వ‌ణుకు పుట్టించే డార్క్ మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌!

ఓటీటీకి.. వ‌ణుకు పుట్టించే డార్క్ మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌! ఎందులో అంటే

చాలా రోజుల త‌ర్వాత బాలీవుడ్ నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వెబ్ సిరీస్ మండల మ‌ర్డ‌ర్స్ డిజిట్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తోంది.

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు చాలా రోజుల త‌ర్వాత బాలీవుడ్ నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వెబ్ సిరీస్ మండల మ‌ర్డ‌ర్స్ (Mandala Murders) డిజిట్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తోంది. క్రైమ్‌, మ‌ర్ట‌ర్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌ జాన‌ర్‌లో వ‌స్తున్న ఈ సిరీస్ రాక కోసం చాలామంది సినీ లవ‌ర్స్ ఎదురు చూస్తున్నారు. గ‌తంలో హిందీ నుంచే వ‌చ్చి క‌ల్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న‌ అసుర్ త‌ర‌హా కాన్పెస్ట్‌తో ఈ సిరీస్ తెర‌కెక్కింది. య‌శ్ రాజ్ సంస్థ ఆస్థాన క‌థానాయిక‌ బాలీవుడ్ న‌టి వాణీ క‌పూర్ (Vaani Kapoor) లీడ్ రోల్‌లో న‌టిస్తుండ‌గా సుర్వీన్ చావ్లా (Surveen Chawla), శ్రీయ పిగ్లోంక‌ర్ (Shriya Pilgaonkar), వైభ‌వ్ రాజ్ గుప్తా (Vaibhav Raj Gupta) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఇదిలాఉంటే.. ఈ సిరీస్‌కు గోపి పుత్ర‌న్ (Gopi Puthran), మ‌న‌న్ రావ‌త్ (Manan Rawat) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. య‌శ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) వంటి ప్ర‌ఖ్యాత భారీ బాలీవుడ్ నిర్మాణ సంస్థ డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్స్ లోకి ఎంట్రీ ఇస్తుండ‌డం విశేషం. చరందాస్పూర్ అనే గ్రామంలో జ‌రిగే వ‌రుస హ‌త్య‌లు, దాని వెన‌క ఉన్న ఆధ్యాత్మిక ర‌హాస్య‌ల ప‌రిశోధ‌న నేప‌థ్యంలో ఈ సిరీస్ రూపొందించారు. రియా థామస్ (Vaani Kapoor) మరియు విక్రమ్ సింగ్ (Vaibhav Raj Gupta) ఈ కేసును ఎలా విచారణ చేశారు, వారికి ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి, మ‌ర్డ‌ర్స్ వెనుక ఉన్న అనేక మిస్టరీలను ఎలా బ‌య‌ట‌కు తీసుకు రాగ‌లిగారు, చివ‌ర‌కు ఏమ‌యింద‌నేది క‌థ‌.

తాజాగా ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకోవ‌డ‌మే వెంట‌నే చూసేయాలి అనే ఫీలింగ్‌ను తెప్పించేలా ఉంది. ముఖ్యంగా వ‌రుస హ‌త్య‌లు, వాటికి దైవానికి మ‌ధ్య లింకులు ఎపిసోడ్ ఎపిసోడ్‌కు వ‌చ్చే ట్విస్టులు మైండ్ బ్లాక్ చేసేలా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఈ సిరీస్‌ జూలై 25 నుంచి నెట్ ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో హిందీతో పాటు ఇత‌ర ప్రాంతీయ భాష‌ల్లోనూ స్ట్రీమింగ్‌కు రానుంది. ఎంతో కాలంగా అసుర్ లాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ కంటెంట్ అశిస్తున్న వారికి ఈ సిరీస్ బెస్ట్ ఛాయిస్‌. సో సినీ, ఓటీటీ ల‌వ‌ర్స్ డోంట్ మిస్ మండ‌ల (Mandala Murders) మ‌ర్డ‌ర్స్‌.

పురుగుల మందు తాగి పీజీ విద్యార్థి ఆత్మహత్య

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం గూడెం గ్రామంలో పీజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గూడెం గ్రామానికి చెందిన గూడ తిరుపతమ్మ రమేష్ దంపతుల కుమారుడు దామోదర్(30) గురువారం సాయంత్రం ఏడు గంటలకు పురుగుల మందు తాగి వాళ్ల పంటచేనులో ఆత్మహత్య చేసుకున్నాడు. మొక్కజొన్న చేనుకు నీరు పారించడానికి వెళ్ళిన కుమారుడు చీకటి అవుతున్నా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెతుకుతూ తన సెల్ ఫోన్ కి ఫోన్ చేస్తూ వెతకగా చేనులోనే శవమై కనిపించాడు. చదువులో చాలా చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న దామోదర్ వ్యవసాయ పనుల్లో కూడా తల్లిదండ్రులకు సహాయపడుతూ ఉంటాడు. చురుకైన విద్యార్థిగా కష్టజీవిగా పేరు తెచ్చుకున్న దామోదర్ చనిపోవడంతో గ్రామం శోకసముద్రంలో మునిగింది. తల్లిదండ్రుల రోదనను ఆపడం ఎవరి తరము కాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోత్కాపల్లి ఎస్సై దీీకొండ రమేష్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version