పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రెండవ వార్డ్ మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్, మాజీ ఎంపిటిసి కళ్యాణ్ ల తల్లి పుల్లూరి భీమక్క ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను శనివారం చెన్నూర్ ఎమ్మెల్యే,రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. భీమక్క చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి సానుభూతి తెలిపారు. అమ్మ గార్డెన్ ఏరియాలో నివాసముండే ఐఎన్టీయూసీ నాయకులు చందుపట్ల సంజీవరెడ్డి తండ్రి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని సైతం మంత్రి వివేక్ పరామర్శించారు. సంజీవరెడ్డి తండ్రి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శ్రీనివాస్ నగర్ లో నివాసం ఉండే నవీన్ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. నవీన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, గోపతి భానేష్,బత్తుల వేణు, కుర్మ సురేందర్, పల్లె దినేష్,చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.