7వ డివిజన్‌లో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు..

7వ డివిజన్‌లో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు..

#ఎమ్మెల్యే నాయిని సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం..

హన్మకొండ, నేటిధాత్రి:

 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 7వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. బీజేపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. రానున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో 7వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఎల్పుల మల్లికార్జున్ (మల్లి), గోపగోని సాయి గౌడ్, వై శ్రీనివాస్, పుల్యాల వంశీ, కుందూరు ప్రశాంత్, ఉదయ్ గౌడ్, సర్వర్, తరుణ్, రాకేష్, భాను తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version