వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన విజ్డం హై స్కూల్ విద్యార్థులు.

వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన విజ్డం హై స్కూల్ విద్యార్థులు

రాయికల్: జూలై 19: నేటి ధాత్రి:

పట్టణం లోని విజ్డం హై స్కూల్ విద్యార్థులు మూడవ శనివారం నో బ్యాగ్ డే స్పెషల్ ప్రోగ్రాం లో భాగంగా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. రైతులతో కలిసి వరి నాటు వేసే విధానాన్ని అడిగి తెలుసుకొని, రైతులతో పాటు నాటు వేశారు, పాఠశాల కరస్పాండెంట్ ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి పిల్లలతో పాటు పొలంలో దిగి నాటు వేసి, చిన్ననాటి జ్ఞాపకాలను, రైతుల యొక్క కష్టాన్ని, రైతు విలువను విద్యార్థులకు తెలియజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు పది వేళ్ళు మట్టిలోకి వెళ్తేనే, మనకు అయిదు వేళ్ళు నోటిలోకి వెళ్తాయని,వరి పంట చేతికి రావాలంటే 120 రోజుల శ్రమ, కష్టం ఉంటుందని, వాటిని గుర్తుంచుకుని ఆహారాన్ని వృధా చేయకుండా, తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోకుండా బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించి, పాఠశాలకు, తల్లిదండ్రులకు తద్వారా దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల డైరెక్టర్ నివేదిత రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ..

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ

నల్లబెల్లి, నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-51.wav?_=1

మండలంలోని పంతులుపల్లి ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు, వాసవి క్లబ్ వరంగల్ సెంట్రల్ వారి సౌజన్యంతో ఉచితంగా నోటు బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణకంటి రాంమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ఏఏపిసి చైర్మన్ ఎరుకుల వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ్ గోనె శ్రీదేవి, మాజీ ఎంపిటిసి ఏడాకుల రవిందర్, మామిండ్లవీరయ్యపల్లి మాజీ సర్పంచ్ ఆసం చంద్రమౌళి అతిధులుగా హాజరై విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలోని తమ పాఠశాల విద్యార్థులకు నోటు బుక్స్ పంపించిన వాసవి క్లబ్ వరంగల్ సెంట్రల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో పాఠశాల సహోపాధ్యాయులు కూనమల్ల రాజన్ బాబు ,విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులకు విద్య సామాగ్రి పంపిణీ..

విద్యార్థులకు విద్య సామాగ్రి పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం /జహీరాబాద్:గ్రామీణ ప్రాంతాలలోని పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని యువ నాయకులు ధన్ రాజ్ అన్నారు. ధన్ రాజ్ పుట్టినరోజు రోజు సందర్బంగా,గురువారం క్రిష్ణ పూర్ గ్రామం లో విద్యార్థుల కు పెన్ను లు పెన్సిల్ తో పాటు విద్య సామాగ్రి ని అందజేశారు. ఈ సందర్బంగా విద్యకు ప్రాధాన్యతనిస్తూ..విద్యార్థులకు అవసరమైన వనరులను అందించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు చదువులో రాణించేందుకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సురేష్ నాగమణి మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో.

విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలి.

విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలి
-విద్యార్థులకు బ్యాగ్స్,పుస్తకాలు,ఆట వస్తువులు పంపిణీ
-ఆధార్ స్వచ్ఛంద సంస్థ అభినందనీయం
-కరకగూడెం ఎస్సై పివిఎన్ రావు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-15.wav?_=2

విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు ఉజ్వల భవిష్యత్తు అందించాలని కరకగూడెం ఎస్సై పివిఎన్ రావు అన్నారు.
గురువారం ‘గూంజ్ సంస్థ సహకారంతో ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు’తోలెం రమేష్ ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలోని గొల్లగూడెం,కొత్తగూడెం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు బ్యాగ్స్,నోటు పుస్తకాలు,ఆట వస్తువులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్సై పివిఎన్ రావు మాట్లాడుతూ…. ప్రభుత్వ పాఠశాలలో అనుభవిజ్ఞాన ఉపాధ్యాయులు అభ్యసించడం వలన విద్యార్థులు ప్రతి రంగంలో ముందుంటున్నారు.విద్యార్థులు మంచి మార్గంలో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.సమాజ సేవలో ఎనలేని సంతృప్తి దాగివుంటుందని ప్రతీ ఒక్కరూ భాగ్యస్వాములు కావాలని పేర్కొన్నారు.విద్యార్థుల కోసం ఆధార్ స్వచ్ఛంద సంస్థ చేసిన సేవ అభినందనీయమని ప్రసంసించారు.ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు ఎస్సై గారు సంస్థ నిర్వహకులు రమేష్ ను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటర్లు విజయ్,సురేష్,ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వరావు,రాధ,శ్రీను,సంస్థ సభ్యులు బట్ట బిక్షపతి,గుడ్ల రంజిత్,ఇర్ప కుశేలుడు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

వనమహోత్సవంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కల నాటింపు.

వనమహోత్సవంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కల నాటింపు.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-14.wav?_=3

నాగర్ కర్నూల్ జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి వనమహోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మన ప్రియతమ నాయకుడు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కల్వకుర్తి రోడ్డులో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పునాదులు వేశారు.
అంతేకాకుండా, మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం సమీపంలో నూతనంగా మంజూరైన డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి అభివృద్ధి పథంలో మరో అడుగు వేసారు.పర్యావరణ పరిరక్షణతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తోన్న ప్రజాప్రతినిధికి అభినందనలు.ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ ఛైర్మెన్ రమణ రావు , మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ జంగయ్య ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్ , మాజీ ఎంపీపీ బండా పర్వతాలు ,తెల్కపల్లి మండల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎఫ్ఎల్ఎన్ ద్వారా విద్యార్థులకు బోధించాలి.

ఎఫ్ఎల్ఎన్ ద్వారా విద్యార్థులకు బోధించాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

FLN ద్వారా విద్యార్థులకు బోధించాలని మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిర్ మండలంలోని కొత్తూరు ప్రాథమిక పాఠశాలను బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆటపాటల ద్వారా భోజనం చేయాలని చెప్పారు. మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం నాణ్యతగా వండించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్

సిరిసిల్ల పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంలో 10వ తరగతి పిల్లలకు సైకిల్ పంపిణీ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంలో 10వ తరగతి పిల్లలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ మహేష్ బి గీతే, ఎమ్మెల్సీ అంజి రెడ్డిలతో కలిసి సైకిళ్ళు పంపిణీ చేశారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ మాట్లాడుతూ విద్యా, వైద్యం రూపంలో రాజకీయాల కతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మోడీ గిఫ్ట్ పేరిట 10వ తరగతి చదివే బాల బాలికలకు ఉచితంగా సైకిల్ అందిస్తున్నామని అన్నారు.
విద్యార్థులకు మొదటి ఆస్తి సైకిల్ అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని సైకిల్స్ అందించామని అన్నారు.నాణ్యమైన సైకిల్ అందిస్తున్నామని, వీటిని వినియోగించి విద్యార్థులు సకాలంలో తరగతి గదులకు హాజరు కావాలని పేర్కొన్నారు.

Bandi Sanjay

రాబోయే సంవత్సరాలలో కూడా 10వ తరగతి చదివే విద్యార్థులకు మోడీ గిఫ్ట్ కింద సైకిల్స్ అందిస్తామని అన్నారు. ఎల్.కే.జి నుంచి 6వ తరగతి చదివే విద్యార్థులకు మోడి కిట్స్ పేరిట బ్యాగ్, నోట్ బుక్స్, ఇతర సామాగ్రి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, పెద్ద పెద్ద కంపెనీలు వివిధ పనులపై వచ్చినప్పుడు వారితో చర్చించి సీ.ఎస్.ఆర్. నిధుల ద్వారా ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
చిన్నతనంలో గంటకు 15 పైసలు, 40 పైసలు కిరాయి తెచ్చుకొని సైకిల్ నడిపేవారిమని కేంద్రమంత్రి గుర్తు చేసుకున్నారు. సైకిల్స్ వినియోగించుకొని విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని అన్నారు. చిన్నతనం నుంచి అనేక ఇబ్బందులు గురైనప్పటికీ బాబా సాహెబ్ అంబేద్కర్ బాగా చదువుకొని దేశానికి రాజ్యాంగం రచ్చించే స్థాయికి ఎదగారని అన్నారు.
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ నిబద్ధతతో పని చేస్తున్నారని అన్నారు. యూ.పి. రాష్ట్రానికి చెందిన కలెక్టర్, మహా రాష్ట్ర కు చెందిన ఎస్పీ క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళికతో కృషి చేయడం వల్ల గొప్ప స్థాయికి ఎదిగామని అన్నారు. విద్యార్థులు ఉదయం సమయంలో చదువుకోవాలని, మన తల్లిదండ్రుల కష్టాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలని కేంద్ర మంత్రి తెలిపారు.

Bandi Sanjay

విద్యార్థులు పట్టదలతో పని చేస్తుందని, 2014 కంటే ముందు విద్య కోసం 68 వేలకోట్లు కేటాయిస్తే, మోడీ ప్రభుత్వం ప్రస్తుతం 1,25,000 కోట్లు ఖర్చు చేస్తుందని, ఏకలవ్య పాఠశాలలు నవోదయ పాఠశాలలు సైనిక్ స్కూల్స్ క్రమశిక్షణకు మారుపేరుగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని అన్నారు. రోడ్డుపై సైకిల్ నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని , ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, 20 రోజుల తర్వాత సర్వీసింగ్ చేసుకోవాలని తెలిపారు.
ఎమ్మెల్సీ అంజి రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వర్యులు సైకిల్స్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. చిన్నతనంలో సర్వ శిక్షా అభియాన్ లో చదువుకునే రోజుల్లో తాను పడిన ఇబ్బందులు విద్యార్దులకు ఉండవద్దని బహుమతిగా సైకిల్స్ అందిస్తున్నామని పేర్కొన్నారు.విద్యార్థులు బాగా చదువుకోవాలని, మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్సీ తెలిపారు. మోడీ గిఫ్ట్ పేరిట అందిన సైకిల్స్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, రోడ్డు పై జాగ్రత్తగా నడపాలని అన్నారు. ఎస్.ఆర్. ట్రస్ట్ తరపున విద్యార్థులకు 10వ తరగతి తర్వాత ఎటువంటి కెరియర్ ఆప్షన్స్ ఉంటాయో తెలుసుకునేందుకు వీలుగా పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు.

Bandi Sanjay

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సిరిసిల్ల జిల్లాలో 4 వేల సైకిళ్ళ పంపిణీకి శ్రీకారం చుట్టారని అన్నారు. రక్త విద్యా సంవత్సరం సిరిసిల్ల జిల్లాలో 10 వేల మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ తెలిపారు.
ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ,విద్యార్థులకు ఎంపీ మంచి సైకిల్స్ అందించారని, వర్షా కాలంలో రోడ్లు స్కిడ్ అధికంగా అవుతాయని, విద్యార్థులు జాగ్రత్తగా నడపాలని అన్నారు. అనంతరం కాలేజీ గ్రౌండ్ నుండి బతుకమ్మ ఘాట్ వరకు విద్యార్థులతో సైకిల్ ర్యాలీ ని జెండా ఊపి ప్రారంబించి కొంత దూరం సైకిల్ సవారీ చేశారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు ఇన్చార్జి డిఈఓ వినోద్ కుమార్, స్థానిక నాయకులు, విద్యార్థులు, ప్రజలు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు గర్భం దాలిస్తే రూ.లక్ష బహుమతి..

విద్యార్థులు గర్భం దాలిస్తే రూ.లక్ష బహుమతి.. సరికొత్త స్కీమ్ తెచ్చిన ఆ దేశ సర్కార్..

ఓ దేశం తెచ్చిన స్కీమ్ చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు గర్భవతులు అయితే దాదాపు రూ.లక్ష అందిస్తోంది. ఇది విద్యార్థుల కెరీర్‌ను నాశనం చేస్తుందని పలువురు మండిపడుతున్నా.. అక్కడి ప్రభుత్వం మాత్రం జనాభా పెరిగితే చాలా అని భావిస్తోంది. ఎందుకంటే ఆ దేశంలో సంతానోత్పత్తి రేటు దారుణంగా పడిపోవడమే దీనికి కారణం.

గత నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌తో యుద్ధంలో బిజీగా ఉంది రష్యా. ఏళ్లు గడుస్తున్నా యుద్ధం మాత్రం ఓ కొలక్కి రావడం లేదు. ఉన్న సైన్యం సరిపోక ఉక్రెయిన్ నుంచి సిబ్బందిని తెచ్చుకుంటుంది రష్యా. ఇప్పటివరకు యుద్ధంలో 2లక్షల 50వేల మంది రష్యన్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. లక్షలాది మంది యువత దేశం విడిచి వెళ్లిపోతున్నారు. దీంతో జనాభా సంక్షోభం తలెత్తింది. మరోవైపు జననాల రేటు గణనీయంగా తగ్గుతున్న తరుణంలో దానిని పెంచేందుకు ప్రభుత్వం అనేక స్కీమ్స్ ప్రవేశపెడుతుంది. ఈ క్రమంలోనే సంతానోత్పత్తిని పెంచేందుకు రష్యా ఓ కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది. స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ గర్భవతులు అయితే వారికి ప్రోత్సాహకాలు అందజేస్తుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాల్లో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. ఇప్పుడు ఈ పథకం చర్చనీయాంశంగా మారింది. కొంతమంది మేధావులు విద్యార్థుల భవిష్యత్తును ఈ స్కీమ్ నాశనం చేస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ క్రెమ్లిన్ మాత్రం జనాభా పెరుగుదలను జాతీయ బలం, వ్యూహాత్మక శక్తిగా భావిస్తుంది. అందుకే ఇటువంటి స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.

ప్రస్తుతం రష్యాలోని 10 ప్రాంతాల్లో ఈ స్కీమ్‌ను అమలు చేస్తున్నారు. అర్హత గల వయసు ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ స్కీమ్‌ను పొందొచ్చు. ఆ విద్యార్థులకు 100,000 రూబిళ్లు అంటే రూ.90వేల రూపాయలను ప్రోత్సాహంగా అందజేస్తుంది. ఈ పథకం రష్యా జనాభా క్షీణతను తిప్పికొట్టడానికి 2025 మార్చిలో ప్రవేశపెట్టారు. స్కూల్ లేదా కాలేజీకి చెందిన యువతి 22వీక్స్ గర్భవతిగా ఉండి తన పేరును ప్రభుత్వ మదర్ క్లినిక్‌లో నమోదు చేసుకుంటే దాదాపు లక్ష రూపాయలు అందజేస్తోంది. 2023లో రష్యా జనన రేటు 1.41శాతంగా ఉంది. అవసరమైన దానికంటే ఇది చాలా తక్కువ. 2024లో మొదటి ఆరు నెలల్లో రష్యాలో దాదాపు 6లక్షల మంది శిశివులు మాత్రమే జన్మించారు. గత పాతికేళ్లలో ఇదే అతి తక్కువ సంఖ్య కావడం గమనార్హం. అందుకే ఈ ఏడాది విద్యార్థులకు సైతం ప్రోత్సాహకాలు అందజేస్తోంది.

ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. రష్యన్ పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. 43శాతం మంది రష్యన్లు ఈ విధానాన్ని సమర్థిస్తుండగా.. 40శాతం మంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ స్కీమ్ యువతుల భవిష్యత్తును దోపిడీ చేస్తుందని.. విద్య, కెరీర్ అవకాశాలను దెబ్బతీస్తుందని పలువురు మండిపడుతున్నారు. అయితే ఈ విధానాలను రష్యా మాత్రమే కాదు వివిధ దేశాలు అమలు చేస్తున్నాయి. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లులకు హంగేరీ పన్ను మినహాయింపులను అందిస్తుంది. పోలాండ్ ప్రతి బిడ్డకు నెలవారీ భత్యాలను చెల్లిస్తుంది. 2050 నాటికి మూడొంతుల కంటే ఎక్కువ దేశాల సంతానోత్పత్తి స్థాయిల దిగువకు పడపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

విద్యార్థుల బోధన విన్న.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సంగర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణకుమారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులను ఆయన పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుకొంటున్నారని అడిగారు. మంచిగా చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ బోర్డులో మీ టీచర్లు పాఠాలు బోధిస్తున్నారా.. అని అడిగారు. మీకు డిజిటల్ బోర్డు ఉపయోగించడం తెలుసా అని అడిగారు. కొందరు విద్యార్థులు డిజిటల్ బోర్డు మీద ఫిజిక్స్, బయాలజీ , సబ్జెక్టులను బోధించారు. ఎమ్మెల్యే ఆసక్తిగా విన్నారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సిఎంఓ బాలు యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్మత్ అలి, రామస్వామి, కృష్ణకాంత్ రెడ్డి, సంజీవరెడ్డి, దోమ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి.

‘ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ-జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మ్యాతారి మహేందర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ప్రతి 30 మందికి ఒక బస్సు ఏర్పాటు చేసి స్కూలుకు తీసుకెళ్లాల్సిందిగా కోరారు.

కే డి సి బ్యాంకు ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్.

కే డి సి బ్యాంకు ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు ప్యాడ్స్ పంపినం

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

మండలంలోని వర్ష కొండ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు నోటు పుస్తకాలు పంపిణీ
చేసారు ఇబ్రహీంపట్నం బ్రాంచ్ వారు కేడీసీ బ్యాంకు ల‌ చైర్మన్ శ్రీ రవీందర్రావు గారి జన్మదిన సందర్భంగా ఫైనాన్షియల్ లిటరసీ అనే కార్యక్రమం 9 ,10 వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ మరియు పెన్నులు నోటు పుస్తకాలు అందించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు అందరికీ పొదుపు చిన్ననాటి నుండి అలవాటు కావాలని అందుకోసం వారి బ్యాంకులో జీరో బ్యాలెన్స్ తో అకౌంట్ లో ఇస్తామని తెలిపారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి రాజేందర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి మా పాఠశాలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ జి మారుతి , అసోసియేషన్ సభ్యులు రాము. ఉపాధ్యాయులు శ్రీనివాస్. ఇమ్మానియేల్. మహేష్. ఉపాధ్యాయుని శ్రీమతి మమత. అనిత. మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు దూడపాక రాజు

ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి
ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు దూడపాక రాజు

మొగులపల్లి నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 26 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 22 లక్షల మంది పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 60% విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలకు దూరంగా నివాసం ఉంటున్న వారు.

కాబట్టి, ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో & ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు ఏర్పాటు చేసి విద్యార్థులను స్కూల్స్ కు తీసుకెళ్లాలి. దీని ద్వారా వారి సమయం, శక్తి వృధా కాకుండా ఉంటుంది. చదువుపై మరింత శ్రద్ధ పెడతారు, ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయి. కొంత మేరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్ గా ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతుంది.
తప్పకుండా ఈ డిమాండ్ ను నెరవేర్చాలని మీ ద్వారా తెలంగాణ | రాష్ట్ర ప్రభుత్వానికి BC, SC, ST JAC తరపున డిమాండ్ చేస్తున్నాం. లేని క్రమంలో ప్రభుత్వంపై అనేక రకాలుగా దశలవారీగా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో స్త్రీలకు ఏ విధంగా అయితే ఉచిత బస్సు అందించారు అదేవిధంగా స్థానిక ప్రభుత్వ స్కూలు ప్రైమరీ, ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు గ్రామాల నుండి పాఠశాల వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని మరొక విధంగా దీనిని సెమీ రెసిడెన్షియల్ గా అనుకోవచ్చు. అలాగే పిల్లలకి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ తో వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు దూడపాక రాజు ఉపాధ్యక్షులు బండారి కుమార్ ధర్మ స్టూడెంట్స్ యూనియన్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ దూడపాక శ్రీక్రిష్ణ మరియు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు శ్రీధర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు

విద్యార్థుల్లో మానసిక దృక్పథాన్ని పెంపొందించడానికి స్ఫూర్తి

విద్యార్థుల్లో మానసిక దృక్పథాన్ని పెంపొందించడానికి స్ఫూర్తి కార్యక్రమం

జిల్లాలోని 118 ప్రభుత్వ విద్యా సంస్థల్లో పూర్తి కార్యక్రమం నిర్వహణ

ఆర్థిక అక్షరాస్యతపై విద్యార్థులకు అవగాహన కల్పన

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:*

విద్యార్థుల్లో మానసిక దృక్పథాన్ని పెంపొందించడానికి స్ఫూర్తి కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆలోచనల మేరకు విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించేందుకు గత విద్యాసంవత్సరం నుండి స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది.యూనిసెఫ్, యునెస్కో, డబ్ల్యూహెచ్ఓ, ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న అంశాల ఆధారంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదచే ప్రత్యేకంగా స్ఫూర్తి కార్యక్రమం రూపొందించారు. స్ఫూర్తి కార్యక్రమాల్లో భాగంగా ఈ విద్యా సంవత్సరం విద్యార్థులలో జీవిత నైపుణ్యాలు, విద్యతో పాటు ఈ వారం స్ఫూర్తి కార్యక్రమంలో ప్రత్యేకంగా

 

 

ఆర్థిక అక్షరాస్యపై విద్యార్థుల్లో కల్పించేందుకు మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లాలోని 118 ప్రభుత్వ విద్యాసంస్థల్లో స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు.జిల్లాస్థాయి మండల ప్రత్యేక అధికారుల,సంబంధిత విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో అనుభవం కలిగిన విశ్రాంత అధ్యాపకులు,బ్యాంక్ అధికారులు, జర్నలిస్టులు
స్ఫూర్తి కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థుల్లో ఎదురయ్యే సమస్యలు, పోటీ తత్వం, ఓత్తిడిలో సమయం స్ఫూర్తి తదితర అంశాలపై ఒత్తిడిని జయించి సామర్థ్యాలు పెంచుకోవడంతో పాటు విద్యార్థులు ఆర్థిక అక్షరాస్యత పై డబ్బులు ఎలా నిర్వహించాలో, బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వహణ,బడ్జెట్ ఎలా వేయాలో, పొదుపు ఎలా చేయాలి.అప్పులు ఎలా తీర్చాలి.తెలివైన పెట్టుబడులు ఎలా పెట్టాలి.ర్ఆర్థికంగా సురక్షితంగా ఉండటానికి ఆర్థిక అక్షరాసత్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు.మంగళవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమాల్లో భాగంగా చెన్నారావుపేట మండల కేంద్రంలో గల దుగ్గొండి మండలం నాచినపల్లి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొనగా,శంభునిపేట తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,రాయపర్తిలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి,13 మండల ప్రత్యేక అధికారులు ఆయా మండలాలలో స్ఫూర్తి కార్యక్రమాలలో పాల్గొని విద్యార్థులకు హార్థిక అక్షరాస్యతతో పాటు జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమాల్లో డిఆర్డిఓ కౌసల్యాదేవి,జడ్పీ సీఈఓ రామిరెడ్డి, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ దాసరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజు,బరిగెల శివ, మండల ప్రత్యేక అధికారులు, ప్రాధానోపాధ్యాయులు, విశ్రాంత అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి

భూపాలపల్లి నేటిధాత్రి

రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా జేఏసీ కోఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 26వేలపైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.

 

 

 

 

వీరిలో 90% విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలకు దూరంగా నివాసం ఉంటున్నవారు.కాబట్టి ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు చేసి, విద్యార్థులను స్కూల్స్ కు తీసుకెళ్లాలి. దీని ద్వారా వారి సమయం, శక్తి వృధా కాకుండా ఉంటుంది చదువుపై మరింత శ్రద్ధ పెడతారు, ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయి.

 

 

 

 

 

ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజుల భారం మోయలేనటువంటి పరిస్థితి, అదే విధంగా ఇప్పుడు వర్షాకాలం సీసన్ గనుక ఒకవేళ వర్షం పడితే స్కూల్ కి వెళ్లలేనటువంటి పరిస్థితి మరియు చిన్నపిల్లలకు బుక్స్ మోయడం భారం అవుతుంది వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.కొంతమేరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్ గా ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతుంది
తప్పకుండా ఈ డిమాండ్ ను నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.

 

 

 

ఈ కార్యక్రమంలో భీమనాధుని సత్యనారాయణ బిసి సంఘం జిల్లా అధ్యక్షులు, వైనాల శోభన్ బాబు రజక సంఘం, వైనాల శంకర్ రజక సంఘం, సంతోష్ ముదిరాజ్ సంఘం, ముత్యాల రవికుమార్ నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు, మరియు ధర్మ స్టూడెంట్ యూనియన్ జిల్లా కన్వీనర్ దూడపాక శ్రీకృష్ణ, జేఏసీ సభ్యులు మంద రమేష్, కండె రవి బొజ్జ పెళ్లి మహర్షి, పుల్ల అశోక్, కుర్రి స్వామినాథన్, దూడపాక రాజు నేరెళ్ల రమేష్ పర్లపల్లి కుమార్ దాసరపు భాస్కర్, మట్టవాడ కుమార్, లాపాక రవి, ఎంజలా శ్రీనివాస్, పందిళ్ళ రమేష్,గుండ్ల రాజకుమార్,సంజీవ్ పాల్గొన్నారు.

పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూసుకోవాలి

పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూసుకోవాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్

Parakala నేటిధాత్రి
ఎస్ఎఫ్ఐ పరకాల మండల కమిటీ ఆధ్వర్యంలో పరకాల మండల పరిధిలోని పలు గ్రామాలలో ఎస్ఎఫ్ఐ నాయకులు పర్యటించారు.మల్లక్కపేట పాఠశాలలో ప్రిన్సిపాల్ మరియు సిబ్బందితో ఎస్ఎఫ్ ఐ నాయకులు కలిసి మాట్లాడుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా తల్లిదండ్రులకు చెప్పి తీసుకురావాలని బడి బాట కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రభుత్వ స్కూల్లో చదివితే భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పి ప్రభుత్వ పాఠశాలను రక్షించాలన్నారు.గతంలో మూసి ఉన్న హైబోతు పల్లె స్కూల్.ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితంగా తిరిగి ప్రారంభించారన్నారు.ఇప్పటికైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని కళ్యాణ్ అన్నారు.ఈ కార్యక్రమంలో
ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మణికొండ ప్రశాంత్,పట్టణ కార్యదర్శి కోగిల సాయి తేజ,రాజశేఖర్ పాల్గొన్నారు.

బాల్యం పై పుస్తకాల భారం…?

బాల్యం పై పుస్తకాల భారం…?

పెరుగుతున్న బడి పుస్తకాల బరువు…

కిలోల కొద్ది బరువును విద్యార్థుల వీపునకు తగిలిస్తున్న వైనం…

పుస్తకాల అధిక బరువు పిల్లల పాలిట శాపంగా మారనుందా?..

బరువుకు మించిన బడి సంచి…

విద్యార్థులకు తప్పని తిప్పలు…

అమలు కానీ నో బ్యాగ్ డే…

పుస్తకాల సంఖ్య తగ్గించాలి అవసరమైన పుస్తకాలను మాత్రమే అందించాలి…

నేటి ధాత్రి

 

 

 

-మహబూబాబాద్ -గార్ల :- ప్రైవేటు,కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఒత్తిడితో కూడిన విద్య బోధనతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో విద్యార్థులపై మళ్లీ బ్యాగు భారం మొదలైంది.అడుతూ, పాడుతూ చదువుకోవాల్సిన వయసులో పుస్త కాల భారం విద్యార్థులకు శాపంగా మారుతోంది.ఏటా పై తరగతికి వెళ్తుంటే, పుస్తకాల సంఖ్య కూడా పెరుగుతోంది.

 

 

 

 

 

ప్రైవేటు స్కూళ్లలో పిల్లలు,బ్యాగు నిండా పుస్తకాలతో నాలు గైదు అంతస్తుల మెట్టు ఎక్కేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఫలితంగా పట్టుమని 15 ఏళ్లు నిండక ముందే చాలా మంది నడుము, మెడ నొప్పి, కండరాల సమస్యల తో సతమతమవుతు న్నారు.విద్యార్థులకు గుణాత్మక నైపుణ్యత విద్యను అందించాలని విద్య హక్కు చట్టం చెబుతున్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం పట్టించుకున్న పాపాన పోలేదు.పుస్తకాల భారం తగ్గించాలని,2006లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన ప్పటికీ,వాటిని అమలు చేయడం లేదు,దీంతో విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు.

 

 

 

 

మరోవైపు పిల్లలపై పుస్తకాల భారం వలన వారి శారీరక, మానసిక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది.పాఠశాల బ్యాగుల బరువు, తరగతి గదిలో అవసరమయ్యే పుస్తకాల సంఖ్య, ఇంటి వద్ద చదవాల్సిన హోంవర్క్ పుస్తకాల పరిమాణం అన్నీ కలిపి పిల్లలపై అధిక భారాన్ని పెంచుతున్నాయి.బరువైన పుస్తకాలు మోయడం వలన వెన్నునొప్పి,కండరాల నొప్పులు, భుజాల నొప్పి వంటి శారీరక సమస్యలు వస్తాయి. పుస్తకాల భారం పిల్లలపై ఒత్తిడిని పెంచుతుంది.ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

 

 

 

 

చదువుపై ఏకాగ్రత తగ్గడం, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.అవసరం ఉన్న లేకున్నా వేలాది రూపాయలు వెచ్చించి కిలోల కొద్ది బరువులను విద్యార్థుల వీపునకు తగిలిస్తున్నారు. పోటీ చదువుల పేరిట అటు తల్లిదండ్రులు,ఇటు పాఠశాల యాజమాన్యాలు పిల్లలపై పుస్తకాల భారం మోపుతున్నారు.ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల నిర్వహకులు ఇష్టమొచ్చినట్లు పుస్తకాలు అంటగడుతున్నారు.

 

 

 

 

 

దీంతో పుస్తకాల అధిక బరువు పిల్లల పాలిట శాపంగా మారనుంది. పాఠశాలలు పుస్తకాల సంఖ్య తగ్గించాలి అవసరమైన పుస్తకాలను మాత్రమే అందించాలి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించేలా ఆయా పాఠశాలల్లో ర్యాక్స్ ఏర్పాటు చేసి పాఠ్యపుస్తకాలు అన్ని పాఠశాలల్లోనే ఉంచుతూ,హోంవర్క్ పుస్తకాలు మాత్రమే ఇంటికి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని విద్యావంతులు, మేధావులు,ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. పిల్లలకు పుస్తకాలతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగించేలా విద్యాబోధన ఉండాలని ఈ విషయంలో పాఠశాలల యాజమాన్యాలు అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు.

రేగుంట హైస్కూలు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల..

మల్లాపూర్ జులై 4 నేటి రాత్రి
రేగుంట హైస్కూలు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల నీటి కొరతను తీర్చిన రేగుంట ఆల్ యూత్ అసోసియేషన్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ గ్రామస్తులు
మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో విద్యార్థుల కాల కృత్యాలు తీర్చుకోవడానికి కనీస నీటి వసతి లేక హైస్కూల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవతున్న విషయాన్ని పాఠశాల ఉపాధ్యా యులు విద్యార్థులు రేగుంట ఆల్ యూత్ అసోసియేషన్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ కు తెలియచేయగా తక్షణమే స్పందించి తనతో పాటు కొద్దిమంది గ్రామస్తులు సహకారంతో కొత్త రిగ్గు మోటర్ అందించి విద్యార్థుల నీటి కొరతను తీర్చి అండగా నిలిచిన మల్లేష్ యాదవ్ సహకరించిన రేగుంట గ్రామస్తులకు కృతజ్ఞతలు ధన్యవాదములు తెలిపిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు
ఈ కార్యక్రమంలో..
కర్నె పవన్ కళ్యాణ్, కుందేళ్ల రాజేష్ ఎండీ భసీర్,కుక్కుదుగు అశోక్, పడిగెల నరేష్,ప్రకాష్ హబీబ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రాజు, నర్సింగ్ రావ్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించడం అభినందనీయం…

పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించడం అభినందనీయం…

మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు

ఆర్కేపి యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ పేదల కోసమే…

యువత జనం కోసం అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేష్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి :

 

 

 

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల ఠాగూర్ స్డేడియం సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసించే 40 మంది విద్యార్థులకు రామకృష్ణాపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ దాతల సహకారంతో డబ్బులు సేకరించి మున్సిపాలిటీ కమీషనర్ గద్దె రాజు చేతుల మీదుగా స్కూల్ బ్యాగ్ లు అందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగులు అందించడం అభినందనీయమని కమీషనర్ అన్నారు. ఈ సంధర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు స్కూల్ కు సంబంధించిన సమస్యలు కమిషనర్ కు వివరించగా కమీషనర్ రాజు సమస్యల పరిష్కారం కోసం స్కూల్ చుట్టూ కంచె, గేట్ ఏర్పాటు చేస్తామని అన్నారు.యువత జనం కోసం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ మాట్లాడుతూ.. యువత స్వచ్ఛంద సేవా సంస్థ కు సహాయం చేస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఆర్కేపీ యువత జనం కోసం పేదల కోసమే పనిచేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో దాతలు గణేష్ యువత ఉపాధ్యక్షుడు వెరైటీ తిరుపతి , కార్యదర్శి కరుణాకర్ పేరేంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

సీజనల్ వ్యాధుల పై విద్యార్థులకు అవగాహన.

సీజనల్ వ్యాధుల పై విద్యార్థులకు అవగాహన ‌‌

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

 

మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ఎంజేపి (మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే) పాఠశాలలో మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా 110 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగినది. విద్యార్థులకు సీజన్ వ్యాధుల గూర్చి అవగాహన కల్పించడం జరిగినది ,వేడి వేడి ఆహార పదార్థాలు తినాలని, కాచి చల్లార్చిన నీరు తాగాలని తెలియజేసినారు . విద్యార్థులకు ఎవరికైనా జ్వరం కానీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే మా వైద్య సిబ్బంది తెలియజేయాలని డాక్టర్ నాగరాణి గారు సూచనలు ఇచ్చారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ సంధ్య, ప్రిన్సిపల్ శారద ,సూపర్వైజర్ సునీత, ఏఎన్ఎం శ్రీలత ,స్టాఫ్ నర్స్ అశ్ర ఆశా కార్యకర్తలు ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.

బెస్ట్ అవైలేబుల్ పాఠశాల విద్యార్థుల అవస్థలు.

బెస్ట్ అవైలేబుల్ పాఠశాల విద్యార్థుల అవస్థలు

విద్యార్థులను హాస్టల్లో చేర్చుకొని యాజమాన్యం

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు

సిరిసిల్ల జిల్లా:(నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని శ్రీ సరస్వతి పాఠశాలలో బెస్ట్ అవైలేబుల్ ద్వారా చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు సంవత్సరాల నుండి శ్రీ సరస్వతి స్కూలుకు బిల్లులు రాకపోవడంతో విద్యార్థులను హాస్టల్ కు తీసుకు రాకూడదని తల్లిదండ్రులకు స్కూల్ యజమాన్యం సూచించింది. దీంతో దిక్కు తోచని స్థితిలో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో సరైన విద్య ప్రమాణాలు లేవని మరియు భోజనం వసతి సౌకర్యాలు అంతంతే నని, పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు బెస్ట్ అవైలబుల్ కింద సీటు రావడంతో అక్కడ ఎంతో నాణ్యమైన విద్య అందుతుందని మొదట మురిపించిందని ఇలా పాఠశాల యజమాన్యం ఇబ్బందులకు గురిచేయడం వల్ల విద్యార్థులు మానసిక అందోలోనాలతో కృంగిపోతున్నారని వెంటనే కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశామన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version