మరణించిన ఉపాధ్యాయుడి కుటుంబాన్ని పరామర్శించిన అబ్ధుల్ అజీజ్..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపుర్ పట్టణం లోని శ్రీనివాస నగర్ లో నివాసం ఉంటున్న నవీన్ నిన్న సాయంత్రం వ్యక్తి గత కారణలవలన వారు నివసిస్తున్న ఇంటిలో ఉరి వేసుకొని బలవన్మరణం చేసుకోవడం జరిగింది. నవీన్ గత రెండు నెలల నుంచి తవక్కల్ పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తవక్కల్ విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ… నవీన్ మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటని, తమ తవక్కల్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న నవీన్ కుమారుడు ప్రియాంష్ కు తమ పాఠశాలలో 10వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తానని, అవసరమైతే భవిష్యత్తులో ఉన్నత విద్యకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని నవీన్ కుటుంబానికి భరోసా కల్పించారు.