ఆడపిల్ల చదువు అందరికీ వెలుగు-జ్యోతిబాపూలే ప్రిన్సిపల్ ప్రిసిల్ల
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: ఆడపిల్లల చదువు ప్రతి ఇంటికి,
దేశానికి వెలుగునిస్తుందని, బాల్య వివాహాలు చేయకుండా బాలికలను ఉన్నత చదువులు చదివించాలని సంగారెడ్డి జిల్లా కోహీర్(ఝరాసంగం) మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల కళాశాల ప్రధానోపాధ్యాయులు ప్రిసిల్ల అన్నారు.శనివారం పాఠశాల, కళాశాలలో అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఇంట్లో ఆడపిల్లను చదివించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలికలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె అన్నారు. బాలికల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
