కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి… తక్షణం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

మంగళవారం మహా ముత్తారం మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అపరిశుభ్రతగా ఉంటే పరిసరాల్లోకి విష జంతువులు వచ్చే అవకాశం ఉన్నందున, విద్యార్థుల భద్రతకు ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు.
అందువల్ల తక్షణమే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా పరిశుభ్రంగా మార్చాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. చేపట్టిన పారిశుద్ధ్య పనుల ఫోటోలను తనకు పంపించాలని సూచించారు. అదనంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచాలని సూచించారు.

ఈ సందర్భంగా పాఠశాలకు వెళ్లే రోడ్డు నిర్మాణం ఇంకా పూర్తికాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు మరియు విద్యుత్ పనులను వెంటనే ప్రారంభించి, బుధవారం నుండి పనులు వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంచినీటి సరఫరా విషయమై మిషన్ భగీరథ అధికారులు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

తనిఖీ అనంతరం
జిల్లా కలెక్టర్ 10వ తరగతి విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారితో స్నేహపూర్వకంగా మాట్లాడారు. హలో స్టూడెంట్స్… ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు ఎన్ని పరీక్షలు వ్రాసారు? ఎలా వ్రాసారు? ఇంకా ఎన్ని పరీక్షలు మిగిలి ఉన్నాయి?” అని అడిగి తెలుసు కున్నారు. మిగిలిన పరీక్షలను కూడా విజయవంతంగా పూర్తి చేయాలని, బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఈఓ రాజేందర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ ప్రకాష్, సర్పంచ్ బాబు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

సిఎస్ఐ పాఠశాల అభివృద్ధి కోసం ఆడహాక్ కమిటీ ఎన్నిక…

సిఎస్ఐ పాఠశాల అభివృద్ధి కోసం ఆడహాక్ కమిటీ ఎన్నిక

పూర్వ విద్యార్థుల కృషిని అభినందించిన పాఠశాల కరస్పాండెంట్ రమాజ్యోతి

పరకాల,నేటిధాత్రి

చదువుకున్న పాఠశాలను కాపాడుకోవడం కోసం పూర్వ విద్యార్థులంతా ముందుకు రావడం చాలా గర్వంగా ఉందని సీఎస్ఐ మిషన్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ రమా జ్యోతి అన్నారు.సీఎస్ఐ మిషన్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం సిఎస్ఐ మిషన్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ రమాజ్యోతి అధ్యక్షతన సోమవారం పూర్వ విద్యార్థులు సమావేశం కావడం జరిగింది.ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం సిఎస్ఐ కరీంనగర్ అధ్యక్ష మండల మేనేజ్మెంట్ కు లోబడి పాఠశాల అభివృద్ధి కార్యచరణ రూపొందించడం కోసం పూర్వ విద్యార్థుల నుంచి తాత్కలిక అడహక్ కమిటీని వేయడం జరిగింది. అడ హక్ కమిటీ చైర్మన్ గా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎబ్బి,ముఖ్య సలహాదారులుగా కే.జే థామస్,జేమ్స్,సిఎస్ఐ కరీంనగర్ అధ్యక్ష మండల మేనేజ్మెంట్కు ఎక్స్ అఫీషి యో ( ప్రత్యేక హోదా )గా పరిగణంలోకి తీసుకుంటూ ఆడహాక్ కమిటీ కన్వీనర్ గా ఒంటేరు ప్రభాకర్,కోకన్వీనర్ గాకాజీపేట రవీందర్,సెక్రటరీగా చొల్లేటి సునేందర్,కోశాధికారిగా బి.అశోక్, సలహాదారుడుగా ఒంటేరు చక్రి,కన్స్ట్రక్షన్స్ కన్వీనర్స్ గా బొచ్చు కళ్యాణ్, పాలకుర్తి తిరుపతిలను ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ ఒంటేరు ప్రభాకర్ మాట్లాడుతూ 1948 సంవత్సరంలో స్థాపించి 77 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు విద్యా ద్వారా తోడ్పాటు అందించిన సీఎస్ఐ మిషన్ ఉన్నత పాఠశాల పూర్వవైభవమే పూర్వ విద్యార్థులు కృషి చేయాలని ఐక్యతగా స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది అన్నారు.2026 -27 విద్యా సంవత్సరంలోపు సి ఎస్ ఐ మిషన్ ఉన్నత పాఠశాల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా కార్యచరణ రూపొందించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. పాఠశాల అభివృద్ధికి నిధుల సేకరణ జరగాలంటే ప్రతి ఎస్ఎస్సి బ్యాచ్ వారందరినీ వాట్సప్ గ్రూపులో యాడ్ చేస్తూ కమిటీ తీసుకున్న నిర్ణయాలను పనులను తెలియజేస్తూ నిధులను సేకరించడం జరుగుతుందన్నారు.ఆయా నిధులను బ్యాంకు అకౌంట్ తీసి అందులో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి సిఎస్ఐ పూర్వ విద్యార్థులు ఎక్కడ ఉన్నా ఎంతటి హోదాలో ఉన్న పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా
వచ్చే నెల డిసెంబర్ 7న 11 గంటలకు అడహక్ కమిటీ సమావేశమై పాఠశాల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులపై కార్యచరణ రూపొందించడం జరుగుతుందన్నారు.ఈ సమావేశంలో పాఠశాల పూర్వ విద్యార్థులు ఒంటేరు చంద్రశేకర్,బొచ్చు అనంతరావు,ఒంటేరు మధు, బొచ్చు శ్రీనివాస్,పాస్టర్ బొచ్చు ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version