రాజన్న సిరిసిల్ల జిల్లా 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

*రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన సంవత్సర 2026 క్యాలెండర్ DIEO CH.శరత్ కుమార్ ఆవిష్కరణ*

*సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)*

తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGJLA 475 )నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ఆవిష్కరణ.
తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGJLA) ఆధ్వర్యంలో నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సిరిసిల్ల లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా DIEO క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా TGJLA 475 నాయకులు DIEO గారిని శాలువాలతో సన్మానించి మర్యాదపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా DIEO మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ లో మన జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించడానికి మీ వంతు సహకారం అందించాలని వారు చెప్పారు .వచ్చే విద్యా సంవత్సరంలో అధికంగా ప్రవేశాలు కల్పించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని వారు కోరారు
ఈ కార్యక్రమంలో TGJLA జిల్లా నాయకులు సామల వివేకానంద్ ,దేవయ్య, కనకయ్య, చంద్రమౌళి,రాజయ్య , గజానంద,పాపారావు, రాజేశ్వరరావు, విజయ్ కుమార్, రమేష్ బాబు ,రవీందర్ ,శ్రీనివాస్,మొదలగువారు పాల్గొన్నారు.

సిరిసిల్లలోని మానేరు జల ప్రవాహానికి బతుకమ్మ ఘాట్ మునక…

సిరిసిల్లలోని మానేరు జల ప్రవాహానికి బతుకమ్మ ఘాట్ మునక

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని మానేరు వాగు ఉదృత ప్రవాహానికి బతుకమ్మ ఘాట్ వరద ప్రవాహానికి మునిగిపోయింది. గత మూడు నాలుగు రోజుల నుండి భారీ వర్షానికి వస్తున్న వరదల వల్ల, పట్టణంలోని ఎగువ మానేరు జలాశయం నుండి నీరు ఉదృతంగా కిందికి ప్రవహిస్తున్న సందర్భంగా సిరిసిల్లలోని మానేరు జల కళ ఉట్టి పడినట్లు సిరిసిల్ల పట్టణవాసులు, మరియు పరిసర గ్రామాల నివాసులు మానేరు వాగు నీటిని సందర్శించడానికి, తండోపతండాలు గా వస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version