యాసంగీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు.

యాసంగీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా లోని బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో ధాన్యం కొంటున్నామని తెలిపారు. సన్నరకం వడ్లకు క్వింటాకు రూ.

500 బోనస్ ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఆదివారం నాగర్ కర్నూల్ నియోజికవర్గంలో కురిసిన అకాల వర్షంతో పంటలు నేలకొరిగిన పంటలను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులందరికీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు అంచన వేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తానని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

యాసంగి వరి కోతలపై రైతులకు అవగాహన

• నాణ్యత ప్రమాణాలు పాటించాలి
• మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి

నిజాంపేట,నేటి ధాత్రి 

యాసంగి వరి కోతులపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం వ్యవసాయ అధికారులు రైతువేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో వివిధ గ్రామాల రైతులతో సమావేశం ఏర్పాటు చేసి మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి మాట్లాడారు… రైతులు యాసంగి కోతల సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. వరి కోసే సమయంలో హార్వెస్టర్ లో ఉండే ఫ్యాన్ బెల్ట్ యొక్క వేగం 18 – 20 ఆర్ పి యం ఉంచడం ద్వారా తాలు గింజలు ధాన్యంలో రాకుండా నివారించవచ్చున్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చే సమయంలో తేమ శాతం 17 కంటే తక్కువ ఉండాలని అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు రమ్య, శ్రీలత, మౌనిక, వివిధ గ్రామాల రైతుల ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version