విద్యార్థిని ,విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేసిన అనుపురం పరశురామ్ గౌడ్..

విద్యార్థిని ,విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేసిన అనుపురం పరశురామ్ గౌడ్

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులు అందరికీ దాదాపు ఎనభై ఆరు మందికి పైగా విద్యార్థులందరికీ వచ్చే నెలలో జరగబోయే పదవ తరగతి పరీక్షల దృష్ట్యా యువజన కాంగ్రెస్ రామడుగు మండల అధ్యక్షులు అనుపురం పరశురామ్ గౌడ్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో శ్రీకొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం డైరెక్టర్, పదవ వార్డు సభ్యులు మామిడి దిలీప్ కుమార్, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా రామడుగు మండల కోఆర్డినేటర్ బాసరవేని అజయ్, రామడుగు పద్నాలుగవ వార్డు సభ్యులు సిరికొండ సాయితేజ, రామడుగు యువకులు ఎడవెల్లి శ్రీనివాస్, వెంకటేష్, రాంప్రసాద్, భరత్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్, ఉపాద్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం అనుపురం పరశురాం గౌడ్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు తొలి మెట్టు. రాబోవు పదవ తరగతి పరీక్షలు విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకొని పరీక్షలు మంచిగా వ్రాసి మంచి ర్యాంక్ లు సాధించి మీతల్లితండ్రులకు, పాఠశాలకి మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని, విద్యార్థులు మంచి భవిష్యత్తును సాధించాలని కోరారు. మోడల్ స్కూల్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించి ఏటువంటి ఇబ్బందులు ఉన్న అన్నివిధాల నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని మాట ఇచ్చారు.

నిత్యం సాధన చేయాలి.. విజయం సాధించాలి..

నిత్యం సాధన చేయాలి.. విజయం సాధించాలి

టైమ్ టేబుల్ ప్రకారం చదవాలి

రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

ఎస్సీ సంక్షేమ శాఖ హాస్టళ్లలో10 వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల ప్రేరణ, అవగాహన తరగతులు ప్రారంభం

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు అన్ని సబ్జెక్టులపై నిత్యం సాధన చేయాలని.. విజయం సాధించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. ఎస్సీ సంక్షేమ శాఖ ఆద్వర్యంలో ఎస్సీ సంక్షేమ శాఖ హాస్టళ్లలోని పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలకు ప్రేరణ, అవగాహన తరగతుల కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్ లోని ఎస్సీ సంక్షేమ హాస్టల్ లో సోమవారం ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు.

అనంతరం విద్యార్థులతో ఇంచార్జి కలెక్టర్ మాట్లాడారు. ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమని స్పష్టం చేశారు. ఇప్పుడు వచ్చిన మార్కులు భవిష్యత్తు చదువులకు ఎంతో ఉపయోగపడుతాయని వివరించారు. మూడు విషయాలపై విద్యార్థులు దృష్టి సారించాలని సూచించారు. అన్ని పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని, ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలో ముందే రాసుకోవాలని, దానికి అనుగుణంగా అన్ని సబ్జెక్టులు చదవడం, రాయడం పూర్తి చేయాలని తెలిపారు. గత ప్రశ్నాపత్రాలు కూడా సాధన చేయాలని పేర్కొన్నారు. ప్రతి రోజూ స్టడీ హవర్ తో పాటుగా సెల్ఫ్ స్టడీ రోజు 3 నుంచి 4 గంటలపాటు చేయాలని సూచించారు. రైటింగ్ కూడా సాధన చేయాలని, వార్షిక పరీక్షల సమయానికి అనుగుణంగా ఇప్పుడు అదే సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేలా సాధన చేయాలని పేర్కొన్నారు. ఇప్పటి మార్కులు మీరు తర్వాత చదివే ఉన్నత తరగతులకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థులందరూ రానున్న పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఏ నేపథ్యం నుంచి వచ్చినా.. ఇప్పుడు ఇష్టపడి సాధన చేయడం.. అన్ని సబ్జెక్టుల్లో రాణించడంతో వారికి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి వివిధ ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని, ఉన్నత స్థానాల్లో నిలవాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, తహసీల్దార్ మహేష్ కుమార్, ఏఎస్ డబ్ల్యూఓ విజయలక్ష్మి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 21న 10వ తరగతి పరీక్షలు ప్రారంభం..

ఈనెల 21న 10వ తరగతి పరీక్షలు ప్రారంభం

విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలి

జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత సంవత్సరంలో పదో తరగతిలో వచ్చిన ఫలితాలు కంటే మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా జిల్లాలో ఉన్న విద్యా సంబంధిత అధికారులు ఉపాధ్యాయులు అందరము కృషి చేస్తున్నాము. ఈనెల 21వ తేదీ నుండి పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతున్న తరుణంలో విద్యార్థులు ఒత్తిడి లేకుండా ఈ పరీక్షలకు ఎలా సంసిద్ధులు కావాలో, దీనికి జిల్లా విద్యాశాఖ ఏ చర్యలు చేపడుతున్నారు అన్న విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్ద మల్ల రాజేందర్ అన్నారు ఈ సందర్భంగా పత్రిక సమావేశంలో మాట్లాడుతూ నవంబర్ మొదటివారం నుండి ఉదయం సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 3449 మంది విద్యార్థిని విద్యార్థులు ఇందులో1724- బాలికలు మరియు1725- బాలురు పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరు కాబోతున్నారు. వీరి కోసం జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మంచి ప్రణాళికను ఏర్పాటు చేసుకొని దానిని అమలుపరచినట్లయితే మంచి ఫలితాలను మనం పొందవచ్చు అనే నినాదంతో మనం ముందుకు వెళ్లడం జరుగుతుంది. జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ సమక్షంలో 10వ తరగతి పరీక్షలు మార్చి 2025 పై సమీక్ష సమావేశం చీఫ్ సూపర్డెంట్ డిపార్ట్మెంటల్ అధికారులకు వార్షిక పరీక్షలకు సంబంధించిన అన్ని విభాగాలతో పరీక్ష నిర్వహణ కొరకు సమావేశమును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జిల్లాలో ఉత్తీర్ణత శాతము పెంచడం కోసం విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకొని వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులకు పరీక్ష భయాన్ని తొలగించుటకు మోడల్ ఫ్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించడం జరిగింది. గతంలో మాదిరిగా ఈ ఏడాది కూడా విద్యార్థులకు స్నాక్స్ ప్రత్యేక తరగతి సమయంలో అందించబడుతుంది. ఒంటి పూట బడి సమయంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు అభ్యసన దీపికలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చేస్తున్నాం. విద్యార్థులు ఉదయం లేచి చదువుకునేలా సంబంధిత ఉపాధ్యాయుల చే వేకప్ కాల్స్ చేపిస్తున్నాం. పర్యవేక్షణ అధికారులతో జిల్లాలోని అన్ని పాఠశాలలో విద్యార్థుల ప్రగతిని అంచనా వేసి తగు సూచనలను ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందించడం జరుగుతుంది. సమిష్టి కృషితో సత్ఫలితాలను సాధించే దిశగా పనిచేస్తున్నాం. ఇంటి వద్ద పిల్లలను వారి తల్లిదండ్రులు చదివించే విధంగా వారిని చైతన్య పరుస్తున్నాం. గణితం, భౌతిక రసాయన శాస్త్రం ఇంగ్లీష్ వంటి కఠిన సబ్జెక్టులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు పరీక్ష భయాన్ని వీడడం కోసం గత మాదిరి ప్రశ్న పత్రాలను అభ్యాసం చేపిస్తున్నాం. పట చిత్రాల గీయడం, మ్యాప్ పాయింటింగ్ వంటి అంశాలపై విద్యార్థులను దృష్టి కేంద్రీకరించేలా చేపిస్తున్నాం. విద్యార్థులు ఎట్టి పరిస్థితులలో అనవసరమైన ఒత్తిడికి గురికాకూడదు. పరీక్షల సమయంలో ఆహారము, నిద్ర, వ్యాయామానికి తగిన ప్రాధాన్యతనిస్తుండాలి. ప్రతిరోజు ఒకే సమయానికి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. నిద్రకు ఖచ్చితంగా 7 నుండి 8 గంటల సమయం కేటాయించాలి. ఒక గంట సమయం చదివిన తర్వాత మెదడుకు ఐదు నిమిషాల విరామం ఇవ్వడం ద్వారా తిరిగి ఉత్సాహంతో చదవగలుగుతారు. టీవీ, మొబైల్స్, సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉండాలి. పరీక్ష అంటే జీవితానికి అగ్నిపరీక్ష కాదు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని నిరుత్సాహపడకుండా మన ప్రయత్నాన్ని కొనసాగించాలి. పరీక్షలను బాధ్యతతో రాయాలి కానీ భయంతో కాదు కావున జిల్లాలోని పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు మంచి ప్రణాళికతో మంచి ఫలితాన్ని సాధిస్తారని ఆశిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి జయశంకర్ భూపాలపల్లి

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version