గాలివాన ధాటికి కూలిన విద్యుత్ స్తంభాలు.. విద్యుత్ సరఫరా నిలిపివేత….

గాలివాన ధాటికి కూలిన విద్యుత్ స్తంభాలు.. విద్యుత్ సరఫరా నిలిపివేత….

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని చనిగేపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షం, బలమైన ఈదురుగాలుల కారణంగా పలు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో కూలిన స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేసే పనులు మంగళవారం చేపట్టారు. గ్రామస్థుల సహకారంతో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. త్వరలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.

చేనిగేపల్లిలో భారీ వర్షం, ఈదురుగాలులతో బీభత్సం: విద్యుత్ సరఫరా నిలిచిపోయింది :

చేనిగేపల్లిలో భారీ వర్షం, ఈదురుగాలులతో బీభత్సం: విద్యుత్ సరఫరా నిలిచిపోయింది :

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం చేనిగేపల్లి గ్రామంలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం, బలమైన ఈదురుగాలులు, వడగండ్ల వానతో బీభత్సం సృష్టించింది. గాలుల తీవ్రతకు పలు చెట్లు విరిగి రహదారిపై పడిపోయాయి, కొన్ని కరెంటు స్తంభాలు కూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారిపై చెట్లు, విద్యుత్ తీగలు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కూలిన స్తంభాలు, చెట్లను తొలగించే పనులు చేపట్టారు. గ్రామంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు మరమ్మతు పనులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

తుమ్మనపల్లి గ్రామంలో విద్యుత్ ఇబ్బందులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు.

తుమ్మనపల్లి గ్రామంలో విద్యుత్ ఇబ్బందులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు.

జహీరాబాద్ నతి ధాత్రి:

ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామస్తులు తరచుగా విద్యుత్ కోతల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తుమ్మనపల్లి గ్రామ నూతన సర్పంచ్ నాజియా అంజూమ్ షైక్ సోహైల్ పేర్కొన్నారు. రోజుకు చాలాసార్లు విద్యుత్ కోతలు ఉండటం వల్ల గృహ అవసరాలు, రైతుల వ్యవసాయ కార్యకలాపాలు అంతరాయం కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. [కీలక] సమయాల్లో కూడా సరైన విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అధికారులను వెంటనే సమస్యను పరిష్కరించి నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని ఆయన కోరారు. గ్రామ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

జహీరాబాద్లో రేపు విద్యుత్ నిలిపివేత

జహీరాబాద్లో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని 132 కేవీ సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టణం మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ తెలిపారు.మన్నపూర్ ఫీడర్ పరిధిలో గల మొగుడంపల్లి మండలం మొత్తం గ్రామాలకు మరియు గోవింద్పూర్, మధులైతుండా, అర్జున్ నాయక్ తాండ గ్రామాలలో కరెంటు ఉండదు, ఈ సమయంలో వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుని విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు.

విద్యుత్ అంతరయంపై ప్రజావాణిలో ఫిర్యాదు

విద్యుత్ అంతరయంపై ప్రజావాణిలో ఫిర్యాదు

జైపూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా భీమరం మండలం మద్దికల్ లో విద్యుత్ అంతరాయంపై స్థానిక మండల బిజెపి నాయకులు ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు. తరచు విద్యుత్ లైన్లలో సమస్యలు ఏర్పడి విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామంలోని వివిధ పనులకు విద్యుత్ అంతరాయంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.విద్యుత్ సమస్య ఎదురైనప్పుడు సంబంధిత సిబ్బంది స్పందించడం లేదని గ్రామ ప్రజలు ఆరోపించారని తెలిపారు.సబ్ స్టేషన్ కి ఎన్ని సార్లు ఫోన్ చేసి సమస్యను తెలిపిన ఫలితం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మాడెం శ్రీనివాస్,బిజెపి పార్టీ మండల అధ్యక్షులు బోర్లకుంట శేఖర్,ఉపాధ్యక్షులు సెగ్గం మల్లేష్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version