తవక్కల్ పాఠశాల, సెయింట్ జాన్స్ పాఠశాల ల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు…

తవక్కల్ పాఠశాల, సెయింట్ జాన్స్ పాఠశాల ల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి :

 

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని తవక్కల్ పాఠశాల, సెయింట్ జాన్స్ పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందస్తు బతుకమ్మ వేడుకలకు తవక్కల్ పాఠశాలలో విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ , పట్టణ ఎస్ఐ రాజశేఖర్, ట్రస్మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి లు హాజరయ్యారు. సెయింట్ జాన్స్ పాఠశాలలో ప్రిన్సిపాల్ పొన్నాల సుమన్ లు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థినీ విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. పాఠశాలల ఆవరణలో విద్యార్థులు రంగురంగుల దుస్తులు ధరించి బతకమ్మ ఆటా పాటలో భాగంగా డీజే పాటలతో నృత్యాలు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థినిలు నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర సాంప్రదాయాన్ని గౌరవిస్తూ పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నామని తవక్కల్ పాఠశాల అధినేత అబ్దుల్ అజీజ్, సెయింట్ జాన్స్ పాఠశాల ప్రిన్సిపాల్ పొన్నాల సుమన్ లు తెలిపారు. కులమతాలకతీతంగా బతుకమ్మ వేడుకలను పాఠశాలల్లో నిర్వహించుకోవడం జరిగిందని విద్యార్థులకు అన్ని పండుగల పైన అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పట్టణ ప్రజలందరికీ ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాలలో పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది…

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది…

జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు లు అన్నారు.బుదవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ ,విమోచన దినోత్సవాన్ని సైతం స్మరించుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా
6 గ్యారెంటీలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చొరవతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు.మంత్రి మంగళవారం మున్సిపాలిటీ రివ్యూ మీటింగ్ నిర్వహించారని, అమృత్ స్కీం కింద ఆర్కేపి,గద్దెరాగడి ఏరియాలలో 2 వాటర్ ట్యాంక్ లు ఏర్పాటు చేసి మంచినీటిని అందిస్తామని అన్నారు. రెండు ఏరియాలకు శ్మశాన వాటికలు సైతం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అఫ్జల్ లాడెన్,బొద్దుల ప్రేమ్ సాగర్,మేకల శ్రీను, గోపు రాజం,ఎల్పుల సత్యం,భైర మల్లేష్,ఎల్పుల మల్లేష్,బత్తుల శ్రీనివాస్,రామస్వామి, రామ కృష్ణ, బోనగిరి రవీందర్,పందిరి లింగయ్య,సరేష్,లచ్చులు,హరిప్రసాద్, శారద తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలను పరామర్శించిన..!

పలు కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలిపిన రాజా రమేష్…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని 14వ వార్డ్ మాజీ కౌన్సిలర్ గడ్డం రాజు_ విజయలక్ష్మి ల తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను శనివారం బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు పరామర్శించారు. అనంతరం రెండవ వార్డ్ మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్, మాజీ ఎంపిటిసి కళ్యాణ్ ల తల్లి భీమక్క ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను సైతం పరామర్శించారు. వారి తల్లి భీమక్క చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాలలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్లు పోగుల మల్లయ్య, రేవెల్లి ఓదెలు, నాయకులు బొమ్మ భూమయ్య గౌడ్, జక్కన బోయిన కుమార్, నందిపేట సదానందం, రామిడి లక్ష్మీకాంత్, ఆర్నె సతీష్, చంద్రమౌళి, పైథార్ ఓదెలు, కొండ కుమార్ ,మణి ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి గడ్డం వివేక్ మృత కుటుంబాలను పరామర్శించారు….

పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రెండవ వార్డ్ మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్, మాజీ ఎంపిటిసి కళ్యాణ్ ల తల్లి పుల్లూరి భీమక్క ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను శనివారం చెన్నూర్ ఎమ్మెల్యే,రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. భీమక్క చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి సానుభూతి తెలిపారు. అమ్మ గార్డెన్ ఏరియాలో నివాసముండే ఐఎన్టీయూసీ నాయకులు చందుపట్ల సంజీవరెడ్డి తండ్రి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని సైతం మంత్రి వివేక్ పరామర్శించారు. సంజీవరెడ్డి తండ్రి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శ్రీనివాస్ నగర్ లో నివాసం ఉండే నవీన్ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. నవీన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, గోపతి భానేష్,బత్తుల వేణు, కుర్మ సురేందర్, పల్లె దినేష్,చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు..

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

చాకలి ఐలమ్మ 40 వ వర్ధంతి వేడుకలు రామకృష్ణాపూర్ పట్టణంలో బీజోన్ రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. బి జొన్ రజక సంఘం అధ్యక్షులు నడిగోట తిరుపతి, గౌరవ అధ్యక్షులు మణికంఠ రాజయ్య, ముఖ్య అతిధులు, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి లు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటం, రజాకార్ల ఉద్యమం, భూస్వామ్య, పెత్తందారుల విధానాలకు విరోచితంగా పోరాటాలు చేసిన ఘనత చాకలి ఐలమ్మదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి కంచర్ల శ్రీనివాస్, కార్యదర్శి నాగరాజు, ప్రధాన కార్యదర్శి కనకయ్య, సమ్మయ్య, జిల్లా అధ్యక్షులు తంగళ్ళపల్లి వెంకటేష్, కార్యదర్శి రాములు, సహాయ కార్యదర్శి కళావతి ,వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమంతు, మున్సిపల్ మాజీ వర్డ్ కౌన్సిలర్ పోగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

ఘనంగా మిలాద్ ఉన్ నబి వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-08T140955.442.wav?_=1

 

ఘనంగా మిలాద్ ఉన్ నబి వేడుకలు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజును పురస్కరించుకొని రామకృష్ణాపూర్ పట్టణంలోని జామ మసీదు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పురవీధులు గుండా, ప్రధాన చౌరస్తాల మీదుగా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. భక్తి గీతాలను ఆలపిస్తూ పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు సయ్యద్ అఫ్జల్ లాడెన్, షేక్ షఫీ, మహమ్మద్ తాజుద్దీన్, సేవత్, ఖలీమ్, గౌస్, రెహమద్, ముజాహిద్, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రామకృష్ణాపూర్ గణేష్ మండపాల్లో అన్నప్రసాద వితరణ…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T165118.924.wav?_=2

రామకృష్ణాపూర్ పట్టణంలోని గణేష్ మండపాలలో అన్నప్రసాద వితరణ..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్ హట్స్ ఏరియాలో సిద్ది గణేష్ మండలి గణపతి మండపం వద్ద నవరాత్రుల సందర్భంగా గురువారం కమిటి సభ్యులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు. జవహర్ నగర్ లక్ష్మీ గణేష్ మండలి నిర్వాహకులు సైతం అన్న ప్రసాద వితరణ చేపట్టారు.

 

క్యాతనపల్లి మున్సిపల్ కమీషనర్ రాజు,ఆర్కేపి ఎస్సై రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు,టిపిసిసి సభ్యులు పి రఘునాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, బింగి శివ కిరణ్, ఎర్రబెల్లి రాజేష్ లు విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. పట్టణంలోని భక్తులు అన్నదాన ప్రసాద వితరణలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

మరణించిన ఉపాధ్యాయుడి కుటుంబాన్ని పరామర్శించిన అబ్ధుల్ అజీజ్..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T142711.214-1.wav?_=3

 

మరణించిన ఉపాధ్యాయుడి కుటుంబాన్ని పరామర్శించిన అబ్ధుల్ అజీజ్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపుర్ పట్టణం లోని శ్రీనివాస నగర్ లో నివాసం ఉంటున్న నవీన్ నిన్న సాయంత్రం వ్యక్తి గత కారణలవలన వారు నివసిస్తున్న ఇంటిలో ఉరి వేసుకొని బలవన్మరణం చేసుకోవడం జరిగింది. నవీన్ గత రెండు నెలల నుంచి తవక్కల్ పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తవక్కల్ విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ… నవీన్ మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటని, తమ తవక్కల్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న నవీన్ కుమారుడు ప్రియాంష్ కు తమ పాఠశాలలో 10వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తానని, అవసరమైతే భవిష్యత్తులో ఉన్నత విద్యకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని నవీన్ కుటుంబానికి భరోసా కల్పించారు.

ఎస్ఆర్కె పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T135338.011.wav?_=4

ఎస్ఆర్కె పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని ఎస్ఆర్కె పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు పెద్దపల్లి ఉప్పలయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి మాట్లాడారు… ఉపాధ్యాయ వృత్తి నుంచి భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా ఎదిగిన తనను మేమందరం ఆదర్శంగా తీసుకొని భారత దేశ అభ్యున్నతి కోసం పాటుపడతామని తెలిపారు.

 

ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులందరికీ బహుమతులు అందించారు. పాఠశాల ఉపాధ్యాయులును అందరినీ శాలువాలతో సత్కరించి, విద్యార్థుల భవిష్యత్తు కోసం హర్నిశలు కృషి చేయాలని వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోల శ్రీనివాస్,డోకూరి సోమశేఖర్, అంబాల రాజేందర్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

భారతదేశ సంస్థగా సింగరేణి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T123359.080.wav?_=5

 

భారతదేశ సంస్థగా సింగరేణి…

సింగరేణి వివిధ దేశాలలో విస్తరిస్తాం…

రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తే ప్రధాన లక్ష్యం…

గనుల్లో భద్రత పెంపుకు పటిష్ట చర్యలు…

సింగరేణి సిఎండి ఎన్ బలరాం నాయక్…

ప్రమాద రహిత సంస్థగా సింగరేణిని తీర్చిదిద్దాలి…

డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్ థా…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

సింగరేణి గనుల్లో భద్రత పెంపుదలకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, సంస్థలో పనిచేసే కార్మికులే సింగరేణికి కొండంత బలమని, కార్మిక సంఘాలు చేసిన సూచనలు పరిగణలోకి తీసుకొని అవసరమైన చర్యలను తక్షణమే తీసుకుంటామని సింగరేణి సిఎండి ఎన్ బలరాం నాయక్ అన్నారు. మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఎంఎన్ఆర్ గార్డెన్ లో సింగరేణి 55వ రక్షణ పక్షోత్సవాల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి డీజీఎం ఎస్ ఉజ్వల్ థా, సౌత్ జోన్ డీజీఎం కన్నన్ లతో కలిసి ముఖ్య అతిథులుగా సీఎండీ ఎన్ బలరాం నాయక్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. సింగరేణి సంస్థను భారతదేశంలో విస్తరింప చేసేందుకు కృషి చేస్తున్నామని, సోలార్ రంగంలో అడుగు పెట్టడం జరిగిందని, ఒడిశా రాజస్థాన్లో ఇప్పటికే విస్తరించగా రానున్న రోజుల్లో కర్ణాటకలో బంగారం, రాగి గనుల తవ్వకం పనుల్లో నిమగ్నం అవుతుందని తెలియజేశారు. ఇతర రాష్ట్రాలలో విస్తరిస్తున్న సింగరేణి సంస్థ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిలో కొత్త గనులు రాకుంటే సంస్థ మునగడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదంలో పడుతుందని, సంస్థ మనుగడను కాపాడుకోవాలంటే బొగ్గు గనుల వేలం పాటలో పాల్గొనాల్సిందేనని అన్నారు. విదేశాల్లోనూ సంస్థ ఖ్యాతిని ఇనుమడింపచేసేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సంస్థ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటూనే గని కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. సంస్థలో బొగ్గు ఉత్పత్తి కన్నా సంస్థను కాపాడే కార్మికుల ప్రాణాలు ముఖ్యమని స్పష్టం చేశారు. ఎక్కువ ప్రమాదాలు పనిలో అప్రమత్తంగా లేకుండా ఉన్న సమయాలలోనే జరుగుతున్నాయని అన్నారు. ప్రమాద రహిత సంస్థగా సింగరేణినీ తీర్చిదిద్దరమే కాకుండా, ఆరోగ్యకరంగా కూడా మార్చాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడి పై, ఉద్యోగి పై ఉందని స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే సింగరేణిలో ప్రమాదాలు చాలావరకు తగ్గాయని, రక్షణపై సింగరేణి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని అన్నారు. సింగరేణి సంస్థలోకి మహిళా ఉద్యోగులు రావడం శుభ సూచకమని పేర్కొన్నారు. కార్మికులకు దసరా, దీపావళి పండుగల బోనస్ లు సకాలంలో అందేలా చూస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్ లో సింగరేణి వ్యాప్తంగా నిర్వహించిన భద్రత పక్షోత్సవాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆయా డిపార్ట్మెంట్ లకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకన్న, పోట్రూ, గౌతమ్, సేఫ్టీ జిఎం చింతల శ్రీనివాస్, శ్రీరాంపూర్ జిఎం ఎం శ్రీనివాస్, సిఎంఓఏఐ లక్ష్మీపతి గౌడ్, గుర్తింపు సంఘం అధ్యక్షులు సీతారామయ్య, ప్రాతినిధ్య సంఘం అధ్యక్షులు జనప్రసాద్, వివిధ ఏరియాల జిఎంలు, అధికారులు, కార్మికులు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తారక గణపతి మండపంలో సామూహిక కుంకుమార్చన…

తారక గణపతి మండపంలో సామూహిక కుంకుమార్చన…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల తారకరామ కాలనీ, తారక గణేశ్ మండలి ఆధ్వర్యంలో మహిళా సోదరిమణులచే సామూహిక కుంకుమార్చన, పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ పూజ కార్యక్రమం లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు చిట్టంపల్లి శ్రీనివాస్, ఆవునూరి తిరుపతి, కుదిరే సతీష్, పూదరి కృష్ణ, పూదరి వంశీ, నవీన్, ల్యాగల్ శ్రీనివాస్, బిక్షపతి, సదానందం తదితరులు పాల్గొన్నారు.

5 వ తేదీనే గణేష్ నిమజ్జనం

గత 30 సంవత్సరములుగా రామకృష్ణాపూర్ పట్టణంలో నవరాత్రులు జరుపుకున్న తెల్లవారి నిమజ్జనం చేయడం పరిపాటని దీనికి అనంత చతుర్దశి తో సంబంధం లేదని శ్రీ కోదండ రామాలయం ఆలయ ప్రధాన అర్చకులు అంబ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు మంగళవారం అయినా శుక్రవారం అయినా తప్పులేదు కాబట్టి ఎల్లరు నవరాత్రి తదనంతరం శుక్రవారం రోజున అనగా ఐదవ తారీకు రోజున గణపతి నిమజ్జనం చేయవలసిందిగా అన్ని గణేష్ ఉత్సవ మందిర కమిటీలకు విజ్ఞప్తి చేశారు

శ్రీ సాయి గణేష్ మండలి గణపతి వద్ద సామూహిక కుంకుమార్చన…

శ్రీ సాయి గణేష్ మండలి గణపతి వద్ద సామూహిక కుంకుమార్చన…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

గణపతి నవరాత్రోత్సవాల సమయంలో కుంకుమపూజ అనేది ఒక ముఖ్యమైన ఘట్టం, అందులో భాగంగానే క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7 వ వార్డ్ గద్దెరాగడి లో శ్రీ సాయి గణేష్ మండలి గణపతి మండపం వద్ద సామూహిక కుంకుమార్చన కార్యక్రమం శ్రీ సాయి గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో పసుపు, కుంకుమ ముఖ్యమైనవి, ఇవి గణేశుడికి, గౌరీదేవికి అలంకరణలో భాగంగా ఉపయోగిస్తారు.హిందూ సంప్రదాయంలో, పసుపు, కుంకుమ అనేవి పూజా ఆచారాలలో ఒక భాగం. ఇవి సౌభాగ్యాన్ని,శ్రేయస్సును సూచిస్తాయి.గణపతి నవరాత్రోత్సవాల్లో, గణేశుడికి పసుపు, కుంకుమతో అలంకరించి పూజలు నిర్వహించడం ఆనవాయితీ అని శ్రీ సాయి గణేష్ మండలి సభ్యులు తెలిపారు.

అంజనీ పుత్ర ఆధ్వర్యంలో ఘనంగా అన్న దాన కార్యక్రమం…

అంజనీ పుత్ర ఆధ్వర్యంలో ఘనంగా అన్న దాన కార్యక్రమం…

అన్నదాతా సుఖీభవ అంటూ భక్తుల ఆశీర్వచనాలు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు న అంజనీపుత్ర ఎస్టేట్స్ ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న
ప్రజలు అన్నదాతా సుఖీభవ అంటూ భక్తులు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ.. అన్ని దానాల్లో అన్న దానం గొప్పదని. సామాజిక కార్యక్రమాలలో అంజనీ పుత్ర సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు.
గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల్లో అంజనీ పుత్ర అన్నదాన కార్యక్రమాలకు ప్రత్యేక స్థానం ఏర్పడిందని అన్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అంజనీ పుత్ర గణపతి మండపం గురించి ప్రత్యేకంగా చర్చించుకునేలా వసతులను వారు కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో అంజనీ పుత్ర సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు సూరినేనీ కిషన్, కాసర్ల సదాందం, డైరెక్టర్ లు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

కొలువుదీరిన బొజ్జ గణపతులు..

కొలువుదీరిన బొజ్జ గణపతులు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

తొమ్మిది రోజులపాటు ఘనంగా పూజలు అందుకోనున్న గణనాథుడు రామకృష్ణాపూర్ పట్టణంలో వివిధ మండపాలలో కొలువ తీరాడు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ గార్డెన్, తిమ్మాపూర్ , కుర్మపల్లి,క్యాతనపల్లి, శేషు పల్లి, అమరవాది, రామకృష్ణాపూర్ ఏరియాలలో భాజా భజంత్రీలు, మంగళహారతుల మధ్య చిన్న పెద్ద తేడా లేకుండా వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. కొలువుదీరిన గణనాథులకు వేద పండితులు, నవగ్రహ పూజలతో ప్రజలు , పుర ప్రముఖులు పూజలు నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పట్టణంలో ప్రముఖ వినాయక మండపాల్లో మట్టి వినాయకులను ప్రతిష్టించారు.వినాయక విగ్రహాల ఏర్పాటుతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడి, చిన్నా పెద్దా అంతా భక్తితో పూజలు నిర్వహించారు.

చెన్నూర్‌లో బాల్క సుమన్ కాంగ్రెస్ పరిపాలనపై విమర్శ…

కాంగ్రెసోళ్ళు ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కారు…

కాంగ్రెస్ కర్కశ పరిపాలనలో పథకాలకు ఎగనామం పెడుతున్నారు…

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

10 ఏండ్ల బిఆర్ఎస్ పరిపాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కొనసాగించారని , ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలన కర్కశ పరిపాలనగా కొనసాగుతోందని ,గడిచిన 20 నెలలుగా ఎలాంటి అభివృద్ధి పనులకు నియోజక వర్గం నోచుకోలేదని, ఏ ఒక్క హామీని నిలబెట్టుకోవడం లేదని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. సోమవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాల్క సుమన్ నివాసంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమీక్ష సమావేశంలో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ తో కలిసి పాల్గొన్నారు.నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల, మున్సిపాలిటీల కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడారు. పరిపాలన అప్పుడే మంచిగుండే మా పోరాటం మా గ్రామం నుండే అనే నినాదంతో నియోజకవర్గంలో విస్తృతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని , అందులో భాగంగానే ఈ నెల 28 న చెన్నూర్, భీమారం, జైపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి ఏరియాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

Congress Governance

గడిచిన 20 నెలల కాలంలో కాంగ్రెస్ పరిపాలన అధ్వానంగా తయారయిందని, ఇక ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో నూతన ఫ్యాక్టరీలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ,యువతకు 45 వేల ఉద్యోగ అవకాశాలు సైతం కల్పించేందుకు కృషి చేస్తానని ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి గద్దెనెక్కారని ,పదవి వచ్చాక ఉద్యోగాల ఊసే లేదని, తన ఇంట్లో మాత్రం రెండు ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బి ఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.చెన్నూర్ ప్రాంత కాంగ్రెస్ నాయకులు బాల్క సుమన్ సమక్షంలో పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పట్టణంలో వెలిసిన అమ్మవారి విగ్రహం….

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T153958.695-1.wav?_=6

పట్టణంలో వెలిసిన అమ్మవారి విగ్రహం….

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కే వన్ మోరీ ఏరియాలో గల బతుకమ్మ ఘాట్ సమీపంలో అమ్మ వారి విగ్రహం వెలిసింది.గత ఏడాది క్రితం నుండి ఈ ప్రాంతంలో అమ్మవారు ఉన్నట్లు మహిళ భక్తురాలు చెప్తున్నట్లు స్థానికులు అంటున్నారు. శుక్రవారం అమ్మ వారి భక్తురాలు దుర్గా మాతను నెలకొల్పే ప్రాంతంలో అమ్మవారు ఉన్నట్లు తెలుపడంతో స్థానికులు, పూజారి గోల సాయినాథ్ వెళ్ళి చూడగా అమ్మవారి విగ్రహం ప్రత్యక్షమై వెలసినట్లు తెలుపుతున్నారు.అమ్మవారి విగ్రహం వెలువడంతో పట్టణంలోని ప్రజలు విగ్రహాన్ని తిలకించేందుకు భారీగా తరలి వచ్చారు. అనంతరం పూజారి గోల సాయినాథ్ మాట్లాడారు. లోక కళ్యాణార్థం అమ్మవారు ఈ ప్రాంతంలో వెలిశారని,అమ్మవారికి గుడి నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరుతున్నారు. గుడి నిర్మించి పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం పట్టణంలోని ప్రతి ఒక్కరిపై ఉంటుందని తెలిపారు. స్థానిక నాయకులు కంబగౌని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ… త్వరలోనే పురోహితుల సమక్షంలో అమ్మవారి గుడిని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించేలా చొరవ తీసుకుంటామని అన్నారు.

వర్తక సంఘ నూతన అధ్యక్షులుగా ఆడెపు కృష్ణ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T125458.443.wav?_=7

 

వర్తక సంఘ నూతన అధ్యక్షులుగా ఆడెపు కృష్ణ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణ బిజోన్ వర్తక సంఘం నూతన అధ్యక్షులుగా ఆడెపు కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గాన్ని శ్రీలక్ష్మి గణేష్ మండపం వద్ద వర్తక సంఘం సభ్యులు ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి కొండ కుమార్, కోశాధికారి ఏముల దేవేందర్ రెడ్డి,
సహాయ కార్యదర్శి గోక శ్రీనివాస్, ప్రచార ప్రతినిధి పరికిపండ్ల రాజు, గౌరవ అధ్యక్షులు పాలకుర్తి గంగాజలం,గౌరవ సలహాదారులు ఆడెపు లక్ష్మణ్, వెంగళదాసు సత్యనారాయణ, బత్తుల శ్రీనివాస్,ఆడెపు తిరుపతి, ఉపాధ్యక్షులు గుండా రమేష్ కేతుపల్లి నారాయణరెడ్డి కొక్కుల సతీష్ గడ్డం శ్రీనివాస్, బండి మల్లేష్ లను ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఆడెపు కృష్ణ మాట్లాడారు. బి జోన్ వర్తక సంఘం సభ్యుల సమస్యల పరిష్కారానికి తోడ్పడతానని,వర్తక సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక చేయూత…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-72.wav?_=8

సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక చేయూత…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణపూర్ పట్టణంలోని మల్లికార్జున నగర్ కి చెందిన సంధవేణి నాగమణి కి ఒక్కసారిగా హై బిపి వచ్చి, మెదడులో నరం తెగి రక్తం గడ్డ కట్టడంతో వారు, కరీంనగర్ లోని కెల్విన్ హాస్పిటల్ లో అడ్మిట్ చేసి ఆర్ధిక ఇబ్బందుల కారణంగా వారు సిరి ఫౌండేషన్ ను సంప్రదించగా వారు దాతల ద్వారా సేకరించిన 12,150 రూపాయలను సిరి ఫౌండేషన్ సభ్యులు వారి ఇంటికి వెళ్లి నాగమణి కుమారుడు సంతోష్ కు అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిస్సహాయ స్థితిలో ఉండి సహాయం కోసం ఎదురు చూసే, ప్రతి ఒక్కరికి సిరి ఫౌండేషన్ అండగా నిలుస్తుంది అని అన్నారు, నేటి యువత సేవా కార్యక్రమలలో ముందుడాలని నాగమణి గారి చికిత్స కోసం విరాళాలు అంధిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిరి ఫౌండేషన్ కార్య వర్గ సభ్యులు ఉప్పు శేఖర్, సంతోష్ కుమార్,స్థానిక నాయకులు అర్నె సతీష్, జీలకర మహేష్, సుధాకర్ పాల్గొన్నారు.

సింగరేణి ఈ అండ్ ఎం డైరెక్టర్ దంపతులకు ఘన సన్మానం…

సింగరేణి ఈ అండ్ ఎం డైరెక్టర్ దంపతులకు ఘన సన్మానం…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ఈ నెలలో ఉద్యోగ విరమణ చేయబోతున్న సింగరేణి ఈ అండ్ ఎం డైరెక్టర్ సత్యనారాయణ దంపతులను మంగళవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ సబ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో కమిటి సబ్యులు చేసిన కృషి అభినందనీయమన్నారు. దేవాలయంతో తనుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉద్యోగ విరమణ అయినప్పటికీ ఆలయ అభివృద్ధిలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ జిఎం ఎం.శ్రీనివాస్ దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, కృష్ణ, కుమారస్వామి, పాల్గొన్నారు.

సింగరేణి కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-3-5.wav?_=9

సింగరేణి కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి..

కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ సుభిక్షంగా ఉంటుంది…

మందమర్రి జిఎం దేవేందర్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

సింగరేణి సంస్థలో పనిచేసే అధికారుల, కార్మికుల, వారి కుటుంబ సభ్యుల, రిటైర్డ్ కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సాధించిందని కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ అన్నారు. రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కార్మికుల సౌకర్యార్ధం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు జిఎం తెలిపారు. అనంతరం జిఎం దేవేందర్ మాట్లాడారు.

Singareni Focus on Workers’ Health

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత పై దృష్టి సారిస్తూనే కార్మికుల ఆరోగ్యం పై సైతం యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, కార్మికుల ఆరోగ్యం పై తగు జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రుల నుండి కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, యూరాలజిస్ట్, గ్యాస్ట్రో వైద్య నిపుణులను రామకృష్ణాపూర్ ఆస్పత్రికి ప్రత్యేకంగా రప్పించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్య పరీక్షలలో సమస్యలు ఉన్నవారికి ప్రత్యేక వైద్యం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఫిట్ సెక్రటరీలు నాగేంద్ర బట్టు, వైద్యులు,సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version