తీవ్ర మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య…

తీవ్ర మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య

మొగుళ్ళపల్లి నేటి దాత్రి

 

మండలంలో ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి మొగుళ్ళపల్లి ఎస్సై బొరగల అశోక్ అందించిన సమాచారం మేరకు. మొగుళ్ళపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామానికి చెందిన బాల వేణి రాధా చంద్రమౌళి దంపతులకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు సంతానం ఉండగా కూతురు వివాహం చేసి బాల వేణి రాధా తన భర్త చంద్రమౌళి, ఇద్దరు కొడుకులతో కలిసి హైదరాబాదులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు స్వగ్రామం మేదరమట్లకు వచ్చి బుధవారం భోగి రోజున వారి ఇంటిలో పట్నాలు వేసిన అనంతరం మృతుడు అంజి (21) కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు అంజిని వెతుకుతున్న క్రమంలో మృతుడు తన పెదనాన్న బాలవేణి వెంకన్న గృహంలో రాత్రి 7:30 గంటల సమయంలో దూలానికి చీరతో ఉరి వేసుకుని కొన ఊపిరితో వేలాడుతు కనిపించడంతో. కొడుకును చూసి తల్లి బాలవేణి రాధా కేకలు వేయగా. గ్రామానికి చెందిన బాలవేణి వీరస్వామి, బాలవేణి శ్రీనివాసులు, ఇద్దరు కొనఊపిరితో ఉన్న అంజిని హుటాహుటిన చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని. తన కుమారుడి ఆత్మహత్యకు ఎవరిమీద ఎలాంటి అనుమానం లేదని ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి బాలవేణి రాధా ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బొరగల అశోక్ తెలిపారు.

సబ్సిడీ ఆటోలతో, సాగని ప్రయాణం…..

సబ్సిడీ ఆటోలతో, సాగని ప్రయాణం…..!

◆:- ఆర్థిక ఇబ్బందుల్లో లబ్ధిదారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలో, నైపుణ్యం కలిగిన అర్హులైన దళితులకు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, షెడ్యూల్డ్ కులముల సేవ, సహకార అభివృద్ధి సంఘం. ( ఎస్. స్సి. కార్పొరేషన్ ). ద్వారా, బ్యాంకు అధికారుల సహకారంతో, సబ్సిడీ ద్వారా, మహీంద్రా ఆల్ఫా డీలక్స్, బీ, యస్, 6, డీజిల్ ప్యాసింజర్, సెన్సార్లు కలిగిన, ఆటోలను, లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సబ్సిడీ ద్వారా ఆటోలను తీసుకున్న కొన్ని నెలలకే, ఈ ఆటోలు చెడిపోవడంతో. ఇట్టి విషయమై ఎన్నో సార్లు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీని, ప్రభూత్వ అధికారులు స్పందించలేదన్నారు. ఈ వాహనంలో ఏ చిన్న లోపం తలెత్తిన, వీటిని బాగు చేయుటకు, ఇతర వాహనం సహకారంతో, హైదరాబాద్ వెళ్లవలసిందే నని, ఈ విధంగా గత మూడు సంవత్సరాల నుండి, ఎన్నోసార్లు హైదరాబాద్ వెళ్లి, తమ ఆటోను బాగు చేసుకొని వచ్చినప్పటికీని, మళ్లీ మళ్లీ చెడిపోవడంతో, లబ్ధిదారులు అప్పులపాలై, బ్యాంకులో ఆటో కొరకు తీసుకున్న అప్పును తీర్చలేక, బ్యాంకు అధికారుల, మరియు, మధ్యవర్థుల మాటలకు, మానసికంగా, బాధపడుతున్నామన్నారు. ఈ ఆటోలను, ప్రభూత్వం ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు మాత్రమే విక్రయించి, ఇతరులకు విక్రయించకుండా, గత మూడు సంవత్సరాలుగా, ఈ ఆటో విక్రయాలు నిలిపివేయడానికి గల కారణం ఏమిటో, సంబంధిత అధికారులు, పత్రిక ముఖంగా తెలియజేయాలని, ఈ ఆటోలను మాత్రమే, ప్రభుత్వం ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేయడానికిగల కారణం ఏమిటో, ఇతర కంపెనీల ఆటోలను ఇవ్వలేమని, సంబంధిత అధికారులు తమకు చెప్పడంతో, గథ్యాంతరం లేక,ఈ ఆటో ను తీసుకున్నామన్నారు. ఈ ఆటోలు తీసుకొని నష్టపోయిన లబ్ధిదారులను, ప్రభూత్వమే ఆదుకోవాలని, లబ్ధిదారులు కోరుచున్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version