దళితులకు అభయ హస్తం పథకం అమలు చేయాలి…

దళితులకు అభయ హస్తం పథకం అమలు చేయాలి

ఈనెల 18న దళిత మహాసభ విజయవంతం చేయండి

ఎం హెచ్ పి ఎస్ జిల్లా కన్వీనర్ తిక్కరాజు మాదిగ పిలుపు

భూపాలపల్లి నేటిధాత్రి

ఎస్సీలకు అంబేద్కర్ అభయ హస్తం 12 లక్షల రూపాయలు పథకం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న హన్మకొండలోని హరిత కాకతీయ లో జరుగు దళిత మహాసభను విజయవంతం చేయాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఎంహెచ్పిఎస్ జిల్లా కన్వీనర్ తిక్క రాజు మాదిగ డిమాండ్ చేశారు. ఎమ్ హెచ్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ ఆదేశాల మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో దళిత మహాసభకు సంబంధించినటువంటి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిక్క రాజు మాదిగ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చేవెళ్లలో జరిగిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సభలో అంబేద్కర్ అభయ హస్తం పేరుతో 12 లక్షల రూపాయలు పథకాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్ర నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి దళితులకు ఇచ్చిన హామీ ఏమైనాట్లని ప్రశ్నించారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో దళితులకు దళిత బంధ పేరుతో 10 లక్షల రూపాయలు అందించిందని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు ఈ పథకం అమలు చేయకుండా దళితులను మోసం చేస్తున్నారన్నారు ఎస్సీ కార్పొరేషన్ ను మూడు విభాగాలుగా విభజించి తక్షణమే కార్పొరేషన్ చైర్మన్ ల నియమించాలని డిమాండ్ చేశారు. హనుమకొండలో జరిగే దళిత మహాసభ దళితులంతా పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టేవాడ సమ్మయ్య, తిక్క మల్లయ్య, రడపాక సారయ్య, మొలుగూరి సారయ్య, కార్తీక్, నర్సింహులు, విజయ్, రాజారాం, లక్ష్మీ, లావణ్య లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version