ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్ ప్రారంభం…

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్ ప్రారంభం

రూ.50 వేల పుస్తకాలు అందజేసిన డాక్టర్ మాలోతు రవీందర్

నర్సంపేట,నేటిధాత్రి:

 

ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), నర్సంపేటలో విద్యార్థుల భవిష్యత్ పోటీ పరీక్షల సన్నద్ధతకు తోడ్పడే ఉద్దేశంతో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సుశ్రుత ఫౌండేషన్ అధ్యక్షులు, మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మాలోతు రవీందర్ చౌకీదార్ కళాశాలకు రూ.50 వేల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను అందజేశారు.
కళాశాల వైస్ ప్రిన్సిపల్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ బైరి సత్యనారాయణ అధ్యక్షతన, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. సోమయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మాలోతు రవీందర్ చౌకీదార్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్, రైల్వే, గ్రూప్స్, సివిల్స్, ఎస్ఎస్సీ, పోలీస్ తదితర పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే సమయపాలన, క్రమశిక్షణ, సరైన పాఠ్య ప్రణాళిక, నిరంతర సాధన అవసరమని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సరైన మార్గదర్శకత్వం, వనరులు లభిస్తే ఉన్నత స్థానాలను సాధించగలరని పేర్కొన్నారు. విద్యార్థులు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే విజయాన్ని సాధించగలరని, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుల్లో ముందుండాలని పిలుపునిచ్చారు.
వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బైరి సత్యనారాయణ మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో రాణించేందుకు నాణ్యమైన పుస్తకాలు, సరైన మార్గదర్శకత్వం అవసరమని, ఈ సెల్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. సోమయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో పోటీ పరీక్షలపై అవగాహన పెంపొందించడం, ప్రారంభ దశ నుంచే సిద్ధం చేయడం, సరైన మార్గనిర్దేశం చేయడం ఈ సెల్ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ సత్యనారాయణ కందాల, స్టాఫ్ సెక్రటరీ ఎం.ఎం.కె. రహీముద్దీన్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్. కమలాకర్, డాక్టర్ బద్రు భూక్య, డాక్టర్ రాంబాబు, డాక్టర్. రాజీరు రుద్రాణి, గ్రంథాలయ పాలకులు గణేష్ తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ వర్క్ షాప్ నిర్వహించడం అభినందనీయం…

అంతర్జాతీయ వర్క్ షాప్ నిర్వహించడం అభినందనీయం

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

అంతర్జాతీయ కార్యాశాల పోస్టర్ ఆవిష్కరణ

నర్సంపేట,నేటిధాత్రి:

 

గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో అంతర్జాతీయ స్థాయిలో వర్క్ షాప్ ను నిర్వహించడం అభినందనీయమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్, రాజమండ్రి కందుకూరి వీరేశలింగం తియాటిక్ కళాశాల, సంయుక్తంగా ఈడుమెంట్ యు ఎడ్యుకేషనల్ ప్రో. వెంకట్స్ .టైమ్ అనే సంస్థల సౌజన్యంతో ఇంటర్నేషనల్ ఇంటెన్సీస్ థీసిస్ రైటింగ్ వర్క్ షాప్ అనే అంశంపై 15 రోజుల అంతర్జాతీయ కార్యాశాలను ఆన్లైన్ విధానంలో కొనసాగించే వర్క్ షాప్ పోస్టర్ ను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నందుకు గాను చీఫ్ పాట్రన్ ప్రొఫెసర్ మల్లం నవీన్, కన్వీనర్ ఎంఎంకే రహీముద్దీన్ ఎమ్మెల్యే అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా 100 శాతం అడ్మిషన్లు సాధించినందుకు గాను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తీసుకున్న చొరవ,ప్రణాళికలను మరింత పెంపొందించాలన్నారు. కళాశాలకు అవసరమైన అభివృద్ధిలో ముందుండి నడుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నవీన్ తో పాటు, అధ్యాపకులు ఎం ఎం కె రహీముద్దీన్,డాక్టర్ కందాల సత్యనారాయణ, ఎస్ కమలాకర్,
డాక్టర్ రాంబాబు,డాక్టర్ సోమయ్య,
ఎస్ రజిత పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version