కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ
శాఖ నుంచి గౌరవ ప్రశంసా పత్రం అందుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు మేడికాల అంజయ్య
దేశభక్తిని చాటేలా జోగాపూర్
విద్యార్థుల “హర్ ఘర్ తిరంగా”
విద్యార్థులలో దేశ భక్తిని పెంపొందించేందుకు సిసిఆర్టి శిక్షకులు, హర్ ఘర్ తిరంగా వాలీంటియర్ మేడికాల అంజయ్య కృషి …
చందుర్తి, నేటిధాత్రి:
స్వాతంత్ర్యయం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా “ఆజాదీ కా మహోత్సవ్ – 2022″లో భాగంగా కేంద్రం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో మరోసారి పాల్గొనే అవకాశం కల్పించినందున జోగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ,సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ ట్రైనింగ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా వాలింటిర్ గా వ్యవహరిస్తు జాతీయ పతాక ఆవిష్కరణ విధానం, నియమాలను విధ్యార్థులకు
అవగాహాన కల్పిస్తు దాదాపు 60 మంది విద్యార్థుల జాతీయ పతాక సెల్ఫిలను అప్ లోడ్ చేయించగా,60 మంది విద్యార్థులు ప్రశంస పత్రాలు అందుకున్నారు. వాలింటిర్ గా వ్యవహరించిన ఉపాధ్యాయుడు అంజయ్య కు
మినిస్ట్రి ఆఫ్ కల్చర్ మరొక గౌరవ ప్రశంసా పత్రం అందించి గౌరవించింది.
విద్యార్థి దశలోనే దేశభక్తిని పెంపోందించేలా కృషి చేస్తే , భావితరాల వారు దేశం కోసం పనిచేస్తారని, విద్యార్థులు చక్కటి క్రమశిక్షణను పాటిస్తారని అంజయ్య అన్నారు.