స్కాలర్ షిప్ దరఖాస్తుల ఆహ్వానం….

స్కాలర్ షిప్ దరఖాస్తుల ఆహ్వానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, 2025-26 సంవత్సరానికి దివ్యాంగ విద్యార్థుల కోసం స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. శాఖ అధికారి లలితా కుమారి తెలిపిన వివరాల ప్రకారం, ప్రీ మెట్రిక్ (9, 10 తరగతులు), పోస్ట్ మెట్రిక్ (11, 12 తరగతులు), డిగ్రీ, పీజీ, డిప్లొమా వంటి కోర్సులలో చదువుతున్న విద్యార్థులు ఈనెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

పురుగుల మందు తాగి పీజీ విద్యార్థి ఆత్మహత్య

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం గూడెం గ్రామంలో పీజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గూడెం గ్రామానికి చెందిన గూడ తిరుపతమ్మ రమేష్ దంపతుల కుమారుడు దామోదర్(30) గురువారం సాయంత్రం ఏడు గంటలకు పురుగుల మందు తాగి వాళ్ల పంటచేనులో ఆత్మహత్య చేసుకున్నాడు. మొక్కజొన్న చేనుకు నీరు పారించడానికి వెళ్ళిన కుమారుడు చీకటి అవుతున్నా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెతుకుతూ తన సెల్ ఫోన్ కి ఫోన్ చేస్తూ వెతకగా చేనులోనే శవమై కనిపించాడు. చదువులో చాలా చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న దామోదర్ వ్యవసాయ పనుల్లో కూడా తల్లిదండ్రులకు సహాయపడుతూ ఉంటాడు. చురుకైన విద్యార్థిగా కష్టజీవిగా పేరు తెచ్చుకున్న దామోదర్ చనిపోవడంతో గ్రామం శోకసముద్రంలో మునిగింది. తల్లిదండ్రుల రోదనను ఆపడం ఎవరి తరము కాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోత్కాపల్లి ఎస్సై దీీకొండ రమేష్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version