ఎస్సీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పొడిగించాలి
ములుగు టౌన్ నేటి ధాత్రి
ములుగు జిల్లాలో షెడ్యూల్డ్ క్యాస్ట్ తరగతుల వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకార రుణాలకు (ఎస్సీ కార్పొరేషన్) దరఖాస్తు గడవు చాలా పరిమితి రోజులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కావున వెంటనే దరఖాస్తు మరో నెల రోజుల పాటు గడువు పొడిగించాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ కోరారు
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి ధ్యేయంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న రుణాల కు చాలా తక్కువ రోజులు పరిమితి విధించి దరఖాస్తు గడువు నిర్ణయించడం జరిగింది . ఈ క్రమంలోనే పండుగలు సెలవులు రావడం వల్ల అనేకమంది అర్హులు ఆయా కులం సర్టిఫికెట్స్ మరియు ఇతర సర్టిఫికెట్లు సకాలంలో అందకపోవడం వల్ల చాలామంది దరఖాస్తుకు సమయానికి చేసుకోలేకపోవడం వల్ల అనేకమంది అనర్హులుగా మిగిలిపోతున్నారని అన్నారు అలాగే కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న ఇవి వెహికల్స్ కి లైసెన్స్ ముఖ్యంగా మహిళలకు టూవీలర్ కి లైసెన్స్ కూడా ఉండాలనే నిబంధనను తొలగించాలని అన్నారు ట్రాఫిక్ RTO వాళ్లే లైసెన్స్ అడగరు కదా మరి ఏ ఉద్దేశంతో కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న ఇవి వెహికల్స్ కి లైసెన్స్ ఉంటేనే అర్హులని అడగడం ఎంతవరకు కరెక్ట్ అనేది అధికారుల ఆలోచించాలి లైసెన్స్ కావాలని నిబంధనను తొలగించాలి ఇంకా ఇతర అగ్రికల్చర్ లోన్స్ కు సంబంధించి సబ్సిడీ ఎక్కువ కల్పించాలని కోరడం జరిగింది అలాగే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి లోన్ మంజూరు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది గత ఐదు ఆరు సంవత్సరాలుగా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అనేవి మంజూరు చేయడంలో గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక మంది షెడ్యూల్ క్యాస్ట్ ప్రజలు ఆర్థికంగా నష్టపోయారని ఇప్పటికైనా పూర్తిస్థాయిలో సమగ్రంగా విచారణ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందేలా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది
