శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలపై పుస్తకాన్ని ఆవిష్కరించిన టి.టి.డి జేఈవో వి.వీరబ్రహ్మం..
తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 22:
శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డా. ఆకెళ్ల విభీషణ శర్మ రచించిన శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనే పుస్తకాన్ని శనివారం టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం ఆవిష్కరించారు. టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ పుస్తకంలో బ్రహ్మోత్సవాలలోని వాహన సేవల విశిష్టతను వివరించారు. వాహన సేవలతోపాటు ఆలయంలో జరిగే వివిధ బ్రహ్మోత్సవ విశేష పూజలను అందులో పొందుపరిచారు.
ఈ కార్యక్రమంలో సీఈ సత్యనారాయణ, డిపిపి కార్యదర్శి శ్రీరామ్ రఘనాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు..