రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని వినతి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలం హుగ్గేల్లి గ్రామానికి వెళ్లే రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయని, వాటిని వెంటనే మరమ్మత్తులు చేయించాలని కోరుతూ పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు సురేష్, సోమవారం అదనపు కలెక్టర్ మాధురికి వినతి పత్రం సమర్పించారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. ఈ రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.