విద్యార్థులకు మొక్కల పంపిణీ…

విద్యార్థులకు మొక్కల పంపిణీ
• నిర్మాణాలు త్వరగా పూర్తి చెయ్యాలి.
• ఎంపీడీవో రాజీరెడ్డి.

నిజాంపేట: నేటి ధాత్రి

 

తల్లి పేరు మీద ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పాఠశాల విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ మేరకు నిజాంపేట మండలం నగరం తాండ గ్రామంలో గ్రామ కార్యదర్శి ఆరిఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో రాజీరెడ్డి హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులకు ఒక్కొకరికి ఒక్కో మొక్కను ప్రధానం చేశారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సంధ్య, ప్రధానోపాధ్యాయులు ఉమారాణి, ఉపాధ్యాయులు వెంకటేష్, కల్పన, స్రవంతి విద్యార్థులు, గ్రామస్తులు ఉన్నారు.

ఆర్ కొత్తగూడెంలో మైరాడ్ సంస్థ మొక్కల పంపిణీ”

మైరాడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్ కొత్తగూడెం గ్రామంలో మొక్కల పంపిణీ

మైరాడ్ సోషల్ మొబిలైజర్ వి నవీన్

నేటిధాత్రి చర్ల

 

మైరాడ సోషల్ మొబలైజర్ వి నవీన్ చర్ల మండలం కలివేరు గ్రామంలో ఐటీసీ యమ్ ఎస్ కె బంగారు భవిష్యత్తు సంస్థ సహకారంతో మైరాడ స్వచ్చంద సంస్థ సభ్యులు ఆర్ కొత్తగూడెం గ్రామం సత్యనారాయణ పురం కలివేరు ఉప్పరిగూడెం పంచాయతీలకు బయోడే వర్సిటీ మొక్కలు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈ మొక్కల వలన జీవవైవిద్య అభివృద్ధి జరుగుతుందని వాతావరణ సమతుల్యతను కాపాడుతాయని అన్నారు ఈ మొక్కల ద్వారా వాతావరణం లోనీ కాలుష్యం తగ్గి ఆక్సిజన్ శాతం పెరుగుతుందని అన్నారు వాతావరణ కాలుష్యం నుండి కాపాడతాయని గ్రామం లో మొక్కలు పెంచడం పండగ వాతావరణంలాగా ఉంటుందని కలివేరు గ్రామ సెక్రెటరీ ఇర్ప శ్రీరామ్ అలాగే మైరాడ సోషల్ మొబిలైజర్ వి నవీన్ అన్నారు రైతులు మొక్కలు పెంచడం వల్ల ప్రాణవాయువు ఉంటుందని నేటి తరాలకు మొక్కలు చాలా అవసరం అని సమావేశంలో తెలియపరిచారు ఈ సమావేశాల్లో తురం బాలకృష్ణ కల్లూరి నరసింహారావు నాని పాలి బాలకృష్ణ పసుపులేటి పిరి పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version