దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిన పార్టీ బీజేపీ
#మండలంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు.
#తడుక అశోక్ గౌడ్ సీనియర్ నాయకుడు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి సీనియర్ నాయకుడు తడుక అశోక్ గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అశోక్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న స్థాపించబడినప్పటి నుండి సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించింది. ప్రారంభ దశలో కేవలం 2 ఎంపీ స్థానాలతో ప్రారంభమైన పార్టీ, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ క్రమంగా తన బలాన్ని పెంచుకుందని,అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన సత్తాను చాటుకున్న బీజేపీ, అనంతరం నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అఖండ విజయాలను సాధిస్తూ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ అభివృద్ధికి కొత్త దిశను చూపిందన్నారు.“సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్” అనే సిద్ధాంతంతో అన్ని వర్గాల అభ్యున్నతి కోసంల భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రంగాపురం గ్రామ సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు , మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు,మండల ఉపాధ్యక్షులు గుర్రపు నరేష్,బత్తిని కుమారస్వామి, మండల కార్యదర్శి ఓదెల అశోక్ ,కోశాధికారి మురికి మనోహర్, సీనియర్ నాయకులు వల్లే పర్వతాలు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
