విద్యార్థులకు మొక్కల పంపిణీ • నిర్మాణాలు త్వరగా పూర్తి చెయ్యాలి. • ఎంపీడీవో రాజీరెడ్డి.
నిజాంపేట: నేటి ధాత్రి
తల్లి పేరు మీద ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పాఠశాల విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ మేరకు నిజాంపేట మండలం నగరం తాండ గ్రామంలో గ్రామ కార్యదర్శి ఆరిఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో రాజీరెడ్డి హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులకు ఒక్కొకరికి ఒక్కో మొక్కను ప్రధానం చేశారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సంధ్య, ప్రధానోపాధ్యాయులు ఉమారాణి, ఉపాధ్యాయులు వెంకటేష్, కల్పన, స్రవంతి విద్యార్థులు, గ్రామస్తులు ఉన్నారు.
రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ పథకాల ను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిఅన్నారు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయము లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో పట్నం మహేందర్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. . అనంతరం వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాల పై ప్రగతి నివేదికను అధికారులు చదివి వినిపించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, అదనపు కలెక్టర్ లు రెవెన్యూ ఖిమ్యా నాయక్, స్థానిక సంస్థలు యాదయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్, డీఎస్పీ వెంకటేశ్వర రావు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈసందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూచరిత్రలో 1948 సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 78 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ ప్రాంతం భారతదేశంలో అంతర్భాగమయిందన్నారు. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని, అందుకే ఈ రోజున తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 555 సంస్థానాలు ఇండియన్ యునియన్ లో కలిశాయి, హైదరాబాద్ సంస్థానం మాత్రం స్వతంత్ర రాజ్యాంగ ఉండేందుకు నిర్ణయించుకుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు మహాలక్ష్మి పథకం మహిళలకు వరం ప్రభుత్వం ప్రతి మహిళలను మహాలక్ష్మిగా చేయాలనే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని జిల్లాలో ఇప్పటివరకు 2 కోట్ల 38 లక్షల 68 వేల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. మొత్తం ప్రయాణికులలో 64.28 శాతం మహిళలు ప్రయాణించటం జరిగింది. ఇందుకు గాను రూ.97.54 కోట్లను ప్రభుత్వం భరించిందన్నారు. మహిళల శక్తిగా మహిళా శక్తి పథకం జిల్లాలోని మహిళా సంఘాలను బలోపేతం చేయుటకు 10 మండల మహిళా సమాఖ్యలకు 10 ఆర్టీసీ బస్సులను ఇచ్చామని వీటి ద్వారా ప్రతి మండల మహిళా సమాఖ్యకు నెలకు దాదాపుగా రూ69 వేల ఆదాయం వస్తుందని అన్నారు కొత్త రేషన్ కార్డుల మంజూరు జిల్లాలో ఇప్పటివరకు 17,490 కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయటం జరిగింది, దీని ద్వారా 45,576 మంది లబ్దిపొందారు. అలాగే ప్రస్తుత కార్డులలో కొత్తగా 29,858 మందిని చేర్చటం జరిగిందన్నారు. పేదలకు ఆరోగ్యదాయనిగా మారిన రాజీవ్ ఆరోగ్యశ్రీ:అందరికీ ఆరోగ్యం” సాధించాలనే లక్ష్యంతో, రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ పథకంలో భాగంగా 1835 రకాల జబ్బులకు వైద్య సేవలను అందిస్తున్నాము. గతంలో ఉన్న వైద్య చికిత్సల ఖర్చు పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచి ఈ ప్రభుత్వం చెల్లించటం జరుగుతుంది. వనపర్తి జిల్లాలో ఏప్రిల్ 1, 2024 నుండి ఇప్పటివరకు 15,540 మంది రూ.39.77 కోట్ల విలువైన వైద్య సేవలను వినియోగించుకున్నారన్నారు. నిరుపేదల సొంత ఇంటి కల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అమలుపరుస్తోంది. అర్హులైన ప్రతి కుటుంబానికి స్వంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తుంది. ఇప్పటివరకు జిల్లాలో 6,173 ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు ఉన్న 200 యూనిట్ల లోపు విద్యుత్ ను వినియోగించుకొనుటకు ప్రభుత్వం ఉచిత కరెంటు జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని మండలాలలో సి సి కెమెరాల ద్వారా పర్యవేక్షణ నేరాలను నియంత్రించటం జరుగుతున్నదన్నారు పోలీస్ శీ టీ o ద్వారా మహిళల కు రక్షణ కల్పించటం. సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేసి జిల్లాలో సైబర్ నేరాలను నియంత్రించటం జరుగుతుంని. జిల్లా ప్రజలు, యువత సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది అవగాహన కార్యక్రమాల నిర్వహన జిల్లా లో గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకంపై జిల్లాలో ప్రత్యేక పోలీస్ నిఘా టీమ్స్ ఏర్పాటు చేసి, ప్రత్యేక నార్కోటిక్ డాగ్స్ ద్వారా బ్లాక్ స్పాట్స్, బస్టాండ్, కళాశాలలు రద్దీ గల ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూన్నారని అన్నారు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా ప్రజలకు న్యాయమూర్తులకు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఎంపీలు ఎమ్మెల్సీ లకు,ఎమ్మెల్యే లకు , అదనపు కలెక్టర్లు జిల్లా ఎస్పీ విలేకరులకు జిల్లా అధికారులకు డి పి ఆర్ ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు
ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే
పోలిసుల గౌరవ వందనం స్వీకరించిన ప్రభుత్వ విప్
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
ప్రజా పాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఎగుర వేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల పై వివరించారు.
ఈ సందర్బంగా విప్ మాట్లాడారు. సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రోజును తెలంగాణ ప్రజా పాలన వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారత దేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర్య భారతావనిలో 60 ఏండ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్నదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తేదీ 09/12/2023న కొలువుదీరింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నది. ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది.
2047 నాటికి దేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఈ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్ 2047’. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ – 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం. ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నాను. మహిళల అభ్యున్నతే ధ్యేయంగా: ఇందిరా మహిళా శక్తిలో భాగంగా డీఆర్డీఓ, మెప్మా ఆద్వర్యంలో జిల్లాలోని ఎస్ హెచ్ జీల ద్వారా 23 ఫర్టిలైజర్ షాపులు ప్రారంభించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 7వేల 111 లక్ష్యానికి గాను ఇప్పటిదాకా 1 వెయ్యి 586 యూనిట్లను గుర్తించి 200 కోట్ల బ్యాంక్ రుణాలు ఇవ్వడం జరిగింది. శ్రీనిధి ద్వారా రూ.68 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటిదాకా రూ. 25 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది. 5వేల 691 యూనిట్లు లక్ష్యం కాగా, వెయ్యి 607 యూనిట్లు గ్రౌండింగ్ చేయడం జరిగింది. చేయూత పింఛన్లు జిల్లాలో లక్ష 17 వేల 370 మంది పించన్ దారులకు ప్రతి నెలా రూ.25 కోట్ల 73 లక్షలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎస్ హెచ్ జీ మహిళలకు చీరలు: సిరిసిల్లలోని నేతన్నలకు చేతి నిండా పనితో భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 64 లక్షల 7౦ వేల మందికి పైగా ఉన్న ఎస్ హెచ్ జీ సభ్యులకు ఏడాదికి ఉచితంగా రెండు ఏకరూప చీరల కోసం 4 కోట్ల 30 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ సిరిసిల్ల మరమగ్గాలకు కేటాయించడం జరిగినది. దీని ద్వారా జిల్లాలోని మరమగ్గాల ఆసాములు, కార్మికులు, అనుబంధ కార్మికులకు 8 నుంచి 10 నెలల వరకు ఉపాధి దొరుకుతున్నది. సన్న బియ్యం పంపిణీ: పీడీఎస్ వ్యవస్థ పేదల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీని ప్రారంభించింది. రాష్ట్రంలో 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం అందించడం జరుగుతున్నది. లక్ష 77 వేల 851 కుటుంబాలు, 5 లక్షల 35 వేల 920 మందికి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది.నూతన రేషన్ కార్డులు: జిల్లాలో కొత్తగా 14 వేల 75 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. 3౦ వేల 376 మంది కుటుంబ సభ్యుల పేర్లు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో చేర్చడం జరిగింది. పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో… రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది. రైతు రుణమాఫీ: గతేడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25 లక్షల 35 వేల మంది రైతులకు, రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసి.. కొత్త చరిత్ర సృష్టించడం జరిగింది. “ఇందిరమ్మ రైతు భరోసా” కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించి, తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. రాష్ట్రంలోని 70 లక్షల 11 వేల 184 మంది రైతులకు, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించడం జరిగింది. జిల్లాలో 393 మంది రైతుల కుటుంబాలకు 18 కోట్ల రూపాయలు బీమా కింద పంపిణీ చేశాము. రైతు భరోసా కింద లక్ష 26వేల 278 మంది రైతులకు.. 149 కోట్ల 27 లక్షల రూపాయలు పంపిణీ చేశాము. 47 వేల 977 మంది రైతులకు 381 కోట్ల 45లక్షల రుణ మాఫీ చేశాము. రాష్ట్రంలో 7 వేల 178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తున్నామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతున్నది. దీని కోసం రూ.16 వేల 691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లించడం జరుగుతున్నది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాసి అన్నదాతల సంక్షేమానికి రూ. లక్ష 13 వేల కోట్ల రూపాయలను ప్రజా ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందిరమ్మ ఇండ్లు: తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3వేల 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. దీనికి రూ.22 వేల 500 కోట్లు వెచ్చించడం జరుగుతున్నది. జిల్లాలో 12 వేల 623 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 7 వేల 927 ఇండ్లు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు, మిడ్ మానేర్ ముంపు గ్రామాల ప్రజలకు 4వేల 696 ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మంజూరు చేసింది. 10వేల 234 ఇంటి నిర్మాణ మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేయగా, 5 వేల 305 గృహాలకు లబ్దిదారులు ముగ్గు పోయడం జరిగింది. వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 38 కోట్లకు పైగా నేరుగా జమ చేసింది. మహాలక్ష్మీ పథకం: ద్వారా ఆడబిడ్డలకు రూ.6 వేల 790 కోట్లు ఆదా అయ్యింది. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం మొత్తంగా రూ. 46 వేల 689 కోట్లు సమకూర్చింది. జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 119 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన 315 లక్షల జీరో టికెట్లపై మహిళలు ప్రయాణం చేశారు. గృహజ్యోతి పథకం: ద్వారా మార్చి 2024 నుంచి ఆగస్ట్ 2025 వరకు మొత్తం 17 లక్షల 52 వేల జీరో కరెంట్ బిల్లులు జారీ చేసి, రూ. 67 కోట్ల 70 లక్షల లబ్ది చేకూర్చాము. జెగ్గారావుపల్లి, పద్మనగర్, పాపయ్యపల్లి, గుండారం, తిప్పాపూర్ (వేములవాడ)లో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాల కోసం ఎన్.పీ.డీ.సీ.ఎల్ కు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. వైద్యారోగ్య శాఖ : ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వైద్యారోగ్యంపై 16 వేల 521 కోట్ల రూపాయలు వ్యయం చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షలకు పెంచగా, డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి ఆగస్ట్ 2025 వరకు 24 వేల 154 మంది రోగులు రూ. 62 కోట్ల విలువైన ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలు పొందడం జరిగింది. జిల్లాలో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటిదాకా 4వేల 795 చెక్కుల ద్వారా రూ. 16కోట్ల 85 లక్షలు, అలాగే 275 ఎల్ఓసీల ద్వారా రూ. 5 కోట్ల సాయం అందజేయడం జరిగింది. మత్స్య శాఖ: ధర్తి అబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపిక చేసిన రుద్రంగి, వీర్నపల్లి నుంచి గిరిజన ప్రాంతాల లబ్దిదారుల నుంచి 82 మంది దరఖాస్తులు ప్రక్రియలో ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ: యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత. యువత ఉద్యోగ, ఉపాధికి పెద్ద పీట వేస్తున్నాం.ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీ.జీ.పీ.ఎస్సీని సంస్కరించాం. 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అలాగే భూ భారతి అమలులో భాగంగా జిల్లాలో అవసరమైన గ్రామ పాలన అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమించడం జరిగింది. పోటీ పరీక్షల్లో రాణించేలా: జిల్లాలోని విద్యార్థులు జాతీయస్థాయిలో పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా 39 రెసిడెన్షియల్ విద్యాలయాల్లో అన్ అకాడమీ సంస్థ ద్వారా 25 లక్షల రూపాయలతో ఐఐటీ ఫౌండేషన్, ఐఐటీ-జేఈఈ, నీట్-యూజీ మెడికల్ ఆన్లైన్ కోచింగ్ తరగతులను నిర్వహిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం జరుగుతున్నది. మొత్తం 13 వేల 564 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. పనుల జాతర: జిల్లాలోని 12 మండలాల పరిధిలోని అన్ని గ్రామాలలో పనుల జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఉపాధి హామీ పథకం, ఆర్ డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, స్వచ్ఛభారత్ వంటి విభాగాల్లో రూపాయలు 7 కోట్ల 80 లక్షల విలువ గల 258 పనులు చేపట్టడం జరుగుతున్నది.చివరి ఆయకట్టుకు నీరు అందించేలా: తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నామని, కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీపడమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ, భూ పోరాట ఉద్యమంలో కీలకపాత్ర పోషించి పెత్తందారుల అణిచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెత్తందారుల అణచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిందని, సాగు చేసే వారికి భూమి కోసం ఉద్యమించిందని తెలిపారు. తెలంగాణ భూ పోరాటానికి నాంది పలికిన మొదటి వ్యక్తి చాకలి ఐలమ్మ అని తెలిపారు. నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా నిరుపేదలకు 10 లక్షల రూపాయల వరకు విలువైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. పట్టుదల, ఏకాగ్రతతో పని చేస్తే సామాన్యుడు కూడా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలువచ్చని అన్నారు. మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుదామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఆధార్ వివరాల్లో తప్పులు ఉంటే త్వరగా సరిచేయాలని జిల్లా కలెక్టర్లను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ ఆదేశించారు. లబ్ధిదారులకు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (APBS) ద్వారా నగదు చెల్లింపులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే లబ్ధిదారుల్లో దాదాపు 30 శాతం మంది ఆధార్ రికార్డుల్లో తప్పులు ఉండటంతో వివరాలు సరిపోలడం లేదని అధికారులు గుర్తించారు. దీని వల్ల పేమెంట్స్ నిలిచిపోయే ఛాన్స్ ఉండటంతో ఆధార్లో తప్పుల సవరణ వెంటనే చేపట్టాలని పేర్కొన్నారు.
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డ్
వనపర్తి నేటిదాత్రి .
గత ప్రభుత్వం లో 8.19 లక్షల కోట్ల అప్పుల భారం చేసి న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ లను అమలు చేస్తున్నమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.శనివారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ ములో మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి ప్రారంభిం చారు ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం లో చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తూన్నామను రాష్ట్రంలో అభివృద్ధి, ఆపలే దని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయింపు జేరుగు తున్నదని అన్నారు అంటే ఇలా ఉండాలి అని ప్రజల చేత శభాస్ అని మెప్పులు పొందుతున్నారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే సిలిండరు, రూ. 21 వేల కోట్లతో రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణ మాఫీ, గత ప్రభుత్వం సంవత్సరానికి ఎకరాకు 10 వేల చొప్పున రైతు భరోసా ఇస్తే ఈ ప్రభుత్వం 12 వేల చొప్పున ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వం వారి వేస్తే ఉరి అని అంటే ఈ ప్రభుత్వం రైతును రాజు చేయాలనే ఉద్దేశ్యంతో సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా 7 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు పాత రేషన్ కార్డుల్లో పెళ్ళైన, పుట్టిన వారి పేర్లు కొత్తగా చేర్చడం జరిగిందన్నారు. గత పాలకులు పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదని, కనీసం సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టిన ఐదు సంవత్సరాల్లో 10 లక్షల ఇళ్లు కట్టేవారని కానీ వారికి పేదల సంక్షేమం కంటే కమిషన్లే ముఖ్యమని కాలేశ్వరం కట్టారని దుయ్యబట్టారు. ప్రజాపాలనలో తొలి విడతగా రూ. 22,500 కోట్ల నిధులతో ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మరో మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు . ప్రతి సోమవారం రాష్ల్ వనపర్తి జిల్లాకలెక్టర్ ఆదర్శ్ సురభి సేవలపై మంత్రి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు రాష్ట్రంలోని 200 యూనిట్ల లో పు ఉచిత విద్యుత్ వనపర్తి జిల్లా లో 6127 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు మహిళల కు ఉచిత బస్ ప్రయాణం రైతులకు భూ భారతి చట్టం అనేక అభివృద్ధి పనులు చేస్తూ న్న మని మంత్రి చెప్పారు ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి వనపర్తి నియోజకవర్గ ని కి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న రాని కొనియాడారుమంగంపల్లిలో గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు , మంత్రులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మేఘా రెడ్డి వ్యక్తిగతంగా ఇందిరమ్మ ఇల్ల లబ్ధిదారులకు బట్టలు పెట్టారు డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ యాదయ్య, మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు మహమ్మద్ మాక్సుధ్ హైమద్ అన్నారు.గురువారం మండల మొగుడంపల్లి కేంద్రంలోని రైతు వేదికలో నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన హజరై మాట్లాడుతూ…ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు.అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అనేక పథకాలు అందజేశారన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ జుబేర్,ఎంపీడీవో మహేష్,ఆర్ఐ సిద్ధారెడ్డి,పంచాయతీ కార్యదర్శి మారుతి,కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ కుమార్,వెంకట్ రామ్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇతర రాష్ట్రాల మాదిరిగా జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్ ఇవ్వాలి
ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన సీనియర్ జర్నలిస్ట్ రాజమల్లు యాదవ్
కేసముద్రం/ నేటి ధాత్రి
సీనియర్ జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల మాదిరిగా పించను ఇప్పించి జర్నలిస్ట్ ల జీవితానికి భరోసా కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కి, శాసనసభ్యులు భూక్య మురళి నాయక్, పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయకుల సమక్షంలో వేం నరేందర్ రెడ్డి కి జర్నలిస్టుల సమస్యల ను వివరిస్తూ కేసముద్రం సీనియర్ జర్నలిస్ట్ వేల్పుల రాజమల్లు యాదవ్ వినతి పత్రం అందజేయడం జరిగింది. బీహార్ రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్టులకు నెలకు రూ.15 వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజాగా నిర్ణయించి ప్రకటించారని పేర్కొన్నారు.జర్నలిస్ట్ మరణిస్తే వారి భాగస్వామి కి నెలకు రూ10 పింఛను ఇవ్వాలని ఆ ముఖ్యమంత్రి నిర్ణయించారని.తమిళనాడు కూడ సీనియర్ జర్నలిస్ట్ లకు పింఛన్లు అందిస్తుందని.పక్కనున్న ఏపీ లో కూడా అంతో,ఇంతో అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్ట్ లకు ఆలాంటి పథకం అమలులో లేవని.తెలంగాణలో కూడ సీనియర్ జర్నలిస్ట్ లకు జర్నలిజం లో 20 ఏళ్ళు గా పనిచేస్తూ 57 ఏళ్ళు దాటిన ప్రతి జర్నలిస్ట్ కు రూ.15 వేలు పింఛను మంజూరు చేయాలని కోరుతున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రమాదంలో మరణిస్తే రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారని.ఐతే జర్నలిస్టులు సహజంగా మరణించిన వారి కుటుంబాలకు కూడా వర్తించే విధంగా అమలు చేసి రూ.10 లక్షల కు పెంచాలని.,మరణించిన జర్నలిస్ట్ జీవిత భాగస్వామి కి జీవితాంతం వరకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3 వేల నుంచి రూ 10వేలు ఇప్పించాలని. అలాగే ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ కు ప్రభుత్వం తరఫున ప్రతి నెల జీవన భృతి కింద రూ. 5 వేలు మంజూరు చేసి వారి జీవితానికి భరోసా కల్పించాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ఇళ్లు లేక జర్నలిస్ట్ లు ఇబ్బంది పడుతున్నారని. ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేయాలని జిల్లాలో సీనియర్ జర్నలిస్టుగా మనవి చేస్తున్నానని పేర్కొన్నారు.
చర్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ 16వ వర్ధంతి వేడుకలు
నేటి ధాత్రి చర్ల
డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా చర్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి భద్రాచలం టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నల్లపు దుర్గా ప్రసాద్ ఘనంగా నివాళులు అర్పించారు వైయస్సార్ 16వ వర్ధంతి సందర్భంగా టిపిసిసి జనరల్ సెక్రెటరీ నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి భారత దేశంలోనే గుర్తింపు పొందుతూ రామరాజ్యం తలపించేలా దివంగత సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలన ప్రజలకు అందించారని అన్నారు ప్రజలకు చేరువుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్రలు చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న మహోన్నత వ్యక్తి అన్నారు కాంగ్రెస్ పార్టీ చర్ల మండల యువ నాయకులు విజయ్ నాయుడు మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ పథకం విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను ప్రవేశపెట్టిన చిరస్మరణీయుడు అని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండెపుడి భాస్కరరావు మాట్లాడుతూ రైతులకు సాగునీటి కాలువలను పంట పొలాలకు అందించి సాగునీటిని అందించిన మహోన్నత వ్యక్తి అన్నారు మాజీ ఎంపీటీసీ చర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు మడకం పద్మ మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన మహోన్నత నాయకుడు వైఎస్సార్ అని అన్నారు చర్ల ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ సాల్మన్ రాజు మాట్లాడుతూ ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళను ఇచ్చి పేద ప్రజలకు గూడును కల్పించిన మహనీయ దేవుడు అని అన్నారు ఈ కార్యక్రమంలో చర్ల కాంగ్రెస్ నాయకులు గుండెపుడి భాస్కరరావు ఎస్సి సెల్ మండల ప్రెసిడెంట్ సల్మాన్ రాజ్ సీనియర్ కాంగ్రెస్ యువ నాయకులు విజయ్ నాయుడు సత్తిబాబు మాజీ ఎంపీటీసీ మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు మడకం పద్మ అంజి బబు మేడి రమేష్ మైపా జోగారావు చింతయ్య మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
◆:- బేస్మిట్ లెవెల్ కే రెండు లక్షలు దాటుతున్న పరిస్థితి!
◆:- నేటికీ అందని ఉచిత ఇసుక!
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటే సొంత ఇంటి కల నెరవేరడం ఖాయమని, అవసరమైతే లబ్దిదారుడిపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తామని ఎన్నికల ముందు చెప్పిన మాటలు ప్రచారాలకే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు మండల వ్యాప్తంగా విస్తారంగా వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులు ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తామన్న ఉచిత ఇసుక అందలేదు. మండలానికి 583 ఇందిరమ్మ గృహాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 380 ఇండ్ల పనులు ప్రారంభమైనాయి.
Indiramma Beneficiaries
పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలు
విస్తారంగా కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల ఓవైపు ఇసుక, మరోవైపు కంకర, సిమెంట్, స్టీల్ ధరలు మూడింతలు పెరగడంతో ఇందిరమ్మ లబ్దిదారులు ఆర్ధిక భారంతో సతమతమవుతున్నారు. దీంతో ఇండ్ల నిర్మాణ పనులలో వేగం తగ్గింది. ప్రభుత్వం ఇందిరమ్మ లబ్దిదారులకు ఉచిత ఇసుక పంపిణీ చేస్తామని చెప్పినా నేటి వరకు అందలేదు. కనీసం ఇసుకైనా ఉచితంగా అందితే కొంతమేర భారం తగ్గుతుందని లబ్దిదారులు వాపోతున్నారు. మరో వైపు ఉన్నత అధికారుల నుంచి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని లబ్దిదారులకు ఒత్తిళ్లు రావడంతో ఎం చేయాలో తోచని పరిస్థితులు నెలకొంటున్నాయని వాపోతున్నారు. ఒకానొక దశలో అధికారులు లబ్దిదారులకు చేతులు జోడించి తమకు పైనుంచి వస్తున్న ఒత్తిళ్లను అర్ధం చేసుకోవాలని వేడుకొంటున్నారు. లేనిపక్షంలో బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్న పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంటున్నారు. దీంతో లబ్దిదారులు ఏం చేయలేక పెరిగిన ధరలతో అనుకున్న అంచనా కంటే అధికంగా ఖర్చులు అవుతున్నాయని ఏం చేయాలో అర్ధం కావడంలేదని అధికారులకు లబ్దిదారులు మొరపెట్టుకుంటున్నారు.
ఉచిత ఇసుక సరఫరా అయ్యేనా !
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామని తెలిపినా ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమై రెండు నెలలు గడిచినా నేటికీ ఆ ప్రక్రియ ప్రారంభమే కాలేదని లబ్దిదారులు వాపోతున్నారు. ఉచిత ఇసుక సరఫరా అనేది మండల స్థాయిలో తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక పాయింట్ని ఏర్పాటు చేసి అక్కడి నుండి మండలంలోని వివిధ గ్రామాలకు సరఫరా చేయాలని ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ ప్రక్రియ నేటికీ ప్రారంభం కాకపోవడంతో లబ్దిదారులు నిరాశ చెందుతున్నారు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రశ్నార్ధకంగా మారాయి. కొందరు లబ్దిదారులు మొదటి బిల్లుతో బేస్మెంట్ వరకు పనులు చేసి నిలిపివేస్తే, మరికొందరు పిల్లర్లను నిర్మించి పనులను అక్కడే నిలుపుదల చేసిన పరిస్థితులు నెలకొన్నాయి.
త్వరలో ఉచిత ఇసుక అందజేస్తాం
-ఎంపీడీఓ, మంజుల, ఝరాసంగం
ఇందిరమ్మ అబ్దిదారులకు త్వరలో ఉచిత ఇసుక అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శుల నుండి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ వివరాలు సేకరించాం. దీని ప్రకారం ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటికి 40 టన్నుల ఉచిత ఇసుక అందిచే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం.
సంక్షేమ పథకాలకు ఆకర్షిణితులై కాంగ్రెస్ పార్టీ లో చేరిక బిట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి & క్లస్టర్ ఇంచార్జి ఆధ్వర్యంలో… పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క. ..ములుగు అసెంబ్లీ, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండంపల్లి లో బిఆర్ఎస్ పార్టీ కి స్థానిక ఎన్నికల ముందు కోలుకోలేని దెబ్బ పడింది కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్ & క్లస్టర్ ఇంచార్జి వారి ఆధ్వర్యంలో నేడు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ చేరిక ..
వీరికి మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు
పార్టీలో చేరిన వారు గట్టి బాబు ( నర్సయ్య ) మాజీ సర్పంచ్ తిమ్మాపూర్. దానం నారాయణ వార్డ్ మెంబర్ గుండంపల్లి రమేష్ సీనియర్ కార్యకర్త. జాటోత్ తేజ గుండంపల్లి భూక్య నాగులు గుండంపల్లి వీరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాగానే నిస్వార్ధంగా ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అందించిన ఘనత రేవంత్ సర్కార్ ది మాత్రమే .. ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని మహిళలకు మొదటి ప్రాధాన్యత కల్పించి వారి భవిష్యత్ కార్యాచరణ కోసం మహిళా సంఘాలను బలోపేతం చేశారు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు వ్యవసాయ రంగంకు దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్న వడ్ల కు 500 బోనస్ వరి మద్దతు ధర నిరుపేదలకు రేషన్ నూతన కార్డులను అందించి అర్హులందరికీ సన్న బియ్యం.. అందించిన ఘనత రేవంత్ సర్కార్ ..! ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు.. ఎన్నడూ లేనివిధంగా కొత్తగూడ లో దూసుకుపోతున్న పలు అభివృద్ధి పనులు కెసిఆర్ ఇవ్వలేనిది ప్రతి గ్రామానికి ఆనాడైనా ఈనాడైనా నిరుపేదలకు గూడు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్న సంగతి విదితమే.. వ్యవసాయ రంగంతో పాటు నిరుపేద గృహాల వెలుగులను నింపుతున్న ప్రజా ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలకు ఆకర్షిణితులై కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరుగుతుందని అన్నారు ములుగు నియోజకవర్గానికి సీతక్క ఎమ్మెల్యేగా .. రాష్ట్ర కేబినెట్ మంత్రివర్యులు గా ఉంటూ ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నిస్వార్ధంగా సేవలను అందిస్తున్న మంత్రి సీతక్క ఉండడం మన అదృష్టం అందుకే కాంగ్రెస్ పార్టీలో సగర్వంగా చేరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు (అసెంబ్లీ ) జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ రాష్ట్ర రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య. కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు సుంకరబోయిన మొగిలి. జిల్లా సీనియర్ నాయకులు వీరనేని వెంకటేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ రూఫ్ సింగ్. ( గుండంపల్లి క్లస్టర్ & కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్ ) వల్లపు రంజిత్, వద్ది సోమయ్య, లక్కాకుల రాజు, గట్టి రమేష్ తోట మాధవలు బానోతు బాలు తదితరులు పాల్గొన్నారు
న్యాల్కల్ మండలంలోని హద్నూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులు ఆసక్తిగా పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. గ్రామానికి మంజూరైన 58 ఇండ్లలో ఇప్పటివరకు 46 మంది లబ్దిదారులు బేస్మెంట్ స్థాయిని పూర్తి చేశారు. ఈ దశలో పనులు పూర్తి చేసిన ప్రతి లబ్దిదారుడికి ఒక్కొక్కరికి రూ.1,00,000 చొప్పున వారి ఖాతాలలో జమ చేసినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి ధనరాజ్ వివరించారుసోమవారం ఆయన నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు నరేష్, రమేష్, శుకూర్ మియా తదితరులు పాల్గొన్నారు.
దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామ ప్రజా సమస్యలపై ఆ గ్రామ సిపిఎం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే నిర్వహించారు.ఈ సర్వేలో ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు.వృద్ధాప్య పింఛన్స్, కరెంట్ బిల్లు,రేషన్ కార్డు,గ్యాస్ బిల్లు, జాబ్ కార్డు,డ్రైనేజీ,తాగునీటి సమస్యల పట్ల గ్రామస్తులు సిపిఎం నాయకులకు విన్నవించుకున్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య,మండల కార్యదర్శి బోళ్ల సాంబయ్య,మండల నాయకులు పుచ్చకాయల నరసింహారెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు పొన్నం రాజు, గ్రామ నాయకులు మహేందర్ రెడ్డి, మాదాసి శీను,శ్రీకాంత్,రమేష్, బత్తిని స్వామి, కొండబత్తుల నరసింహరాములు తదితరులు పాల్గొన్నారు.
దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామ ప్రజా సమస్యలపై ఆ గ్రామ సిపిఎం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే నిర్వహించారు.ఈ సర్వేలో ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు.వృద్ధాప్య పింఛన్స్, కరెంట్ బిల్లు,రేషన్ కార్డు,గ్యాస్ బిల్లు, జాబ్ కార్డు,డ్రైనేజీ,తాగునీటి సమస్యల పట్ల గ్రామస్తులు సిపిఎం నాయకులకు విన్నవించుకున్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య,మండల కార్యదర్శి బోళ్ల సాంబయ్య,మండల నాయకులు పుచ్చకాయల నరసింహారెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు పొన్నం రాజు, గ్రామ నాయకులు మహేందర్ రెడ్డి, మాదాసి శీను,శ్రీకాంత్,రమేష్, బత్తిని స్వామి, కొండబత్తుల నరసింహరాములు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకు 2004 నుంచి అమలు చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి 1972 పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ ను మళ్ళీ అమలు చేయాలనే డిమాండ్ చేస్తూ.తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు,,,ప్రభుత్వ కార్యాలయాల్లో బోజన విరామ సమయాల్లో నల్ల బ్యాడ్జీ లు ధరించి నిరసన తెలిపారు…ఈ సందర్భంగా మండల పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాల పొట్టిపల్లీ తో పటు అనేక పాఠశాలలు,,,ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగులు,, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెల్పారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు Y. అమృత్,శంకర్ ,ప్రసన్న లక్ష్మి. నారాయణ,,కృష్ణ తదితరులు పాల్గొన్నారు,
మొగుడంపల్లి మండలం జాంగార్ బోలీతండాలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చలపతిరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడి, మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే పూర్తి చేసుకున్న పనులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహేశ్, పంచాయతీ కార్య దర్శి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి–సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం : మంత్రి కొండా సురేఖ
వరంగల్, నేటిధాత్రి.
అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మొత్తం రూ. 5.87 కోట్లు వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆమె గురువారం శంకుస్థాపన చేశారు. జిడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సంఘ నిధులు, జనరల్ ఫండ్ మరియు ఎస్ఎఫ్సి పథకాల కింద రూ. 4.87 కోట్ల విలువైన పలు పనులను ప్రారంభించారు. వీటిలో బస్తీ దవాఖాన, బీఆర్ నగర్లో సీసీ రోడ్లు, ఎన్ఎన్ నగర్, జ్యోతినగర్లో సీసీ రోడ్లు, అంబేడ్కర్ భవన్ కమ్యూనిటీ హాల్, బీరన్నకుంట కమ్యూనిటీ హాల్ నిర్మాణం, బట్టలబజార్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో కిచెన్ షెడ్, రంగశాయిపేటలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం ఉన్నాయి. అదనంగా ఆర్అండ్బి శాఖ కింద రూ.
Minister Konda Surekha
కోటి వ్యయం తో మషూఖ్ రబ్బానీ దర్గాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదనంగా, బీరన్నకుంట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంత్రి, మేయర్, జిల్లా కలెక్టర్, జిడబ్ల్యూఎంసీ కమిషనర్తో కలసి మధ్యాహ్న భోజనం వడ్డించారు. తరువాత కరీమాబాద్ పరపతి సంఘ భవనంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. తూర్పు నియోజకవర్గంలో 2690 కొత్త కార్డులను జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6815 రేషన్ కార్డులు మంజూరు, వాటిలో 26766 కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసినట్లు వివరించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ….
Minister Konda Surekha
ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అందజేస్తోందని, గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు సన్న బియ్యం అందిస్తున్నారని, లబ్ధిదారులకు అన్ని సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. అదనంగా, జిల్లాలోని విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు రామకృష్ణ మిషన్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో 123 ప్రభుత్వ పాఠశాలల్లో కార్యక్రమం ప్రారంభించామన్నారు.
Minister Konda Surekha
మొదటి విడతలో కరీమాబాద్ సహా 55 పాఠశాలల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ నగరాన్ని హైదరాబాద్ తరహాలో సమగ్ర అభివృద్ధి చేయడానికి మామునూరు విమానాశ్రయం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనులు వేగవంతం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే ముంపు నివారణకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు.నియోజకవర్గంలో అర్హులైన పేదల కోసం 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్టు, మరో 3500 ఇళ్లు ఈ సంవత్సరం కేటాయించనున్నట్టు వెల్లడించారు. దేవాదాయ శాఖ ద్వారా జిల్లాలోని అన్ని దేవాలయాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, కార్పొరేటర్లు, రెవెన్యూ అధికారులు, బల్దియా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
3; 17 వార్డును సందర్శించిన సబ్ కలెక్టర్ మనోజ్ ఐ.ఏ.ఎస్ కి మా నేటి ధాత్రి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు
బెల్లంపల్లి నియోజకవర్గం అంబేద్కర్ నగర్ 3, 17 వార్డును సీసీ రోడ్డు, మురికి కాలువలు లేవని ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని సందర్శించిన సబ్ కలెక్టర్ మనోజ్ ఐ.ఏ.ఎస్ ప్రజలు వారి సమస్యలు రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న వారి బాధలను కలెక్టర్ కి వెల్లడించారు అలాగే నీటి సమస్య గురించి నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళకు పెన్షన్ ఇప్పించాలని మరి కొంతమంది కి ఇందిరమ్మ ఇల్లు రాలేదని కలెక్టర్ కి వారి గోడు వారికి వెళ్లబుచ్చుకున్నారు. వీరి సమస్యలు ఓపికగా విన్న కలెక్టర్ సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసి త్వరలో పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు.
దేశ రాజకీయ చరిత్రలో ధ్రువతార. . *రాజీవ్ గాంధీ 81వజన్మదిన వేడుకలు జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు మొగులపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొగుళ్లపల్లి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు మండల కేంద్రం లోని చౌరస్తా వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఆయన 1944 ఆగస్టు 20వ తేదీన బాంబేలో జన్మించారు భారతదేశం స్వాతంత్రం సాధించే నాటికి ఆయన తాత ప్రధాన మంత్రి అయినప్పటికీ రాజీవ్ గాంధీ వయసు కేవలం మూడు సంవత్సరాలు అలాంటి వ్యక్తి భారతదేశానికి ఏడవ ప్రధానమంత్రి అతను 1984 నుండి 1989 వరకు ప్రధానమంత్రిగా వ్యవహరించారు ఆయన ప్రధానమంత్రి గా పనిచేశారు అలాంటి గొప్ప వ్యక్తి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో జరుపుకోవడం సంతోషకరమని అన్నారు.అలాగే చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మమ్మదు రఫీ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆపద వస్తే నేనున్నానని 108 లాగా ముందుండి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారి ఆదేశాల మేరకు ఇందిరా గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మండల కేంద్రంలో జరుపుకోవడం అదృష్టంగా భావిస్తూ గాంధీ కుటుంబం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు ఎంతో మేలు చేసిందని అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల కోసం ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆ రాజ్యంలో పేదలకు న్యాయం జరుగుతుందని వారి పేర్ల మీద నిరుపేదలైనటువంటి వారికి పథకాలను ప్రవేశపెట్టి అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అలాగే 500 కే గ్యాస్ సిలిండర్ పేదలకు ఉచిత సన్న బియ్యం కార్డు లేని నిరుపేదలకు రేషన్ కార్డు లు ఇస్తూ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలను ప్రవేశపెట్టి పేదలను అభివృద్ధి పథకంలో నడిపిస్తూ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రము ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు . కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్ ,మండలంలోని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గణపురం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఓసీ త్రీ మట్టిని ఉంచితంగా అందించాలి బీజేపీ మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎల్ భాస్కర్ కు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గణపురం మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో అర్హులైన లబ్దిదారులు ఇండ్లు నిర్మించుకుంటున్నారు. అయితే గృహ నిర్మాణంకు మట్టి తప్పనిసరి అవసరం ఏర్పడుతుంది, కానీ ఆయా గ్రామ పంచాయతీల్లో మట్టి లభ్యత లేకపోవడం, ఉన్న ప్రాంతంలో మట్టి తీసేందుకు ఇరిగేషన్, రెవెన్యూ శాఖ నుండి అనుమతి లేకపోవడంతో ఇంటి నిర్మాణ లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని 17 గ్రామపంచాయితీల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారులకు ఆయా గ్రామ పరిధిలో మట్టి లభ్యత లేదనందున సింగరేణి ఓసీ త్రీ మట్టిని సింగరేణి అధికారులతో మాట్లాడి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇప్పించాలని ఎంపీడీవోను కోరారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సోమా దామోదర్, దుగ్గిశెట్టి పున్ పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.