ముఖ్యమంత్రి సహాయనిధిని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 19 :
పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక గొప్ప వరమని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని దేవరయాంజాల్ చెందిన సుతారిగూడెం జగన్ మోహన్ ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ.60,000/-ల చెక్కును శుక్రవారం అందజేశారు. ఈ సందర్బంగా అయన అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ తిరుపతి శంకర్ గౌడ్, శ్రీ సీతారామ స్వామి దేవస్థానం చైర్మన్ పేండం లక్ష్మి నారాయణ, దేవస్థానం ధర్మకర్తలు వలందాసు మురళి గౌడ్, గుడిసేని హరికృష్ణ, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు పేండం సాయి, మనీష్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి నుండి తనకు రూ.60,000/-ల ఆర్థిక సహాయం మంజూరు చేయించడంలో సహకరించిన రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ గారికి,జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి గారికి లబ్ధిదారుడు సుతారిగూడెం జగన్ మోహన్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
