బీసీ సంఘాల బంధుకు మద్దతు….

బీసీ సంఘాల బంధుకు మద్దతు

బంధులో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ

మంగపేట నేటిధాత్రి

 

మంగపేట మండలం రాజుపేట నుండి కమలాపురం వరకు నిర్వహించిన బైక్ లతో ర్యాలీలలో పాల్గొనీ మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, బంద్ కు మద్దతు తెలిపారు.ఈ ర్యాలీ లో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, పార్టీ సీనియర్ నాయకులు, చిలకమర్రి రాజేందర్, మాలికంఠ శంకర్ , గాదె శ్రీనివాస చారి, గ్రామ కమిటీ అధ్యక్షులు, యాగ్గడి అర్జున్, మునిగేల సాంబులు, పార్టీ నాయకులు లోడి కృష్ణ, పూసల నర్సింహా రావు , నక్క యాకయ్య, యూత్ నాయకులు ముప్పారాపు సందీప్, కేక్కం జగదీష్, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు

బీసీ బంద్ లో పాల్గొన్న ఎంసిపిఐ (యు)

బీసీ బంద్ లో పాల్గొన్న ఎంసిపిఐ (యు)

నర్సంపేట,నేటిధాత్రి:

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సామాజిక రాజకీయ పార్టీలు చేపట్టిన తెలంగాణ బంద్ కు ఎంసిపిఐ (యు) సంపూర్ణ మద్దతు తెలిపింది.నర్సంపేట లో నిరసన ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ,డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి మాట్లాడుతూ రాజ్యాంగంలోని షెడ్యూల్ 9 లో బీసీ రిజర్వేషన్ అంశాన్నిచేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సమాజమంతా ఏకతాటిపైకి వచ్చి ఐక్య పోరాటాలు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు అనుమాల రమేష్ ,బంగారు ముత్తయ్య,అచల,మేడిద ప్రమీల,ఈర్ల అనుష ,మాదాసి రాజు,జి అంజి, సుశీల,శ్రీను,రాములు, ఐలమ్మ, జన్ను నీల,ప్రమీల పాల్గొన్నారు.

దుగ్గొండి మండలంలో…

బీసీ రిజర్వేషన్ కోసం చేపట్టిన రాష్ట్రవ్యాప్త బిసి బంద్ కార్యక్రమంలో భాగంగా దుగ్గొండి మండలంలోని గిర్నిబావిలో చేపట్టిన నిరసనలో ఎం సిపిఐ పార్టీ నాయకులు పాల్గొని ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట డివిజన్ కార్యదర్శి మొహమ్మద్ రాజా సాహెబ్, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబురావు,డివిజన్,మండల సభ్యులు కుమారస్వామి, కొమురయ్య, సురేందర్,చందర్ రావు,భాస్కర్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలి…

బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలి
-నల్లబెల్లి గ్రామ బిసి సంఘం నాయకులు
వర్దన్నపేట (నేటిధాత్రి):

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబేల్లి గ్రామంలో బీసీ సంఘాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో బీసీలకు 42% బిల్లును గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం తెలపాలని తెలంగాణ బంద్ నిరసన కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మరియు వివిధ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ , కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మహమ్మద్ జాఫర్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు డోలి సతీష్, బిఆర్ఎస్ నల్లబెల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు తాటికాయల సురేష్, కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు శ్రీపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం కొరకై ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతే అనే నినాదంతో దేశంలోనే కుల గణనకు నాంది పలికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుల గణనను విజయవంతంగా పూర్తి చేసి దాని ఆధారంగా 52 శాతం ఉన్న బీసీ జనాభాకు ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశంతో రాజకీయంగా విద్య ఉద్యోగ పరంగా రిజర్వేషన్ కల్పించాలని స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ తో ఆర్డినెన్స్ , రాష్ట్ర అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టం బిల్లును బీసీ బిల్లు ఆమోదించి గవర్నర్కు రాష్ట్రపతికి పంపినప్పటికీ కూడా మూడు నెలలు గడుస్తున్నా ఇంకా దాన్ని కాలయాపన చేయడం ద్వారా బీసీలు నష్టపోతున్నారని తెలుసుకొని ప్రత్యేక జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లడం జరిగింది దాన్ని కొంతమంది కావాల్సి కొని అడ్డుకోవడం జరిగింది. కావున కేంద్ర ప్రభుత్వం బీసీలపై ప్రేమానురాగాలు ఉంటే వారి అభివృద్ధి కోరుకున్నట్లయితే వెంటనే రాష్ట్రపతి గవర్నర్ బిల్లులను ఆమోదించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును చేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు తంగెళ్ల భాస్కర్ ,గజ్జల దేవేందర్ పసునూరి కృష్ణమూర్తి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దిలీప్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డే నారాయణ, దోమకొండ ప్రభాకర్, చెంగల స్వామి, సురేందర్, భాస్కర్, దోమకొండ ఈశ్వర్, ఆరేల్లి వీరస్వామి, ఫైండ్ల కుమారస్వామి, రాజు, సురేష్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version