వివాహాది శుభ కార్యంలో పాల్గొన్న మాజీఎమ్మెల్యే గండ్ర..

వివాహాది శుభ కార్యంలో పాల్గొన్న మాజీఎమ్మెల్యే గండ్ర

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రానికి చెందిన శాయంపేట మాజీ వార్డు సభ్యులు గొట్టి ముక్కుల చక్రపాణి కుమారుడు రాజేష్- స్వాతి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వస్త్రాలు అందించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమ ణారెడ్డి నూతన వధూవరు లను ఆశీర్వదించారు.ఈ కార్య క్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, మాజీ మార్కె ట్ వైస్ చైర్మన్ మారేపల్లి నందం, యూత్ అధ్యక్షులు మారేపల్లి మోహన్, మాజీ ఉపసర్పంచ్ ధైనంపల్లి సుమన్, గ్రామశాఖ అధ్యక్షులు గాదె రాజేందర్, సీనియర్ నాయకులు దైనంపల్లి కరుణ్ బాబు,సోషల్ మీడియా కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

చదువుకోడానికి స్టడీ రూమ్ లేదు.
సరియైన ఆటస్థలం ఏర్పాటు చేయాలి.

మాజీ ఎమ్మెల్యే గండ్ర.

చిట్యాల. నేటి ధాత్రి :

చిట్యాల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు ప్రభుత్వ మోడల్ బాల, బాలికల విద్యాలయాలను సందర్శించి విద్యార్థుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారు మరియు వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గంట జ్యోతి మరియు మండల బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ…

ఇటీవల గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ సంఘటనల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ కేటీఆర్ ఆదేశాల మేరకు చిట్యాల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను మరియు ప్రభుత్వం మోడల్ పాఠశాలలను సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా కస్తూర్బా గాంధీ విద్యార్థినిలు మాకు ఒక ప్లే గ్రౌండ్ కావాలని, అదేవిధంగా మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థినులు మా యొక్క హాస్టల్ పరిసరాలు మొత్తం పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని కోరడం జరిగింది.
అదేవిధంగా టాయిలెట్స్ అయిదు రోజులకి ఒకసారి క్లీన్ చేయడంతో చాలా దుర్వాసన వెదజలుతున్నాయని, అదే విధంగా మాకు చదువుకోవడానికి స్టడీ రూమ్, ఆడుకోవడానికి ఆటస్థలం, కరెంట్ సరిగ్గా రావడం లేదని మాకు సరైన కరెంట్, చుట్టుప్రక్కల ఆపరిశుభ్రంగా ఉండటంతో దోమలు ఎక్కువగా వస్తున్నాయి అని అందుకు మెస్ డోర్స్ ఏర్పాటు చేయాలని, అదే విధంగా నీటి సమస్య అధికంగా ఉన్నది కారణంగా మిషన్ భగీరథ ద్వారా నీటిని అందించాలని, వారికీ హాట్ వాటర్ కొరకు సోలార్ గ్రీజర్ మరియు సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని కోరారు.
అదే విధంగా ఇప్పటి వరకు కోస్మోటిక్ బిల్లు రాలేదని వాటిని కూడా త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరారు. వారి వెంట మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన..

మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

చిట్యాల ,నేటి దాత్రి ;

భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలోని మాజీ ఉపసర్పంచ్ కోడెల రాజయ్య కుటుంబాన్ని భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి శుక్రవారం రోజున పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
నేడు వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేసినారు,
వారి వెంట మండల అధ్యక్షులు అల్లం రవీందర్. వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ చిట్యాల యూత్ అధ్యక్షుడు తవటంనవీన్ టౌన్ అధ్యక్షులు బుర్ర శ్రీధర్ పెరుమాండ్ల రవీందర్ పసుపుల శీను కోడేలరాజమల్లు సదానందం రవి రాంబాబు నరేందర్ తాటిపల్లి శీను రజినికాంత్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

గండ్ర పరామర్శ….

గండ్ర పరామర్శ….
.
* మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మొగుళ్ళపల్లి మండలం,పోతుగల్లు గ్రామ వాస్తవ్యులు మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు రేణుకుంట్ల మొగిలి బైపాస్ సర్జరీ ఆపరేషన్ చేయించుకొనిఇంటి వద్ద కోలుకుంటున్న వారిని. ఆప్యాయంగా పలకరించి ఆరోగ్యం బాగా చూసుకోవాలని తెలిపారు
* ఆకినపల్లి గ్రామ వాస్తవ్యులు చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బండి సుదర్శన్ గౌడ్ పెద్ద కుమారుడు కీ.శే బండి కిరణ్ మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిమనోధైర్యం కలిపించారు
వారి వెంట మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య మాజీ సర్పంచ్ నైనకంటి ప్రభాకర్ మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గురు పౌర్ణమి పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

గురు పౌర్ణమి పూజలు చేసిన
మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

గురు పౌర్ణమి సందర్భంగా భూపాలపల్లి మంజూరు నగర్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కృష్ణకాలనీలోని శ్రీ షిరిడీ సాయిబాబాను దర్శించుకుని స్వామి వారి అభిషేక కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూపాలపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే గండ్రను కలిసిన కేటీఆర్ సేన నాయకులు

*మాజీ ఎమ్మెల్యే గండ్రను కలిసిన కేటీఆర్ సేన నాయకులు*

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి నూతన కేటీఆర్ సేన అధ్యక్షుడిగా ఎన్నికైన రాకేష్ భూపాలపల్లి నియోజకవర్గం మాజీఎమ్మెల్యే గండ్ర వెంకటర మణారెడ్డి మర్యాద పూర్వ కంగా కలిసిన జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కేటీఆర్ సేన నాయకులు అభినందించి శాలువాతో సత్కరించారు. బి ఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, అధికార కాంగ్రెస్ పార్టీ అబద్దాల ప్రచారాలను ఎప్పటి కప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎండ గట్టాలని తెలిపారు.ఈ కార్యక్ర మంలో భూపాలపల్లి జిల్లా కేటీఆర్ సేన జిల్లా అధ్యక్షులు వీసం భరత్ రెడ్డి, నియోజ కవర్గ అధ్యక్షులు పిన్నింటి మణిదీప్, యూత్ నాయకులు సికిందర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులకు ఘన స్వాగతం.

మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులకు ఘన స్వాగతం

బిఆర్ఎస్ పార్టీ టేకుమట్ల మండల నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి:

 

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అమెరికాలో దిగ్విజయంగా నిర్వహించి అమెరికా పర్యటన ముగించుకొని, నేడు స్వదేశానికి తిరిగి వచ్చిన భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన టేకుమట్ల మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో టేకుమట్ల బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు సట్ల రవి గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, మాజీ ఎంపీటీసీలు ఆది రఘు, పింగిలి వెంకటేశ్వర్ల రెడ్డి మాజీ సర్పంచులు బిలకంటి ఉమేందర్రావు నల్లబెల్లి రవీందర్, ఉద్దమారి మహేష్ యాదవ్, దేవేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు

నూతన దంపతులను ఆశీర్వధించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

నూతన దంపతులను ఆశీర్వధించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర….
మొగుళ్ళపల్లి నేటి దాత్రి:

మొగుళ్ళపల్లి మండలం, పర్లపల్లి గ్రామ వాస్తవ్యులు, గండ్ర వీరాభిమాని బోయిని స్వామి గారి తమ్ముడు బోయినిరాములు – స్వరూప గార్ల కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్ని నూతన దంపతులను ఆశీర్వదించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి .

వారి వెంట మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య, చిట్యాల వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్, నాయకులు బెల్లంకొండ శ్యాంసుందర్ రెడ్డి, చెక్క శ్రీధర్ గ్రామ అధ్యక్షులు గడ్డం రాజు గౌడ్, రాజేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నేర్పాటి శ్రీనివాస్, యూత్ ఉపాధ్యక్షులు జన్ని రాజు, మాజీ కో ఆప్షన్ నెంబర్ రహీం, సీనియర్ నాయకులు గుండారపు రాజు, బండి కుమార్ స్వామి, తిమ్మాపురం ఆనంద్, ఆకినపల్లి చిరంజీవి, మరియు గండ్ర అభిమానులు పాల్గొన్నారు

బిఆర్ఎస్ నాయకున్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

బిఆర్ఎస్ నాయకున్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

చిట్యాల నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం రామ్ నగర్ కు చెందిన బిఆర్ఎస్ మండల నాయకులు ఆరెపల్లి సమ్మయ్యను హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మంగళవారం రోజు పరామర్శించి వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు , వారి వెంట బి ఆర్ఎస్ మండల అద్యక్షులు అల్లం రవీందర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరు రాజిరెడ్డి గారు మండల నాయకులు పాండ్రాల వీరస్వామి పెరుమాండ్ల రవీందర్ గౌడ్  ఉన్నారు.

ఈద్గ ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర.

ఈద్గ ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

 

భూపాలపల్లి నేటిధాత్రి

 

ముస్లిం సోదరులకు,వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.
ముస్లింల పవిత్రదినం రంజాన్ పండుగ సందర్బంగా భూపాలపల్లి బాంబులగడ్డలోని ఈద్గలో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రార్ధన కార్యక్రమంలో పాల్గొన్ని ముస్లిం సోదరీ సోదరులకు వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపి,మీ కష్ట నష్టాలల్లో, ముస్లిం మైనారిటీ ప్రజల అభ్యున్నతిలో బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సోదరులు పాల్గొన్నారు

మాజీ ఎమ్మెల్యే గండ్ర పై వ్యాఖ్యలు

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే గండ్ర పై వ్యాఖ్యలు బాధించాయి

కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భూపాలపల్లి హత్య కేసుపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామిరెడ్డి పై చేసిన వాక్యాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. మైలారం గ్రామం మాజీ సర్పంచ్ అరికెళ్ల ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి కేవలం కావాలని గండ్ర వెంకటరమణా రెడ్డి పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని బిఆర్ఎస్ పార్టీకి గండ్ర వెంకట రమణారెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక భూపాల్ పల్లిలో నిన్న జరిగిన రాజలింగ మూర్తి హత్య విషయంలో రాజకీయం చేసి కేవలం కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడిగడ్డ మ్యారేజ్ విషయంలో ఉన్న కోర్టు కేసులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పై అన వసరమైన ఆరోపణలు చేయ డం సరికాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఇలాంటి హత్య రాజకీయాలు మా ప్రభుత్వంలో గాని, గండ్ర రమణారెడ్డి ఇప్పటివరకు చేయలేదని హత్యా రాజకీ యాలు కాంగ్రెస్ పార్టీ నాయకు లకు కొత్తేమి కాదని ఇరువ ర్గాల మధ్య భూ వివాదంమే ప్రధాన కారణమని అందరూ చెపుతున్నారని,హత్య జరిగిందని దానిని బీఆర్ ఎస్ నాయకులకు రుద్దడం సిగ్గు చేటని ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు పద్ధతి మార్చుకొని ప్రజా పాలన చేయాలని హత్య రాజకీయాలు మీరు చేస్తారు మా నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి ప్రజలకు సేవ చేసే నాయకుడిగా కొనియాడారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపిటిసి గడిపే విజయ్ బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ యూత్ మండలాధ్యక్షుడు మారేపల్లి మోహన్ కరణ్ బాబు మస్కే భాస్కర్ బిఆర్ఎస్వి జిల్లా నాయకులు వెంకట్ ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version