శ్రీ సాయి గణేష్ మండలి గణపతి వద్ద సామూహిక కుంకుమార్చన…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
గణపతి నవరాత్రోత్సవాల సమయంలో కుంకుమపూజ అనేది ఒక ముఖ్యమైన ఘట్టం, అందులో భాగంగానే క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7 వ వార్డ్ గద్దెరాగడి లో శ్రీ సాయి గణేష్ మండలి గణపతి మండపం వద్ద సామూహిక కుంకుమార్చన కార్యక్రమం శ్రీ సాయి గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో పసుపు, కుంకుమ ముఖ్యమైనవి, ఇవి గణేశుడికి, గౌరీదేవికి అలంకరణలో భాగంగా ఉపయోగిస్తారు.హిందూ సంప్రదాయంలో, పసుపు, కుంకుమ అనేవి పూజా ఆచారాలలో ఒక భాగం. ఇవి సౌభాగ్యాన్ని,శ్రేయస్సును సూచిస్తాయి.గణపతి నవరాత్రోత్సవాల్లో, గణేశుడికి పసుపు, కుంకుమతో అలంకరించి పూజలు నిర్వహించడం ఆనవాయితీ అని శ్రీ సాయి గణేష్ మండలి సభ్యులు తెలిపారు.