ఏఐటియుసి నాయకుల తప్పుడు ఆరోపణలను.

ఏఐటియుసి నాయకుల తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం

ఐఎన్టియుసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్రావు

శ్రీరాంపూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

ఆర్కే5 గనిపై ఇటీవల జరిగిన ద్వార సమావేశంలో ఏఐటియుసి నాయకులు తమకు అసలు సంబంధం లేని విషయాలపై ఘనతను దక్కించుకోవాలని తాపత్రయపడటం దురదృష్టకరమన్నారు. డిపెండెంట్ల వయోపరిమితిని 30 నుండి 40 సంవత్సరాలకు పెంచేలా,మీప్రభుత్వంతో మాట్లాడి యాజమాన్యాన్ని ఒప్పించగలిగిన ఘనత ఐఎన్టియుసి యూనియన్‌ కే దక్కుతుంది అని అన్నారు. కానీ ఆ విషయాన్ని ఏఐటీయూసీ నాయకులు తమ విజయంగా చెప్పుకోవడం వారి నీతి మాలిన అసత్య ప్రచారానికి నిదర్శనమని పేర్కొన్నారు.
సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ఐఎన్టియుసి నాయకత్వంలో
బి.జనక్ ప్రసాద్,సెక్రటరీ జనరల్,తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరి బోర్డు చైర్మన్ ప్రభుత్వ స్థాయిలో అనేకసార్లు చర్చలు జరిపినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి,మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్,సింగరేణి చైర్మన్ డైరెక్టర్లతో జరిపిన చర్చలు,సమర్పించిన నివేదికలు స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.పెద్దపల్లి యువ వికాసం బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి
భట్టి విక్రమార్క,రాష్ట్ర మంత్రివర్యులు పాల్గొన్న ఈ సమావేశం అత్యంత విజయవంతంగా నిర్వహించబడిందన్నారు.
ఈసమావేశంలో మంత్రి
దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభలో సింగరేణి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, కార్మికుల సొంతింటి పథకం, అలవెన్సులపై ఇన్కమ్ టాక్స్ చెల్లింపులు,మారుపేర్ల పరిష్కారం,ఇతర పలు సమస్యలపై
బి.జనక్ ప్రసాద్ సమర్పించిన వినతిపత్రాల అంశాలను సంబంధిత శాఖలు పరిశీలిస్తున్నాయని స్పష్టంగా ప్రకటించడమే కాక,త్వరలో కార్మికుల కల నెరవేరేలా చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.ఐఎన్టియుసియూనియన్ కృషి, నిబద్ధతా కార్యాచరణకు, విజయపథానికి ప్రత్యక్ష నిదర్శనమని
జెట్టి శంకర్రావు పేర్కొన్నారు.
గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ యాజమాన్యంతో జరిపిన స్ట్రక్చర్ సమావేశాలలో ఏమి సాధించామో చెప్పకుండా ,
ఐఎన్టియుసి కార్యాచరణను, తమదిగా చెప్పుకుంటూ కాలం వెళ్ళేదీయడం వారి అనైతికతకు నిదర్శనమన్నారు.గనుల్లో, డిపార్ట్మెంట్లలో కార్మికులు, మహిళా కార్మికులు అధిక పనిభారంతో,మౌలిక సదుపాయాల ఏర్పాట్లు కొరవడి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా, ఏఐటీయూసీ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలతో, పైరవీలకే పరిమితమవుతూ కార్మికుల సమస్యల పట్ల శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు.ఈ నేపథ్యంలో కార్మికులు ఏఐటీయూసీ నాయకుల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని, నిజమైన కార్మిక సంక్షేమానికి కృషి చేస్తున్న ఐఎన్టియుసి పట్ల తమ మద్దతును కొనసాగించాలని జెట్టి శంకర్రావు పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో
సిహెచ్.భీమ్ రావ్, గరిగ స్వామి,కలవేన శ్యామ్, తిరుపతి రాజు,వెంకటేష్ పేరం రమేష్,ఏనుగు రవీందర్ రెడ్డి, ఐరెడ్డి తిరుపతిరెడ్డి,ల్యాగల శ్రీనివాస్,జీవన్ జోయల్, మనోజ్,గోపాల్ రెడ్డి,చాట్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

జమ్మూ కాశ్మిర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము.

జమ్మూ కాశ్మిర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము…_

— మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షులు పత్తి కుమార్

కాప్రా నేటిధాత్రి 24

 

 

జమ్మూ కాశ్మిర్ లోని అనంత నాగ్ జిల్లా పెహల్గామ్ లో నిన్న జరిగిన ఉగ్ర దాడిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షులు పత్తి కుమార్ అన్నారు.
జమ్మూ కాశ్మీర్ అందమైన పర్యాటక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చాలా దురదృష్టకరం, ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వo పూర్తి బాధ్యత వహించాలని దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నాము..
గాయపడిన కుటుంబాలకు మెరుగైన చికిత్స అందించి వారి కుటుంబాలకు ధైర్యాన్ని చేకూర్చాలి అదేవిధంగా ఉగ్రదాడి బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకొని వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ఉన్నది దాడికి బాధ్యులైన వారిని వెంటనే పట్టుకొని ఉరిశిక్ష అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సమయంలొ దేశప్రజలు అందరు ఒక్కటై బాధితకుటుంబలకు అండగా నిలబడాలని కోరుతున్నాము.

పెహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల.!

పెహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

బొచ్చు కోమల
యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్

పరకాల నేటిధాత్రి

పెహాల్గంలో ఉగ్రవాదుల చేతిలో చంపబడిన 26 మంది అమాయక పర్యాటకులపై దాడిని వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల తీవ్రంగాఖండించారు.ఉగ్రవాదుల పిరికిపంద చర్యను ఆయన అనాగరిక చర్యగా అభివర్ణిస్తూ మృతి చెందిన వారికి తన సంతాపాన్ని తెలియజేస్తూ దాడిలో గాయపడిన 20 మంది త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్తిస్తున్నట్లు తెలిపారు.బాధిత కుటుంబాలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని,ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదులను గుర్తించి,వారిని పెంచి ప్రోత్సహిస్తున్న ఉగ్ర వాద సంస్థలను సమూలంగా దేశంలో లేకుండా తుడిచివేయాలని,ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని దేనని,ఉగ్రదాడుల్లో మృతి చెందిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.

మాజీ ఎమ్మెల్యే గండ్ర పై వ్యాఖ్యలు

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే గండ్ర పై వ్యాఖ్యలు బాధించాయి

కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భూపాలపల్లి హత్య కేసుపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామిరెడ్డి పై చేసిన వాక్యాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. మైలారం గ్రామం మాజీ సర్పంచ్ అరికెళ్ల ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి కేవలం కావాలని గండ్ర వెంకటరమణా రెడ్డి పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని బిఆర్ఎస్ పార్టీకి గండ్ర వెంకట రమణారెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక భూపాల్ పల్లిలో నిన్న జరిగిన రాజలింగ మూర్తి హత్య విషయంలో రాజకీయం చేసి కేవలం కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడిగడ్డ మ్యారేజ్ విషయంలో ఉన్న కోర్టు కేసులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పై అన వసరమైన ఆరోపణలు చేయ డం సరికాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఇలాంటి హత్య రాజకీయాలు మా ప్రభుత్వంలో గాని, గండ్ర రమణారెడ్డి ఇప్పటివరకు చేయలేదని హత్యా రాజకీ యాలు కాంగ్రెస్ పార్టీ నాయకు లకు కొత్తేమి కాదని ఇరువ ర్గాల మధ్య భూ వివాదంమే ప్రధాన కారణమని అందరూ చెపుతున్నారని,హత్య జరిగిందని దానిని బీఆర్ ఎస్ నాయకులకు రుద్దడం సిగ్గు చేటని ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు పద్ధతి మార్చుకొని ప్రజా పాలన చేయాలని హత్య రాజకీయాలు మీరు చేస్తారు మా నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి ప్రజలకు సేవ చేసే నాయకుడిగా కొనియాడారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపిటిసి గడిపే విజయ్ బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ యూత్ మండలాధ్యక్షుడు మారేపల్లి మోహన్ కరణ్ బాబు మస్కే భాస్కర్ బిఆర్ఎస్వి జిల్లా నాయకులు వెంకట్ ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version