కె.సి.ఆర్ ఆమరణ దీక్ష,అమరవీరుల త్యాగాల విజయ దివాస్..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T113712.199.wav?_=1

 

కె.సి.ఆర్ ఆమరణ దీక్ష,అమరవీరుల త్యాగాల విజయ దివాస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

విజయ దివాస్ డిసెంబర్ 9 సందర్భంగా , బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ & మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు ఆదేశాల మేరకు కొనింటి మాణిక్ రావు , తెలంగాణ తల్లికి పాలాభిషేకం & డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కె.సి.ఆర్ సచ్చోడో తెలంగాణ వచ్చాడో అంటూ నవంబర్29నుండి డిసెంబర్ 9 వరకు చేసిన ఆమరణ దీక్షతో కేంద్రం తెలంగాణ ప్రకటన చేసిందని కె.సి.ఆర్ రణబేరీ,ఆత్మార్పణకు సంకల్పించిన రోజు కాబట్టి డిసెంబర్9నీ విజయ దివాస్ గా జరుపుకుంటున్నామని అన్నారు.
డిసెంబర్9తర్వాత ఎన్నో ఒడిదొడుకులు,నిర్బంధాలు ఎదుర్కొని కె.సి.ఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారని కొనియాడారు.
దేశ చిత్రపటంలో మాయమైన తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా మార్చిన ఘనత కె.సి.ఆర్ గారిది అని అన్నారు. కె.సి.ఆర్ ఆమరణ దీక్ష,అమరవీరుల త్యాగాల వల్ల వచ్చిన రాష్టం నేడు తిరోగమన దశలో ఉందని ఇది భావితరాలకు ప్రమాదకరం అని ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణలో సుపరిపాలన కావాలంటే మళ్ళీ కె. సి.ఆర్ సర్కార్ రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమములో మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం, సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్, మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,యూత్ అధ్యక్షులు కళ్లెం రవి, మాజి హజ్ కమిటీ సభ్యులు యూసఫ్ సాబ్,యువ నాయకులు మిథున్ రాజ్,గణేష్, వెంకటేశం,చంద్రయ్య,నరసింహ రెడ్డి,నాగన్న పటేల్,ఇబ్రహీం,లక్ష్మీకాంత్, అలి, జుబేర్,జాఫర్,జాకీర్, అమెర్, బిఆర్ఎస్వీ నాయకులు ఫయాజ్, సాజిద్,రఘు తేజ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version