బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ…

బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ.

నర్సంపేట,నేటిధాత్రి:

 

42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని బిసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ కు దుగ్గొండి బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు పలికారు. మండలంలోని గిర్నిబావి గ్రామంలో గల నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ధర్నా నిర్వహించి రాస్తారోకో,ర్యాలీ చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.బీఆర్ఎస్ పార్టీ
మండల అధ్యక్షులు సుకినే రాజేశ్వరరావు, నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు మద్దతు తెలిపామన్నారు.బీసీ రిజర్వేషన్ కులగనన ప్రకారంగా దక్కాల్సిన వాటాన్ని కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా విద్యా వైద్య ఆర్థిక రాజకీయ ప్రైవేట్ సెక్టార్ లో ప్రాథమిక హక్కుగా భావించి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బిజెపి పార్టీ చేస్తున్న నాటకాలను బీసీ కులాలు గమనిస్తున్నాయని అన్నారు. వెంటనే పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేసేటట్లుగా రెండు పార్టీలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ప్రజలలో కాంగ్రెస్ పార్టీ లేనిపోని అపోహాలు సృష్టిస్తూ ఇతర హామీలు నెరవేర్చకుండా బీసీ రిజర్వేషన్లు తెరపైకి తీసుకొచ్చి ఆడ లేక మధ్యలో ఓడినట్లుగా బీసీ బందులో పాల్గొనడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు.పార్లమెంటులో చట్టాలు చేసే బిజెపి పార్టీ కూడా బీసీలపై వారి యొక్క విధానాన్ని ప్రకటించకుండా బీసీ బందుకు మద్దతు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీసీల బంద్ కు ముందు నుండి మద్దతు తెలుపుతుంది.కాంగ్రెస్ పార్టీలోని బీసీ నాయకులు వారి పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పించి ఒత్తిడి పెంచి రిజర్వేషన్లు రాజకీయపరమైన విధానాలు రూపొందించాలన్నారు. చట్టసభల్లో బీసీ జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ అమలుపరిచి బిజెపి,కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా సత్తా చాటుకోవాలన్నారు లేనియెడల బీసీ ప్రజల యొక్క అగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జిలు మాజీ ఎంపీపీ కోమల భద్రయ్య. టిఆర్ఎస్ పార్టీ యూత్ విభాగం నియోజకవర్గం కన్వీనర్, ఎన్నారై శానబోయిన రాజ్ కుమార్, కంచరకుంట్ల శ్రీనివాసరెడ్డి, ఊరటి రవి, శంకేశి కమలాకర్, పెండ్యాల రాజు,గుండెగారి రంగారావు, కామిశెట్టి ప్రశాంత్,బండి జగన్,పిండి కుమారస్వామి, భూంపల్లి రజనీకర్ రెడ్డి. కొల్లూరు మోహన్ రావు, గుండెకారి రవికుమార్, ల్యాండే రమేష్,యూత్ నాయకులు మడతలపాటి కుమార్,మాజీ సర్పంచ్ మోడం విద్యాసాగర్ గౌడ్, కుర్ర మధు, ఓడేడి తిరుపతిరెడ్డి,మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, గ్రామ పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు బీసీ బందులో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version