కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి… తక్షణం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

మంగళవారం మహా ముత్తారం మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అపరిశుభ్రతగా ఉంటే పరిసరాల్లోకి విష జంతువులు వచ్చే అవకాశం ఉన్నందున, విద్యార్థుల భద్రతకు ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు.
అందువల్ల తక్షణమే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా పరిశుభ్రంగా మార్చాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. చేపట్టిన పారిశుద్ధ్య పనుల ఫోటోలను తనకు పంపించాలని సూచించారు. అదనంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచాలని సూచించారు.

ఈ సందర్భంగా పాఠశాలకు వెళ్లే రోడ్డు నిర్మాణం ఇంకా పూర్తికాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు మరియు విద్యుత్ పనులను వెంటనే ప్రారంభించి, బుధవారం నుండి పనులు వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంచినీటి సరఫరా విషయమై మిషన్ భగీరథ అధికారులు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

తనిఖీ అనంతరం
జిల్లా కలెక్టర్ 10వ తరగతి విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారితో స్నేహపూర్వకంగా మాట్లాడారు. హలో స్టూడెంట్స్… ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు ఎన్ని పరీక్షలు వ్రాసారు? ఎలా వ్రాసారు? ఇంకా ఎన్ని పరీక్షలు మిగిలి ఉన్నాయి?” అని అడిగి తెలుసు కున్నారు. మిగిలిన పరీక్షలను కూడా విజయవంతంగా పూర్తి చేయాలని, బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఈఓ రాజేందర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ ప్రకాష్, సర్పంచ్ బాబు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

పదవ తరగతి విద్యార్థిని,విద్యార్థులకు…

పదవ తరగతి విద్యార్థిని,విద్యార్థులకు
( గిఫ్ట్ ఏ స్మైల్ ) ఆధ్వర్యంలో,పెన్స్,ఎగ్జామ్స్ పాడ్స్ పంపిణి

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పెద్దూరులోని
కస్తూరిబ గురుకుల పాఠశాలలో మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు( గిఫ్ట్ ఏ స్మైల్) ఆధ్వర్యంలో పదో తరగతి రాయబోయి విద్యార్థినీ, విద్యార్థులకు ఎగ్జామ్స్ పాడ్స్ మరియు పెన్స్ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా 9వ వార్డ్ కౌన్సిలర్ దొంతులేని కళ్యాణి అశోకరావు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థిని విద్యార్థులు విజయవంతంగా పదో తరగతి పరీక్షలు రాసి, అత్యధిక మార్కులు సాధించి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు గౌరవప్రదంగా ఈ విజయాన్ని అందించాలని తెలిపారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ లింగంపల్లి భాగ్యలక్ష్మి సత్యనారాయణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేకాలి,ఎనిమిదో వాడు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విడుదల దేవయ్య,మాజీ సర్పంచ్ ఆదేపల్లి దేవ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం…

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం,

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రంజోల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ తెలిపిన వివరాల ప్రకారం, పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 20. పాలిసెట్ ప్రవేశ పరీక్ష మే 13న నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాల కోసం www.tspolycet.nic.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.

విద్యార్థులకు ప్రశ్నాపత్రాలను పంపిణీ చేసిన ఎంఐఎం కౌన్సిలర్ రఫీ…

విద్యార్థులకు ప్రశ్నాపత్రాలను పంపిణీ చేసిన ఎంఐఎం కౌన్సిలర్ రఫీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలోని ఒక స్థానిక అధికారి 10వ తరగతి ప్రాక్టీస్ ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు పంపిణీ చేసి, ఉజ్వల భవిష్యత్తును సాధించడానికి వారి చదువుపై దృష్టి పెట్టాలని ప్రోత్సహించారు.
బిలాల్‌పూర్ కోర్ట్ స్కూల్‌లో ఎంఐఎం కౌన్సిలర్ మహ్మద్ రఫీ ప్రాక్టీస్ పేపర్లను పంపిణీ చేశారు.
విద్యార్థులు రాబోయే పరీక్షలలో మంచి మార్కులు సాధించడంలో సహాయపడటం ఈ చొరవ లక్ష్యం. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసం చదువుపై దృష్టి పెట్టాలని కోరారు.

10వ తరగతి విద్యార్థులకు యూత్ కాంగ్రెస్ నాయకుడు స్నాక్స్ పంపిణీ

ఉత్తమ ఫలితాలు సాధించాలి : దాత యూత్ కాంగ్రెస్ నాయకులు నక్క సందీప్ గౌడ్

* 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్ పంపిణి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలని స్నాక్స్ దాత, యూత్ కాంగ్రెస్ నాయకులు నక్క సందీప్ గౌడ్ కోరారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శామీర్‌పేట్, దేవరయాంజాల్, బొమ్మరాసిపేట్ గ్రామాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా స్నాక్స్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాలేష్, వేణు లతో కలిసి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పరీక్షల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి, ఒత్తిడిని తగ్గించుకొని చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఆర్టీఏ సభ్యులు భీమిడి జైపాల్ రెడ్డి, పాఠశాల ఛైర్మన్ కట్ట మీనా కుమారి, శ్రీ సీతారామ స్వామి దేవస్థానం ఛైర్మన్ పేండం లక్ష్మినారాయణ, ధర్మకర్త ఎల్లెంకి భారతి, కట్ట మైసమ్మ దేవాలయం ఛైర్మన్ మేకల మహేందర్ యాదవ్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు యాష్కీ శంకర్ గౌడ్, విలాసాగర్ అశోక్, కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మేకల అంజనేయులు, పంబలి అశోక్, తాళ్ల శ్రీనివాస్ రెడ్డి, సోగడ బాల్ రాజు, ఇదిగాళ్ల యేసు దాసు, తలారి భరత్ కుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కత్తి రమేశ్, తదితర నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version