శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న వరదల్లో మునిగిన సుదర్శన్ నగర్ కాలనీ
శేరిలింగంపల్లిలో, నేటి ధాత్రి :
శేరిలింగంపల్లి, డివిజన్ శనివారం మధ్యాహ్నం వర్షం దంచి కొట్టింది. మధ్యాహ్నం ఒక్కసారిగా భారీగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. కుండపోత వర్షానికి రోడ్లు పూర్తిగా వరద నీటితో నిండిపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న సుదర్శన్ నగర్ కాలనీ రోడ్డు పూర్తిగా వరద నీటితో నిండి చెరువును తలపించేలా మారింది. చిన్న పాటి వర్షం కురిసిన రోడ్డు పూర్తిగా వరద నీటితో నిండిపోతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
