చెక్కుల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులు.
చెక్కులు పంపిణీ చెయ్యాలని వేడుకలు
నిజాంపేట: నేటి ధాత్రి
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద పేదింటి పెళ్లి కోసం కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. ఒక ఆడపిల్ల పెళ్లి చేసే తండ్రి కి కొంతమేర సహాయంగా కల్యాణ లక్ష్మి ఉపయోగపడుతుందనీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మేరకు మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదింటి తల్లిదండ్రులు ఆడబిడ్డకు పెళ్లి చేశారు. కల్యాణ లక్ష్మికి అప్లై చేసినప్పటికీ సుమారు ఐదు, ఆరు నెలలుగా చెక్కులు పంపిణీ చేయడం లేదు. ఇది అధికారుల నిర్లక్ష్యమా! ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యమా! అనే సందేహాలు ప్రజల్లో మొదలయ్యాయి. వెయ్యి కళ్ళతో కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తూ ఉన్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి వెంటనే కల్యాణ లక్ష్మి చెక్కులను అందివ్వాలని లబ్ధిదారు లు వేడుకుంటున్నారు.
