వడగళ్ల వర్షానికి మామిడి తోట నేలమట్టం.

వడగళ్ల వర్షానికి మామిడి తోట నేలమట్టం

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం బుర్రకాయల గూడెం గ్రామ శివారు రత్న బాబు రైతు కు చెందిన 7 ఎకరాల మామిడి తోట 4 ఎకరాల వరి పొలం బుధవారం రాత్రి కురిసిన వడగళ్ళ వర్షానికి గాలి దుమారానికి నష్టం జరిగింది 7 ఎకరాల మామిడి తోట 500 ల చెట్లకు ఉన్న మామిడి కాయలు మొత్తం రాలిపోయాయి శుక్రవారం మామిడితోట కొద్దామనుకునే సమయానికి వర్షానికి పూర్తిగా నేల పాలయాయ్యాయి మామిడి ఒక ఎకరానికి లక్ష యాభై వెయిల చొప్పున మొత్తం 7 లక్షల యాబై వేయిలు నష్టం జరిగింది 4 ఎకరాల వరి పంట మొత్తం నేల మట్టం అయ్యింది అధికారులు స్పందించి తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు

అకాల వర్షం తో వడగండ్ల వానతో నష్టపైన రైతులను.!

అకాల వర్షం తో వడగండ్ల వానతో నష్టపైన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి

కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ డిమాండ్.

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి

 

 

 

మండలంలోని. వర్షకొండ ఇబ్రహీంపట్నం, కేశవాపూర్ ,ఎర్రపూర్, గోధుర్, కోమటి కొండాపూర్ రైతులను వెంటనే ఆదుకోవాలని మానుక ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇటీవల ఈదురు గాలులకు నువ్వుల పంట, సజ్జ ,వరి పంటలు, మొక్కజొన్న ,మామిడి, రైతులు తీవ్రంగా నష్టపోయారని ముఖ్యంగా వరి పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షంతో నష్టపోయారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. అలాగే, పలువురు గుడిసెలు సైతం దెబ్బతిన్నాయని పంటలు నేలవాలయని నష్టపోయిన రైతులను పరామర్శించి రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకొని జిల్లా కలెక్టర్ ,వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే స్పందించి ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకోవాలని, అలాగే నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల టిడిపి అధ్యక్షులు ఎండి సాదుల్లా నియోజకవర్గ టిడిపి సభ్యులు రాజ గణేష్ ,కోరుట్ల పట్టణ టిడిపి ఉపాధ్యక్షులు మహదేవ్, ఇర్నాల గంగులు ,శ్రీనివాస్ ,బాలే మారుతి రైతులు రాములు ,మల్లయ్య, లచ్చయ్య, దయాకర్, లక్ష్మణ్ ,పెద్ది నరసయ్య ,రాజేశ్వర్, గంగాధర్, భాగ్యలక్ష్మి, చిన్న భూమయ్య, వెంకటి, నర్సారెడ్డి ,విజయ, రాజలింగం ,భూమన్న ,మురళి ,పెద్ద భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

కోహిర్ మండల్లో భారీ వర్షం మరియు వడగళ్ల వాన.!

కోహిర్ మండల్లో భారీ వర్షం మరియు వడగళ్ల వాన కారణంగా మామిడి పంటకు భారీ నష్టం.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

కోహిర్ మండల్ మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని గ్రామాలను భారీ వర్షం మరియు వడగళ్ల వాన ముంచెత్తింది, దీనితో ప్రజలు వేడి నుండి ఉపశమనం పొందారు. మరోవైపు, చెరకు, టమటా, మామిడి పంటలకు భారీ నష్టం వాటిల్లడంతో రైతులు, మామిడి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం మరియు గురువారం సాయంత్రం, అకస్మాత్తుగా భారీ వర్షం మరియు బలమైన గాలులతో కూడిన వడగళ్ళు పడ్డాయి, దీని ఫలితంగా పీడ్ కమల్, బిలాల్ పూర్, మన్యార్ పల్లి మరియు బేడంపేట్ గ్రామాలలో భారీ వడగళ్ళు పడటంతో నేలపై మంచు పలక కనిపించింది మరియు మామిడి తోటలలోని మామిడి చెట్ల కింద అనేక టన్నుల మామిడి కాయలు పడి ఉన్నాయి. మరియు మామిడి వ్యాపారులతో మాట్లాడినప్పుడు, వారు మిలియన్ల నష్టాలను నివేదించారు మరియు వర్షం మరియు వడగళ్ల వాన కారణంగా సంభవించిన నష్టాన్ని మరమ్మతు చేయడానికి లేదా భర్తీ చేయడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కోసం సిఫార్సు చేయాలని వ్యవసాయం మరియు ఉద్యానవన శాఖ, కోహిర్ మండల్ అధికారులు మరియు సీనియర్ అధికారులను కోరారు.

వడగండ్ల వానతో నష్ట పోయిన పంటలు.!

వడగండ్ల వానతో నష్ట పోయిన పంటల ను పరీశీలిస్తున్న కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి :

, వడగండ్ల వానతో వరి పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి తెలిపారు.మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కొత్తకోట మండల సంకిరెడ్డి పల్లి గ్రామంలో వడగండ్ల వానతో నష్టపోయిన వరి పంటలను కలెక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు నాయక్ తో కలిసి పరిశీలించారు.వెంకట్ రాములు అనే వరి రైతు పొలాన్ని సందర్శించి రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు సంకిరెడ్డి పల్లి లో మొత్తం ఎన్ని ఎకరాల్లో పంట నష్టం అయిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆరా తీయగా, వ్యవసాయ శాఖ సర్వే చేసిన ప్రకారం 170 ఎకరాల్లో పంట నష్టం అయిందని తెలిపారు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వడగండ్లు, వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వానికి పూర్తి వివరాలు నివేదిస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబీ తెలిపారు.
జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయక్, హౌసింగ్ పీడీ పర్వతలు, డి ఈ విటోభా, ఉద్యాన శాఖ అధికారి అక్బర్, తహసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version