రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభం

2025: ఈ సంవత్సరం పవిత్ర రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? డేట్, టైమ్, ఇతర వివరాలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

2025 సంవత్సరానికి గానూ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయ్యే సమయం దగ్గరపడుతోంది. వివిధ దేశాల్లో ఈ సమయం వేర్వేరుగా ఉంటుంది. నెలవంక దర్శనం ఆధారంగా రంజాన్ మాస ఉపవాసాలను ముస్లింలు ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన కానీ, మార్చి 1 వ తేదీన కానీ నెలవంక కనిపించవచ్చని భావిస్తున్నారు.

ఈ సంవత్సరం పవిత్ర రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

2025: చంద్రవంక దర్శనం ప్రకారం.. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. నెలవంక వేర్వేరు దేశాల్లో వేర్వేరు సమయాల్లో కనిపించడం వల్ల, ఆయా దేశాల్లో రంజాన్ మాసం ప్రారంభ సమయం మారుతూ ఉంటుంది. ఈ వ్యత్యాసం కొత్తదేమీ కాదు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్ లోని ప్రతి నెల ప్రారంభ తేదీని ప్రభావితం చేసే నెలవంక దర్శనంపై ఆధారపడతారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈదుల్ ఫితర్ వేడుక తేదీలలో కూడా వైవిధ్యాలకు దారితీస్తుంది.

మార్చి 1వ తేదీననా? లేక మార్చి 2 నా?

ఇస్లామిక్, పాశ్చాత్య దేశాలలో ఎనిమిదవ ఇస్లామిక్ నెల షబాన్ జనవరి 31, 2025 శుక్రవారం ప్రారంభమైంది. అందువల్ల, ఈ సంవత్సరం సాంప్రదాయకంగా, రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక ఫిబ్రవరి 28, శుక్రవారం, అంటే షబాన్ 29 వ రోజున కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ నెలవంక కనిపిస్తే ఈ దేశాల్లో 2025 మార్చి 1 నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. అయితే చాలా చోట్ల చంద్రుడు ఆ రోజు కనిపించకపోవచ్చని, అందువల్ల షబాన్ నెల మరో రోజు పొడిగించబడుతుందని భావిస్తున్నారు. అంటే, మార్చి 1వ తేదీన నెలవంక కనిపిస్తే, రంజాన్ మాసం ప్రారంభం 2025 మార్చి 2కి మారే అవకాశం ఉందని కొందరు పండితులు వాదిస్తున్నారు.

రంజాన్ విషయంలో ప్రాంతీయ వ్యత్యాసాలు

సౌదీ అరేబియా ఖగోళ అంచనాలకు అనుగుణంగా మార్చి 1న రంజాన్ ప్రారంభమవుతుందని పాశ్చాత్య దేశాలలోని అనేక నగరాలు ఇప్పటికే తమ రంజాన్ 2025 టైమ్ టేబుల్ ను ప్రచురించాయి.

అయితే, మొరాకో వంటి దేశాలు కఠినమైన విధానాన్ని అనుసరిస్తాయి. అక్కడ నెలవంక స్పష్టంగా కంటికి కనిపించిన మరుసటి రోజు రంజాన్ ను ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 న మొరాకోలో చంద్రుడు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే మొరాకోలో మార్చి 2 నుండి రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

జర్మనీలో రంజాన్ 2025 ఫిబ్రవరి 28 న ప్రారంభమవుతుందని అంచనా వేశారు. అలాగే, అక్కడ ఈ పవిత్ర మాసం మార్చి 30 నాటికి ముగుస్తుంది.

అమెరికాలో కూడా మార్చి 1వ తేదీన పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే, ఈద్ అల్-ఫితర్ వేడుకలతో పవిత్ర మాసం మార్చి 30న ముగుస్తుందని భావిస్తున్నారు.

2025 మార్చి 1న రంజాన్ ప్రారంభమైతే, 2025 మార్చి 30న సౌదీ అరేబియా సహా పలు దేశాల్లో ఈద్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే మార్చి 2న రంజాన్ ప్రారంభమయ్యే వారికి ఈద్ 2025 మార్చి 31న వచ్చే అవకాశం ఉంది.

ప్రయాగ్రాజ్, అయోధ్యను దర్శించుకున్న….

ప్రయాగ్రాజ్ అయోధ్యను దర్శించుకున్న తాజా మాజీ సర్పంచ్

జహీరాబాద్. నేటి ధాత్రి:

న్యాల్కల్ మండల్ మల్గి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి తమ పార్టీ బిఆర్ఎస్ నాయకులు – సభ్యులతో మరియు గ్రామ మిత్రులు కలిసి ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహా కుంభ మేళను సందర్శించిపుణ్య స్నానాల ఆచరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహా కుంభమేళా జరుగుతుందన్నారు. కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందాని దీన్ని ఆదిశంకరాచార్యు లు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. పురాణాల ప్రకారం, సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు. హిందూ పురాణాల ప్రకారం, దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు. ఈ సమయంలో అనేక రత్నాలు, అప్స రసలు, జంతువులు, విషయం, అమృతం వంటివి బయటికొచ్చాయి. అయితే అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు. ప్రయాగ, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణా ల్లో ఉన్నాయన్నారు. కోట్లాది సత్పురు షుల మధ్య స్నానం ఆచరించడం తన జీవితం ధన్యమైందని అన్నారు. అంతే కాకుండా వారణాసి అయోధ్య ఉజ్జయిని మహంకాళేశ్వరం ఓంకారేశ్వర్ ను వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి బిఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షులు మాణిక్ యువ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ఇందిరమ్మ కాలనీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డికిమొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వీప్ జిల్లా అధ్యక్షులు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీనియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డితంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆదేశానుసారం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఇందిరమ్మ కాలనీ గ్రామంలో ఉన్నటువంటి పట్టు బద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతోగెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు పట్టుభద్రులకిఏ సమస్య వచ్చిన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారి గురించి వారి సమస్యలకు పరిష్కారమయ్యే దిశగా పాటు పడదామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీరామ్ నరేష్ కొంపెల్లి శ్యామ్ మాజీ వార్డు సభ్యులు దూస మహేందర్ గోరెంట్ల రాజమల్లు బల్ల లక్ష్మీపతి అంబటి ఆంజనేయులు మాటీటీ రాజు ముసం విలాస్ కొండి నరేష్ తదితరులు పాల్గొన్నారు

ఆదివాసి వ్యక్తి పైన దాడి…

ఆదివాసి వ్యక్తి పైన ఫారెస్ట్ అధికారులు విచక్షణ రహితంగా దాడి..

వ్యక్తికి ప్రక్కటెముకలు విరిగిన వైనం.

దాడికి పాల్పడిన ఫారెస్ట్ అధికారులను విధులు నుంచి తొలగించాలి.

ఫారెస్ట్ అధికారుల పైన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలి..

మానవ హక్కుల కమిషన్ Save ఫిర్యాదు చేస్తాం.

ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటి..

నూగూర్ వెంకటాపురం, (నేటి ధాత్రి ):-

అటవీ శాఖా అధికారులు ఆదివాసీల పైన వరస దాడులకు పాల్పడుతూ ఉన్నారని ఆదివాసీ నాయకులు కొర్స నర్సింహా మూర్తి,ఉయిక శంకర్, పూనెం సాయి ఆరోపించారు. ఆదివారం అటవీ శాఖా అధికారుల చేత దాడికి గురై గాయాల పాలైన ఏకన్న గూడెం గ్రామానికి చెందిన కోరం సమ్మయ్య ను పరామర్శించారు. సమ్మయ్య ను, కుటుంబ సభ్యులను పూర్తి వివరాలు అడికి తెలుసుకున్నామని ఆదివాసీ సంఘాల నాయకులు తెలిపారు. అడవికి వెళ్లిన ఆదివాసీ పైన అటవీ శాఖా అధికారులు మూడు ప్రక్కఎముకలు విరిగేలా అత్యంత పాశవికంగా దాడి చేయడం హేయమైన దుశ్చర్య అని మండిపడ్డారు. ఒకవేళ సమ్మయ్య తప్పు చేస్తే శిక్షించడానికి న్యాయ వ్యవస్థలు ఉన్నాయని, కొట్టడానికి అధికారులకు అధికారం ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం ఎవరిచ్చారు అని నిలదీశారు. తనని వదిలేయమని ఎంత ప్రాదేయ పడిన కనికరం చూపకుండా దాడి చేయడం అమానవీయ చర్య అన్నారు. బాధితుడి లుంగీ విప్పి తన మెడకు, మొఖానికి ముసుకు వేసి, చేతులు వెనక్కి కట్టేసి విచక్షణ రహితంగా దాడి చేసినట్టు బాధితుడు సమ్మయ్య చెప్పినట్టు తెలియజేసారు. ఆదివాసీలు శతా బ్దాలు గా అడవిని కాపాడితే అటవీ శాఖా ఉద్యోగులు కంచే చేను మేసినట్టు అడవిని అమ్ముకుంటున్నారు అని విమర్శించారు. ఈ అమానవీయ ఘటన పైన జాతీయ మానవ హక్కుల కమిషన్ ని, ఎస్సి ఎస్టీ కమిష్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు నాయకులు నర్సింహా మూర్తి, శంకర్, సాయి తెలిపారు. సమ్మయ్య కుటుంబం రోడ్డు పడిందని, నష్టపరిహారం గా 10 లక్షలు ఇవ్వాలని ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు… కోరం సమ్మయ్య కు న్యాయం జరగక పోతే చర్ల రేంజ్ ఆఫీస్ ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు..జి ఎస్పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం ప్రతాప్, ఏ ఎన్ ఎస్ మండల అధ్యక్షులు కుంజ మహేష్, వాసం నారాయణ తదితరులు పాల్గొన్నారు..

పట్టభద్రుల ప్రసన్నం కష్టమే!


-హరికృష్ణ ప్రభావం అంతంత మాత్రమే!

-తను ఊహించుకున్న ఆర్భాటం అంతా ఉత్తదే!

mlc candidate vanga

-సాగుతున్న ప్రచారం కూడా పరిమితంగానే.!

-ఎంత ప్రయాసపడినా గెలుపు తీరం కష్టమే

-ఎంత సాగిల పడినా గెలుపు భారమే

-నిరుద్యోగుల సమస్యల మీద గళం విప్పింది లేదు

-తెలంగాణ ఉద్యమ సమయంలో జై తెలంగాణ అన్నది లేదు

-ఉద్యమానికి సమయం కేటాయించింది లేదు

-ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఉద్యమాలు చేసింది లేదు

-నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసింది లేదు

-ఇంత కాలం తన రాజకీయ ప్రచారం మాత్రమే సాగించారు

-ముందు కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నం చేశాడు

-ఆ తర్వాత బిజేపి అగ్రనాయకులను కలిశాడు

-ఏ పార్టీ టికెట్‌ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌ అన్నాడు

-బిసి ఐక్యత ముసుగేసుకొని కొంత కాలం కథ నడిపించాడు

-ఆఖరుకు బిసి కండువా పక్కన పడేసి బిఎస్పీ అంటున్నాడు

-ఎన్నికలకు ముందే ఇన్ని జెండాలు మార్చిన హరికృష్ణ

-ప్రసన్న ఎజెండా ఎలాంటిదో చెప్పకనే చెప్పాడు

-కోచింగ్‌ సెంటర్ల కోసం తపన పడ్డాడు

-కాలేజీ వదిలేసి కోచింగ్‌ సెంటర్లకు పుస్తకాలు రాయడం మొదలు పెట్టాడు

-కోచింగ్‌ సెంటర్ల ముసుగులో కోట్లు సంపాదించుకున్నాడు?

-ఎన్నికలలో గెలిచి ఎమ్మెల్సీ కావాలనుకున్నాడు

-అసలు రంగు బైటపడడంతో ఉక్కిరి బిక్కిరౌతున్నాడు

                                    హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ మీద బిసి. సంఘాలు మండిపడుతున్నాయి. తన స్వార్ధపూరిత రాజకీయాల కోసం బిసిలను ముందు ఎగదోసి, తర్వాత పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా ఆయనపై పట్టభద్రులలో పెద్దగా స్పందన కనిపించడం లేదు. ప్రసన్న హరికృష్ణ ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాగిస్తూ, తన విద్యార్దుల కోసం చేసిందేమీ లేదు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పనిచేస్తూ ఆయన తన విద్యార్దులను ఉన్నత లక్ష్యాలతో తీర్చిదిద్దాల్సిన సమయంలో ప్రైవేటు కోచింగ్‌ సెంటర్ల మేలు కోసమే పని చేశారన్న ఆరోపణలున్నాయి. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ, కోచింగ్‌ సెంటర్ల మేలు కోసం పనిచేశారు. తన విద్యార్ధులకు ఆ మెటీరియల్‌ అందించలేదు. కేవలం వ్యాపార లాభాపేక్షతోనే తన పుస్తక రచనను కొనసాగించారు. వాటిని కోచింగ్‌ సెంటర్లకు అమ్ముకోవడం కోసమే ప్రయత్నం చేశాడు. అలా కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. విద్యార్దులకు తీరని అన్యాయంచేశారు. తన వల్ల కోచింగ్‌ సెంటర్ల ద్వారా వేల మంది నిరుద్యోగులకు ఉపయోగపడ్డానని చెబుతున్నారే, గాని జీతం తీసుకుంటూ తన కాలేజీ విద్యార్దుల భవిష్యత్తు తీర్చిదిద్దానని చెప్పుకునే పరిస్ధితి లేదు. నిజంగా ఆయన సమాజం కోసం, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఆలోచిస్తే తాను పనిచేసే కాలేజీ విద్యార్దులే కొన్ని వేల మంది వుంటారు. వారిని తీర్చిదిద్దితే ఎంతోమంది జీవితాలు బాగుపడేవి. కాని అలా చేయలేదు. కేవలం పుస్తకాలు రాసి, ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లకు అందజేయడం వల్ల వ్యక్తిగతంగా ఆయన లాభపడ్డాడు. ఆ మెటీరియల్‌తో కోచింగ్‌ సెంటర్లు బాగుపడ్డాయి. అందుకే పట్టభద్రులు ఇప్పుడు ఆయన వ్యవహారశైలిపై గళమెత్తుతున్నారు. హరికృష్ణ విద్యార్ధుల జీవితాలను గాలికి వదిలేసి, కోచింగ్‌ సెంటర్లకు అమ్ముడుపోయిన వ్యక్తి అంటున్నారు. అసలు కాలేజీకి హజరు కాకుండా, విద్యార్దులకు పాఠాలు చెప్పకుండా జీతాలు తీసుకొని ప్రభుత్వాన్ని మోసం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాలేజీకి ఎగనామం పెట్టి, యూనివర్సీటీ పెద్దలను ప్రసన్నం చేసుకొని, కోచింగ్‌ సెంటర్లకు మెటీరియ్‌ అందించి, తన కాలేజీ విద్యార్దులకు తీరని అన్యాయం చేశాడంటున్నారు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ బిసిల మధ్య చీలికకు ప్రయత్నం చేస్తున్నాడన్న బిసి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్సీ కావాలన్న ఆశలతో ముందు ఆయన కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. హరికృష్ణ అసలు స్వరూపం తెలిసిన తర్వాత ఆయనకు టికెట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ నిరాకరించింది. దాంతో బిజేపి టికెట్‌ కోసం ప్రయత్నాలు చేశారు. బిజేపి పెద్దలను కలిసి వేడుకున్నాడు. కాని అక్కడా అవకాశం దొరకలేదు. తర్వాత బిఆర్‌ఎస్‌ పెద్దలను కలిశారు. అయితే హరికృష్ణ తన జీవితంలో ఏనాడు తెలంగాణ కోసం పనిచేసిన వ్యక్తికాదని తెలిసింది. ఓ వైపు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ఆయన కోచింగ్‌ సెంటర్లకు మెటీరియల్‌ తయారు చేస్తూన సంపాదనలో మునిగితేలారంటున్నారు. ఏనాడు ఆయన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నది లేదు. తెలంగాణకు జైకొట్టింది లేదని బిసి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒక బిసిగా అంతటి స్ధాయికి ఎదిగినా ఏనాడు ఏ బిసి విద్యార్ధికి ఆయన సాయం చేసింది లేదు. కాని తనకు పదవి కావాల్సి రాగానే మాత్రం బిసిల జపం చేస్తున్నాడని అంటున్నారు. బిఆర్‌ఎస్‌ కూడా టికెట్‌ ఇవ్వమని తేల్చి చెప్పడంతో ఇక గత్యంతరం లేక , ఇండిపెండెంటుగా పోటీకి నిలబడ్డాడు. అక్కడ కూడా ఆయనకు సరైన ఆదరణ లభించలేదు. బిసి సంఘాలు ఆయనకు మద్దతు పలకలేదు. దాంతో ఏదొ ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే తప్ప లాభం లేదనుకున్నాడు. బిఎస్పీ పెద్దలను ప్రసన్నం చేసుకొని బిఫామ్‌ తెచ్చుకున్నాడు. అప్పుడు కూడా అటు బిఎస్పీని, ఇటు బిసిలను మభ్యపెడుతూనే వున్నాడు. ప్రచారంలో మోసంచేస్తూనే వున్నాడు. బిసి నాయకులను కలిసే సమయంలో బిసి కండువా కప్పుకుంటున్నాడు. బిఎస్పీ నేతలను కలిసే సమయంలో ఆ పార్టీ కండువా కప్పుకొని ప్రచారం చేయడాన్ని అందరూ గమనిస్తూనే వున్నారు. ప్రసన్న హరికృష్ణకు పట్టభద్రుల్లో పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. ఆయనకు సహకరిస్తామని ఎవరూ చెప్పడం లేదు. ఆయన ప్రచారం అంతంత మాత్రంగానే సాగుతోంది. పట్టుమని ఆయన వెంట పది మంది తిరిగే పరిస్ధితి కనిపించడం లేదు. తనకు తానుగా గొప్పగా ఊహించుకొని హరికృష్ణ రంగంలోకి దిగారు. అయితే ఆయన వెనక కోచింగ్‌ సెంటర్లు వున్నాయంటున్నారు. హరికృష్ణకు ఎన్నికల పెట్టుబడి వాళ్లే ఏర్పాటు చేస్తున్నారంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు రావడం, కోచింగ్‌ సెంటర్లు ఆ నిరుద్యోగుల చేత వాయిదాలు కోరడం, ప్రభుత్వ ం వినకపోతే వారి చేత కోర్టులను ఆశ్రయించడం వంటివి చేస్తుంటారు. అలా ఏళ్ల తరబడి పరీక్షలను వాయిదా వేయిస్తూపోవడం వల్ల నిరుద్యోగులు కోచింగ్‌ సెంటర్లను వదిలివెళ్లిపోరు. కొత్త కొత్త బ్యాచులు ఏర్పాటు చేసుకునేందుకు వీలౌతుంది. అలా కోచింగ్‌ సెంటర్ల వ్యాపారం మూడు పరీక్షలు, ఆరు వాయిదాలుగా నడిచేది. ఆయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోచింగ్‌ సెంటర్లు చేసే ఈ జిమ్మిక్కులు సాగడం లేదు. కోచింగ్‌ సెంటర్లు కొంత మంది విద్యార్దులను రెచ్చగొట్టి అశోక్‌నగర్‌లో, దిల్‌సుఖ్‌ నగర్‌లో పెద్దఎత్తున ఉద్యమాలు చేసేందుకు కుట్రులు పన్నారు. అయినా ప్రభుత్వం చెప్పిన సమయానికి పరీక్షలు నిర్వహిస్తూ, ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. ఇలా జరిగితే కోచింగ్‌ సెంటర్ల అవసరం ఎవరికీ రాదు. దాంతో కోచింగ్‌ సెంటర్లు దివాళా తీసే పరిస్ధితి వస్తుంది. ఇప్పటికే కోచింగ్‌ సెంటర్లు ఊగలుతోలుకునే పరిస్ధితి వచ్చింది. ఈ పరిస్ధితి మారాలంటే మళ్లీ కోచింగ్‌ సెంటర్లు కళకళలాడాలంటే తమకు అనుకూలమైన వ్యక్తిని ఎమ్మెల్సీ చేయాలని పెద్దఎత్తున ఖర్చుపెడుతున్నారు. ప్రసన్న హరికృష్ణనుముందు పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ కోచింగ్‌ సెంటర్ల మూలంగానే కోట్లు సంపాదిస్తున్నారు. వారికి మేలు చేయడానికి తప్ప రాష్ట్రంలోని పట్టభద్రులకు న్యాయం చేసేందుకు కాదని హరికృష్ణ వ్యవహారం తేలిపోయింది. అందుకే ఆయన వెంట పట్టభద్రులు ఎవరూ కనిపించడం లేదు. కేవలం కోచింగ్‌ సెంటర్లకు చెందిన వ్యక్తులు మాత్రమే ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. అది కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది. ప్రసన్న హరికృష్ణఎంత సాగిలపడినా వృధానే అనే టాక్‌ వినిపిస్తోంది. ఎంత సాగిలపడినా గెలుపు దారిలో ముందుకొచ్చే పరిస్ధితి కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన నిరుద్యోగుల విషయంలో గళం విప్పిందిలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన యువతకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించలేదు. కనీసం ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేసింది లేదు. నిరుద్యోగులను రెచ్చగొట్టి పరీక్ష వాయిదా కోసం ప్రయత్నం చేశాడే తప్ప, ఉద్యోగాలు నోటిఫికేషన్‌ కోసం ఏనాడు కృషి చేయలేదు. నిరుద్యోగుల పక్షాన పోరాటంచేసింది లేదు. ఎన్నికలకు ముందే ఇన్ని జెండాలుమార్చిన హరికృష్ణ నిరుద్యోగుల పక్షాన నిలుస్తారని అనుకోవడం అత్యాశే అవుతుంది. ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలను కలిసి టికెట్‌ కోసం ప్రయత్నం చేసిన హరికృష్ణ ఒక వేళ గెలిచినా, తనవ్యక్తిగత రాజకీయ ప్రతిష్ట కోసం పాకులాడుతాడే తప్ప నిరుద్యోగుల గళంకాలేడని అంటున్నారు. ఇంత కాలం కోచింగ్‌ సెంటర్లకోసం తపన పడ్డాడు. కోచింగ్‌ సెంటర్ల యజమానుల డబ్బులతో ఎన్నికల్లో నిలబడ్డాడు. కోచింగ్‌ సెంటర్లలో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికడతాడా? నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటాడు. ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసిన ప్రతి సందర్భంలోనూ వాటి వాయిదాల కోసమే హరికృష్ణ ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగుల నుంచి కోచింగ్‌ సెంటర్లు సొమ్ముచేసుకునేందుకే ఉపయోగపడతాడు. అని సాక్ష్యాత్తు బిసి సంఘాలు, పట్టభద్రులే అంటున్నారు. ఇంత మంది చెబుతున్న మాటలు వింటున్న జనం హరికృష్ణను ఆదరిస్తారని మాత్రం ఎవరూ అనుకోరు.

’’వంగ’’కు ఎదురుతిరుగుతున్న టీచర్లు?

`బెడిసికొడుతున్న ‘‘వంగ’’ ప్రచారం.

`టీచర్ల ప్రశ్నలకు కంగు తింటున్న ‘‘వంగ’’.

`’’వంగ మహేందర్‌ రెడ్డి’’ మాటలు నమ్మమని వ్యాఖ్యలు.

`’’వంగ’’ ఇన్నేళ్లు చేసిందేమీ లేదు!

`టీచర్ల సమస్యలపై ‘‘వంగ’’ పోరాటం చేయలేదు.

`గత ప్రభుత్వాన్ని ‘‘వంగ’’ నిలదీసింది లేదు.

`సమస్యల సాధనకు ‘‘వంగ’’ కొట్లాడిరది లేదు.

`’’వంగ’’ లీడర్‌ గా ఒరగబెట్టిందేమీ లేదు!

`’’వంగ’’ ఎమ్మెల్సీ అయితే రాజకీయాలు తప్ప మరేమీ చెయ్యలేడు!!

`’’వంగ మహేందర్‌ రెడ్డి’’ పై యూనియన్‌ సభ్యుల గుసగుసలు.

`వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం రాజకీయాలు.

`పరపతి పెంపుకోసమే పాకులాటలు.

`317 జీవోను అడ్డుకున్నది లేదు.

`టీచర్లు చెట్టుకొకరు పుట్టకొకరైతే కాపాడిరది లేదు.

`ఆ జీవో రద్దు చేయించలేదు.

`ఆ సమయంలో కేంద్ర మంత్రి ‘‘బండి సంజయ్‌’’ పోరాటం చేశారు.

`కనీసం ‘‘బండి సంజయ్‌’’ కి ఆయనకు మద్దతు పలికింది లేదు.

`టీచర్ల కోసం ‘‘బండి సంజయ్‌’’ దీక్ష చేశారు.

 `యూనియన్‌ తరుపున ‘‘వంగ’’ చేసిన ఉద్యమాలేమీ లేవు.

`టీచర్లకు అండగా నిలిచింది లేదు!

`ట్రాన్స్‌ఫర్ల మీద నోరు విప్పింది లేదు.

`తెలంగాణ కోసం కొట్లాడిన టీచర్లను అడుక్కునే స్థితికి ఎవరు తెచ్చారు?

`జీతాలు నెలనెల రాకున్నా నోరు మూసుకున్నదెవరు?

`టీచర్లకు రావాల్సిన ‘‘జీపిఎఫ్‌’’ నిధులు ఆగిపోతే యూనియన్‌ ఏం చేసింది?

`’’పిఆర్‌సీ’’ సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు?

`’’రిటైర్డ్‌ టీచర్ల బెన్‌ఫిట్స్‌’’ ఆగిపోతే యూనియన్‌ చేసిందేముంది.

`నోరు మూసుకొని కూర్చున్న యూనియన్‌ లీడర్‌ ‘‘వంగ’’ గెలిస్తే ప్రశ్నిస్తాడా?

`ఏ రకంగా చూసినా ‘‘వంగ’’ సాధించేదేమి వుండదు.

`సంపాదనకు అప్పుడు అడ్డూ అదుపు వుండదు.

`ఇది ‘‘టీచర్ల’’ మనోగతం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రిత్రలో మొదటి సారి యూనియన్‌ లీడర్‌కు టీచర్లు ఎదురు తిరుగుతున్నారు. ప్రతిసారి యూనియన్‌ పేరు చెప్పుకోవడం ఎమ్మెల్సీలుగా గెలవడం, రాజకీయ పార్టీల కండువాలు కప్పుకోవడం అలవాటైందని నిలదీస్తున్నారు. యూనియన్‌ లీడర్‌ ముదిరి రాజకీయ నాయకుడౌతాడంటే ఇదే నిదర్శనమంటున్నారు. దేశంలో ఏ ఉద్యోగులకు, ఏ యూనియన్లకు లేని అవకాశం ఒక్క టీచర్లకే రాజ్యాంగం ఈ అవకాశం కల్పించింది. దానిని ఉపాద్యాయుల హక్కులు, విద్యా వ్యవస్ధలో నూతన ఆవిష్కరణలకు ఉపయోగపడాల్సిన ఎమ్మెల్సీలు రాజకీయాలను ఎంచుకుంటున్నారు. ఉపాద్యాయుల సమస్యలు గాలికి వదిలేస్తున్నారు. అందుకే ఈసారి యూనియన్‌ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవాలనుకుంటున్నవారికి ఎన్నుకోమని టీచర్లు ముక్తకంఠంతో చెబుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌ ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న యూనియన్‌ లీడర్‌ వంగ మహేందర్‌ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు. నిన్నటి వరకు మహేందర్‌ రెడ్డికి ఎదురు చెప్పడానికి కూడా ఆలోచించే ఎంతో మంది టీచర్లు ముఖం మీదే టీచర్ల కోసం ఏం చేశావని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. మొదటిసారి టీచర్లు తమ గొంతువిప్పడం వారిలో వచ్చిన చైతన్యానికి నిదర్శనం. ఏకంగా సోషల్‌ మీడియా వేదికగా వంగా మహేందర్‌రెడ్డికి ఎందుకు ఓటేయ్యాలని అంటున్నారు. యూనియన్‌ పేరు చెప్పుకొని వారు బాగు పడడం తప్ప టీచర్లకు జరిగిన న్యాయం ఏదీ లేదంటున్నారు. అనాదిగా ఏం జరుగుతుందో మహేందర్‌రెడ్డిని ఎన్నుకుంటే అదే జరుగుతుందని కూడా తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు అలాంటి ఆనవాయితీని కొనసాగించమంటున్నారు. సమాజానికి చైతన్యం నింపే ఉపాద్యాయులే ప్రశ్నించకపోతే, సమాజ చైతన్యం ఎలా వెల్లివిరుస్తుందంటున్నారు. యూనియన్‌ ముసుగేసుకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నవారికి ఈ ఎన్నికలు ఒక చెంప పెట్టు కావాలని కోరుకుంటున్నట్లు కూడా టీచర్లు చెబుతున్నారు. ఏ సోషల్‌ మీడియా చూసినా ఇవే వార్తలు వుంటున్నాయి. ఎక్కడికక్కడ టీచర్లు తమ గొంతు సవరించుకుంటున్నారు. యూనియన్‌ అనేది సమస్యల పరిష్కారం కోసం, ఉపాద్యాయుల మద్దత కోసం, వారి ప్రయోజనాల కోసం…కాని యూనియన్ల వల్ల ఒరిగిందేమీ లేదంటున్నారు. ముఖ్యంగా వంగా మహేందర్‌ మూలంగా ఇప్పటి వరకు జరిగిన మేలు కూడా ఏదీ లేదంటున్నారు. ఇలా ఒక్కసారిగా టీచర్లు ఎదురు తిరుగుతారని కూడా మహేందర్‌ రెడ్డి ఊహించలేదు. గత రెండేళ్లుగా ఉద్యోగాన్ని వదులకొని ఊరూరు తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. కాని ఆఖరుకు ఈ పరిస్టితి వస్తుందని అనుకోలేదు. ఆయన ఉద్యోగం పూర్తిగా మానేయలేదు. కేవలం వాలెంటరీ రిటైర్‌ మెంటు తీసుకున్నారు. అంతే…ఈ ఎన్నికల్లో గెలిస్తే ఎమ్మెల్సీ అవుతాడు. లేకుంటే మళ్లీ తన ఉద్యోగాన్ని ఎలాగో తెచ్చుకొని కొలువు చేసుకుంటాడు. మళ్లీ యూనియన్‌ లీడర్‌గా తన పెత్తనం ఎలాగూ సాగిస్తాడు. అలాంటప్పుడు ఆయన వల్ల ఒనగూరేదేమీ వుండడు. ఈ మధ్య మహేందర్‌ రెడ్డి ఎక్కడికెళ్లినా ఇలాంటి ప్రశ్నలు ముఖం మీదే అడుగుతున్నారట. దాంతో ఆయన ఖంగు తింటున్నారు. ప్రచారానికి వెళ్లాలంటే కూడా భయపడుతున్నాడట. టీచర్లను ఒక చోటకు పిలవాలంటే కూడా ముందు వెనుక ఆలోచిస్తున్నాడట. టీచర్లు ఒక్కసారిగా ఇలాఎందుకు ఎదురు తిరిగే పరిస్టితి వచ్చిందని ఆలోచించుకుంటూ తల పట్టుకుంటున్నాట. మహేందర్‌ రెడ్డి నీ మాటలు మేం నమ్మం అంటూ ముఖం మీదే చెబుతుంటే సమాదానం చెప్పలేక దండం పెడుతూ వెనుతిరుగుతున్నారట. ఒక్కసారిగా టీచర్లలో ఇలాంటి చైతన్యం చూసి ఆయన విస్తుపోతున్నాడు. ఎమ్మెల్సీ పదవి దేవుడెరుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం తనను యూనియన్‌ లీడర్‌గానైనా అంగీకరిస్తారా? లేదా? అన్న డైలమాలో పడుతున్నారట. ఎందుకంటే ఎప్పుడో రెండేళ్ల క్రితమే రాజీనామా చేసిన ఉపాద్యాయుడు యూనియన్‌లో సభ్యుడుగా వుండడమే సరైంది కాదు. అలాంటిది యూనియన్‌ లీడర్‌గా ఎలా చెలామణి అవుతాడంటూ కూడా నిలదీస్తున్నారట. అయినా మహేందర్‌ రెడ్డి టీచర్ల సమస్యల కోసం పోరాటం సాగించి, ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. టీచర్ల సమస్యలు పరిష్కరింకపోవడంతో నిరసనగా మహేందర్‌ రెడ్డి రాజీనామా చేసి పోరాటం చేయడంలేదు. టీచర్ల హక్కుల పోరాటం కోసం ఆయన రాజీనామా చేసి ఎన్నికల్లోకి వెళ్లడం లేదంటూ టీచర్లు సెటైర్లు వేస్తున్నారు. కేవలం తన వ్యక్తిగత ప్రయోజనం తప్ప ఇందులో టీచర్ల కోసం ఏముందంటూ చెబుతున్నారు. తమ అభిప్రాయం ఏమిటో కూడా తెలుసుకోకుండా ఏక పక్షంగా వారికి వారే నిర్ణయాలు తీసుకుంటే యూనియన్‌లో ప్రజాస్వామ్యమెక్కడుంది. మా మాటలకు విలువేముందని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. హక్కుల గురించి రేపటి తరానికి పాఠాలు చెప్పే టీచర్ల అభిప్రాయానికే విలువలేకుండా చేస్తున్న యూనియన్ల మూలంగా మా గొంతులు నొక్కబడుతున్నాయంటున్నారు. గత ప్రభుత్వం కొత్త జిల్లాలను తెచ్చి, టీచర్ల జీవితాలు ఆగం చేసింది. జీవో.నెం.317 తెచ్చి టీచర్లను చెట్టుకొకరు, పుట్టకొకరును చేసింది. అప్పుడు యూనియన్‌ ఏం చేసింది? ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయలేదు. జీవో తప్పని ఎందుకు నినదించలేదు. తూతూ మంత్రంగా చెప్పడం కాదు..గతంలో టీచర్ల మాటంటే ప్రభుత్వాలు గౌరవించేవి. టీచర్లు ఉద్యమ బాట పడుతున్నారంటే భయపడేవి. కాని యూనియన్లు ప్రభుత్వాలకు తొత్తులుగా మారిపోయిన తర్వాత అసలు ప్రశ్నించడమే మర్చిపోయారు. హక్కుల సాధనకు కొట్లాటే మానుకున్నారు. అందుకే 317 జీవో అమలైంది. ఆ సమయంలో యూనియన్‌ నిక్కచ్చిగా వ్యతిరేకిస్తే అమలుజరిగేదా? అంటూ టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ జీవోపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఎన్నికల ముందు జీవోను సవరిస్తామని చెప్పి,దానిపై ప్రభుత్వం స్పందించడం లేదు. అయినా యూనియన్‌ ఏం చేస్తోంది? నిజం చెప్పాలంటే 317 జీవో రద్దు కోసం రాజకీయ పార్టీలు ప్రయత్నం చేశాయి. ముఖ్యంగా బిజేపి అధ్యక్షుడుగా ఆ సమయంలో వున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పోరాటం చేశారు. ఈ జీవో విషయంలో అరెస్టుయ్యారు. కాని యూనియన్‌ మాత్రం నోరు మెదపలేదంటూ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కోసం అటు విధులు నిర్వర్తిస్తూనే ఉద్యమాలు చేసిన చరిత్ర టీచర్లది. విద్యార్థుల జీవితాలు ఆగం కాకుండా వారికి పాఠాలు బోదిస్తూనే, మరో వైపు ఉద్యమానికి ఊపిరి పోసిన వారిలో టీచర్లున్నారు. అలాంటి టీచర్లు జీతమెప్పుడు వస్తుందా? అని ఎదురు చూసే రోజులు వస్తే కూడా యూనియన్‌ ప్రశ్నించింది లేదు. టీచర్లు అడుక్కుతినే పరిస్ధితి వస్తుంటే గుడ్లప్పగించి చూసిన యూనియన్‌ వల్ల ఒరిగిందేమీ లేదంటున్నారు. జీతాలు సకాలంలో రాకున్నా నోరు మూసుకున్నారు. టీచర్లకు రావాల్సిన జిపిఎఫ్‌ నిధుల ఆగిపోయినా, అడిగే నాధుడు లేదు. అయినా ఒకటీచర్‌దాచుకున్న సొమ్ముకూడా తీసుకోలేని స్దితిలో వున్నారంటే పరిస్దితి ఎలా వుందో అర్దం చేసుకోవచ్చు. పిఆర్‌సీ సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదంటూ టీచర్లు వంగాన నిలదీస్తున్నారు. కొన్ని వేల మంది రిటైర్డ్‌ టీచర్స్‌ బెన్‌ఫిట్స్‌ అగిపోతే యూనియన్‌ ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా రకరకాల ప్రశ్నలతో మహేందర్‌రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. నాలుగు డిఏలు పెండిరగ్‌లో వున్నా ఇప్పటి వరకు యూనియన్‌ నోరు మెదపడం లేదంటున్నారు. యూనియన్‌ లీడర్‌గా వున్నప్పుడే నోరు మెదపని మహేందర్‌ రెడ్డి రేపు ఎమ్మెల్సీ అయిన తర్వాత సమస్యలపై మాట్లాడతాడంటే నమ్మలేమని తేల్చి చెబుతున్నారు. ఇంత కాలం గొప్పగా నాయకుడిని అని చెప్పుకుంటున్న మహేందర్‌రెడ్డి చేసిన ఉద్యమాలు ఏమీ లేవంటున్నారు. పెద్దగా పోరాటాలు చేసి సాదించిన హక్కులేమీ లేదు. గుంపులో గోవిందయ్యే తప్ప ఉపాద్యాయ సమస్యల మీద సదస్సులు పెట్టిన నాయకుడు కాదు. టీచర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్లి కొట్లాడిన సందార్భాలేమీ లేవు. అందుకే ఈ ఎన్నికల్లో ఈసారి యూనియన్‌ నాయకులకు కాకుండా ప్రశ్నించే గొంతులు ఎవరుంటే వారిని ఎంచుకుంటామంటున్నారు.

శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలపై పుస్తకాన్ని ఆవిష్కరించిన టి.టి.డి జేఈవో వి.వీరబ్రహ్మం..

శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలపై పుస్తకాన్ని ఆవిష్కరించిన టి.టి.డి జేఈవో వి.వీరబ్రహ్మం..

తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 22:

శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డా. ఆకెళ్ల విభీషణ శర్మ రచించిన శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనే పుస్తకాన్ని శనివారం టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం ఆవిష్కరించారు. టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ పుస్తకంలో బ్రహ్మోత్సవాలలోని వాహన సేవల విశిష్టతను వివరించారు. వాహన సేవలతోపాటు ఆలయంలో జరిగే వివిధ బ్రహ్మోత్సవ విశేష పూజలను అందులో పొందుపరిచారు.
ఈ కార్యక్రమంలో సీఈ సత్యనారాయణ, డిపిపి కార్యదర్శి శ్రీరామ్ రఘనాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు..

తిరుపతిలో ముగిసిన అంతర్జాతీయ దేవాలయాల సదస్సు

ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు హాజరు

ఆకట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై ప్రసంగం

ప్రపంచ వ్యాప్తంగా హిందూ, బౌద్ధ, సిక్కు, జైన ప్రార్థనా స్థలాల అనుసంధానతే లక్ష్యం

ప్రపచంలో దేవాలయాల ఆర్థిక వ్యవస్థ విలువ రూ.6లక్షల కోట్లు

భారత్‌లో పెరుగుతున్న దేవాలయ పర్యాటకం

కోవిడ్‌ తర్వాత పెరుగుతున్న తీర్థయాత్రికులు

ఈ నేపథ్యంలోనే హిందూ దేవాలయాల అనుసంధానతకు ప్రాధాన్యం

దేవాలయాలకు గుదిబండగా మారిన ప్రభుత్వ నియంత్రణ

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రపంచ వ్యాప్తంగా దేవాలయాల మధ్య అనుసంధానతను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ‘ఇంటర్నేషనల్‌ టెంపుల్స్‌ కన్వెన్షన్‌ Ê ఎక్స్‌పో`2025’ను (ఐ.టి.సి.ఎక్స్‌`2025) ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీవరకు ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని ఆశా కన్వెన్షన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై, గోవా మంత్రులు, పార్లమెంట్‌ సభ్యుల వంటి ప్రముఖులు హజరై ప్రసంగించడం విశేషం. 2023లో తొలి సదస్సు వారణాసిలో జరగ్గా రెండవ సదస్సును తిరుపతిలో నిర్వహించారు. ఇందులో 17 దేశాలకు చెందిన 1581 దేవాలయాల ప్రతినిధులు, మరో 58 దేశాలనుంచి 685దేవాలయాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ మూడు రోజుల కార్యక్రమంలో 111మంది వక్తలు తమ విలువైన సందేశాలనివ్వగా, 15 వర్క్‌షాప్‌లు, 60కంటే ఎ క్కువ ప్రదర్శన శాలలను నిర్వహించారు. దేవాలయాల వారసత్వాన్ని పరిరక్షించడం, వాటి పరి పాలన, ఆలయాల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఈ ఎక్స్‌పోను ‘టెంపుల్‌ కనెక్ట్‌’, అంత్యోదయ ప్రతిష్టాన్‌ సహకారంతో నిర్వహించారు. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు ప్రార్థనా స్థలాలను ఒకేతాటి కిందికి తీసుకొనిరావడం దీని ప్రధాన లక్ష్యం. 

ఆలయాల సమాచారం డిజిటలీకరణ

 ‘టెంపుల్స్‌ కనెక్ట్‌’ వ్యవస్థాపకులు గిరీష్‌ కులకర్ణి మరియు ఇంటర్నేషనల్‌ టెంపుల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో ఛైర్మన్‌, మహారాష్ట్ర శాసన మండలి ఛీఫ్‌ విప్‌ ప్రసాద్‌ లాడ్‌లు ‘మహాకుంభ్‌ ఆఫ్‌ టెంపుల్స్‌’గా వ్యవహరించే ఐ.టి.సి.ఎక్స్‌ను ఏర్పాటు చేశారు. భారతీయ మూలాలున్న దేవాలయాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి డిజిటల్‌ రూపంలో భద్రపరచడం ప్రధాన ల క్ష్యంగా టెంపుల్‌ కనెక్ట్‌ సంస్థ పనిచేస్తుంది. దేవాలయాల ఆర్థిక వ్యవస్థను మరింత విస్తరించడం కూడా ఐ.టి.సి.ఎక్స్‌. ప్రధాన ఉద్దేశం. దేవాలయ పర్యాటకాన్ని, నిర్వహణను ప్రోత్సహించడానికి కూడా ఇది కృషిచేస్తుంది. 

మతపరమైన లేదా ధార్మిక అవస్థల పరిధికి ఆవల దేవాలయాల నిర్వహణలో మరింత పురోగతి సాధించేందుకు విధానకర్తలు, దేవాలయాల నాయకులు, పారిశ్రామిక నిపుణుల సమన్వయం కోసం ఐ.టి.సి.ఎక్స్‌`2025 ప్రధానంగా కృషిచేసింది. నిధుల నిర్వహణ, రద్దీ నియంత్రణ, భద్రత వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై కూడా ఈ ఎక్స్‌పో దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర పర్యాటకమంత్రిత్వశాఖ ఐ.టి.సి.ఎక్స్‌`2025 ఎక్స్‌పోకు మద్దతునిచ్చింది. మహారాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కూడా దీనికి సహాయ సహకారాలను అందజేసింది. అంతేకాదు భారత పురావస్తు పరిశో ధనా సంస్థ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, కర్ణాటకకు చెందిన టూరిజం అండ్‌ ఎండోమెంట్స్‌ బోర్డులు కూడా ఈ సదస్సుకు సంపూర్ణ మద్దతును అందజేశాయి. కానీ టెంపుల్‌ స్టేట్‌గా పేరుపొందిన తమిళనాడునుంచి సహకారం అందలేదు. కాగా ఈ సదస్సు సందర్భంగా ‘స్మార్ట్‌ టెంపుల్స్‌ మిషన్‌’ను ప్రారంభించడమే కాకుండా, ‘స్మార్ట్‌ టెంపుల్స్‌ అవార్డు’లను కూడా ప్రదానం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక లక్షణాలతో అలరారుతున్న 12 దేవాలయాలకు ఈ అవా ర్డులను ప్రదానం చేశారు.

యు.కె.లోని జైన ధర్మశాలలు, ప్రముఖ డివోషనల్‌ చారిటీస్‌, హిందూ దేవాలయాల సంఘాల ప్రతినిధులు, అన్నక్షేత్ర మేనేజ్‌మెంట్లు, వివిధ పుణ్యక్షేత్రాలకు చెందిన పురోహిత్‌ మహాసంఘా లు, తీర్థయాత్రలను ప్రోత్సహించే బోర్డులకు చెందిన సభ్యులు కూడా ఈ సదస్సుల్లో పాల్గన్నారు. ఇస్కాన్‌, శ్రీమందిర్‌, దుర్లభ్‌ దర్శన్‌, సరస్వత్‌ ఛాంబర్‌, క్రిస్టల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఒ.ఎన్‌.డి.సి, హల్దీరామ్‌ వంటి సంస్థలు ఐ.టి.సి.ఎక్స్‌`2025కు స్పాన్సరర్లుగా వ్యవహ రించాయి. 

ప్రపంచ వ్యాప్తంగా 32 లక్షల దేవాలయాలు

ప్రపంచ వ్యాప్తంగా 32లక్షల దేవాలయాలు, ప్రధానంగా భారత్‌కు చెందిన ఆలయాలను ఒకే వేదిక కిందికి తీసుకొని రావడం ఐ.టి.సి.ఎక్స్‌`2025 ప్రధాన లక్ష్యం. ఈ దేవాలయాల మొత్తం ఆర్థిక వ్యవస్థ రూ.6లక్షల కోట్లు! ఇప్పుడు వీటన్నింటినీ ఒకే నెట్‌వర్క్‌ కిందికి తెచ్చే యత్నాలు జరుగుతున్నాయి. ఆవిధంగా వీటన్నింటినీ ప్రజలకు పారదర్శకమైన రీతిలో అందుబాటులోకి తేవడం కూడా దీని ప్రధాన ఉద్దేశం. ఐ.టి.సి.ఎక్స్‌ ఇప్పటికే ప్రపంచంలోని 12వేల దేవాలయాలతో అనుసంధానత ఏర్పరచుకోగలిగింది. కోవిడ్‌ మహమ్మారి తర్వాత దేవాలయాల సందర్భన బా గా పెరిగింది. ఉదాహరణకు కోవిడ్‌కు ముందు వైష్ణోదేవి ఆలయానికి రోజుకు 10 నుంచి 15వే లమంది భక్తులు సందర్శించేవారు. కానీ కోవిడ్‌ తర్వాత వీరి సంఖ్య 32వేలు`40వేల మధ్య వుంటోంది. పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని ఇప్పుడు రోజుకు లక్షమంది సందర్శిస్తున్నారు. ఇది కూడా కోవిడ్‌కు పూర్వం కంటే చాలా ఎక్కువ. కేరళలో ప్రఖ్యాత గురువాయూర్‌ దేవాలయన్ని కోవిడ్‌కు ముందు రోజుకు 4వేలమంది దర్శిస్తే ఇప్పుడు వారి సంఖ్య 6 నుంచి 7వేలకు పెరి గింది. ప్రస్తుతం భారత్‌లో పర్యాటక పరిశ్రమ ద్వారా 80 మిలియన్ల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఎందుకంటే ఏటా పర్యాటకుల సంఖ్య 19శాతం చొప్పున పెరుగుతోంది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా మతపరమైన పర్యాటక మార్కెట్‌ 2032 నాటికి ఏకంగా 2.22బిలియన్‌ యు.ఎస్‌. డాలర్లకు చేరుతుందని కేపీఎంజీ సంస్థ అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పర్యాటకం ఏటా సగటున 6.25% వృద్ధిని నమోదు చేస్తోంది. 

చంద్రబాబు ప్రసంగం

ఈ ఎక్స్‌పోలో పాల్గన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృత్రిమ మేధ, బ్లాక్‌ ఛైన్‌, సుస్థిర ఇంధన పరిష్కారాల ద్వారా దేవాలయాల నిర్వహణను మరింత ఆధునీకరించాల్సిన అవసరం వుందన్నారు. ఆధ్యాత్మిక, ఆర్థిక కేంద్రాలుగా వున్న దేవాలయాలను సృజనాత్మక రీతి లో నిర్వహించాలన్నారు. ఫలితంగా వీటి సాంస్కృతిక ప్రభావశీలత బలీయంగా వుండగలదన్నా రు. ఇదే సమయంలో తిరుపతి ఆధ్యాత్మిక వారసత్వ ప్రాశస్త్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని ప్రపంచ ప్రతినిధులను కోరారు. 

హెచ్‌ఆర్‌ Ê సి.ఇ. చట్టం వల్ల అనర్థాలు

రెండో రోజు ఐ.టి.సి.ఎక్స్‌ా2025లో తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై ప్రసంగిస్తూ త మిళనాడులో ప్రస్తుతం అమల్లో వున్న ‘హిందూ రిలిజియస్‌ అండ్‌ ఛారిటబుల్‌ ఎండోమెంట్‌ యాక్ట్‌ (హెచ్‌ఆర్‌Ê సి.ఇ.)’ వల్ల కలుగుతున్న అనర్థాలను ఆకట్టుకునే రీతిలో వివరించారు. ఈ చట్టాన్ని ఎత్తేయాలని, హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల నియంత్రణ వుండకూడదని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం మార్కెట్‌ విలువ రూ.2.5లక్షలకోట్లని పేర్కొంటూ, ప్రపంచంలోని చాలా ప్రముఖ సంస్థలకంటే ఇదెంతో విలువైందన్న సంగతిని గుర్తుచేశారు. తమిళనాడులో అమల్లో ఉన్న హెచ్‌ఆర్‌Ê సి.ఇ. చట్టం హిందూ దేవాలయాల ఆర్థిక పురోభివృద్ధికి గుదిబండలా మారిందని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని ఎత్తేస్తామని స్పష్టం చేశారు. వెంకటేశ్వరస్వామి దయవల్ల తాము తమిళనాడు పగ్గాలు చేపడితే రాష్ట్రంలోని 44121 దేవాల యాలకు స్వేచ్ఛను ప్రసాదిస్తామన్నారు. దేవాలయాల ఆర్థిక వ్యవస్థ, తమ చుట్టుపక్కల ప్రదేశా ల్లోని స్కూళ్ల నిర్వహణ, పౌర మౌలిక సదుపాయాల కల్పన, సెంటర్స్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ సైన్స్‌ వంటి కేంద్రాల నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతున్న సంగతిని గుర్తుచేశారు. తమిళనాడులో ఆలయాల ఆర్థిక వ్యవస్థ నిర్వహణను ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నా ఇంతటి సామాజిక సేవను చేస్తున్న దేవాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం వుందన్నారు. చోళ రాజులు ఎంత చక్కగా దేవాలయాలను నిర్వహించిందీ ఆయన వివరించారు. ఈ దేవాలయాలు కేవలం ధార్మిక కేంద్రాలు మాత్రమే కాదు, ధనిక, పేద వర్గాలను ఒక్కచోటుకు చేర్చే ప్రదేశాల న్న సంగతిని ఆయన గుర్తుచేశారు. భారత్‌ను ఒకే తాటిపై నిలుపుతున్నది దేవాలయాలు మాత్ర మే. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక సుగంధాన్ని పునరుద్ధరించడం సనాతనధర్మంలో భాగమేనన్నారు.తొలి సదస్సు వారణాసిలో

 ఇంటర్నేషనల్‌ టెంపుల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో (ఐ.టి.సి.ఎక్స్‌ా2023) 2023 జులై 22 నుంచి 24వ తేదీ వరకు వారణాసిలో జరిగింది. ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌సంఫ్‌ుచాలక్‌ మోహన్‌ భాగవత్‌ దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అప్పటి టీటీడీ ఇ.ఒ. ధర్మారెడ్డి కూడా పాల్గన్నారు. మొత్తం 25 దేశాలనుంచి 450కి పైగా దేవాలయాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గన్నారు. వీరిలో హిందూ, బౌద్ధ, జైన, సిక్కు ప్రార్థనా స్థలాకు చెందిన వారుండటం విశేషం. వారణాసిలోని రుద్రాక్ష కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో ఉత్తమ ప్రార్థనా రీతులను ప్రవేశపెట్టడం ప్రధానలక్ష్యమని టెంపుల్‌ కనెక్ట్‌ వ్యవస్థాపకులు గిరీష్‌ కుల కర్ణి, ఐటీసీఎక్స్‌ ఛైర్మన్‌ ప్రసాద్‌ లాడ్‌లు ఈ సదస్సులో స్పష్టం చేశారు. టెంపుల్‌ కనెక్ట్‌ను గిరీష్‌ కులకర్ణి 2016లో స్థాపించారు.

శివుడికి అభిషేకం చేయాల్సిన సరైన విధానం

శివుడికి అభిషేకం చేయాల్సిన సరైన విధానం
ప్రతి ఏటా హిందువులు మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తిప్రపత్తులతో జరుపుకుంటారు. ఆరోజు రాత్రంతా జాగారం చేసి శివధ్యానంలో నిమగ్నం కావడం వల్ల ఆ పరమశివుడు మనతోనే వున్నాడన్న భావనకు లోనవుతాం. ఆదియోగి అయిన శివుడి తలపై వున్న నెలవంక ద్వారా జ్ఞాన ప్రసరణ ప్రవాహరూపంలో ప్రసరిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఏడాది ఫిబ్రవరి 26న మహాశివ రాత్రి పర్వదినం. 27వ తేదీ తెలతెలవారుతుండగానే భక్తులు శివాలయాలకు వెళ్లి శివుడికి అభిషే కాన్ని నిర్వహించి, శివనామస్మరణతో గడుపుతారు
mahashivarathri abhishekam

శివలింగమంటే…
A Shivling is a symbol of Lord Shiva, and is worshipped on Mahashivratri, a major Hindu festival

అనంతమైన ప్రకృతికి చిహ్నంగా శివలింగాన్ని భక్తులు పరిగణిస్తారు. శివలింగంలోని లింగాకృతివిశ్వశక్తికి చిహ్నం. అదేవిధంగా లింగం యొక్క దిగువ భాగం ‘యోని’ స్త్రీశక్తికి ప్రతీక. ఆమెనే ఆదిశక్తి. శివలింగం రెండు భాగాలుగా వుంటుంది. ఈ రెండు భాగాలను మనం పూజిస్తున్నా మంటే శివుడితో పాటు, గణేషుడిని, కార్తికేయుడిని, అశోక్‌ సుందరి, పార్వతీ మాతను పూజిస్తున్నామని అర్థం.
తొలి పూజ
మనం ఏ పూజాకార్యక్రమం నిర్వహించినా ముందుగా గణేషుడిని అర్చించాలి. తొలిగా ఆయన్నుపూజించకుండా ఏ పూజ లేదా క్రతువు సంపూర్ణం కాదు. అందువల్ల ముందుగా శివలింగానికి కుడివైపు నుంచి పూజను ప్రారంభించాలి. అంటే లింగానికి కొద్దిగా ముందు, యోనికి సమీపంలో నీటిని వదులుతూ గణేశుడి మంత్రాన్ని స్మరించాలి.
mahashivarathri abhishekam

రెండో పూజ

తర్వాత పూజించాల్సింది శివలింగం ఎడమభాగంలో వుండే కార్తికేయుడిని. ఈయన శివ`పార్వతుల సంతానం. దేవతల సేనానాయకుడు. దక్షిణ భారతదేశంలో మురుగన్‌ లేదా సుబ్రహ్మణ్య స్వామి పేరుతో ఈయన్ను అర్చిస్తారు. ఆయన నామాన్ని జపిస్తూ అక్కడ నీటిని వదలాలి.

మూడో పూజ
గణేషుడు, కార్తికేయుడిని అర్చించిన తర్వాత శివ`పార్వతుల మూడో సంతానమైన అశోక్‌ సుం దరిని అర్చించాలి. ఈమె పేరు చాలామందికి తెలియదు. శివలింగంలోని స్త్రీశక్తికి ఈమె ప్రతీక.ఈమెను సౌందర్య దేవతగా, వివేకాన్నిచ్చి, కోర్కెలను తీర్చే దేవతగా పరిగణిస్తారు.

అశోక్‌ సుందరి యోగి మధ్యభాగంలో, శివలింగానికి కుడిపక్క ముందుభాగంలో వుంటుంది.

mahashivarathri abhishekam
నాలుగో పూజ
శివలింగానికి ముందుభాగంలో పార్వతీదేవికి సమర్పించే పూజ. ఇప్పుడు జలాన్ని శివలింగం ఆధారభాగం చుట్టూ కుడివైపు నుంచి ఎడమవైపునకు పోయాలి. ఈ భాగం పార్వతీదేవికి ప్రతీక. ఈవిధంగా అభిషేకజలాన్ని పోస్తున్నప్పుడు పార్వతీదేవి మంత్రాన్ని పఠించాలి. లేదా ‘ఓం నమ్ణ శివాయ’ అని పఠించినా సరిపోతుంది.
ఐదో పూజ
గణేషుడు, కార్తికేయుడు, అశోక్‌ సుందరి, పార్వతీదేవిలకు అభిషేకం చేసిన తర్వాత, ఇప్పుడు లింగ రూపంలోని శివుడిని అర్చించాలి. ఆయనకు పంచామృతాలు (పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చెరుకురసం) మరియు గంధంతో అభిషేకించాలి. ఈ సందర్భంగా భక్తులు ఆరోగ్యం, ప్రేమ,అదృష్టం, సౌభాగ్యం కలగాలిని ఆ శివుడిని కోరుకుంటారు. 

శివాభిషేకం చేసే సమయంలో ‘ఓం నమ్ణశివాయ’ మంత్రాన్ని పఠించడం మరచిపోవద్దు. ఈ సందర్భంగా పూర్తి శ్రద్ధ, మనస్సును పూర్తిగా ఆయనపై లగ్నం చేయాలి. ఆప్పుడే ఆయన ప్రస న్నుడవుతాడు.

mahashivarathri abhishekam

 

mahashivarathri abhishekam pooja vidhanam

ఆపరేషన్‌ బెంగాల్‌ మొదలు?

ఢల్లీి, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల విజయంతో బీజేపీలో జోష్‌

రంగంలోకి దిగిన ఆర్‌ఎస్‌ఎస్‌

ఎన్నికలకు ఏడాదిముందే వ్యూహాత్మక అడుగులు

తృణమూల్‌ సాంస్కృతిక మూలాలపై విమర్శలు

హిందువులను ఏకీకృతం చేసేందుకు యత్నాలు

తృణమూల్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత

ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచిన ఆర్జీకర్‌ ఆసుపత్రి సంఘటన 

హిందువులపై వివక్షను హైలైట్‌ చేస్తున్న బీజేపీ

శాఖలు పెంచుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో విస్తరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ యత్నాలు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఢల్లీి అసెంబ్లీ ఎన్నికలు, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌ల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయాల తో కమలనాథుల్లో సమరోత్సాహం పెల్లుబుకుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు ‘ఆపరేషన్‌ బెంగాల్‌’ను బీజేపీ మొదలుపెట్టిందా అన్న అనుమానాలను లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా కొరకరాని కొయ్యగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో పాగా వేయాలన్నది వారి ప్రస్తుత లక్ష్యం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, పశ్చిమ బెంగాల్‌లో 18 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించగా, ఆ ఉత్సాహంతో పార్టీ కార్యకర్తలు చేసిన విస్తృత ఫలితాలనిచ్చి 2021 అ సెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లలో గెలుపు సాధించడానికి దోహదం చేసింది. ఒకప్పుడు మమతా బెనర్జీకు కుడిభుజంగా వ్యవహరించిన సుబేందు అధికారి, నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడిరచి ఈ ప్రాంతంలో తన బలమేంటో నిరూపించారు. ప్రస్తుతం భాజపా పశ్చిమ బెంగాల్‌లో గెలుపు సాధనకోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు ఇప్పుడు పూర్తిగా ఉనికిని కోల్పోయిన నేపథ్యంలో, మమత ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి, అరాచక పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్న యోచనలో వ్యూహాత్మకంగా ముందుకు సాగు తోంది. గత ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి క్షేత్రస్థాయిలో ఆర్‌ఎస్‌ఎస్‌ గణనీయంగా కృషిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పుడు తన శాఖలను మరింత విస్తరించుకొని, బీజేపీ బలహీనంగా వున్న ప్రాంతాల్లో పార్టీకి గట్టి ఓటు బ్యాంకు ఏర్పాటుచేసేందుకు తనవంతు కృషిని మొదలుపెట్టింది.

ఢల్లీి ఎన్నికల్లో విజయం సాధించడంతో, పశ్చిమబెంగాల్‌ బీజేపీ శాఖలో జోష్‌ కనిపిస్తోంది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం వంటి కారణాలవల్ల ఆప్‌ అధికారాన్ని కోల్పోయిందని బీజేపీ రాష్ట్ర నేతలుఒకపక్క విమర్శిస్తుంటే, ఆప్‌కు మద్దతిచ్చిన తృణమూల్‌ కాంగ్రెస్‌ మౌనంగా వుండటం గమనా ర్హం. ఢల్లీి ఎన్నికలు పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ గెలుపునకు ఉత్తేజాన్నిస్తాయని బీజేపీ నాయకులు విశ్వసిస్తున్నారు. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాల్లో 213 సీట్లను కైవసం చేసుకొని తృణమూల్‌ కాంగ్రెస్‌ తన కోట ఎంత పటిష్టంగా వున్నదీ తెలియజెప్పింది. ఇక కుంభమేళాను ‘మృత్యు కుంభ్‌’ అంటూ మమతా బెనర్జీ చేసిన తాజా వ్యాఖ్యలతో రాష్ట్ర బీజేపీ నేతలు ఒక్కసారి భగ్గుమన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన మమతా బెనర్జీపై కఠిన చర్యలు తీసుకోవాలని, బీజేపీ నాయకులు సుబేందు అధికారి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించడం తాజా పరిణామం. ఇదిలావుండగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశం సందర్భంగా జరిగిన గందరగోళంలో బీజేపీ నాయకు డు, విపక్షనేత సుబేందు అధికారితో సహా నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను 30రోజుల పాటు స్పీ కర్‌ సస్పెండ్‌ చేశారు. వరుస పరిణామాలను పరిశీలిస్తే బీజేపీ నాయకులు తృణమూల్‌ కాంగ్రెస్‌ పై తమ దాడులను క్రమంగా తీవ్రం చేస్తున్నారన్న అంశం స్పష్టమవుతోంది. తృణమూల్‌ సాం స్కృతిక, మతపరమైన మూలాల నేపథ్యంలో భాజపా నాయకులు హిందువుల హక్కులను పరిర క్షించేది తమ పార్టీమాత్రమేనన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, రాష్ట్ర బీజేపీ నాయకత్వం మరింత చురుగ్గా తృణమూల్‌పై విమర్శల దాడులను ముమ్మరం చేస్తారని తాజా పరిణామాలు స్ప ష్టం చేస్తున్నాయి.  

ఇటీవల హిందువులు నిర్వహించే సరస్వతీ పూజపై తృణమూల్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించడం తో, హిందువులపట్ల ప్రభుత్వం వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందంటూ బీజేపీ నేతలు విపరీతం గా ప్రచారం చేశారు. హిందువులపై జరుగుతున్న దాడులు, వీరికి వ్యతిరేకంగా నెరపే రాజకీ యాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఏడాది కాలంలో తృణమూల్‌ను బలమైన ఓటు బ్యాంకును దెబ్బతీయాలన్న లక్ష్యంతో రాష్ట్ర నాయకత్వం ముందుకెళుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా బీజేపీ రాజకీయాలను ఎదుర్కొనేందుకు తమది ‘సెక్యులర్‌’ ప్రభుత్వమని ప్రచారం చే స్తోంది. శాంతిభద్రతల విషయంలో మతం పేరుతో చూసీ చూడనట్టు వుండలేమని స్పష్టం చే స్తోంది.

రంగంలోకి ఆర్‌ఎస్‌ఎస్‌

మహారాష్ట్ర, హర్యానా, ఢల్లీి ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌పై తన దృష్టిని కేంద్రీకరించిందన్నది స్పష్టమవుతోంది. ముఖ్యంగా సంస్థ అధినేత మోహన్‌ భాగవత్‌ ఫిబ్రవరి 15వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌ పట్టణంలోని తాలిత్‌ రాయ్‌ కాంప్లెక్స్‌లో జరిగిన సంస్థ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ, ఆర్‌ఎస్‌ ఎస్‌లో సభ్యులుగా చేరాలంటూ కొత్తవారికి పిలుపునివ్వడం రాష్ట్రంలో సంస్థను మరింత విస్తరించడం ద్వారా హిందువులను మరింత సుసంఘటితం చేయాలన్న ఉద్దే శం స్పష్టమవుతోంది. ‘బయట వుండి మమ్మల్ని పరిశీలిస్తే మీలో తప్పుడు అభిప్రాయం ఏర్పడవచ్చు. అందువల్ల సంస్థలో చేరండి. ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. ఇక్కడి కార్యకలాపాలను పరిశీలించి నచ్చితే కొనసాగండి లేకపోతే వెళ్లిపోవచ్చు’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను అర్థం చేసుకోవాలంటే కొంత సమయం పడుతుంది. హిందూ సమాజంలో ఆత్మీయతను పెంపొందించడం, వారిని ఏకతాలిపై నడపడమే ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రధాన లక్ష్యమని ఆయన అ న్నారు. బయటనుంచి అభిప్రాయాలు ఏర్పరచుకునేదానికంటే సంస్థతో సాన్నిహిత్యాన్ని పెంచు కోండి. అప్పుడు మీకు సంస్థ అంటే ఏంటో అర్థమవుతుందన్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో 70వేల ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా సంస్థ బలహీనంగా వున్న ప్రాంతాల్లో శాఖలను నెలకొల్పడం ద్వారా ప్రజల్లోకి మరింతంగా విస్తరించాలన్న అభిప్రాయం ఆయన మాటల్లో వ్యక్తమైంది. అంతేకాదు ఈసారి ఆయన పది రోజుల పర్యటన వ్యూహాత్మకంగా సాగింద నుకోవాలి. ఎందుకంటే 2026లో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. మహారాష్ట్ర, హర్యానా, ఢల్లీి ఎన్నికల్లో భాజపా విజయం వెనుక క్షేత్రస్థాయిలో చాలా ముందునుంచే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల అకుంఠిత కృషి దాగివున్నదన్న ది నిష్టుర సత్యం. ఈ నేపథ్యంలో ఏడాది ముందునుంచే బెంగాల్‌లో తన వ్యూహాలను అమలు చేయాలన్న ఉద్దేశంతో ఆర్‌ఎస్‌ఎస్‌ అడుగులు ముందుకేస్తున్నట్టు అవగతమవుతోంది. ముఖ్యంగా దక్షిణ పశ్చిమబెంగాల్‌ ప్రాంతంలో బలంగా వున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ మూలాలను దెబ్బకొట్ట గలిగితే బీజేపీ అవలీలగా అధికారంలోకి రాగలుగుతుంది. ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ ప్రాంతంపై నే దృష్టికేంద్రీకరించి, తన శాఖలను మరింత విస్తరించి ఇప్పటినుంచే క్షేత్ర స్థాయి వ్యూహాలను అమలు పరచాలని చూస్తోంది. 

ఆర్‌ఎస్‌ఎస్‌ సభను అడ్డుకోవడానికి విఫలయత్నం

ఆర్‌ఎఎస్‌ఎస్‌ వ్యూహాలను ముందుగానే పసిగట్టిన మమతా బెనర్జీ ప్రభుత్వం బర్థమాన్‌లో మోహన్‌ భాగవత్‌ నిర్వహించాల్సిన సమావేశానికి అనుమతినివ్వలేదు. ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు జరుగతున్నందున, మైకులు, లౌడ్‌స్పీకర్ల వల్ల విద్యార్థులకు అసౌకర్యం ఏర్పడుతుందన్న నెపంతో జిల్లా యంత్రాంగం ఈ ర్యాలీ, బహిరంగ సభకు అనుమతి నిరాకరించింది. దీనిపై ఆర్‌ఎస్‌ఎస్‌ హైకోర్టును ఆశ్రయించడంతో, ‘ఆదివారం కావడంవల్ల పిల్లలకు ఏవిధమైన ఇబ్బంది ఏర్పడదని’ పేర్కొంటూ షరతులతో కూడిన అనుమతిని మంజూరుచేసింది. హైకోర్టు అనుమతివ్వడం తృణ మూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దెబ్బగానే పరిగణించాలి. ఇదిలావుండగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు భాగవత్‌ పర్యటన కేవలం రొటీన్‌గా జరిగేదే అని చెబుతున్నప్పటికీ, పొరుగున్న వున్న బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసాకాండ, బాంగ్లా సరిహద్దుల వద్ద కొనసాగుతున్న ఉద్రిక్త తల నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌ తన ఉనికిని మరింత విస్తరించాలన్న ఉద్దేశంతో ఉన్నది. ఇందుకోసం గ్రామపంచాయతీల స్థాయిలో తమ కార్యకలాపాలను కొనసాగించడం ద్వారా మరింత బలోపేతం కావాలని సంఫ్‌ు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 

పొరుగున బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడం, ఇస్కాన్‌కు చెందిన స్వామీజీ అరెస్ట్‌, హిందువులపై, వారి ప్రార్థనా మందిరాలపై దాడులు పెరగడంతో పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌ఎ స్‌ఎస్‌ నేతృత్వంలో పలు నిరసన ర్యాలీలు గతంలో జరిగాయి. ఫిబ్రవరి 8వ తేదీన మోహన్‌ భాగవత్‌ ఆర్జీకర్‌ ఆసుపత్రిలో అత్యాచారం, హత్యకు గురైన జూనియర్‌ డాక్టర్‌ తల్లిదండ్రులను కలిసి పరామర్శించడం గమనార్హం. గత అక్టోబర్‌ నెలలో ఆర్జీకర్‌ ఆసుపత్రి సంఘటనపై స్పందిస్తూ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం నేరస్థులను కాపాడటానికి యత్నిస్తున్నదంటూ విమర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాలకు చెందిన కార్యకర్తలతో ఆయన సమాలోచనలు జరిపారు. అంతేకాదు బెంగాల్‌, బిహార్‌, సిక్కిం, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులకు చెందిన సంఘ సీనియర్‌ కార్యకర్తలతో కూడా ఆయన చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. బర్ధమాన్‌ పట్టణంలోని ఉల్లాష్‌లో ఫిబ్రవరి 14న మధ్యప్రాంత ఆర్‌ఎస్‌ఎస్‌ కా ర్యాలయాన్ని ప్రారంభించారు. ఇదే జిల్లాలోని పుర్బాలోని శాఖను ఆయన సంద ర్శించారు.

మోహన్‌ భాగవత్‌ పర్యటన బెంగాల్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ను మరింత విస్తరించేందుకు దోహదం చే స్తుందనడంలో ఎంతమాత్రం సందేహంలేదు. బంగ్లా సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లో హింసా రాజకీయాలు సర్వసాధారణంగా మారాయి. ఈ నేపథ్యంలో బెంగాల్‌ పీఠం లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఏవిధంగా పావులు నడుపుతుందో వేచి చూడాలి. గతంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యూహాలు ఫలించి బీజేపీ అధికారంలోకి రావడానికి దోహదం చేశాయన్న సంగతి మరువకూడదు! అందుకనే మోహన్‌ భాగవత్‌ బెంగాల్‌ పర్యటనకు అంతటి ప్రాధాన్యత!

మహా కుంకుమార్చన

మహా కుంకుమార్చనలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొత్త తిమ్మాపూర్ ప్రాంతంలో ఆండాలమ్మ కాలనీ నుండి బొక్కలగుట్ట వెళ్లే ప్రదేశంలో జగదంబేశ్వర ఆశ్రమ ప్రాంగణంలో జగదాంబేశ్వరి, మహా శివలింగ, రామలక్ష్మణ, సింహ వాహన గణపతి, సుబ్రహ్మణ్య అన్నపూర్ణ, దత్తాత్రేయ, వీరబ్రహ్మేంద్రస్వామి, పంచముఖ హనుమాన్, ద్వాదశ జ్యోతిర్లింగ, మల్లికార్జున స్వామి ల విగ్రహాల ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించారు. మహా కుంకుమార్చన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.

11 రోజుల వేడుకల్లో భాగంగా దేవాలయాన్ని శోభాయ మానంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ… వేద పాఠశాల ఆధ్వర్యంలో విగ్రహాల ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన నిర్వహించి ప్రాంతాన్ని భక్తి పారవశ్యంతో నింపుతున్న నరేష్ శర్మ, రామేశ్వర చార్యులకు ఎల్లవేళలా సహాయం అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. వేద పాఠశాలలో విద్యార్థులకు ఎల్లవేళలా తోడుంటామని తెలిపారు. గోశాలను సైతం స్థాపించి ఆదర్శంగా నిలుస్తున్నారని, గోశాల కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. వోన్నోజుల రామేశ్వరా చార్య, వోన్నోజుల నరేష్ శర్మ ల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో హోమం, ప్రత్యేక పూజలు చేపట్టారు.

11 రోజుల మహోత్సవానికి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు విగ్రహ ప్రతిష్టాపనకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం వొన్నోజుల నరేష్ శర్మ మాట్లాడారు. జగదాంబేశ్వర ఆశ్రమ లక్ష్యం లోక కళ్యాణం అని, సకల స్త్రీమూర్తులందరూ నిండు సౌభాగ్యాలతో ఉండాలని, ప్రతి కుటుంబం అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని, స్త్రీ ఆనందంగా ఉంటే ప్రతి కుటుంబం ఆనందంగా ఉంటుందనే భావనతో హోమాలు పూజలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, పిసిసి సెక్రటరీ పిన్నింటి రఘునాథరెడ్డి, గోపతి బానేష్, భక్తులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సంగారెడ్డి కాంగ్రెస్ సారథిగా… ఉజ్వల్ రెడ్డి?

■డీసీసీ అధ్యక్షుడిగా నియమించేలా అధిష్టానం కసరత్తు

” దాదాపుగా ఖరారు.. త్వరలో అధికారికంగా ప్రకటన

■జిల్లా కీలక నేతలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్ణయం

జహీరాబాద్. నేటి ధాత్రి:

కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా పగ్గాలు డాక్టర్ సిద్ధంరెడ్డి ఉజ్వల్ రెడ్డికి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఆయన పేరు ఇప్పటికే దాదాపుగా ఖరారైంది. అధి కారికంగా ప్రకటించడమే మిగిలినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడా దిన్నర కావొస్తున్న తరుణంలో కొన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులుగా కొత్తవారికి అవకాశం ఇచ్చేలా పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా ఉజ్వల్ రెడ్డిని నియమిం చేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అమెరికాలో వైద్యుడిగా సేవలు!

జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లికి చెందిన సిద్దం రెడ్డి ఉజ్వల్ రెడ్డి కొన్నేళ్లుగా అమెరికాలో వైద్యుడిగా సేవలందిస్తూ వచ్చారు. మరోవైపు ఉజ్వల్ ఫౌండేషన్ స్థాపించి ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తు న్నారు. పన్నెండేళ్లుగా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలో తన ట్రస్టు ద్వారా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు యువతను క్రీడల వైపు ప్రోత్సహించేలా వివిధ పోటీలనూ నిర్వహిస్తుంటారు.
వీరి కుటుంబానికి స్థానికంగా మంచి పేరుంది. ఉజ్వల్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి గతంలో జహీరా బాద్ ఎంపీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉజ్వల్ రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగానూ కృషి చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా సారథిగా ఆయనను నియమించేలా కసరత్తు పూర్తయింది.

కార్పొరేషన్ చైర్ పర్సన్ పదవి ఇవ్వడంతో!

నిర్మలా జగ్గారెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి డీసీసీ అధ్యక్షు రాలిగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన
తర్వాత ఆమెకు టీజీఐఐసీ చైర్ పర్సన్ గా అవకాశం
ఇచ్చారు. ప్రస్తుతం ఆమె టీజీఐఐసీ కార్పొరేషన్
ఛైర్ పర్సన్ తో పాటు జిల్లా అధ్యక్షురాలిగానూ
కొనసాగుతున్నారు. దీంతో ఈసారి ఉజ్వల్ రెడ్డిని
సారథిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.
అతి త్వరలోనే ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
గత ఎన్నికల్లో ఆయన జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు ప్రయత్నించారు. చివరకు పార్టీ అధిష్టానం సురేష్ షెట్కార్ వైపే మొగ్గింది. ఈ క్రమంలో ఉజ్వల్ రెడ్డికి జిల్లా పగ్గాలు అప్పగించేలా అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

కల్పవృక్ష వాహన సేవ.

*కల్పవృక్ష వాహన సేవలో ఆక‌ట్టుకున్న క‌ళా బృందాల ప్ర‌ద‌ర్శ‌న‌..

తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 21:

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్ర‌వారం ఉద‌యం కల్పవృక్ష వాహనసేవలో వివిధ ప్రాంతాల‌ నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత‌ ప్రదర్శనలిచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో 6 కళాబృందాలు, 80 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవసింప చేశారు.


తాడిప‌త్రికి చెందిన వంద‌న డ్యాన్స్ అకాడ‌మికి చెందిన 22 మంది చిన్న‌రులు కూచిపూడి నృత్యాన్ని, తిరుప‌తికి చెందిన సేవా కుటుంబం బృందంలోని 23 మంది మ‌హిళ‌లు, వైభ‌వ వేంక‌టేశ్వ‌ర కోలాట బృందంలోని 16 మంది మ‌హిళ‌ల కోలాట నృత్యం నయనానందకరంగా సాగింది. పాల‌కొల్లు వెంక‌ట వోనిల‌మ్మ భ‌జ‌న బృందంకు 30 మంది క‌ళాకారులు, పైడిప‌ల్లికి చెందిన శ్రీ కృష్ణ‌కోలాట బృందం కోలాటం ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది..

యాసంగి వరి కోతలపై రైతులకు అవగాహన

• నాణ్యత ప్రమాణాలు పాటించాలి
• మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి

నిజాంపేట,నేటి ధాత్రి 

యాసంగి వరి కోతులపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం వ్యవసాయ అధికారులు రైతువేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో వివిధ గ్రామాల రైతులతో సమావేశం ఏర్పాటు చేసి మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి మాట్లాడారు… రైతులు యాసంగి కోతల సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. వరి కోసే సమయంలో హార్వెస్టర్ లో ఉండే ఫ్యాన్ బెల్ట్ యొక్క వేగం 18 – 20 ఆర్ పి యం ఉంచడం ద్వారా తాలు గింజలు ధాన్యంలో రాకుండా నివారించవచ్చున్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చే సమయంలో తేమ శాతం 17 కంటే తక్కువ ఉండాలని అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు రమ్య, శ్రీలత, మౌనిక, వివిధ గ్రామాల రైతుల ఉన్నారు.

చిన్నదర్పల్లిలో విద్యార్థులకు మెటీరియల్ అందజేత

చిన్నదర్పల్లిలో విద్యార్థులకు మెటీరియల్ అందజేత.

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

భవిష్యత్తు బాగుండాలంటే మంచిగా చదువుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు .మహబూబ్ నగర్ పట్టణంలోని వార్డు నెంబర్ 15, చిన్న దర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే ఆత్మీయ కానుక డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ కేవలం మన మహబూబ్ నగర్ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను మరోసారి రివిజన్ చేయాలని చెప్పారు. మీరంతా ఇంటర్మీడియట్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరాలని అక్కడ సుశిక్షితులైన అధ్యాపకులు ఉన్నారని, ఇంటర్మీడియట్ తో పాటుగా ఇంజనీరింగ్ మరియు మెడికల్ కోసం తన సొంత నిధులతో ఉచితంగా ఎంట్రెన్స్ పరీక్ష కోసం 200 మంది విద్యార్థులకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశామని, మీరు ఇంటర్మీడియట్ ప్రభుత్వం కళాశాలలో చేరితే మీ తల్లిదండ్రులకు కూడా ఆర్థిక భారం తగ్గుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎంఓ బాలు యాదవ్, ప్రధానోపాధ్యాయులు శైలజ, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నాయకులు లక్ష్మణ్ నాయక్, రమేష్ నాయక్, యాదయ్య యాదవ్, యం. నాగరాజు యాదవ్, రమేష్ యాదవ్, రవి నాయక్, యాదగిరి నాయక్, ఆంజనేయులు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

టిటిడి బోర్డు మెంబర్ ను ఉద్యోగులు నిందించడం తగదు

*శ్రీవారి భక్తుల సేవలో తరిస్తున్న నాయి బ్రాహ్మణులు..

*టిటిడి బోర్డు మెంబర్ ను ఉద్యోగులు నిందించడం తగదు…

*ఉద్యోగుల సంక్షేమం కోసమే పరితప్పిస్తున్న బోర్డు మెంబర్ నరేష్ కుమార్..

*వంకిపురం పవన్ ను తమ కులం నుండి ఎప్పుడో
వెలివేశాం..

*నాయి బ్రాహ్మణ కుల సంఘ నేతలు…

తిరుపతి(నేటి ధాత్రి)ఫిబ్రవరి 21:

తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం నాయి బ్రాహ్మణులుగా భక్తి భావంతో ఈ రోజు వరకు ఎటువంటి మచ్చ లేకుండా తమ వంతు సేవ చేస్తున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు ఆవుల పార్టీ బుజ్జిబాబు పేర్కొన్నారు.
ఈ క్రమంలో బుధవారం తిరుమల ముఖద్వారం వద్ద జరిగిన ఘటనపై టిటిడి ఉద్యోగులు తమ కులానికి చెందిన టిటిడి బోర్డు సభ్యుడు నరేష్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ నిరసనలకు పాల్పడటం బాధాకరంగా ఉన్నదని విచారణ వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తమ సంఘ నాయకులతో కలిసి మాట్లాడారు. టీటీడీ దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన ఇచ్చిన హామీ మేరకు బీసీ నాయి బ్రాహ్మణ కులానికి చెందిన కుప్పం నివాసి అయిన వైద్యం శాంతారావుకి, అలాగే కర్ణాటక రాష్ట్రానికి చెందినమరో నాయి బ్రాహ్మణులు నరేష్ కుమార్ కి టిటిడి పాలకమండలి సభ్యులు గా ఇచ్చినందుకు వారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని వర్షం వ్యక్తం చేశారు. ఈమధ్య తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటున్న కొత్త నిర్ణయాల వల్ల ఉద్యోగులు తమదైన శైలిలో భక్తులకు, విఐపి లకు తేడా లేకుండా వారికి నచ్చిన రీతిలో వారు విధులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. బుధవారం జరిగిన టిటిడి పాలక మండలి సభ్యులు నరేష్ కుమార్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుంచి దానికి పది నిమిషాల ముందు మహా ద్వారం గుండా ఎవరెవరు వెళ్లారు..? అనే ఎక్కడా సిసి టీవీ ఫుటేజ్ బయట పెట్టలేదన్నారు. బోర్డు సభ్యులుగా వారికి మహా ద్వారం గుండా పోయే అవకాశం ఉన్న, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా బోర్డు మెంబర్ మహా ద్వారం గుండా వెలుపలికి వచ్చే సమయంలో టిటిడి ఉద్యోగి అవగాహన రాహిత్యంగా వ్యవహరించడం సబబుగా లేదన్నారు. తరతరాలుగా నాయి బ్రాహ్మణులుగా మంచి కట్టు, సాంప్రదాయంతో భగవంతుడు సేవలో తాము కూడా శాశ్వత, కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఇతర ఉద్యోగస్తులతోపాటు సమైక్యంగా పనిచేసుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో నిరంతరం ఉంటున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మా సేవలను గుర్తించి టీటీడీ బోర్డు మెంబర్ గా మా కులానికి సంబంధించిన ఇద్దరిని నియమించి రాష్ట్రవ్యాప్తంగా కళ్యాణకట్టలో పనిచేస్తున్న మా సమస్యలను గుర్తించి వాటిని నిషేధిస్తున్న ఈ తరుణంలో మాపై ఇటువంటి వివక్ష చూపడం బాధ కలిగించిందన్నారు.తాము నిజంగానే టీటీడీ ఉద్యోగి పట్ల దురుసుగా ప్రవర్తించి ఉంటే కర్ణాటక రాష్ట్రానికి చెందిన బోర్డు మెంబర్ నరేష్ కుమార్ భాష బేధం వల్ల జరిగిన తప్పిదానికి, దానికి ముందు జరిగిన సీసీటీవీ ఫుటేజ్ ను రిలీజ్ చేసి ఎంతమంది ఆ రోజు ముఖద్వారం ముందు బయటకు ప్రవేశించారన్న వీడియోను టీటీడీ యాజమాన్యం విడుదల చేయాలని కోరారు.నారీశక్తి అవార్డు గ్రహీత, శ్రీవారి కళ్యాణకట్ట మహిళా క్షురకుల వ్యవస్థాపక అధ్యక్షురాలు కె.రాధాదేవి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాల పట్ల తాము ఎప్పుడు వ్యతిరేకం కాదని, ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలోకి వస్తున్న తమ తరతరాల ప్రవృత్తి దారులను గుర్తిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు పదవులు ముట్ట చెప్పడం ఆనందదాయకంగా ఉందన్నారు. టీటీడీ లో చిరు ఉద్యోగిగా ఉన్న చీర్ల కిరణ్ అనే వ్యక్తి టిటిడి ఉద్యోగుల అసోసియేషన్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటూ గత టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కనుసనల్లో పనిచేస్తుండేవారు అనే ఆరోపణలు ఎక్కువగా ఉండేవన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఈయన టిటిడిలో విధులు నిర్వహించకుండా చిరుద్యోగి అయినప్పటికీ అధికారి స్థాయిలో సిబ్బందిపై హుకుం జారీ చేసేవాడని ఆరోపించారు. ఇప్పుడు కూడా టీటీడీ బోర్డు మెంబర్ పై వచ్చిన ఆరోపణలను ప్రతిపక్ష వైసిపి పార్టీ నేతల కనుసనల్లోనే ఉద్యోగులను రెచ్చగొట్టి నిరసన కార్యక్రమాలు చేపట్టడం దుర్మార్గపు చర్య అని చెప్పారు. అలాగే కళ్యాణ కట్టలో పనిచేస్తున్న వెంకీపురం పవన్ పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ప్రతిపక్ష వైసిపి పార్టీకి చెందిన నేతలతో తిరుగుతూ కళ్యాణకట్ట విధులు నిర్వహించకుండా ఉద్యోగ సంఘ నేతగా చలామణి అవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇప్పటికే తమ నాయి బ్రాహ్మణ కులం నుంచి వంకిపురం పవన్ ను బహిష్కరించడం జరిగిందన్నారు. ప్రతిపక్ష వైసిపి పార్టీ నేతల కనుషనల్లోనే కొంతమంది టీటీడీ ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమాలు చేశారని కొంతమంది ఉద్యోగులు బహిరంగంగా చర్చించుకుంటూన్నా రని, పేర్కొన్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు చీర్ల కిరణ్,వంకి పురం పవన్ కార్యకలాపాలపై టీటీడీ ఉన్నతాధికారులువిజిలెన్స్ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ నేపథ్యంలో ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టిటిడి పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్ మాటలను వ్యంగంగా చిత్రీకరిస్తూ టిటిడి ఉద్యోగులు నిరసనలు, ధర్నాలు చేయడం సబబుగా లేదని ఖండించారు. టిటిడి దేవస్థానం వారు సోషల్ మీడియాలో విడుదలైన వీడియోకు ముందు జరిగిన ముఖద్వార ప్రవేశ,బయటకు వచ్చిన వీడియోను కచ్చితంగా విడుదల చేయాలని కరాకండిగా తేల్చి చెప్పారు.ఈ విలేకరుల సమావేశంలో నాయి బ్రాహ్మణ సంఘ నేతలు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే గండ్ర పై వ్యాఖ్యలు

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే గండ్ర పై వ్యాఖ్యలు బాధించాయి

కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భూపాలపల్లి హత్య కేసుపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామిరెడ్డి పై చేసిన వాక్యాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. మైలారం గ్రామం మాజీ సర్పంచ్ అరికెళ్ల ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి కేవలం కావాలని గండ్ర వెంకటరమణా రెడ్డి పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని బిఆర్ఎస్ పార్టీకి గండ్ర వెంకట రమణారెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక భూపాల్ పల్లిలో నిన్న జరిగిన రాజలింగ మూర్తి హత్య విషయంలో రాజకీయం చేసి కేవలం కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడిగడ్డ మ్యారేజ్ విషయంలో ఉన్న కోర్టు కేసులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పై అన వసరమైన ఆరోపణలు చేయ డం సరికాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఇలాంటి హత్య రాజకీయాలు మా ప్రభుత్వంలో గాని, గండ్ర రమణారెడ్డి ఇప్పటివరకు చేయలేదని హత్యా రాజకీ యాలు కాంగ్రెస్ పార్టీ నాయకు లకు కొత్తేమి కాదని ఇరువ ర్గాల మధ్య భూ వివాదంమే ప్రధాన కారణమని అందరూ చెపుతున్నారని,హత్య జరిగిందని దానిని బీఆర్ ఎస్ నాయకులకు రుద్దడం సిగ్గు చేటని ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు పద్ధతి మార్చుకొని ప్రజా పాలన చేయాలని హత్య రాజకీయాలు మీరు చేస్తారు మా నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి ప్రజలకు సేవ చేసే నాయకుడిగా కొనియాడారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపిటిసి గడిపే విజయ్ బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ యూత్ మండలాధ్యక్షుడు మారేపల్లి మోహన్ కరణ్ బాబు మస్కే భాస్కర్ బిఆర్ఎస్వి జిల్లా నాయకులు వెంకట్ ఉన్నారు.

అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి

సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్ కి వినతిపత్రం

పరకాల నేటిధాత్రి
మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అక్రమగృహ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా కళ్యాణ్ మాట్లాడుతూ పట్టణంలో 4,9,15,18,19, వార్డుల పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్నాయని వ్యాపార సముదాయాలు సైతం అనుమతి మేరకు కాకుండా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు నిర్మిస్తున్నారని పట్టణ టౌన్ ప్లానింగ్ విభాగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అనేక నిర్మాణాలు అనుమతులు లేకుండానే పట్టణ పరిధిలో కొనసాగుతున్నాయన్నారు.నూతన భవన నిర్మాణాల పట్ల తక్షణమే విచారణ జరిపించి భవిష్యత్ కాలంలో ఇబ్బందులకు దారి కాకుండా వెంటనే విచారణ జరిపించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కళ్యాణ్ అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హేమంత్,ఈశ్వర్ పాల్గొన్నారు.

పనిచేసేవారికే పదవులు…

– కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులి సత్యం.

చందుర్తి, నేటిధాత్రి:

ఈ నెలలో జరిగే మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వేములవాడ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే ఉత్సవాలకు ఉత్సవ కమిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో 29మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేయడము హర్షనీయమని ఆ కమిటీలో చందుర్తి మండల కేంద్రానికి చెందిన గొట్టే ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండలఅధ్యక్షులు చింతపంటీ రామస్వామిని నియమించడం చాలా సంతోషంగా ఉందని చందుర్తి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులి సత్యం శుక్రవారం రోజున పాత్రికేయుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వము పనిచేసే వారికే పదవులు ఇస్తుందని వారం రోజులపాటు జరిగే ఉత్సవాలు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చూసుకోవడానికి పోలీస్ సిబ్బందిని ఇతర సిబ్బందిని వారితో పాటు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోవడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారని అన్నారు. కమిటీలో ఇద్దరికీ అవకాశం కల్పించినందుకు మండల ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డికి అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

పురుగుల మందు తాగి పీజీ విద్యార్థి ఆత్మహత్య

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం గూడెం గ్రామంలో పీజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గూడెం గ్రామానికి చెందిన గూడ తిరుపతమ్మ రమేష్ దంపతుల కుమారుడు దామోదర్(30) గురువారం సాయంత్రం ఏడు గంటలకు పురుగుల మందు తాగి వాళ్ల పంటచేనులో ఆత్మహత్య చేసుకున్నాడు. మొక్కజొన్న చేనుకు నీరు పారించడానికి వెళ్ళిన కుమారుడు చీకటి అవుతున్నా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెతుకుతూ తన సెల్ ఫోన్ కి ఫోన్ చేస్తూ వెతకగా చేనులోనే శవమై కనిపించాడు. చదువులో చాలా చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న దామోదర్ వ్యవసాయ పనుల్లో కూడా తల్లిదండ్రులకు సహాయపడుతూ ఉంటాడు. చురుకైన విద్యార్థిగా కష్టజీవిగా పేరు తెచ్చుకున్న దామోదర్ చనిపోవడంతో గ్రామం శోకసముద్రంలో మునిగింది. తల్లిదండ్రుల రోదనను ఆపడం ఎవరి తరము కాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోత్కాపల్లి ఎస్సై దీీకొండ రమేష్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version