వరంగల్ తూర్పు, కాశిబుగ్గ 19వ డివిజన్ వివేకానంద కాలనీ రోడ్డు నెంబర్ 2 లో ఉన్న, కోతి విగ్రహం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు రంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 19వ డివిజన్ కార్పొరేటర్ఓని స్వర్ణ భాస్కర్, మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టినారు.
ఈ కార్యక్రమంలో గణిపాక సుధాకర్, చిలువేరు శ్రీనివాస్, వేముల నాగరాజు, సిలువేరు రాజు, ములుక సురేష్, క్యాతం రంజిత్, చిలువేరు పవన్, బాల మోహన్, కత్తెరశాల భరత్, బొప్పరాతి నగేష్, బానోతు కిరణ్. దేవర ప్రసాద్, చిలగాని రమేష్, మార్త భాస్కర్, గుజ్జుల రాకేష్ రెడ్డి, , క్యాతం రాజు, బాల రామ్మోహన్, కలివేలు శేషు, ఊరుగొండ రవీందర్, సిలువేరు రాజేష్, చిలువేరు సన్నీ, కుసుమ సారంగపాణి, వంగరి రాంప్రసాద్, వంగరి రవి, సాంబారి మల్లేశం, గోరంట్ల వరుణ్, కాశిబుగ్గ మిత్ర బృందం మరియు లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.Hanuman
నర్సింహారామయ్య ప్రతివాదేహానికి నివాళులు అర్పించిన మడికొండ బ్రదర్స్
పరకాల నేటిధాత్రి
పరకాల మున్సిపల్ పరిధిలోని 12 వ వార్డులో మొలుగురి నర్సింహా రామయ్య అకాలమరణం చెందగా వారి పార్దివదేహాన్ని సందర్శించి, పూలమాలలువేసి,నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మడికొండ బ్రదర్స్.ఈ కార్యక్రమంలో బొచ్చు భాస్కర్,బొచ్చు బాబు,ఎండీ.నయీమ్ పాషా,కందుకూరి సాగర్,బొచ్చు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
మండలంలో అధికారులు నాయకుల చే. ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ….
తంగళ్ళపల్లి నేటీ ధాత్రి:
తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల. నిర్మాణానికి మొదటిగా సారిగా మండలంలోని సారం పెళ్లి గ్రామంలో అధికారులచే నాయకులచే భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడం ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని కలిగి ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల అన్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేస్తుందని. మండలంలో మొట్టమొదటిసారిగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారంచుట్టిందని అలాగే ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం అందిస్తుందని నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తుందనినిర్మాణంలో నిధులు మంజూరుకు లబ్ధిదారులు అధికారులను. దళారులను ఆశ్రయించవద్దని లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం చేపట్టి పనులు వేగవతం చేసి ఇందిరమ్మ ఇంటి కల సాకారం చేసుకోవాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ల దోపిడీకి తెర లేపారని ప్రజా ప్రభుత్వంలో అటువంటి వాటికి తావు లేదని ఇందిరమ్మ ఇండ్ల పనుల్లో ప్రభుత్వం విడు త ల. వారీగా రుణాలు మంజూరు చేస్తారని.ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ . సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి . చిత్రపటాలకు లబ్ధిదారుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మునిగల.రాజు ఆధ్వర్యంలో మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసినారు. ఇట్టి కార్యక్రమంలో . పంచాయతీ సెక్రెటరీ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ భరత్ గౌడ్. ఏఎంసీ డైరెక్టర్ గుగ్గిల. రాములు. ఎండి హనీ. గడ్డమీది శ్రీనివాస్. సుంచుల కిషన్. సిరిసిల్ల దేవదాస్. బాలరాజు. అంజయ్య. పురుషోత్తం. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
మండల స్థాయిలో డ్రగ్స్ నియంత్రణ పై సమావేశాలు నిర్వహించాలి
గ్రామాలలో గంజాయి పై సమాచారం అందితే వెంటనే పోలీసులకు తెలియజేయాలి
డ్రగ్స్ నియంత్రణ పై జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశం నిర్వహించిన కలెక్టర్
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మాదకద్రవ్యాలు (డ్రగ్స్) నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం వారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని ఎస్పీ మహేష్ బి గీతే, ఇతర అధికారులతో కలిసి నిర్వహించారు.
జిల్లాలో నమోదవుతున్న ఎన్.డి.పి.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాధక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, పాఠశాలలో పరిసరాల్లో ఉన్న పాన్ షాప్ వంటి వాటి పై నిఘా పెట్టాలని అన్నారు.
పాఠశాలలు మరియు కళాశాలలు పునఃప్రారంభం జరిగిన తర్వాత డ్రగ్స్ నియంత్రణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో ఎక్కడా కూడా ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా చూడాలని అన్నారు. ప్రతి మండలంలో తహసిల్దార్, ఎంపిడిఓ, పోలీస్, మండల వ్యవసాయ అధికారి వైద్య అధికారులు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి డ్రగ్స్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు జరుగుతుందో పరిశీలించి దాని నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లాలో ఉన్న బార్, వైన్ షాప్ ప్రభుత్వ నిర్దేశిత సమయపాలన పాటించేలా చూడాలని అన్నారు.
జిల్లాలో ఉన్న సినిమా థియేటర్ల పరిసరాలను రాత్రి సమయంలో ఆకస్మికంగా తనిఖీలు చేయాలని, జిల్లాలో ఉన్న రైస్ మిల్లులు, ఇట్టుక బట్టీల వద్ద అసిస్టెంట్ లేబర్ అధికారి ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వీటిలో డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే నష్టాలు వివరించే వీడియోలను, పోస్టర్లను ప్రదర్శించాలని అన్నారు.
డ్రగ్స్ పరీక్షల నిర్వహణకు అవసరమైన యూరిన్ కిట్లను పోలీసు, ఎక్సెస్ శాఖ అధికారుల వద్ద అవసరమైన మేర అందుబాటులో ఉంచాలని కలెక్టర్ వైద్యారోగశాఖ అధికారికి సూచించారు.
కళాశాలలో సడన్ గా వింతగా ప్రవర్తించే విద్యార్థులను గుర్తించాలని, ఎవరైనా డ్రగ్స్ గంజాయి తీసుకుంటున్నట్లు తెలిస్తే వారికి అవసరమైన కౌన్సిలింగ్ అందజేయాలని అన్నారు.
డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాల పై అవగాహన వివరిస్తూనే సమాంతరంగా వాటి నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు.
గ్రామ స్థాయి నుంచి డ్రగ్స్, గంజాయి అలవాటు ఉన్నట్లు ఏదైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.
ఈ సమావేశంలో కలెక్టరేట్ సెక్షన్ సూపర్డెంట్ ప్రవీణ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జలీ బేగం, అసిస్టెంట్ లేబర్ అధికారి నాజర్ అహ్మద్, డ్రగ్ ఇన్స్పెక్టర్ భవాని, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష, ఎక్సైజ్ విద్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు
సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలో దళిత వైతాళికులు,సంఘ సంస్కర్తగా ప్రఖ్యాతులైన భాగ్యారెడ్డి వర్మ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భాగ్యరెడ్డి వర్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్.ఈసందర్భంగా ఎస్పి మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ ఒక గొప్ప సంఘ సంస్కర్త, దళిత వైతాళికుడు అని కొనియాడారు. స్వాతంత్ర్యంకు ముందు దళితుల హక్కులు, సమానత్వం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని, హైదరాబాద్ సంస్థానంలో అనేక దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వేల మంది విద్యార్థులకు విద్య అందించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడని కొనియాడారు.
Bhagya Reddy Varma Jayanti
స్వాతంత్య్ర రాక ముందే సమాజంలో నెలకొని ఉన్న అనేక సామాజిక వివక్షత లు,అసమానతలు,మూడ నమ్మకాలపై గళమెత్తి పోరాటం చేశారని కొనియాడారు.జోగిని,దేవదాసి వ్యవస్థలపై పోరాటం చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి పద్మ, ఆర్.ఐ యాదగిరి,ఆర్.ఎస్.ఐ జునైద్,కార్యాలయా సిబ్బంది, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన. మి రుపాల నర్సింగరావు. తండ్రి. వెంకట్రావు. గ్రామం నేరెళ్ల మండలం తంగళ్ళపల్లి. జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా. అను నేను మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాం. ఈ సందర్భంగా విషయం ఏమనగా నేరెళ్ల గ్రామ మాజీ సర్పంచి బొబ్బల మంజుల మల్లేశం గార్లకు ఎలాంటి ప్రమేయం లేదు ఈరోజు మేము మా కుటుంబం. గత రెండు నెలలుగా కరీంనగర్లోని హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉండడం చూసిన సదురు రైతు అయినటువంటి మాజీ ఉపసర్పంచి మీరు పాల మానస జగదీశ్వర్ అనేవారు కేసీఆర్ గారి మేనల్లుడు అయిన అటువంటి పోతుగల్ చందు రావు గారి సడ్డకుడు వారి అండదండలతో బీద వాళ్ళు అయినటువంటి అయినటువంటి మమ్మల్ని చులకనగా చూసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు మేము వారి నాటు వేసుకున్న కానీ మాకు నష్టం జరిగిన కానీ ఆ చల్లని చెట్టు కొమ్మలి గత 18 సంవత్సరాల నుంచి నరికి వేయలేదు కావాలని నేరెళ్ల గ్రామానికి లీడర్ని అని విర్రవీగుతూ పైసల బలంతో ఎవడినైనా ఏమైనా చేయగలను అనే అహంకారంతో ఊరిలో రాజ్యమేలుతున్నారు నేను మొదటిగా పెట్టిన మెసేజ్ తో సెస్.ఏఈ .గారు ఎంక్వయిరీ కి వచ్చారు నేను అందుబాటులో లేను కనుక ఫోన్లో సంప్రదించగా నాకు.ఏ లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేము లేనిది చూసి దొంగగా కబ్జా కొరులుగా లైన్మెన్ లతో కుమ్మక్వై ఎలా నా చెట్టుకొమ్మలని కొట్టేస్తారు కరెంటు స్తంభాలు పాతుతారు అని ప్రశ్నించాను. దానికి సెస్ ఏఈ గారికి సమాధానం రేపు మాకు అంటూ నాకు జరిగిన అన్యాయాన్ని . దాటవేస్తున్నారు ఇట్టి విషయమై సెస్. చైర్మన్ అయినటువంటి చిక్కాల రామారావు గారిని వేడుకుంటూ బాధ్యులపై చర్యలు తీసుకుంటూ నాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ దీనిపై.తగు విచారణ చేసి బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయమై మేము ఎటువంటి పొరపాటు చేసిన దానికి నేనే మేము మా కుటుంబ సభ్యులు బాధ్యులమని తెలియజేశారు. లేని ఎడల. ఆ కరెంటు స్తంభాలకే నా ప్రాణమే సైతం లెక్కచేయకుండా వదలడానికి సిద్ధంగా ఉన్నానని తెలుపుతున్నాను ఇట్టి విషయమై సంబంధిత అధికారులు తగ్గు విచారణలు చేపట్టి బాధ్యులుఎవరైనా నేనైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాకు తగు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం.
ప్రాణాయాపయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆదుకుని ఇచ్చిన మాట
తప్పకుండా నెరవేర్చిన కేటీఆర్….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి:
తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన మంద మహేష్ జీవనోపాధి నిమిత్తం సౌదీ వెళ్ళగా. సౌదీలో ప్రమాదవశావస్తు. 15 రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో. తనతో పాటు ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందగా. ఒక్కడే తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. దీనితో దిక్కులేని పరిస్థితులు మధ్య ఉన్న పరిస్థితిని ఇండియాలో గ్రామంలోని కుటుంబ సభ్యులకు తన దీన పరిస్థితిని వివరించారు. ఈ విషయమై మాజీ మంత్రి సిరిసిల్ల కెటి రామారావు దృష్టికి తీసుకురాగా. గ్రామంలో పర్యటించి. కుటుంబ సభ్యులను. ఓదార్చి వారికి మనోధర్యం చెప్పి. మీ బాబుని ఎలాగైనా ఇండియాకు తీసుకొచ్చి మంచి వైద్యం కల్పించే బాధ్యత నాది అని. సదురు గాయపడిన వ్యక్తితో సెల్ఫీ వీడియో ద్వారా మాట్లాడి తమకు కావాల్సిన వైద్య సహాయం అందిస్తానని తనకు ధైర్యం చెప్పిన కేటీఆర్. సదురు గాయపడిన వ్యక్తి తనను స్వదేశానికి తీసుకువెళ్లాలని మాజీ మంత్రి కేటీ రామారావును వేడుకున్నారు ఈ విషయమై మహేష్ కి ధైర్యం చెప్పి ఆదుకుంటానని భరోసా ఇచ్చారు ఈ విషయమై. కేటీ రామారావు ప్రత్యేక చొరవ తీసుకొని మహేష్ నీ. ఇండియాకు తీసుకువచ్చి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇప్పిస్తానని అంగీకరిస్తూ సౌదీ లోని. కేటీఆర్ సంబంధించిన వ్యక్తులను పంపించి వారితో మాట్లాడి ఎలాగైనా ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి పంపించాలని అక్కడ వైద్యుల దృష్టికి తీసుకువెళ్లగా సౌదీలోని.ప్రభుత్వ ఆసుపత్రికి. హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్ . యజమాన్యం లేఖ రాశారు. దీనిపై కేటీ రామారావు చెప్పినట్లుగానే సౌదీ నుంచి నేడు స్వదేశానికి చేరుకున్న మహేష్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా మహేష్ ని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించిన స్థానిక నాయకులు. కెటి రామారావు చెప్పడంతో. మండలంలోని మాజీ ఎంపీపీ. భర్త. అయినా బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పడిగెల రాజు.పాక్స్. చైర్మన్ బండి దేవదాస్. పార్టీ సీనియర్ నాయకులు తదితరులు మహేష్ ను తీసుకువెళ్లి కిమ్స్ ఆసుపత్రిలో. కేటీఆర్ ఆదేశాలతో ప్రత్యేక చొరవ తీసుకొని వైద్య సహాయ నిమిత్తం మెరుగైన వైద్యం చేయాలని. డాక్టర్ల బృందానికి కేటీ రామారావు ప్రత్యేకంగా తెలియజేశారు. మా కొడుకు. ప్రమాదవశావాస్తు గాయపడి. దిన పరిస్థితులు ఉన్న. మా వాడి పై ప్రత్యేక శ్రద్ధ వహించి ఇండియాకుతీసుకురావడానికి. కృషి చేసి. ప్రత్యేకంగా కిమ్స్ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్న మాజీ మంత్రి కేటీ రామారావుకి మా కుటుంబాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాదు సంస్థానంలో దళిత బాలికల పాఠశాలలను స్థాపించిన భాగ్యరెడ్డి వర్మ వాటి అభ్యున్నతికి పునాది అయ్యాడని నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ కె.భాస్కర్ అన్నారు. దళిత వైతాళికుడిగా ప్రసిద్ధి చెందిన సంఘ సంస్కర్త ఆది ఆంధ్ర సభ స్థాపకుడు భాగ్యరెడ్డి వర్మ జయంతిని పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ భాస్కర్ మాట్లాడుతూ 1906 నుండి 1933 లో హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలు స్థాపించారని అన్నారు. జగన్మిత్ర మండలి,మన్యసంఘం,సంఘసంస్కా ర నాట్యమండలి,అహింసా సమాజాలను స్థాపించి హైదరాబాద్ ప్రాంతాలలో సంఘసంస్కారాలపై ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సంపత్ కుమార్, మున్సిపల్ ఇంజనీర్ రాజేష్, జేఏవో రజిని, సానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు, వార్డుల ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
సిరిసిల్లా జిల్లా లో భాగ్యరెడ్డి వర్మ 137 వ జయంతి వేడుకలు
సిరిసిల్ల టౌన్(నేటిధాత్రి):
సిరిసిల్ల పట్టణ కేంద్రం లో ని భాగ్యరెడ్డి వర్మ 137 వ జయంతిని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వేడుకలలో జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజా మనోహర్,జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉదయం 11:00 నుండి 11:05 గంటల వరకు: హెలిప్యాడ్ ద్వారా జహీరాబాద్ లోని పస్తాపుర్ కి చేరుకుంటారు. ఉదయం 11:15 నుండి 11:30 గంటల వరకు: హుగ్గెల్లిలో విశ్వగురు బసవేశ్వర స్వామి విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. ఉదయం 11:40 నుండి 11:50 గంటల వరకు:మాచ్నూర్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయ ఆవిష్కరణ. ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు: జహీరాబాద్‌లోని పాస్తాపూర్‌లో ప్రజా సభా స్థలానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:05 నుండి 12:20 గంటల వరకు: వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలా ఫలకాల ఆవిష్కరణ. మధ్యాహ్నం 01:35 నుండి 01:40 గంటల వరకు: ప్రజా సభా స్థలం నుండి హెలిప్యాడ్‌కు స్థలానికి చెరుకుంటారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేస్తున్న నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, మరియు స్వచ్ఛంద సేవకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం పలికి, ఈ సందర్శనను జహీరాబాద్‌కు ఒక చిరస్థాయిగా నిలిచే సందర్భంగా మార్చడానికి మనమంతా కలిసి కృషి చేద్దాం!
శ్రీరేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకొన్న తెలంగాణ గౌడ సంక్షేమ సంఘ నాయకులు
కరీంనగర్ నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలోని శ్రీరేణుక ఎల్లమ్మ జాతర సందర్బంగా శ్రీ రేణుక మాత ను గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్ నాయకులు దర్శనం చేసుకొని సందర్శించడం జరిగింది. ఈసందర్భంగా తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్ మాట్లాడుతూ రేణుకా మాత ఆశీస్సులు ప్రతి ఒక్క గౌడ బిడ్డకు ఉండాలని ఆ తల్లి ఆశీర్వాదం తోటి సుఖశాంతులు ప్రజలకు వెదజల్లాలని, అష్టైశ్వర్యాలు నిండు నూరేళ్లు కలకాలం జీవించాలని ఆభగవంతుని ప్రార్థించారు. ఎంతో నిష్టతో చేసే రేణుకా మాత బోనాల కార్యక్రమాలు ఘనంగా బొమ్మకల్ గ్రామంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈసంవత్సరం రేణుకా మాత ఆశీర్వాదంతో గౌడ కులస్తులు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలు అందించాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో కరీంనగర్ మండలం అధ్యక్షులు బుస శ్రీనివాస్ గౌడ్, తిమ్మాపూర్ మండలం అధ్యక్షులు రావుల శ్రీనివాస్ గౌడ్, మానకొండూర్ నియోజకవర్గం ఇంచార్జి గోపాగోని నవీన్ గౌడ్, బొమ్మకల్ గ్రామ గౌడ సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి చౌరస్తాలోని 65వ జాతీయ రహదా రిపై ఏర్పాటు చేసిన మహాత్మ బసవేశ్వరుడి 12 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కర ణకు సిద్ధమైంది. న్యాల్కల్కు చెందిన ప్రముఖ శిల్పి డాక్టర్ హోతి బస్వరాజు చేత రూపుదిద్దుకున్న ఈ విగ్రహాన్ని ఈనెల 23న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో జహీరాబాద్ కు సీఎం చేరుకుంటారు. హుగ్గెల్లి చౌరస్తాకు వెళ్లి బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించి భక్తులకు అంకితం చేయనున్నారు. అనంతరమే ఇతర కార్యక్రమాల్లో సీఎం పాలుపం చుకుంటారు. కాగా ఈ బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని రూపొందించేందుకు శిల్పి బస్వరాజ్ ఎంతో శ్రమించారు. రెండు టన్నుల పంచలోహాన్ని ఉపయోగించి 12 అడుగుల ఎత్తులో రూపొందించారు. 25 మంది నైపుణ్యం గల పనివారితో ఆరు నెలల సమయంలో శిల్పాని తీర్చిదిద్దడం జరిగిందని శిల్పి డాక్టర్ హోతి బస్వరాజు తెలిపారు. తన సొంత తాలూకా అయిన జహీరాబాద్లో తాను రూపొందించిన ఈ విశ్వగురు బసవేశ్వర కాంస్య శిల్పాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.
పట్టణ పురపాలక సంఘ పరిధిలో ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పూర్తి కావడంతో ఇక వాహనాలు రయ్… రయ్.. మంటూ పరుగులు పెట్ట నున్నాయి. జహీరాబాద్ పట్టణంతో అనుసంధానంగా ఉన్న జహీరాబాద్, మొగుడంపల్లి న్యాల్కల్ మండలాలతోపాటు సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రయాణికులకు ప్రయాణ కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. రూ.వంద కోట్ల వ్యయంతో నిర్మిం చిన రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ఈనెల 23న ముఖ్యమం త్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికా రులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రారం భించేందుకు వీలుగా శిలాఫలకం ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు అంచనా రూ.90కోట్లు కాగా, ఇందులో రూ.50 కోట్లు భూ సేకరణ కోసం కేటాయించారు. రూ.50 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టారు.
ఏడేళ్లకు మోక్షం
రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టిన ఏడు సంవత్సరాలకు పూర్తి చేశారు. ప్రయాణికుల కష్టా లను దూరం చేసేందుకు వీలుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో నిధులు మంజూరు చేసింది. బ్రిడ్జి నిర్మాణం పనులు 2018 ఆగస్టు 30న చేప ట్టారు. ఆర్అండ్ శాఖ ఆధ్వర్యంలో రైల్వే ఓవ ర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టి ఎట్టకేలకు పూర్తి చేశారు. 20 నుంచి 30 నిమిషాలు ఆగాల్సిందే స్థానిక లెవెల్ క్రాసింగ్ మీదుగా హైదరాబాద్, సికిం ద్రాబాద్ నుంచి నాందేడ్, పూర్ణ, షిర్డీ, పర్లీ, లాతూర్ ప్రాంతాలతోపాటు బెంగళూరు, తిరుపతి, కాకినాడ ప్రాంతాలకు ఎక్స్ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అంతేకాకుండా గూడ్స్ రైళ్లు సైతం ఎక్కువగా వచ్చి పోతుంటాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ మార్గంలో రైలు వచ్చిన ప్రతీసారి గేట్లు మూసివేయ డంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారు. పట్టణ ప్రజలతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణి కులు రైలు వచ్చిన ప్రతీసారి రైల్వే గేటు వద్ద కనీసం 20 నుంచి 30 నిమిషాలపాటు ఆగాల్సి వస్తోంది. ఈ మార్గంలో నిత్యం 36 రైళ్ల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి.
బ్రిడ్జిపై ఎల్ ఈడీ లైట్ల వెలుగులు
రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఎస్ఈడీ విద్యుత్ దీపాలను బిగించారు. కిలో మీటరు పొడువునా బిగించిన లైట్లు ఫ్లై ఓవర్ బ్రిడ్జితో పాటు కింది భాగంలో ఉన్న సర్వీసు రోడ్డుపై కూడా వెలుతురు ఉండేలా బిగిం చారు. బ్రిడ్జికిరువైపులా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి దిగువన మొగుడంపల్లి క్రాస్ రోడ్డు నుంచి బీదర్ క్రాస్ రోడ్డు వరకు నాలుగు వరుసల సీసీ రోడ్డు నిర్మించి విద్యుత్ దీపాలను బిగించారు.
దివంతనేత మొహమ్మద్ ఫరీదోద్దీన్ పేరు పెట్టాలి
నూతనంగా ప్రారంభించనున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కి దివంతనేత మొహమ్మద్ ఫరీదోద్దీన్ పేరు పెట్టాలని జహీరాబాద్ ప్రజలందరూ ప్రభుత్వానికి వ డిమాండ్ చేసారు. జహీరాబాద్ ప్రాంతంలో ముస్లింలు దళితులు ప్రజలు అధిక శాతంలో ఉన్నారని, జాతి కుల వర్ణ బేధాలు లేకుండా అందరికీ సమాన హక్కులు కలగాలని ఆకాంక్షించిన వ్యక్తి దివంతనేత మొహమ్మద్ ఫరీదోద్దీన్ పేరు పెట్టడమే సమంజసం అని జహీరాబాద్ ప్రాంతంలో ముస్లింలు దళితులు సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మే 24న జహీరాబాద్‌లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ సభ
జహీరాబాద్ నేటి ధాత్రి:
పార్లమెంటు ఇటీవల ఆమోదించిన వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ మే 24న జహీరాబాద్ పట్టణంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రోగ్రామ్ కన్వీనర్ ముఫ్తీ అబ్దుల్ సుబుర్ ఖాష్మీ బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఐఎం, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నాయకులు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు, సభ్యులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ముఫ్తీ అబ్దుల్ సుబుర్ ఖాష్మీ పెద్ద ఎత్తున హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.సభ విజయవంతం కావడానికి ఓటింగ్ శాతం హామీ ఇస్తుంది.ఈ విలేకరుల సమావేశంలో మౌలానా అబ్దుల్ ముజీబ్ ఖాస్మీ, ముఫ్తీ నజీర్ అహ్మద్ హుసామీ, ముఫ్తీ ఖలీల్ అహ్మద్, ముఫ్తీ ఒబైద్ ఉర్ రెహ్మాన్ ఖాస్మీ, ముహమ్మద్ అథర్ అహ్మద్, మహ్మద్ యూసుఫ్, మహ్మద్ మొయిజుద్దీన్, ముహమ్మద్ మొహియుద్దీన్ గౌరీ, ముహమ్మద్ మొహియుద్దీన్ గౌరీ, ముహమ్మద్ మద్స్ మజీద్, మహ్మద్ మద్స్ మజీద్ తదితరులు పాల్గొన్నారు. ముహమ్మద్ ఫరూఖాలీ, ముహమ్మద్ జమీరుద్-దిన్ అడ్వకేట్ ఆఫీస్, ముహమ్మద్ అక్బర్ మరియు ఇతర అధికారులు. తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలం జడిమల్కాపూర్‌లో ప్రసిద్ధి చెందిన దుర్గామాత ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం రాత్రి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఆలయా దుర్గామాత దేవిని దర్శించుకొని సందర్శించారు.
Former Minister Harish Rao
ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించి. గ్రామంలో హరీష్ రావుకు పూలమాలలతో భాజ భాజంత్రీలతో ఘన స్వాగతం పలికారు . గ్రామ నాయకులు భరత్ రెడ్డి ఆయనకు పూలమాలల వర్షం కురిపించి ఘనంగా స్వాగతం పలికారు.
మద్యం సహా ఎరువుల ధరలు పెంచిన ప్రభుత్వం : ఎమ్మెల్యే హరీష్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చకపోగా కేసీఆర్ అమలు చేసిన పథకాలను కూడా నిలిపివేసిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. మొగుడంపల్లి మండలం జాడి మల్కాపూర్ గ్రామంలో జరుగుతున్న దుర్గమ్మ మాత జాతర ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన హరీష్ రావు స్థానిక క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దు చేసినా, కరోనా వచ్చిన కేసీఆర్ ఎప్పుడూ రైతుబంధు ఆపలేదని వానకాలం రైతుబంధు ఎగ్గొట్టి యాసంగిని మూడెకరాలకు పరిమితం చేశారున్నారు. కేసీఆర్ పది వేలు ఇస్తే మేం రూ.12 వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు మళ్ళీ వానాకాలం వచ్చినా ఇప్పటివరకు రైతుబంధు ఊసే లేదు. జహీరాబాద్, నారాయణఖేడ్ లకు కేసీఆర్ హయాంలో అత్యధికంగా 100 కోట్ల రూపాయల రైతుబంధు వచ్చేది. ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా ప్రీమియం చెల్లించక పోవడంతో గత నాలుగు నెలలుగా చనిపోయిన రైతులకు బీమా సొమ్ము రావడం లేదని ఆరోపించారు. మెదక్, సిద్దిపేటకు నేషనల్ సీడ్ కార్పొరేషన్ విత్తనాలు సప్లై చేయాలని, మరికొన్ని జిల్లాలు స్టేట్ సీడ్ కార్పొరేషన్ సీడ్ పంపిణీ బాధ్యతలు అప్పగించారన్నారు.ఇద్దరు కలిసి స్టేట్ కు, ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేస్తున్నారు..బీరు విస్కీ ధరలు పెంచి చివరకు విత్తనాల ధరలు పెంచిన రేవంత్ రెడ్డి ప్రజలకు మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్ర ఆదాయం పెంచి రైతులకు పంచాడని అదే మీరేం చేస్తున్నారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. వైన్స్ ధరలు పెంచావు, జనుము, జీలుగ తదితర పచ్చిరొట్టె ఎరువుల ధరలు పెంచి రైతులకు ఇచ్చే రైతుబంధు, రైతు బీమాలు ఇస్తలేవని ధ్వజమెత్తారు. ఇచ్చేది ఎగవేస్తున్నావ్ ఉల్ట రైతుల వద్ద గుంజేస్తున్నావ్ వంటూ ..ఈ వైఖరిని ఏమనుకోవాలన్నారు. ధాన్యానికి బోనస్ బోనస్ అని బోగస్ చేసేస్తున్నావని, యాసంగిలో సన్న వడ్లకు ఇచ్చే బోనస్ రూ.850 కోట్ల బకాయిల్లో ఒక్క పైసా కూడా రైతులకు చెల్లించ లేదని ఆరోపించారు.బోనస్ పైసలు, రైతు బంధు డబ్బులు, యాసంగిలో ఒక్క పైసా ఇవ్వని రైతులను మోసం, దగా చేసిన రేవంత్ రెడ్డి ఏం మొహం పెట్టుకుని సంగారెడ్డికి వస్తున్నాడనిప్రశ్నించారు. యూరియా బఫర్ స్టాక్ తగ్గిపోయిందని, గత ప్రభుత్వం వేసవిలోనే ఎరువులు కొరత లేకుండా చూసేదన్నారు. 25 శాతం ధాన్యం ఇంకా కల్లాలోనే ఉందని కరీంనగర్ మెదక్, నల్గొండ వరంగల్ ఇతర జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసి ధాన్యం తడిసిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ లో బస్తాల్లోని ధాన్యం మొలకెత్తి రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. మెదక్ జిల్లాలో రైతులు రాస్తారోకోలు చేస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదని, మంత్రులు దున్నపోతు మీద వాన పడ్డట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అన్ని సెంటర్లలో అదే పరిస్థితి ఉందంటూ.. అధికారులు నీ మాట వినడం లేదా అని ఎద్దేవాచేశారు. అప్పుల విషయంలో తప్పుగా మాట్లాడుతూ నీ పరువునే కాక రాష్ట్రం పరువును తీయడం అది కాదని, నీ పరువు నీవు తీసుకున్న పర్వాలేదు కానీ రాష్ట్రం పరువు తీయకని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు నా సొంత నిధులని కలిపి కోటి రూపాయలతో బసవేశ్వర విగ్రహాన్ని కడితే ఈ ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారా?జహీరాబాద్ నియోజకవర్గానికి రేవంత్ ఏం ఇచ్చిండు? ఇవ్వకపోగా కేసీఆర్ ఇచ్చిన రూ.25కోట్లను వాపస్ తీసుకున్నడు. జహీరాబాద్ మున్సిపాలిటీకి కేసీఆర్ రూ.30 కోట్లు ఇస్తే వాటిని కూడా వాపస్ తీసుకున్నాడు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్ రావు వినతి మేరకు గ్రామీణ రోడ్లకు కేసీఆర్ రూ.50 కోట్లు మంజూరు చేస్తే అవి కూడా గుంజుకున్నడని ఆరోపించారు.జహీరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి కి నిజంగా ప్రేమ ఉంటే వాపస్ తీసుకున్న నిధులని వెంటనే ఇవ్వాలి. పాతవి ఇచ్చి కొత్తగా వంద కోట్ల రూపాయలని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నా. బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించడం కాదు. సంగారెడ్డి జిల్లాని సస్యశ్యామలం చేసే బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టుని పునరుద్దరించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నా. సర్పంచులు, మండల, జిల్లా పరిషత్ లకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల తరపున డిమాండ్ చేస్తున్నా. ఇక్కడి నుంచి నేరుగా జాడి మల్కాపూర్ బయలుదేరి వెళ్లి దుర్గమ్మ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయా కార్యక్రమాలలో హరీష్ రావు తో పాటు ఎమ్మెల్యే కొనేంటి మాణిక్యరావు, స్థానిక నేతలు ఎం.శివకుమార్, మాణిక్యం, గుండప్ప, రాజేందర్, విజయ్ కుమార్, శ్రీనివాస్ ఇతర జిల్లా, స్థానిక నేతలు ఉన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని 37 వార్డులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
సిరిసిల్ల టౌన్ మే 22 (నేటి ధాత్రి ):
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని 37 వ వార్డులో ని ఈ రోజున ఉదయం 10-30 సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సహాయ నిధి (CMRF)నుండి స్థానిక శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు సహాయ సహకారంతో 37.వ పరిధిలో గల లబ్దిదారులైన బూర్ల ప్రతాప్ 24000/- రూపాయలు దాసరి కళావతి విఠల్ 6500/- రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్ లను వార్డ్ తాజా మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవి రాజు చేతుల మీదుగా అందజేయడం జరిగినది.ఈ సందర్బంగా స్థానిక శాసన సభ్యులు కల్వకుంట్ల తారకరామారావు కి తాజా మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవి రాజు మరియు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు..
కూలిపోయిన తోరణాలు, బుడదగా మారిన పార్కింగ్ స్థలాలు.
వాహనాలు జామ్, ఎక్కడికి వెళ్లాలో తెలవక భక్తుల్లో గందరగోళ పరిస్థితి.
కొనసాగుతున్న వర్షం ఆగిన ఎదురుగాలు.
మహదేవపూర్- నేటి ధాత్రి:
అల్పపీడన ప్రభావం భారీ ఈదురుగాలులతో వర్షం రైతులకు ఒక శాపంగా మారింది, మరోవైపు పుష్కరాల్లో గందరగోళ పరిస్థితిని నెలకొల్పింది. బుధవారం రోజు నాలుగు గంటల నుంచి తుఫాను ప్రభావంతో మండలంలో భారీ వర్షంతో పాటు ఎదురుగాలు, ఉరుములు మెరుపులు కొనసాగడం జరుగుతుంది. ప్రస్తుతం కాలేశ్వరం పుష్కరాల ఏడవ రోజు పెద్ద మొత్తంలో భక్తులు ఉండడంతో, వర్షం పుష్కరాల్లో వచ్చిన భక్తుల పరిస్థితిని గందరగోళంగా మార్చేసింది. భారీ వర్షంతో పుష్కరాల్లో ఏర్పాటుచేసిన తాత్కాలిక వసతులు నేలకొరకడం జరిగియి, అంతేకాకుండా గాలి వాన బీభత్సవానికి భారీ ఫ్లెక్సీలు తెగిపోవడంతో భక్తులకు గాయాలు కావడం జరిగింది.
Rain… curse!
ప్రస్తుతం కొనసాగుతున్న భారీ వర్షం, మండలంలోని రైతులకు ఒక శాపం గా మారింది, గత కొన్ని రోజుల క్రితం భారీ వర్షంతో అనేక రైతులు ఇబ్బందులకు గురై, కొనుగోలు కేంద్రాల్లో వరి చెరువులను తలపించడం జరిగింది. కానీ అధికారుల నిర్లక్ష్యం ఇప్పటికీ మండలంలో పిఎసిఎస్, ఐకెపి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల్లో పెద్ద మొత్తంలో వడ్లను రవాణా చేయలేదు. మొదట్లో పడిన వర్షానికి తడిసిన ధాన్యం ఇప్పటికీ కొన్ని కొనుగోలు కేంద్రాల్లో, రైస్ మిల్లర్లకు తరలించలేదు, నేడు కురిసిన భారీ వర్షానికి, రాబోయే రోజుల్లో అల్పపీడన ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగడం, జరుగుతుందన్న వార్తలు వస్తున్న క్రమంలో వరి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని ఇంకెప్పుడు తరలిస్తారు, అధికారుల నిర్లక్ష్యం ఈ తుఫాను ప్రభావం వల్ల పడుతున్న వర్షాలు మాకు శాపంగా మారిందని రైతులు ముత్తుకుంటున్నారు.
Rain… curse!
ఏడవ రోజు పుష్కరాల సందర్భంగా పెద్ద మొత్తంలో గోదావరి పుణ్య స్థానాలు ఆచరిస్తున్న భక్తులు ఒకేసారి, తుఫాను ప్రభావంతో ఏర్పడిన గాలి దువారం వర్షానికి, కాలేశ్వరం కేంద్రం కాస్త గందరగోళ పరిస్థితిని లోకి వెళ్ళిపోయింది. గోదావరి వద్ద ఏర్పాటు చేసిన స్థాన ఘట్టాలు చలవ పందిర్లు, నెలకు ఓరగడం తో భక్తుల పరిస్థితి గందరగోళానికి మారింది. ఒకవైపు వర్షం మరోవైపు వర్షం నుండి రక్షణ కొరకు, ఎక్కడికి వెళ్లాలో తెలవని పరిస్థితిలో భక్తులు పరుగు పందెం మొదలుపెట్టారు. మరోవైపు గాలి ద్వారానికి ప్రచార నిమిత్తం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పడడంతో కొందరికి గాయాలు కావడం జరిగింది. అలాగే వాహనాలు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థావరాలన్నీ బురద మా ఇంకా మారిపోయి, వాహనాలు బయటికి వచ్చి పరిస్థితి లేకుండా పోయింది. భక్తులు కూడా వాహనాల వద్దకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో, ఆర్టీసీ బస్టాండ్ తో పాటు దేవాలయ పరిసర ప్రాంగణంలో వర్షానికి తడుచుకుంటూ నిలబడడం జరిగింది. తుఫాను ప్రభావం చే వచ్చిన అకాల వర్షం గాలి దువారానికి పెద్ద ప్రమాదం లాంటి వి సంభవించడం జరగలేదు కానీ, దామమాత్రంగా కొందరు భక్తులు కటౌట్లు పడడంతో గాయాల పాలు కావడం, ఒకేసారి వర్షం ప్రభావం ప్రారంభం కావడంతో జనసంధారం ఎక్కువ ఉండడంతో, గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
Rain… curse!
అధికార యంత్రాంగం తక్షణమే అప్రమత్తమై భక్తులకు ఇబ్బందులు కలగకుండా, వాహనాల రాకపోకల తో పాటు, పడిపోయిన తాత్కాలిక పనులను తిరిగి మొరబత్తు చేసి కార్యక్రమంలో నిమగ్నం కావడం జరిగింది.
జహీరాబాద్ పట్టణంలోని భారత మాజీ ప్రధాని, యువ భారత్ శిల్పి శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్దంతిని పురస్కరించుకుని, కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.,ఈ సందర్భంగా మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.రాజీవ్ గాంధీ భారతదేశానికి నూతన దిశను చూపిన మహానాయకుడు. 21వ శతాబ్దం భారతానికి తగిన సాంకేతికత,ఐటీ విప్లవం, యువతలో నూతన ఆశలు నూరిపోసిన వ్యక్తి. గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్యం రంగాల్లో ఆయన దూరదృష్టితో అమలు చేసిన పథకాలు ఇవాళా కూడా దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన రాజీవ్ గాంధీ , గ్రామ పంచాయతీ వ్యవస్థను బలపరిచారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆయన కలలను సాకారం చేయడంలో ముందుండి నడుస్తోంది అని వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు రాజీవ్ గాంధీ గారి జీవితం, స్వప్నాలు, దేశాభివృద్ధికి చేసిన సేవలపై ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్ , శ్రీనివాస్ రెడ్డి , రామలింగారెడ్డి, మాక్సూద్ అహ్మద్,పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ, సామెల్ గారు,కేతకి సంగమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ తిరుపతి రెడ్డి,మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ అశోక్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు హుగెల్లి రాములు , శుక్లవర్ధన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్ షెట్కార్ , జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, ఉదయ్ శంకర్ పాటిల్ మరియు ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
⏩18 ఏళ్ల కే ఓటు హక్కు కల్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ
⏩ రాజీవ్ గాంధీ చొరవ వల్లే దేశంలో సాంకేతిక పరిజ్ఞానం
⏩ప్రజాసేవ కోసం ప్రాణ సైతం లెక్కచేయని వీరుడు రాజీవ్ గాంధీ
దుపాకి సంతోష్ కుమార్ 16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
కాశిబుగ్గ నేటిధాత్రి
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 16వ డివిజన్ పరిధి గొర్రెకుంట క్రాస్ రోడ్డు వద్ద బుధవారం రోజున పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు ఉదయం 10.00 గంటలకు భారత రత్న,మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 34 వ వర్దంతి సందర్భంగా 16వ డివిజన్ ఆధ్వర్యంలో కీర్తినగర్ క్రాస్ రోడ్డు వద్ద రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం 16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ కుమార్ మాట్లాడుతూ 1944 ఆగస్టు 20న న్యూఢిల్లీ లో జన్మించిన రాజీవ్ గాంధీ, ఢిల్లీలోని డాన్ బాస్కో స్కూల్ లో చదువుకున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. అతను లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. 1968లో,సోనియా గాంధీని వివాహం చేసుకున్నాడు, రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధునీకరణ,ఉదారీకరణలపై దృష్టి సారించింది. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు.రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారు.దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ విప్లవం ఘనత అతనికే చెందుతుందని అన్నారు. అతను విదేశీ విధానంలో చురుకైన పాత్ర పోషించాడు. శ్రీలంక, సోవియట్ యూనియన్ తో సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేశాడు.స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు.రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారని అన్నారు.రాజీవ్ గాంధీకి రాజకీయాలపై ఆసక్తి లేదని, అతను విమాన పైలట్‌గా పనిచేసేవారని కానీ 1980లో తన తమ్ముడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో అకాల మరణం తర్వాత, రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిరా గాంధీకి మద్ధతుగా 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది. తర్వాత 1983లో అతను ఉత్తరప్రదేశ్ నుండి అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు.1984 అక్టోబరు 31న ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆమె అంగ రక్షకులచే హత్యకు గురయ్యారు.అప్పుడు 1984లో రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.తదుపరి జనరల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి ప్రధానమంత్రిగా కొనసాగారు.1985లో ముంబైలో జరిగిన ఏఐసీసీ సర్వసభ్య సమావేశంలో రాజీవ్ గాంధీ సందేశ్ యాత్రను ప్రకటించాడు.అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ దీనిని దేశవ్యాప్తంగా నడిపింది.రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలు(పిసిసి),పార్టీ నాయకులు కలిసి ముంబై, కాశ్మీర్, కన్యాకుమారి, ఈశాన్య ప్రాంతాల నుండి నాలుగు పర్యటనలు చేశారు.మూడు నెలలకు పైగా సాగిన ఈ యాత్ర ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ముగించారు.పేద ప్రజల సంక్షేమం కోసం ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి 1991 మే 21న,రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఒక ఆత్మహత్య బాంబు దాడిలో హత్యకు గురయ్యాడు. వారి మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు.వారు చేసిన సేవలను ఎప్పటికి అను నిత్యం కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటూనే ఉంటుంది. పేద ప్రజలకు గుండె చప్పుడు గాంధీ కుటుంబమని వారు వ్యాఖ్యానించారు.దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం ఏదైనా ఉంది అంటే అది కేవలం గాంధీ కుటుంబం మాత్రమే అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లెం సుధాకర్, జానపాక అధ్యక్షులు మహమ్మద్ జానీ,గరీబ్ నగర్ అధ్యక్షులు దాసారపు సారయ్య, కీర్తినగర్ అధ్యక్షులు హుజూర్,పరకాల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పిట్టల అనిల్,ప్రధాన కార్యదర్శి వల్లెం సాయికుమార్,పెద్ద జానీ,చెక్క రమేష్, గోదాసి చిన్ని,మాసూద్ అలీ,ప్రతాప్, కొమ్ముల రాజు, బిర్రు ప్రసాద్, రుద్రారపు సదా,అంకేశ్వరపు రాజు, మధుసూధన చారీ, మహిళా నాయకులు మౌనిక,నీలిమ,నూరజహాన్, కర్ణాకర్, రాజశేఖర్,అశోక్, శివ పవన్,అజీమ్,శ్రీనివాస్, మరియు 16వ డివిజన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.