంతో సమావేశం అవుతా అని అన్నారు.ఎమ్మెల్యే గారి తో పాటుగా సీనియర్ నాయకులు నామ రవికిరణ్ ,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,బండి మోహన్, తదితరులు ఉన్నారు .

 బాధిత కుటుంబానికి భరోసా.

 బాధిత కుటుంబానికి భరోసా

నిజాంపేట నేటి ధాత్రి:

గత 15 రోజుల క్రితం నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన ఆకుల నాగరాజు ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న లీలా గ్రూప్స్ చైర్మన్ మోహన్ నాయక్ బాధిత కుటుంబానికి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమం లో టెలికామ్ బోర్డ్ మెంబర్ ఆకుల రమేష్, బాలరాజ్, సురేష్ నాయక్ లు ఉన్నారు.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని. అభివృద్ధి పథంలో ముందు ఉంచాలని ఆయన తీసుకున్న నిర్ణయాలు అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిఆరోజు నాటిన మొక్కలే ఈరోజు దేశానికి వృక్షాలై . ఏ లుతున్నాయని అలాగే దేశంలోని యువతకు 21 సంవత్సరానికి ఓటు హక్కు కల్పించిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని అలాగే దేశంలో సాంకేతిక విద్యను విప్లవాన్నితీసుకువచ్చి టెక్నాలజీలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి దేశానికి. ఆయన ఐయామ్ లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారని సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చారని బలమైన అర్థిక దేశంగా నిలబెట్టారని అలాగే పాకిస్తాన్ కి ఇందిరాగాంధీ బలమైన గుణపాఠం చెప్పిందని. ఈ దేశానికి ఇవన్నీ తెచ్చిన. రాజీవ్ గాంధీ అని. తీవ్రవాద ముసుగులో రాజీవ్ గాంధీని హతమార్చారని దేశం గురించి ఆయన ప్రాణాలు అర్పించారని అలాగే తల్లి ఇందిరా గాంధీ కూడా దేశానికి ప్రాణాలు అర్పించారని అటువంటి వారు ఇప్పుడు మనలో లేకపోవడం చాలా బాధాకర విషయమని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు.

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు.

#దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి.

#మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

 

స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో మండల పార్టీ శ్రేణులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర భారత యువ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించి యువతను రాజకీయాల్లోకి వచ్చేలా వారిలో స్ఫూర్తి నింపిన నేత రాజీవ్ గాంధీ. 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించడం పంచాయతీరాజ్ నవోదయ విద్యాలయా లాంటి అనేక పథకాలను ఆయన ప్రవేశపెట్టారు. దేశానికి సాంకేతికతను తీసుకొని వచ్చి ప్రపంచంలో టెక్నాలజీ విప్లవంలో భారతను నిలిపి తన సత్తా చాటారు. దేశం కోసం తన ప్రాణాలను అర్పించి దేశ ప్రజల గుండెలో చిరకాలగా నిలిచిన గొప్ప మహోన్నత మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ వై నాలా అశోక్, ఇస్తారు శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి చార్ల శివారెడ్డి, నాయకులు ఎర్రబెల్లి రఘుపతిరావు, మాలోత్ చరణ్ సింగ్, పురుషోత్తం సురేష్, ఏడాకుల సంపత్ రెడ్డి, పెంతల కొమ్మురారెడ్డి, మాలోత్ మోహన్, తేజ వత్ సమ్మయ్య నాయక్, మామిళ్ల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాజీవ్‌గాంధీ వర్ధంతి.

ఘనంగా రాజీవ్‌గాంధీ వర్ధంతి

మరిపెడ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జాటోత్ సురేష్ నాయక్

మరిపెడ నేటిధాత్రి:

దేశానికి సాంకేతికతను తీసుకువచ్చింది రాజీవ్‌ గాంధీనేనని మరిపెడ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జాటోత్ సురేష్ నాయక్ అన్నారు. రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం మరిపెడ పట్టణంలోని రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్‌ గాంధీనే అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు. దేశంలో బీదరికాన్ని పారద్రోలి సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికి మరవలేమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఎండి అప్సర్,ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ రవికాంత్,మరిపెడ పట్టణ యువ నాయకుడు బంక ప్రమోద్,యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీతేజావత్ అఖిల్ నాయక్, కార్యకర్తలు
తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి…

రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి…

రాజీవ్ గాంధీ వర్ధంతి…చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ, మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ సెంటర్ నందు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి ,మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ బండారు వెంకన్న, సీనియర్ నాయకులు బండారు దయాకర్

ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ:-స్వతంత్ర భారత యువ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించి యువత రాజకీయాల్లోకి వచ్చేలా స్ఫూర్తి నింపిన నేత రాజీవ్ గాంధీ అని అన్నారు.

18సంవత్సరాల వారికి ఓటు హక్కు కల్పించడం పంచాయతీ రాజ్ నవోదయ విద్యాలయాలు లాంటి అనేక పథకాలు ఆయన హయంలో వచ్చాయి అని గుర్తుచేశారు.

టెలికాం ఐటీకమ్యూనికేషన్ రంగాలలో భారత్ అభివృద్ధి కి ఆయన చేసిన కృషి మరువలేనిది అని పేర్కొన్నారు.

దేశానికి సాంకేతికతను తీసుకొని వచ్చి ప్రపంచంలో టెక్నాలజీ విప్లవంలో భారత్ ను నిలిపింది రాజీవ్ గాంధీ నే అని అన్నారు.

దేశం కోసం తన ప్రాణాలను అర్పించి దేశ ప్రజల గుండెలు చిరకాల నిలిచిన ఘనత మహనీయుడు రాజీవ్ గాంధీ గాంధీ సొంతమన్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముదిగిరి సాంబయ్య,మార్కెట్ డైరెక్టర్ ఎండీ ఆయుబ్ ఖాన్,బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక నాగరాజు,మాజీ ఉప సర్పంచ్ బానోత్ వెంకన్న,దామరకొండ ప్రవీణ్,పోకల శ్రీనివాస్,గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి,ప్రతాప చారి, గండి శ్రీనివాస్ గౌడ్,రాజులపాటి మల్లయ్య,సట్ల శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలు,గోపాల్ రెడ్డి,ముల భూలోక్ రెడ్డి,కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి,తరాల సుధాకర్, రషీద్ ఖాన్,బన్నిశెటి వెంకటేష్,ఎలేందర్,ఆగే చిన్న వెంకన్న,పరకాల కుమార్,చిన్న సాంబయ్య, బోడా విక్కి,బదవత్ శంకర్, ఎండీ అలీమ్,ఉప్పునూతల శ్రీను,కనుకుల రాంబాబు,సామల నరసయ్య, భూక్యా అరుణ్,హనుమ,సుందర్ వెంకన్న,బాధ్య,మామిడిశెట్టి మల్లయ్యా,నరసింహ రెడ్డి,రామ కృష్ణ,కార్యకర్తలు, మండల నాయకులు, జిల్లా నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు…

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు…

సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీనే…

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్.

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

దేశానికి సాంకేతికతను తీసుకువచ్చింది రాజీవ్‌ గాంధీనేనని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు శ్యామ్ గౌడ్ లు అన్నారు.

రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో గల రాజీవ్‌ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్‌ గాంధీనే అని అన్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు.

దేశంలో బీదరికాన్ని పారద్రోలి సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికి మరవలేమని కొనియాడారు.

కంప్యూటర్ యుగానికి నాంది పలికారని అన్నారు.

రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని గుర్తు చేశారు.

Rajiv Gandhi’s death

 

 

యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనకే చెందుతుందని అన్నారు.

నేటి యువత రాజీవ్ గాంధీ మార్గంలో నడవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహంకాళి శ్రీనివాస్,పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు అఫ్జల్ లాడెన్,పలిగిరి కనకరాజు, గోపు రాజం, ఉప్పులేటి సురేష్, బత్తుల వేణు, బుడిగే శ్రీను, బొద్దుల ప్రేంసాగర్,బోనగిరి రవీందర్, భాస్కర్,గండి కుమార్ గౌడ్, రామకృష్ణ,రామ్ సాయి,భైర మల్లేష్,మల్యాల బాలకృష్ణ,మల్లేష్,మరపాక రాజయ్య,కనుకుంట్ల కనకయ్య,మస్కం సంపత్,ఒజ్జ ముత్తయ్య, సుధాకర్ మహిళ నాయకురాలు పుష్ప, సునీత తదితరులు పాల్గొన్నారు.

వివాహానికి హాజరై నూతన వధూవరులను.

వనపర్తి లో వివాహానికి హాజరై నూతన వధూవరులను

ఆశీర్వదించినమాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిధాత్రి:

 

 

వనపర్తి పట్టణంలో 4 వ వార్డు లో అర్ యస్ నాయకుడు రామ స్వామి ఆహ్వానం మేరకు వారి సోదరుడు కుమారుడు శేఖర్ లావణ్య వివాహానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ నూతన వధూవరులను ఆశీర్వదించారు
మాజీ మంత్రి వెంట బీ ఆర్ ఎస్ నేతలు వాకిటి శ్రీధర్ పలస రమేష్ గౌడ్ జిల్లా, మీడీయా ఇంచార్జి నందిమల్ల అశోక్,గులాం ఖాదర్ బండారు కృష్ణ తిరుమల్ నాయుడు నీల స్వామి సూర్యవంశంగిరి జోహెబ్ హుస్సేన్ సునీల్ వాల్మీకి రామస్వామిబీఇమ్రాన్ చిట్యాల రాము బాలరాజు నరేందర్ ,ముని పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ.

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ఎస్పీ పరతోష్ పంకజ్ మంగళవారం పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ సీఎం పర్యటనకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

జహిరాబాద్ చేరుకున్న డాగ్ స్క్వాడ్ బృందాలు.

జహిరాబాద్ చేరుకున్న డాగ్ స్క్వాడ్ బృందాలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణ పరిసరాల్లో శుక్రవారం సీఎం రెవంత్ రెడ్డి పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పోలీసు డాగ్ స్క్వాడ్ బృందాలు జహిరాబాద్ చేరుకొని తనిఖీ చేసాయి.

నల్లెల్ల టు రాజోలు పి ఆర్ రోడ్డు పక్కన.!

నల్లెల్ల టు రాజోలు పి ఆర్ రోడ్డు పక్కన ప్రమాదకర వ్యవసాయ బావి కి మరమ్మతుపనులు

 ప్రమాదకర బావికి ముగింపు పలికిన డోర్నకల్ శాసనసభ్యుడు డాక్టర్ రామచంద్రునాయక్

మరిపెడ/కూరవి నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కేంద్రంలో ని నల్లెల్ల గ్రామపంచాయతీ పరిధిలోని గజా తండ,నల్లెల నుంచి రాజోలు వెళ్ళే రోడ్డులోని బానోతు ఈర్య నాయక్ వ్యవసాయ బావి వద్ద ఉన్న ప్రమాదకర బావి ప్రాంతం గురించి స్థానిక ఎమ్మెల్యేకు ప్రమాదకర బావి గురించి వివరించడం జరిగింది, సానుకులంగా స్పందించిన ఎమ్మెల్యే తండా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు చివరకు మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టారు,ఇటీవల డోర్నకల్ పర్యటన లో భాగంగా బావి ని చూసి ప్రమాదకరంగా ఉంది అని గమనించిన ఎమ్మెల్యే,తండ ప్రజల కు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే అధికారులను ఆదేశించి రోడ్డు మార్గాన్ని సురక్షితంగా మార్చేలా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ నుండి 10 లక్షల వ్యయం తో పనులు మంజూరు చేయించారు,ఈ సందర్భంగా కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రం గౌడ్ బావి మరమ్మత్తు పనులు కు శంకుస్థాపన చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు పై వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి అని మంచి మనసు తో స్పందించిన ఎమ్మెల్యేకు గాజతండ ప్రజలు నల్లల్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు, ఈకార్యక్రమంలో గాజ తండా గ్రామ పార్టీ అధ్యక్షుడు వాసు నాయక్, చిరంజీవి, శివలాల్,చందులాల్, భద్ర తేజావత్,ఈర్యా,మంగీలాల్, శ్రీను,రవికుమార్,ధర్మ సోత్, ధర్మ నాయక్,కాంట్రాక్టర్ ఆంగోత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి లో త్వరలోనే ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు.

,వనపర్తి లో త్వరలోనే ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు

 

ఓటర్ లిస్ట్ ఆధారంగా 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలి

 

రాష్ట్ర ఆర్యవైశ్య జిల్లా మహాసభ ఆదేశాలు పాటించాలి

 

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

 

వనపర్తి పట్టణంలో త్వరలో జరగబోయే ఆర్యవైశ్య సంఘం అధ్యక్షు డి ఎన్నికల సందర్భంగా వనపర్తి పట్టణంలో ఆర్యవైశ్యుల ఓటర్ లిస్ట్ ఆధారంగా పురుషులు స్త్రీలు 18 సంవత్సరాలు నిండినవారికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఎన్నుకోవడానికి ఓటు హక్కు కల్పించాలని పలువురు ఆర్యవైశ్యులు డిమాండ్ చేశారు

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం కమిటీ చైర్మన్ గా నియమించాలని కమిటీ ని వేరుగా ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేశారు .

ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడి ఎన్నికలు జరిగే ముందు వనపర్తి ఆర్యవైశ్యుల సమావేశం ఏర్పాటు చేయాలని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయమునకు సంబంధించి చిట్యాల రొడ్డు లో షాపుల అద్దెలు ఆస్తులు ఆర్యవైశ్య సంగములో చిట్టీలు ఎత్తిన ఆర్యవైశ్యులు ఎంతమంది ఉన్నారు .

ఎంతమందికి చిట్టి డబ్బులు ఎత్తిన వారికి డబ్బులు ఇవ్వలేదు.

వాటి వివరాలు ఆర్యవైశ్య సంగం వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య ల సమీక్షములో సమర్పించాలని పూరిబాల్ రాజ్ డిమాండ్ చేశారు.

అప్పులు ఆదాయం ఫంక్షన్ హాల్ అనగా అమ్మవారి దేవాలయంలో వివాహాలు ఇతర అద్దెలు నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా వచ్చిన ఆదాయం వాటి వివరాలు రెండున్నర సంవత్సరాలలో ఖర్చులు ఆదాయం అప్పులు అన్ని సమర్పించాలని వనపర్తి సీనియర్ ఆర్యవైశ్యులు మేధావులు న్యాయవాదులు ఉపాధ్యాయులు పట్టణ ఆర్య వైశ్యుల తరుపున కోరారు.

ప్రశాంతంగా ఓపికగా లెక్కలు సమర్పించి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు సహకరించాలని పూరి కోరారు వనపర్తి ఆర్యవైశ్యులు మేధావులు కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జరిగే వాటిని అన్ని గమనిస్తున్నారని.

అన్నారు ఈ విషయంలో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని వెంటనే ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఎన్నికల నిర్వహించాలంటే

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయమునకు సంబంధించి లెక్కలు అప్పులు ఆదాయం అద్దెలు అన్ని సమర్పించి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆదేశాలు పాటించి ఎన్నికలు ప్రశాంతంగా జేరుగు.

గుటకు కృషి చేయాలని 18 సంవత్సరాలు నిండిన వారికి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు ఎన్నికలు అవకతవకలు జరగకుండా ప్రశాంతంగా జరుగుటకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నేతలు జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సీనియర్

ఆర్యవైశ్యులు వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు సహకరించాలని పూరి కోరారు ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాల్ రాజ్ మాట్లాడుతూ వాసవి అమ్మవారి గుడికి చెందిన

లెక్కలు జమ ఖర్చు లు గత కార్యవర్గ ము వెంటనే సమర్పించాలనిఆర్యవైశ్య ల తరుపున డిమాండ్ చేశారు వనపర్తి లో 2023 2024 లో పాలన చేసిన

ఆర్యవైశ్య కార్యవర్గ ము లెక్కలు ఇవ్వనoదు కు వనపర్తి ఆర్యవైశ్య లు వివిధ రకాలుగా చర్చి oచు కుంటున్నారని పూరి బాలరాజు శెట్టి సెల్ 9642139213 ఆవేదన వ్యక్తంచేశారు

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల కు గురై కోలుకున్న.

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల కు గురై కోలుకున్న సీనియర్ జర్నలిస్ట్ దూరదర్శన్ ప్రతినిధి మల్యాల బాలస్వామి

వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన దూరదర్శన్ ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ మలియాల బాలస్వామి గత నెల 25 న వనపర్తి గోశాల దగ్గర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు . ఈ మేరకు సీనియర్ జర్నలిస్ట్ బాలస్వామి హైదరాబాదులో ఆర్థోపెడిక్ కేర్ హాస్పిటల్ డాక్టర్ తో చికిత్స చేయించుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న నేటి దాత్రి దినపత్రిక జిల్లా విలేకరి పోలిశెట్టి సురేష్ బుధవారం నాడు నాగవరంలో జర్నలిస్ట్ బాలస్వామి నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు .జర్నలిస్ట్ బాలస్వామి త్వరగా కోలుకొని జర్నలిస్ట్ విధుల్లో చేరాలని పొలిశెట్టి సురేష్ ఆకాంక్షించారు

ఆర్డీవోని కోరిన సీనియర్ సిటిజన్ సమస్యలను.

ఆర్డీవోని కోరిన సీనియర్ సిటిజన్ సమస్యలను పరిష్కరించాలని విన్నపం

సిరిసిల్ల టౌన్: మే 21 (నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సిరిసిల్ల జిల్లా సీనియర్ సిటిజన్ ప్రతినిధులు రాష్ట్ర కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సీనియర్ సిటిజన్ వృద్ధులను తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం నుండి గాని,సేవా సంస్థల నుండి గాని,ప్రభుత్వ పెన్షన్ విధానాలు గాని,జిల్లాలో ఉన్న వృద్ధులకు సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగినది. ఏదైనా వృద్ధులకు ఇబ్బంది ఉంటే సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆర్డీవో ని కోరడం జరిగింది , ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య, కోశాధికారి దొంత దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version