ఉదయమే మొదలైన వర్షం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ సెప్టెంబర్ 11:ఆగష్టు మాసంలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నీటమునిగి పెద్ద మొత్తంలో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే, వరద బాధితులను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయల కేటాయించినప్పటికీ బాధితుల కష్టాలు వర్ణనాతీతం ఇలాంటి బాధాకరమైన విషయాలు మరవకముందే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోని ప్రభావంతో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు జనాలు విసుగు చెందుతున్నారు. గురువారం ఉదయం 8 గంటలకే మొదలైన వర్షంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు పొలాల్లో ఉన్నటువంటి కోతకు వచ్చిన పంటల్ని కోసి ధాన్యంగా మార్చే ప్రక్రియలో పనులకు అంతరాయం కలగడంతో చేతికొచ్చిన పంట కళ్ళముందే నాశనం అవుతుంటే చూసి భరించలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.