నేటి ధాత్రి కథనానికి స్పందించిన అధికారులు.
బెల్లంపల్లి నేటిధాత్రి:
3; 17 వార్డును సందర్శించిన సబ్ కలెక్టర్ మనోజ్ ఐ.ఏ.ఎస్ కి మా నేటి ధాత్రి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు
బెల్లంపల్లి నియోజకవర్గం
అంబేద్కర్ నగర్ 3, 17 వార్డును సీసీ రోడ్డు, మురికి కాలువలు లేవని ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని సందర్శించిన సబ్ కలెక్టర్ మనోజ్ ఐ.ఏ.ఎస్ ప్రజలు వారి సమస్యలు రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న వారి బాధలను కలెక్టర్ కి వెల్లడించారు అలాగే నీటి సమస్య గురించి నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళకు పెన్షన్ ఇప్పించాలని మరి కొంతమంది కి ఇందిరమ్మ ఇల్లు రాలేదని కలెక్టర్ కి వారి గోడు వారికి వెళ్లబుచ్చుకున్నారు. వీరి సమస్యలు ఓపికగా విన్న కలెక్టర్ సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసి త్వరలో పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు.