(ఈదుల్ ఫితర్) సమీపిస్తున్న తరుణంలో…

(ఈదుల్ ఫితర్) సమీపిస్తున్న తరుణంలో,ప్రధాన ఈద్గా వద్ద మున్సిపల్ యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ మహ్మద్ యూనుస్, స్థానిక కౌన్సిలర్లు మరియు సీనియర్ నాయకులతో కలిసి ఈద్గాను సందర్శించారు. పండుగ రోజున వేలాది మంది ముస్లిం సోదరులు ప్రార్థనల కోసం తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈద్గా ఆవరణలో ఉన్న సౌకర్యాలను చైర్మన్ స్వయంగా పరిశీలించి, పెండింగ్లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు.
నమాజ్ సమయానికి మంచినీరు, పారిశుధ్యం, విద్యుత్ సౌకర్యాలు నిరంతరాయంగా అందేలా చూడాలని సంబంధిత విభాగాలకు దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో మున్సిపల్ అధికారులతో పాటు ఈద్గా కమిటీ సభ్యులు ఉన్నారు. పండుగ ఏర్పాట్లలో కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని చైర్మన్ తెలిపారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, పట్టణంలోని ముస్లిం సోదరులందరూ ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలన్నదే తమ లక్ష్యమని, మున్సిపాలిటీ తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.

నూతన మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లును సన్మానించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు…

నూతన మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లును సన్మానించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు

◆-: డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ ఫిబ్రవరి23:పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారి నివాసంలో సోమవారం నూతనంగా ఎన్నికైన జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లుకు శాలువాతో సన్మానించి వారికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.వారు మాట్లాడుతూ జహీరాబాద్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యునూస్,వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి,కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి,జాఫర్,అరుణ్ కుమార్, జమిలుద్దిన్,జావిద్,జహంగీర్,అక్రం,నిజాం,అక్కాన్,ఖదీర్ మరియు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శుక్లవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,నర్సింహా యాదవ్,బర్కత్,ముస్తఫా మరియు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version