బాలానగర్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

బాలానగర్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

జడ్చర్ల / నేటి ధాత్రి.

 

జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండల కేంద్రంలోని జనార్దన్ రెడ్డి కాంప్లెక్స్‌లో సోమవారం భారతీయ జనతా 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షుడు గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో.. నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1980లో ఏర్పడినప్పుడు 2 సీట్లతో ప్రారంభమై, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు.పార్టీ సిద్ధాంతం ప్రకారం “దేశ ప్రథమం” నినాదంతో, జాతీయవాదం, సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో.. మండల బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు మల్లేష్ , శ్రీనివాస్ కార్యదర్శి బాలరాజు, జిల్లా కౌన్సిలర్ మెంబర్ శ్రీశైలం, బీజేపీ సీనియర్ నాయకులు నర్సింలు,యాదయ్య, సామ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

దేశం కోసం ధర్మం కోసం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ బిజెపి.

దేశం కోసం ధర్మం కోసం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ బిజెపి.

బిజెపి మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్.

చిట్యాల, నేటిదాత్రి :

భారతదేశంలో ఆదర్శాలకు సంస్కృతికి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ బిజెపి అని చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్* అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భారతీయ జనతా పార్టీ జన సంఘ్* , జనతా పార్టీ* నుండి 1980 ఏప్రిల్ 6వ తేదీన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి*, లాల్ కృష్ణ అద్వాని నేతృత్వంలో ఆవిర్భంచి నేటికీ 46 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ జెండాను చిట్యాల మండల కేంద్రంలో గల బీజేపీ కార్యాలయంలో బిజెపి జెండా ఎగరవేయడం జరిగిందిఅని సిద్ధాంతాలకు* కట్టుబడి పనిచేస్తూ ప్రపంచంలోనే* ఎక్కువ సభ్యత్వాలు గలఅతిపెద్ద పార్టీగా బిజెపి అవతరించిందని 2 పార్లమెంటు సీట్లతోనే ప్రారంభమై వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అధికారంలో ఉండి అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దని 500 సంవత్సరాల క్రితం నెరవేరని అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ఈరోజు దేశభక్తిని ప్రతి పౌరునికి అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని దేశం కోసం ధర్మం* కోసం దేశ ప్రజల శ్రేయస్ కోసం బిజెపి పనిచేస్తుందని ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీనీ ఆదరించాలని వెంకటేష్ గౌడ్ అన్నారు
ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ బిజెపి సీనియర్ నాయకులు గజానాల రవీందర్ ఓదెల శ్రీహరి సాదా సదానందం గుర్రపు రవి రాయిని శ్రీనివాస్ చింతల రాజేందర్ కేంసారపు ప్రభాకర్ పల్లాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

సామూహిక గా వందే మాతరం గీతాలాపన…

సామూహిక గా వందే మాతరం గీతాలాపన

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

దేశభక్తిని మరింతగా పెంపొందించే కార్యక్రమంగా వందే మాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సామూహిక వందేమాతర గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రజలలో దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి, భారత చరిత్రలో వందే మాతరం గీతానికి ఉన్న విశిష్ట స్థానాన్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన వివరించారు.

ఇలాంటి కార్యక్రమాలు నిర్వహణ పట్ల ప్రజల్లో ఉత్సాహం గుండెల నిండుగా జాతీయ భావం నెలకొందని ఆయన వెల్లడించారు. జాతీయ భావన, ఐక్యత, సామూహిక భావం పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఐక్యతకు దోహదపడతాయని తెలిపారు. వందేమాతర గీతం భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రజల్లో దేశభక్తి భావాన్ని రగిలించిన గీతమని, స్వాతంత్ర్య సమరయోధులందరిలో ఉత్సాహానికి, శక్తికి ప్రతీకగా నిలిచిందని ఆయన గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది
తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version