పిచర్యగడి ఎస్సీ కాలనీలో వర్షపు నీటి ముంపు:
◆:-అధికారులకు కాలనీవాసుల విజ్ఞప్తి
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహీర్ మండలం, పిచర్యగడి గ్రామంలోని ఎస్సీ కాలనీ శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా నీట మునిగింది. కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎస్సీ కాలనీ గుండా కాలువలను నిర్మించడం, ఊరి వెనకాల ఉన్న చెరువు నీరు మరియు గ్రామంలోని మురికినీరు రెండూ ఒకే కాలువ గుండా ప్రవహించడం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. ఈ కారణంగా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వేరువేరు కాలువలను నిర్మించి ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.