ఎస్సీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పొడిగించాలి….

ఎస్సీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పొడిగించాలి

ములుగు టౌన్ నేటి ధాత్రి

ములుగు జిల్లాలో షెడ్యూల్డ్ క్యాస్ట్ తరగతుల వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకార రుణాలకు (ఎస్సీ కార్పొరేషన్) దరఖాస్తు గడవు చాలా పరిమితి రోజులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కావున వెంటనే దరఖాస్తు మరో నెల రోజుల పాటు గడువు పొడిగించాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ కోరారు

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి ధ్యేయంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న రుణాల కు చాలా తక్కువ రోజులు పరిమితి విధించి దరఖాస్తు గడువు నిర్ణయించడం జరిగింది . ఈ క్రమంలోనే పండుగలు సెలవులు రావడం వల్ల అనేకమంది అర్హులు ఆయా కులం సర్టిఫికెట్స్ మరియు ఇతర సర్టిఫికెట్లు సకాలంలో అందకపోవడం వల్ల చాలామంది దరఖాస్తుకు సమయానికి చేసుకోలేకపోవడం వల్ల అనేకమంది అనర్హులుగా మిగిలిపోతున్నారని అన్నారు అలాగే కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న ఇవి వెహికల్స్ కి లైసెన్స్ ముఖ్యంగా మహిళలకు టూవీలర్ కి లైసెన్స్ కూడా ఉండాలనే నిబంధనను తొలగించాలని అన్నారు ట్రాఫిక్ RTO వాళ్లే లైసెన్స్ అడగరు కదా మరి ఏ ఉద్దేశంతో కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న ఇవి వెహికల్స్ కి లైసెన్స్ ఉంటేనే అర్హులని అడగడం ఎంతవరకు కరెక్ట్ అనేది అధికారుల ఆలోచించాలి లైసెన్స్ కావాలని నిబంధనను తొలగించాలి ఇంకా ఇతర అగ్రికల్చర్ లోన్స్ కు సంబంధించి సబ్సిడీ ఎక్కువ కల్పించాలని కోరడం జరిగింది అలాగే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి లోన్ మంజూరు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది గత ఐదు ఆరు సంవత్సరాలుగా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అనేవి మంజూరు చేయడంలో గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక మంది షెడ్యూల్ క్యాస్ట్ ప్రజలు ఆర్థికంగా నష్టపోయారని ఇప్పటికైనా పూర్తిస్థాయిలో సమగ్రంగా విచారణ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందేలా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది

విద్యార్థులకు వార్షిక పరీక్షల ప్రేరణ తరగతులు

విద్యార్థులను వార్షిక పరీక్షలకు ప్రోత్సహించేలా ప్రత్యేక ప్రేరణ- అవగాహన తరగతులు

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య

మంచిర్యాల,నేటి ధాత్రి:

10వ తరగతి చదువుతున్న విద్యార్థులను వార్షిక పరీక్షలకు ప్రోత్సహించేలా ప్రత్యేక ప్రేరణ అవగాహన తరగతులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతులకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి భాగ్యవతి,జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య,జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి,ఎ. టి. డి. ఓ. సురేష్, టి.ఎన్.జి.ఓ.స్ ప్రతినిధి గడియారం శ్రీహరి,మానసిక వైద్య నిపుణులు సునీల్ లతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ప్రత్యేక ప్రేరణ-అవగాహన తరగతులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ప్రతి విద్యార్గి ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని,ఇష్టంతో చదివి, పట్టుదలతో సాధించి ఉన్నత స్థానాలలో నిలవాలని, తల్లిదండ్రులకు,జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.ప్రేరణ-అవగాహన తరగతులను సద్వినియోగం చేసుకోవాలని,విషయ నిపుణులైన ఉపాధ్యాయులు ఇచ్చే మెలకువలను పాటించి, అన్ని సబ్జెక్టులలో 100 శాతం మార్కులు సాధించాలని, వార్షిక ఫలితాలలో 100 శాతం ఉత్తీర్ణతతో మంచిర్యాల జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమాధికారి ధర్మానంద్ గౌడ్,ఉపాధ్యాయులు,వసతి గృహ సంక్షేమ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

రాజ్యాంగంపై అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరం: సాయినాథ్

రాజ్యంగంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి:

◆-: ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రికల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సాయినాథ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా శాసనసభ పరిది కోహిర్ మండలంలోని పిచరగడి పాత తండా గ్రామపంచాయతీలో గురువారం నాడు జరిగిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ లో సబ్ ఇంజనీర్ మరియు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జహీరాబాద్ డివిజన్ సెక్రటరీ రామావత్ సాయినాథ్, ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ పవర్ ను సన్మానించి భారత రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రామవత్ సాయినాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రాజ్యంగంపై అవగాహన కలిగి ఉన్నప్పుడే చట్టాలు, ప్రాథమిక హక్కులు, విదులపై అవగాహన కలిగి ఉంటుందని, రాజ్యాంగం ప్రసాదించిన అన్ని అవకాశాలను షెడ్యూల్ కులాలు, గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దేవసోత్ శంకర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రాథోడ్ రవి ఐకెపి, రాథోడ్ వినోద్ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ కొహీర్ మండలం, రామావత్ విజేందర్, కేతవత్ అనిల్ తదితరులు పాల్గొన్నరు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version