చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి…

చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి

ఐఎఫ్ టియుసి నాయకుడు చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

సుభాష్ కాలనీ బస్టాండ్ వద్ద చిట్యాల చాకలి ఐలమ్మ 40 వర్ధంతి వేడుకల్లో పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఐఎఫ్ టియుసి రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిట్యాల చాకలి ఐలమ్మ జన్మించి దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా మహిళ అయి ఉండి పోరాటాలు చేసి విజయాన్ని సాధించారు మహిళలు ఇండ్ల నుండి బయటికి రాని కాలంలోనే వీరవనితగా దొరలు భూస్వాములను తరిమి కొట్టి వారికి ఉండబడిన భూములను ప్రజలకు పంచిన విప్లవ వీర వనిత చాకలి ఐలమ్మ ఆశయాలను మనందరం కొనసాగించాలి అని వారు అన్నారు

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు..

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

చాకలి ఐలమ్మ 40 వ వర్ధంతి వేడుకలు రామకృష్ణాపూర్ పట్టణంలో బీజోన్ రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. బి జొన్ రజక సంఘం అధ్యక్షులు నడిగోట తిరుపతి, గౌరవ అధ్యక్షులు మణికంఠ రాజయ్య, ముఖ్య అతిధులు, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి లు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటం, రజాకార్ల ఉద్యమం, భూస్వామ్య, పెత్తందారుల విధానాలకు విరోచితంగా పోరాటాలు చేసిన ఘనత చాకలి ఐలమ్మదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి కంచర్ల శ్రీనివాస్, కార్యదర్శి నాగరాజు, ప్రధాన కార్యదర్శి కనకయ్య, సమ్మయ్య, జిల్లా అధ్యక్షులు తంగళ్ళపల్లి వెంకటేష్, కార్యదర్శి రాములు, సహాయ కార్యదర్శి కళావతి ,వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమంతు, మున్సిపల్ మాజీ వర్డ్ కౌన్సిలర్ పోగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలి…

చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలి

జిల్లా కలెక్టర్  సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్బంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ బుధవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్  సందీప్ కుమార్ ఝా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని ,తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని చూపిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, వివిధ శాఖల అధికారులు,సిబ్బంది, రజక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version