తెలంగాణ క్రీడాకారులు ప్రపంచ స్థాయికి ఎదగాలి : శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 20 :
తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అందిస్తున్న సదుపాయాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి, ఎంఎల్ఏ మల్లారెడ్డి అన్నారు.
మేడ్చల్ నియోజకవర్గంలోని మూడుచింతలపల్లి మునిసిపల్ జగన్ గూడ మైనారిటీ గురుకుల పాఠశాలలోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలలో శనివారం ఉమ్మడి జిల్లాల అండర్- 14, 17, 19 క్రీడా పోటీలను శనివారం సందర్శించారు. విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన ఖోఖో పోటీలను టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటమితో కుంగిపోకుండా కష్టపడి ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. క్రీడలు శారీరక, మానసిక వికాసానికి ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి దాన్ని వెలికి తీయడమే ఈ క్రిడల ఉద్దేశం అన్నారు. కబడ్డీ, క్రికెట్ వంటి క్రీడల్లో భారత ఆటగాళ్లు ప్రపంచాన్ని శాసిస్తున్నారని, తెలంగాణ క్రీడాకారులకు కూడా గొప్ప భవిష్యత్తు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అవసరమైన శిక్షణ అందించే వ్యాయామ ఉపాధ్యాయులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ పోటీల్లో మూడు జిల్లాల నుంచి సుమారు 900 మంది క్రీడాకారులు, 100 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, జిల్లా ల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ కాంతమ్మ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్, జిల్లా ఆర్టీఏ భీమిడి జైపాల్ రెడ్డి, ఆర్డీవో వెంకట్ ఉపేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిడిపల్లి వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్, తుంకి రమేష్, సాయిపేట శ్రీనివాస్, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
