గూడు లేని నిరుపేదలను గుర్తించండి..
*సొంతింటి కలను సాకారం చేయండి..
*ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పనిచేయండి..
*అధికారులకు దిశా నిర్దేశం చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్..
*లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు..
చిత్తూరు(నేటిధాత్రి)నవంబర్
గూడు లేని నిరుపేదను గుర్తించి, వారి సొంతింటి కలను సాకారం చేయాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ జిల్లా యంత్రాంగానికి సూచించారు. అదే సమయంలో ప్రభుత్వ ఆశయానికనుగుణంగా పనిచేసి ,కూటమి సర్కార్ ప్రతిష్టను పెంచాలని తెలియజేశారురాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టిన
నేపధ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, అధికారంలోకి వచ్చిన 17 నెలల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 3 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించిన విషయం విదితమే.., బుధవారం సామూహిక గృహ ప్రవేశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు అన్నమయ్య జిల్లా నుంచి వర్చువల్ విధానంలో లాంఛనంగా ప్రారంభించారుఈ సందర్భంగా చిత్తూరు అర్బన్, తిమ్మసముద్రంలో నిర్వహించిన నూతన గృహాలకు సంబంధించి , లబ్ధిదారులకు తాళాలు అప్పజెప్పే కార్యక్రమానికి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్ మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్,నగర మేయర్ కుమారి అముద, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు,చుడా ఛైర్పర్సన్ కఠారి హేమలత తదితరులు హాజరై.., లబ్ధిదారులకు స్వయంగా తాళాలను అందజేశారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో చిత్తూరు ఎం.పి. దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడారు.
నిరుపేదల కడగండ్లను తీర్చడమే కూటమి సర్కార్ లక్ష్యం అన్నారు. అధికారి యంత్రం కూడా ఆ దిశగా పనిచేయడం అభినందనీయమన్నారు. అర్హులైన నిరుపేదల సొంతింటి కలను సహకారం చేసే దిశగా తమ వంతు కృషి చేస్తామన్నారు. మరి ముఖ్యంగా అధికారులు ప్రభుత్వ ఆశయాన్ని గుర్తించి, అందుకు అనుగుణంగా తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని వారు సూచించారు. అప్పుడే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు టీడీపీ పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బాబు, కార్పోరేటర్ అశోక్, నగర టిడిపి అధ్యక్షుడు నరేష్, నాయకులు గోపాల కృష్ణ,,రాణేమ్మ, రాజశేఖర్ నాయుడు, కూటమి నాయకులు,కార్యకర్తలు, జిల్లా హౌసింగ్ శాఖ అధికారులు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు..
