కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన కేజీవీబీ టీచర్స్..

కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన కేజీవీబీ టీచర్స్

భూపాలపల్లి నేటిధాత్రి

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబివి) టీచర్స్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబివి) పథకం 2004లో భారత ప్రభుత్వంచే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసి మైనార్టీ వర్గాలకు చెందిన వెనుకబడిన ప్రాంతాల బాలికలకు 6 నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన నివాస విద్యను అందించడానికి ప్రారంభించబడింది. అది సమగ్ర శిక్షా అభియాన్ లో భాగంగా కొనసాగుతూ బాలికల అక్షరాస్యతా పెంపునకు దోహదపడాలి. కానీ, ఆచరణలో నేడు కేజీబివిలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థినుల నుండి మొదలు, అందులో పని చేసే అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది వరకు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. పేరుకే అవి నాణ్యమైన విద్యనందించే నిలయాలు అని చెప్తున్నప్పటికీ అందులో పని చేసే సిబ్బందికి అవి పెట్టి చాకిరి నిలయాలుగా మారాయి. 2004 నుండి ప్రారంభమైన ఈ పాఠశాలల్లో ‘సమాన పనికి సమాన వేతనం” అమలు చేయకుండా అతి తక్కువ వేతనంతో ఎక్కువ శ్రమను రక్షణ లేకుండా చేయిస్తున్నారు. కేజీబివిలలో పని చేసే టీచర్లు అందరు మహిళ టీచర్లే, కానీ, రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోని పంచాయితీరాజ్ టీచర్లతో పోల్చినపుడు అన్ని విషయాలలో చాలా వ్యత్యాసం కనబడుతుంది. కేజీబివిలలో పని చేస్తున్న మహిళా టీచర్ల వేతనాలు SOల నెల వేతనం రూ.32,500.00, పేజీసిఆర్టీలకు రూ.29,700.00, సిఆర్జీలకు 26,000.00 వేతనాలు చెల్లిస్తున్నారు. అదే విధంగా సెలవులు కూడా మహిళా టీచర్లకు సాధారణ సెలవులు అకాడమిక్ సంవత్సరానికి 20 మాత్రమే ఇస్తున్నారు. రెగ్యులర్ మహిళా టీచర్లకు 27 ఇస్తున్నారు. ఇంత తేడా ఎందుకు? అనే దానికి సమాధానం లేదు. ఈ 20 సాధారణ సెలవులు కూడా ప్రతి నెల 2 మాత్రమే వాడుకోవాలి. వాడుకోకపోతే ఆ రెండు సెలవులు కోల్పోవాల్సిందే. రెగ్యులర్ టీచర్లు మాత్రము సంవత్సరంలో అవసరం ఉన్నప్పుడు వాడుకొనే అవకాశం కల్పించారు. కేజీబివి టీచర్లకు శిశు సంరక్షణ సెలవులు లేవు. అర కొర వేతనంతో పని చేస్తున్నందుకు, కనీసం వైద్య సదుపాయం కూడా కల్పించడం లేదు. పంచాయితీరాజ్ పాఠశాలలకు కల్పించే 5 ఐచ్చిక సెలవులు, 3 స్థానిక సెలవులు గాని కేజీబివి పాఠశాలలకు లేవు. ప్రతి కేజీబివి రెసిడెన్సిల్ పాఠశాలగా నడుస్తుంది. కాని అందులో హాస్టల్ వార్డెన్ నియమాకం లేదు. అదే విధంగా కేర్ టేకర్ పోస్టు నియమాకం లేదు. ఈ బాధ్యతలన్నీ అందులోనే SO లతో పాటు ఆ టీచర్లే బాధ్యత తీసుకోవాలి. ప్రతి రోజు ఒక టీచర్ నైట్ డ్యూటీ చేయాలి. అ టీచరే మరుసటి రోజు మధ్యాహ్నం’ వరకు ఉండి రిలీవ్ కావాలి. ఈ పాఠశాలలో పని చేస్తున్న ఉద్యోగి ప్రమాదవశాత్తూ మరణిస్తే కనీస ఆర్థిక సహాయం లేదు. ప్రమాద బీమా లేదు. వారు అన్నారు ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి
తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి
సుదర్శన్ రాష్ట్ర కోఆర్డినేషన్ వీరేశం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ కేజీబీపీ టీచర్స్ చైతన్య రాధిక సులోచన జ్యోతి రాణి స్రవంతి కవిత సుధా రవళి రజిత తదితరులు పాల్గొన్నారు

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలి…

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం. కేజీబీవీ. ను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్. ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మేడం. విద్యాలయంలో ఆరుబయట విద్యార్థులతో కూర్చొని పలు అంశాలపై చర్చించారు. ముందుగా స్టోర్ రూమ్ను సందర్శించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలని. కోడిగుడ్లు. కూరగాయలు పరిశీలించారు . ఈ సందర్భంగా విద్యార్థుల్లో పాటు కింద కూర్చొని మెనూ ప్రకారం చికెన్ మటన్ కోడిగుడ్డు ఇస్తున్నారా అని ఆరా తీశారు పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని వివరిస్తూ పర్యావరణ భవిష్యత్తు ప్రణాళికల అంశాలపై చర్చించారు. తద్వారా పాఠశాల విద్యాలయం ఆవరణలో 9వ తరగతి విద్యార్థులకు బయో సైన్స్ లోని. ఫోటో సింథసిస్. పై వివరించారు విద్యార్థులందరూ చదువుపై శ్రద్ధ పెట్టాలని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు తాము అనుకున్న ఉద్యోగాలు ఉన్నత స్థానాలకు ఎదగాలని ఈ సందర్భంగా విద్యార్థులందరికీ పిలుపునిచ్చారు ఆర్థికంగా కూడా స్థిరపడాలని ఆకాంక్షించారు. అలాగే తల్లిదండ్రులు మీ భవిష్యత్తు పై పెట్టుకున్న ఆశలు నెరవేర్చాలని. విద్యాలయం ఆవరణం నిత్యం పరిశుభ్రంగా ఉండాలని ఏవైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తద్వారా డి ఈ ఓ.ను. ఇన్చార్జి కలెక్టర్. గరీమాఅగ్రవాల్. ఆదేశించారు ఇట్టి కార్యక్రమంలో. కేజీబీవీ. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

కోరికిశాల కస్తూర్బా పాఠశాలను సందర్శించిన…

కోరికిశాల కస్తూర్బా పాఠశాలను సందర్శించిన ఏఐఎస్ఎఫ్ బృందం

ఎస్ఓ ను తక్షణమే సస్పెండ్ చేయాలి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోత్కు ప్రవీణ్ కుమార్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగులపల్లి మండల కేంద్రంలోని కొరికిశాల కస్తూర్బా పాఠశాలను ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్తుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఎస్ఓ, వర్కర్ల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థకు గురై ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు.
గతంలో విద్యార్థులు పలుసార్లు భోజనం బాగాలేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని ఎస్ఓ దృష్టికి తీసుకువచ్చిన ఏం మాత్రం పట్టించుకోకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని తెలిపారు మరలా ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తక్షణమే బాధ్యత వహించి అన్ని కస్తూర్బా పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టలను ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు పర్యటించాలని కోరారు.
కస్తూర్బా పాఠశాల విద్యార్థులను అడిగి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది అని అన్నారు. వారి సమస్యలపై పోరాటాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్, జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల ప్రవీణ్ దొంతర బోయిన అజయ్ రాజేష్ పవన్ రత్న రమాకాంత్ కన్నురి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version